రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా.. | Reliance Jewels Unveils Vivaham Collection | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా..

Published Thu, Oct 17 2024 7:03 PM | Last Updated on Thu, Oct 17 2024 7:52 PM

Reliance Jewels Unveils Vivaham Collection

భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన 'రిలయన్స్ జ్యువెల్స్' రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం రెండూ కలబోసిన వినూత్న వివాహ ఆభరణాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కు పుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.

ఈ వివాహం కలెక్షన్‌లో.. బంగారం, వజ్రాలతో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ వధువును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్‌లో ఉన్నాయి.

వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో వివాహాలు సంస్కృతికి నిదర్శనం. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్‌లోని ప్రతి సెట్ నిలుస్తూ.. నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. ఇవన్నీ కేవలం పెళ్లి రోజున ధరించేవి మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.

రిలయన్స్ జువెల్స్ 2024 నవంబర్ 11 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ వ్యాల్యూ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆభరాలు దేశంలోని 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement