ఆదాయం, లాభాలు, మార్కెట్ వాల్యూ, సామాజిక ప్రభావం వంటి వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 విజికీ వెలువరించిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్‌లో సంస్థ ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ప్రముఖ FMCG లేదా బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీల కంటే కూడా రిలయన్స్ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉందని ఏఐ బేస్డ్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.
రిలయన్స్ సంస్థ.. 2024 న్యూస్ స్కోర్‌లో 100కి 97.43 స్కోర్ చేసింది. ఈ స్కోర్ 2023 (96.46), 2022 (92.56), 2021 (84.9) కంటే ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ప్రతి ఏటా వృద్ధి నమోదు చేస్తూనే ఉంది. రిలయన్స్ కంపెనీ విజికీ న్యూస్ స్కోర్ వార్షిక ర్యాంకింగ్స్‌లో మొదటి నుంచి గత ఐదేళ్లలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
విజికీ న్యూస్ స్కోర్ అనేది న్యూస్ పరిమాణం, హెడ్‌లైన్ ప్రజెంటేషన్, పబ్లికేషన్ రీచ్ & రీడర్‌షిప్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్.. మీడియా ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి బ్రాండ్‌లు, వ్యక్తుల కోసం వార్తల దృశ్యమానతను కొలవడానికి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రామాణిక కొలమానం.
రిలయన్స్ తరువాత ర్యాంకింగ్‌లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (89.13), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (86.24), వన్97 కమ్యూనికేషన్స్ (84.63), ఐసీఐసీఐ బ్యాంక్ (84.33), జొమాటో (82.94) ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్ ఏడో స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ITC తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 40వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment