brides
-
రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా..
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన 'రిలయన్స్ జ్యువెల్స్' రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం రెండూ కలబోసిన వినూత్న వివాహ ఆభరణాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కు పుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.ఈ వివాహం కలెక్షన్లో.. బంగారం, వజ్రాలతో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ వధువును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి.వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో వివాహాలు సంస్కృతికి నిదర్శనం. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్లోని ప్రతి సెట్ నిలుస్తూ.. నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. ఇవన్నీ కేవలం పెళ్లి రోజున ధరించేవి మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.రిలయన్స్ జువెల్స్ 2024 నవంబర్ 11 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ వ్యాల్యూ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆభరాలు దేశంలోని 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
ఆస్కార్ అడ్రస్‌కు లాపతా లేడీస్
‘నాకు కుట్లు అల్లికలు, వంట, పాటలు, భజన వచ్చు. అమ్మ నేర్పింది’ అని కొత్త పెళ్లికూతురు అంటే ‘అత్తగారింటికి సొంతగా వెళ్లడం నేర్పలేదా?’ అని అడుగుతుంది ఒక పెద్దావిడ. అత్తగారి ఊరు ఏదో దానికి ఎలా వెళ్లాలో తెలియని స్థితి నుంచి తామేమిటో తమకు ఏం కావాలో తెలుసుకునే చైతన్యం వరకూ సాగే ఇద్దరు పల్లెటూరి నవ వధువుల కథ ‘లాపతా లేడీస్’ ఆస్కార్– 2025కు మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘‘సినిమాలు చాలానే ఉన్నాయి. కాని భారతీయతను ప్రతిబింబించే సినిమాగా ‘లాపతా లేడీస్’ ఏకగ్రీవంగా ఎంపికైంది’’ అని కమిటీ తెలిపింది. మహిళా డైరెక్టర్ కిరణ్ రావు తీసిన మహిళా గాథ ఇది.‘పితృస్వామ్యానికి వ్యతిరేక పదం మాతృస్వామ్యం అని చాలామంది అనుకుంటారు. కాని పితృస్వామ్యానికి వ్యతిరేక పదం సమానత్వం. మనకు ఒకరు ఆధిపత్యం వహించే పితృస్వామ్యం వద్దు.. మాతృస్వామ్యం వద్దు... అందరూ సమానంగా జీవించే వ్యవస్థే కావాల్సింది’ అంటుంది కిరణ్ రావు.ఆమె దర్శకత్వంలో మార్చి 2024లో విడుదలైన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో 2025 సంవత్సరానికిగాను మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. ‘పతా’ అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండాపోవడం. సరిగా చె΄్పాలంటే మన దేశంలో పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లి తన గుర్తింపును తాను కోల్పోవడం.గుర్తింపు నుంచి తప్పిపొడం... ఆకాంక్షలను చంపుకోవడం... ఇదీ కథ. ఆస్కార్ కమిటీకి ఈ సినిమా నచ్చి నామినేషన్ పొందితే ఒక ఘనత. ఇక ఆస్కార్ సాధిస్తే మరో ఘనత. ‘లాపతా లేడీస్’ నిర్మాత ఆమిర్ ఖాన్ గతంలో నిర్మించి నటించిన ‘లగాన్’కు కొద్దిలో ఆస్కార్ తప్పింది. ఈసారి ఆస్కార్ గెలవడానికి గట్టి అవకాశాలున్నాయని సినిమా విమర్శకులు భావిస్తున్నారు. ముందడుగును అడ్డుకునే కపట నాటకం‘లాపతా లేడీస్’లో ఇద్దరు వధువులు అత్తగారింటికి వెళుతూ తప్పిపోతారు. ఒక వధువు మరో పెళ్లికొడుకుతో తనకు సంబంధం లేని అత్తగారింటికి చేరితే ఇంకో వధువు పారటున వేరే స్టేషన్లో చిక్కుకు΄ోతుంది. రైల్వేస్టేషన్లో ఉన్న వధువుకు తన అత్తగారి ఊరు పేరేమిటో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. సొంత ఊరి పేరు చెబుతుంది కానీ భర్త లేకుండా తిరిగి పుట్టింటికి చేరడం తల వంపులని వెళ్లడానికి ఇష్టపడదు.‘మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అలా చేయరు’ అంటుంది స్టేషన్లో క్యాంటీన్ నడుపుతున్న అవ్వతో. అప్పుడా అవ్వ ‘మన దేశంలో ఇదే పెద్ద కపట నాటకం. మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని అసలు ఏదీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు’ అంటుంది. అయితే ఆ వధువు వెరవకుండా ఆ స్టేషన్లో ఆ అవ్వతోనే ఉంటూ అక్కడే పని చేసుకుంటూ భర్త కోసం ఎదురు చూస్తూ మెల్లగా ఆత్వవిశ్వాసం నింపుకుంటుంది. మరో వైపు వేరే వరుడితో వెళ్లిన వధువు ఆ అత్తగారింటిలో (వాళ్లంతా అసలు కోడలి కోసం అంటే రైల్వే స్టేషన్లో ఉండిపోయిన కోడలి కోసం వెతుక్కుంటూ ఉండగా) ఆశ్రయం పొంది పై చదువులు చదవడానికి తాను అనుకున్న విధంగా పురోగమిస్తుంది. సినిమా చివరలో ఒక వధువు తన భర్తను చేరుకోగా మరో వధువు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తను కాదని పై చదువులకు వెళ్లిపోతుంది. ఈ మొత్తం కథలో దర్శకురాలు కిరణ్ రావు ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకుల ముందు ఉంచుతుంది. మన దేశంలో స్త్రీలను పరదాలు, ఘోషాలు, ఘూంఘట్ల పేరుతో అవిద్యలో ఉంచి వారికి లోకం తెలియనివ్వకుండా కనీసం తమ వ్యక్తిత్వ చిరునామాను నిర్మించుకోనివ్వకుండా ఎలా పరాధీనంలో (పురుషుడి మీద ఆధారపడేలా) ఉంచుతున్నారో చెబుతుంది. స్త్రీలు స్వతంత్రంగా జీవించగలరు, ఆత్మవిశ్వాసంతో బతగ్గలరు వారినలా బతకనివ్వండి అంటుందీ సినిమా. పెద్ద హిట్నాలుగైదు కోట్లతో నిర్మించిన ‘లాపతా లేడీస్’ దాదాపు 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయినా జనం థియేటర్లలో చూడటానికి వెళ్లడం విశేషం. చాలా మంచి ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. రైల్వే స్టేషన్లో అవ్వగా నటించిన ఛాయా కదమ్‌కు, ఇన్స్పెక్టర్గా నటించిన రవికిషన్‌కు మంచి పేరు వచ్చింది. మిగిలిన కొత్త నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.భారీపోటీలోఆస్కార్ అఫిషియల్ ఎంట్రీ కోసం చాలా సినిమాలుపోటీ పడ్డాయి. తెలుగు నుంచి కల్కి, హనుమ్యాన్, మంగళవారం ఉన్నాయి. తమిళం నుంచి ‘మహరాజా’, ‘తంగలాన్’ ఉన్నాయి. జాతీయ అవార్డు పొందిన ‘ఆట్టం’ (మలయాళం), కేన్స్ అవార్డు ΄పొదిన ‘ఆల్ వియ్ ఇమేజిన్ యాజ్ లైట్’ కూడా ఉన్నాయి. హిందీ నుంచి ‘యానిమల్’, ‘శ్రీకాంత్’పోటీ పడ్డాయి. కాని ‘లాపతా లేడీస్’లోని అంతర్గత వేదన, మార్పు కోరే నివేదన దానికి ఆస్కార్‌కు వెళ్లే యోగ్యత కల్పించింది. ఇది మాకు దక్కిన గౌరవంఆస్కార్ నామినేషన్ కోసం ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ మా ‘లపతా లేడీస్’ సినిమాను ఎంపిక చేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌కు మాతో పాటు మరికొన్ని అద్భుతమైన భారతీయ సినిమాలుపోటీ పడ్డాయి. అయితే కమిటీ మా చిత్రాన్ని నమ్మినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖండాంతరాలు దాటేందుకు, ప్రజల హృదయాలతో కనెక్ట్ కావడానికి సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం. భారతదేశంలో ‘లాపతా లేడీస్’కు లభించిన ఆదరణ, ప్రపంచ వ్యాప్తంగా కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను.– కిరణ్‌రావు -
Manish Malhotra: పల్లకీలో పెళ్లికూతుళ్లకు మనీష్ మల్హోత్రా సరికొత్త సొబగులు (ఫోటోలు)
-
ఇంత పిచ్చా?....వధువు హెయిర్‌స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం. ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే. జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by chitrasmakeupartist (@_chitras_makeup_artist_28) -
గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సాముహిక వివాహ పథకం వివాదాస్పదంగా మారింది. ఆ పథకంలో భాగంలో మధ్యప్రదేశ్‌లోని గడ్సరాయ్ ప్రాంతంలో శనివారం 219 మందికి సాముహిక వివాహాలు నిర్వహించారు. ఐతే అందులో ఐదుగురు యువతులు గర్భవతులు అని తెలియడంతో వారిని సాముహిక వివాహాలకు అనుమతించలేదు. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ వివాదానికి తెరలేపింది. అయినా పెళ్లి చేసుకోడానికి వచ్చిన యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం ఏమిటని కాంగ్రెస్ పశ్నించింది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి 200 మంది యువతులకు ప్రెగన్సీ టెస్ట్‌లు నిర్వహించారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ వార్త నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి నుంచే వినాలనుకుంటున్నాం. ఈ వార్త నిజమైతే సామాజికంగా వెనుకబడిని యువతులను ఘెరంగా అవమానించడమే అవుతుంది. ముఖ్యమంత్రి దృష్టిలో పేద, గిరిజన వర్గాల ఆడబిడ్డలకు పరువు లేదా అని నిలదీశారు. శివరాజ్ ప్రభుత్వంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ అగ్రస్తానంలో ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం గర్భ నిర్ధారణ పరీక్షకు సంబంధించింది కాదని ఇది మొత్తం స్త్రీ జాతి పట్ల దురుద్దేశంలో కూడిన వైఖరి అని మండిపడుతూ ట్వీట్ చేశారు. అయితే డిండోరి చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సాధారణంగా వయస్సు ధృవీకరణ, సికిల్ సెల్ అనీమియా వంటి శారీరక దృఢత్వాన్ని నిర్థారించే పరీక్షలు నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయిని తెలిపారు. అందులో కొందరు యువతులకు పీరియడ్ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దీంతోనే వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తాము కేవలం పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తామని చెప్పారు. అయితే ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా యువతలను పథకంలో మినహాయించే నిర్ణయం మాత్రం సామాజికి న్యాయ శాఖ తీసుకుంటుందని వివరించారు. కాగా, ముఖ్యమంత్రి వివాహ యోజన పథకం / నికా యోజన ఏప్రిల్ 2006లో ప్రారంభమైంది. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా రూ. 56,000/- నగదును అందిస్తోంది. (చదవండి: భార్య అరెస్టు అవుతుందనే భయంతో అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా?) -
ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్, యూపీ
చెన్నై: గతంలో ఆడపిల్లలు పుడితే ఆర్థిక పరిస్థితులు, పున్నామ నరకం నుంచి రక్షించేది కొడుకేననే భావనతో పురిట్లోనే చంపేసేవాళ్లు. టెక్నాలజీ పెరిగిన తరువాత స్కానింగ్ చేసి ఆడ బిడ్డ అని తెలిసుకుని భ్రూణ హత్యలకు పాల్పడేవాళ్లు. మారిన పరిస్థితులు, ప్రభుత్వాల చర్యల ఫలితంగా ఈ అకృత్యాలు కొద్ది తగ్గుముఖం పట్టాయి. అయితే, అప్పట్లో జరిగిన దారుణాలకు నేడు కొందరు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా తమిళనాడులో బ్రాహ్మణ యువకులకు పెళ్లి చేసుకొందామంటే ఆ రాష్ట్రంలో ఆడపిల్లలు కరువయ్యారట. వివరాల ప్రకారం.. తమిళనాట 10 బ్రాహ్మణ బాలురకు కేవలం ఆరుగురే బాలికలు మాత్రమే ఉన్నారని దీని ప్రకారం 30-40 ఏళ్ల నలభై వేల మంది బ్రాహ్మణ అబ్బాయిలకి వివాహం చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకడం లేదని ఆ రాష్ర్టానికి చెందిన బ్రాహ్మణ సంఘం తెలుపుతూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూపీ, బీహార్‌లో అమ్మాయిలను వెతకనున్నారట. ఈ విషయాన్ని తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణన్ తెలిపారు. దీని ప్రకారం యూపీ, బీహార్‌లో వివాహాల కోసం అమ్మాయిలను వెతికేందుకు ఆ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలకు సమాచారం ఇవనున్నట్లు చెప్పారు. మరోవైపు 30 నుంచి 40 ఏళ్ల వయసొచ్చిన పెళ్లిళ్లు కాకపోవడంతో ఆ బ్రాహ్మణ అబ్బాయిల్లో కొందరు డిప్రెషన్లోకి వెళ్తున్నారని నారాయణన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెద్ద మనసుతో స్థలం దానం.. గత 7నెలలుగా విసుగెత్తి అక్కడే వంటా–వార్పు -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
పూల వ్యాపారి స్మార్ట్ ఆలోచన.. ఫిదా అవుతున్న వధూవరులు
సాక్షి, చెన్నై: కరోనా కష్టకాలంలో తప్పనిసరిగా ధరించాల్సిన ఫేస్ మాస్క్‌ల కష్టాలగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ, మాస్క్ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా కోవిడ్-19 మహమ్మారి ఉధృతిని అడ్డుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి పీటల మధ్య ముసి ముసి నవ్వులతో మురిసిపోవాల్సిన వధూవరులకు కూడా ఇది తప్పదు. అందుకే తమిళనాడుకు చెందిన ఒక పూల వ్యాపారి చాలా స్మార్ట్‌గా ఆలోచించి చక్కటి మాస్క్‌లను రూపొందించారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా స్మార్ట్‌గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. తమిళనాడులోని పూల వ్యాపారి ఈ విషయాన్ని నిరూపించారు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో పట్టుచీరకు మ్యాచింగ్‌గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్‌లను ధరించడం చూశాం. కానీ ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు. ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా ఉంటాయంటున్నారు. Tamil Nadu | Mohan, a flower vendor in Madurai makes floral masks exclusively for brides, grooms to raise awareness about COVID-19 "Despite govt orders, people don't wear masks at weddings. I make these floral masks to encourage brides, grooms to wear them," he said (10.08) pic.twitter.com/1gJKK3S68p — ANI (@ANI) August 11, 2021 -
బుద్ధిలేని పెళ్లికొడుకా... ఈ పెళ్లి నాకొద్దు
1980–90ల కాలంలో పెళ్లిమంటపంలో ‘ఆపండి’ అన్న కేక వినపడితే వధువు తరఫువారు అదిరిపోయేవారు– ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని.ఇప్పుడు రోజులు మారాయి. ‘ఆపండి’ అన్న కేక వధువే వేస్తోంది. తనకు తాళి కట్టబోతున్నవాడు బుద్ధిలేని వాడని చివరి నిమిషంలో తెలుసుకున్నా నిర్మొహమాటంగా పెళ్లి కేన్సిల్ చేసేస్తోంది. రెండో ఎక్కం కూడా రానివాణ్ణిచ్చి చేస్తారా అని ఒక పెళ్లికూతురు, తాగి వచ్చినందుకు ఒక పెళ్లికూతురు, గుట్కా తిన్నందుకు ఒక పెళ్లికూతురు ఆ పెళ్లికొడుకులను పెళ్లి మంటపాల్లోనే రిజెక్ట్ చేశారు. దేశంలో పెళ్లికూతుళ్లు చేస్తున్న ఈ హెచ్చరిక పెళ్లికొడుకులకు ఏం పాఠం చెబుతోంది? ఉత్తరప్రదేశ్‌లో స్త్రీల వెనుకబాటుతనం గురించి కథనాలు వింటూ ఉంటాం. కాని ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల పెళ్లికూతుళ్లు ఏం చేశారో చూడండి. పెళ్లి అంటే మగాడు ఒక సొంత సంస్థను స్థాపించుకుంటూ ఉన్నట్టు, దానికి అతడు యజమాని కాబోతున్నట్టు, తన కింద ఒక ఉద్యోగిని భార్య పేరుతో తీసుకుంటున్నట్టు భావించే పెళ్లికొడుకులు ఇంకా ఉన్నట్టయితే వారికి కాలం చెల్లిందని ఈ ఉదంతాలు చెబుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు అమ్మాయిలు అక్కడి అబ్బాయిల వైఖరి, కుసంస్కారం, వ్యక్తిత్వాలను ఈసడించుకుంటున్నారని అర్థమవుతూ ఉంది. ‘ఎవరో ఒక అయ్య నన్ను కరుణిస్తే చాలు’ అని యువతులు అనుకునే రోజులు పూర్తిగా పోయాయి. ఒక పరస్పర గౌరవ ప్రజాస్వామిక స్థాయిలో ఇరువురూ జీవితం మొదలెట్టాలని యువతులు అనుకుంటున్నారు. దాని ప్రతిఫలమే ఈ ఉదంతాలు. డిమాండ్లు అదుపులో పెళ్లి అంటే డిమాండ్లు చేసే స్థాయిలో మగపెళ్లి వారు, డిమాండ్లు నెరవేర్చే ఆగత్యంలో ఆడపెళ్లివారు ఉన్నట్టు భావించే రోజులు కూడా ఇక మీదట పెద్దగా చెల్లుబాటయ్యేలా లేవు. ‘ఎవరి కోసం’ అని మగపెళ్లివారు అనుకుంటే ‘నువ్వు తప్ప గతి లేక మాత్రం కాదు. నువ్వు కాకపోతే నీ కంటే మెరుగైనవాడు మరొకరు దొరుకుతాడు’ అని వధువులు నిర్మొహమాటంగా మెడలోని దండ తీసి అవతలికి కొడుతున్నారు. బెంగళూరులో ఒక పెళ్లిలో మగపెళ్లివారు ‘మటన్ బిరియానీకి ఒప్పుకుని విందులో చికెన్ బిరియానీ పెడతారా’ అని అడిగినందుకు పెళ్లికూతురు పెళ్లి కేన్సిల్ చేసేసింది. గత సంవత్సరం ఒరిస్సాలోని కటక్ జిల్లాలో మగపెళ్లి వారు తమకు తగినంత మాంసం కూర పంపలేదని పేచీకి దిగారు. ఆడపెళ్లివారికి ఇది చాలా ఇబ్బంది కలిగించింది. పెళ్లికూతురు పెళ్లి కేన్సిల్ చేసి మగపెళ్లివారికి ఇక ఏ కూరా పెట్టేది లేదని తెగించి చెప్పింది. అంతా అర్థమయ్యి ఈ దేశంలో ‘పెళ్లి’ అనే వ్యవస్థ ఎలా పని చేస్తుంది... అందులో స్త్రీలు ఎంత శ్రమ చేయాలి... ఎంత పరిమితుల్లో ఉండాలి... ఎంత స్వీయ జీవితాన్ని కోల్పోవాలి... ఇవన్నీ గతంలో ఆడపిల్లలు ఒక తప్పనిసరి జీవితభాగంగా భావించి చేసేవారు. ఇప్పటి యువతులు అవన్నీ అర్థం చేసుకుని వాటిని తాము భరించడానికి సిద్ధంగా ఉన్నా కాబోయే భర్త, అతని కుటుంబం తనకూ తన కుటుంబానికి ఇచ్చే విలువ, గౌరవం గురించి పర్టిక్యులర్‌గా ఉన్నారు. ‘నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని వినక తప్పదు’ అని నేటి యువతులు చాలా గట్టిగా చెబుతున్నారు. ‘ఆమె అభిప్రాయాలు నేను వినాలట’ అని తల ఎగరేసేవారు కొన్నాళ్లు సంబంధాలు రిజెక్ట్ చేసుకుంటూ పోయి ఆ తర్వాత పెళ్లి కాకుండా మిగులుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. నీ ఇష్టం కాదు ‘నేను తాగుతాను. తిరుగుతాను. ఇల్లు పట్టించుకోకుండా ఉంటాను. సమయానికి ఇంత జీతం తెచ్చి మొహాన కొడతాను’ అనే భావనతో అబ్బాయిలు ఉండి అలాంటి జీవితంతో పెళ్లిని ఆలోచిస్తూ ఉంటే వారికి గడ్డుకాలం వచ్చినట్టేనని అర్థం చేసుకోవాలి. ‘నో’ చెప్పే యువతుల కాలం ఇది. పెళ్లిపీటల మీద ‘నో’ చెప్పించుకునే విధంగా నా వ్యవహార శైలి ఉందా అని ఆలోచించుకోక తప్పని ఈ కాలాన్ని వారు స్వీకరిస్తారనే ఆశిద్దాం. పెళ్లికూతురు – 1: జూన్ ఐదున ఉత్తరప్రదేశ్‌లోని బాలియా ప్రాంతంలోని మిశ్రోలి అనే చిన్న పల్లెలో పెళ్లి. అంతా సజావుగానే ఉంది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమంటపానికి చేరుకుంది. పెళ్లికూతురు పెళ్లికొడుకును గమనించింది. పెళ్లికొడుకు గుట్కా తింటున్నాడు. మరి కాసేపట్లో పెళ్లి ఉంటే గుట్కా తింటూ వచ్చిన పెళ్లికొడుకును ఏం చేయాలి? ఒకటి... అది మర్యాద కాదు. రెండు... అది ఎంత వ్యసనం కాకపోతే తింటాడు. ‘నాకీ పెళ్లి వొద్దు’ అని పెళ్లికూతురు అడ్డం తిరుక్కుంది. ఇరుపక్షాలు ఆమె వాదనకు ముందు హతాశులైనా తుదకు అంగీకరించారు. పెళ్లి ఆగిపోయింది. ఇచ్చిపుచ్చుకున్న వన్నీ తిరిగి ఇచ్చి పుచ్చుకున్నారు. పెళ్లికూతురు – 2: మే రెండోవారంలో ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ధూమ్‌ధామ్‌గా పెళ్లి. వరుడు భారీ ఊరేగింపుతో కల్యాణమంటపానికి చేరుకున్నాడు. ముహూర్తానికి ఇంకా టైముంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇరు పక్షాల బంధువులు, ఊరి పెద్దలు అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. హటాత్తుగా పెళ్లికూతురు ‘రెండో ఎక్కం చెప్పు’ అని పెళ్లికొడుకును అడిగింది. అంతా నిశ్శబ్దం ఆవరించింది. పెళ్లికొడుకు రెండో ఎక్కం చెప్పలేకపోయాడు. పెళ్లికూతురు లేచి నిలబడి పెళ్లికొడుకు తరఫు వాళ్లతో ‘ఇక ఇళ్లకు పోండి. ఈ పెళ్లి జరగదు’ అంది. ఇరుపక్షాల వాళ్లు చాలా చెప్పి చూశారు. పెళ్లికూతురు వింటేనా? పెళ్లికూతురు – 3: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తిక్రీ అనే గ్రామంలో జూన్ 5న పెళ్లి. వధువు రైతు కూతురు. వరుడు, అతని బంధువులు ఊరేగింపు గా వచ్చారు. అయితే అంతా తాగి ఉన్నారు. పెళ్లికూతురు తరఫు వాళ్లు అది గమనించి నొసలు చిట్లించినా సరేలే అని ఊరుకున్నారు. అయితే ‘వరమాల’ వేయించుకునే సమయంలో మత్తులో ఉన్న పెళ్లికొడుకు సీన్ క్రియేట్ చేశాడు. పెళ్లికూతురు తనతో డాన్స్ చేయాలన్నాడు. చేయకపోతే కోపగించుకున్నాడు. పెళ్లికూతురు ఇక సహించలేదు. అందరినీ పార్శిల్ చేసి వెనక్కు పంపించేసింది. కుర్రాడు లబోదిబోమన్నా లాభం లేకపోయింది. – సాక్షి ఫ్యామిలీ -
ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు తాళికట్టిన యువకుడు !
కొల్చారం (నర్సాపూర్): ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు ఓ యువకుడు తాళికట్టాడు. కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన పెళ్లిలాగే మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామంలో తాజా ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేశ్‌కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి స్వాతికి శివ్వంపేట మండలం పాంబండకు చెందిన మేనబావ బాల్‌రాజ్‌తో పెళ్లి కుదిరింది. రెండో కూతురు శ్వేతకు మతిస్థిమితం లేదు. దీంతో శ్వేతని కూడా బాల్‌రాజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో పెళ్లి పత్రికలో వరుడితో పాటు ఇద్దరు అమ్మాయి ల పేర్లు కూడా ముద్రించి ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించారు. అయితే వరుడు స్వాతిని మాత్రమే ఇంటికి తీసుకెళ్లగా.. మతిస్థిమితం లేని శ్వేతను తండ్రి తన ఇంటి వద్దే ఉంచుకున్నాడు. -
తుళ్లూరు వధూవరులకు భలే డిమాండ్
*ఫొటోలతో తిరుగుతున్న మ్యారేజ్ బ్యూరోలు *చదువు లేకపోయినా.. ఆస్తి ఉంటే చాలు.. విజయవాడ : రాజధాని తుళ్లూరు అంటే మాటలా.. ఎన్నో వింతలు, విశేషాలు ఒకవైపు.. రియల్టర్లు, భూ యజమానులు, రైతుల హడావుడి మరోవైపైతే.. తాజాగా మ్యారేజ్ బ్రోకర్ల హవా కూడా ఇక్కడ నడుస్తోంది. ఒకప్పుడు తుళ్లూరులో పెళ్లి సంబంధమంటేనే.. ‘ఆ.. పెద్దగా చదువుకోరు ఏం అవసరం లేదులే..’ అనుకున్న పెళ్లి పెద్దలు ఇప్పుడు ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొంటున్నారు. బ్రోకర్లకు ఫొటోలిచ్చి సంబంధం చూడమంటున్నారు. చదువు లేకపోయినా.. ఆస్తి తప్పనిసరి.. ఒకప్పుడు తుళ్లూరు సంబంధం అంటేనే వెనక్కి తగ్గేవారని, రాజధాని ప్రభావంతో ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని గుంటూరులోని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా సంబంధాల కోసం వస్తున్నారంటున్నారు. నాలుగైదు ఎకరాల భూమి ఉన్న కుర్రాడికి చదువు లేకపోయినా చాలు తమ కుమార్తెను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ, గుంటూరులో ఐదారు ఇళ్లు ఉన్న యజమానుల కంటే.. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాల భూమి ఉన్న వారికి సంబంధం చూడటం సులభంగా ఉందని గుంటూరు పండరీపురం ఏరియాలోని ఒక మ్యారేజ్ లింక్స్ నిర్వాహకురాలు చెబుతున్నారు. బీటెక్ సంబంధాలున్నాయా..? రాజధాని ప్రభావం తుళ్లూరు రైతులపై బాగానే పడింది. గతంలో తమ కుమారుడికి మధ్య తరగతి ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడేవారు. ఇప్పుడు వరుడికి చదువు లేకపోయినా.. వధువు మాత్రం తప్పనిసరిగా బీటెక్ చదివి ఉండాలని ఆంక్షలు పెట్టడం విశేషం. ఇక ఇటీవల ముగిసిన మ్యారేజ్ సీజన్లో తుళ్లూరులో జరిగిన వివాహాలు చూస్తే ఔరా..! అనక మానరు. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న రైతులు లక్షలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపించారు. ఆడపిల్లల తండ్రులు పెద్ద మొత్తంలో కట్నాలు సమర్పించడమే కాకుండా భారీగా, హుందాగా వివాహాలు చేస్తున్నారు. -
అత్తారింటికి వెళ్లే ముందు..
అమ్మాయిల్లో ఉద్యోగం చేయని వారు, చేసేవారు... ఇద్దరూ ఉంటారు. వీరిద్దరినీ దృష్టిలో పెట్టుకుంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన ఆర్థిక అవసరాలను నాలుగు కేటగిరీల కింద వర్గీకరించొచ్చు. 1. వ్యక్తిగత ఖర్చులు 2. గృహ అవసరాల ఖర్చులు 3. అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు 4. భవిష్యత్‌లో సొంత ఇల్లు, కారు లాంటివి కొనుక్కోవడం, విదేశీ టూర్లకు వెళ్లడం వంటి అవసరాలకు నిధులు. ఉద్యోగిని అయినా, ఉద్యోగం చేయనివారైనా ఎవరైనా సరే! అవసరాలను గుర్తెరిగి, ముందస్తుగా ప్రణాళిక వేసుకుంటే, భవిష్యత్‌లో రెండు కుటుంబాలకూ మంచిదే. ఉద్యోగం చేయని వారి సంగతి తీసుకుంటే ఆర్థిక నిర్వహణపై వారికి కొంత ఎక్కువగా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోవటం నేర్పాలి. అమ్మాయి పెళ్లి కావడానికి ముందే.. ఆమె కుటుంబ సభ్యులు లేదా ఆమే స్వయంగా ఈ ప్లానింగ్‌కి పూనుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు వివాహయోగ్యమైన వయసు వచ్చినప్పట్నుంచీ ప్రతినెలా కొంత ఆదాయం వచ్చేలా ఆమె పేరిట ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ లాంటి వాటిలో శిక్షణనిప్పించడమూ మంచిదే. పెళ్లి కాకముందైనా.. అయ్యాకైనా ఇతరులపై ఆధారపడ కుండా ఆమె నిలదొక్కుకోవడానికివి ఉపయోగపడతాయి. పెళ్లి తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తినా ఎదుర్కొనగలిగే ధీమా ఆమెకు లభిస్తుంది. అలాగే, అమ్మాయికి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటుతో పాటు బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా జరపాలన్నదీ తెలిసుండాలి. పెళ్లికి ముందు నుంచే పొదుపు చేయడం మొదలు పెట్టడం సర్వదా అభిలషణీయం. ఇక ఉద్యోగం చేసేవారి సంగతి చూస్తే... వారు పెళ్లి నాటికి కూడా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆర్థిక భద్రతకు సంబంధించి వారి సమస్యలు సగం తీరినట్లే. ఆర్థిక నిర్వహణ గురించి వర్కింగ్ ఉమెన్‌కి కొంతైనా అవగాహన ఉంటుంది. వీరు తమ జీతంలో కనీసం 25-30 శాతమైనా పొదుపు చేయాలి. అలాగని దాచిపెట్టుకున్నదంతా పెళ్లి వేడుకలకు ఖర్చు చేసేయడం ఎంతమాత్రం సరికాదు. దుస్తులు, ఇతర హడావుడి వ్యయాలను కాస్త తగ్గించుకుని కొంత పక్కన పెట్టడం మేలు. పెళ్లైన తొలినాళ్లలో ఖర్చుల కోసం ఇంట్లో వారిని అడగాలంటే మొహమాటం ఉంటుంది గనుక... అప్పుడు ఈ డబ్బులు అక్కరకొస్తాయి. భార్యా, భర్తలు ఇరువురికి జీవిత బీమా, వైద్య బీమా పాలసీలుండాలి. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే.. బీమా మొత్తం సిసలైన వారసులకు దక్కేలా వారి పేర్లను చేర్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో సాధ్యమైనంత వరకూ ఇతర కుటుంబ సభ్యుల మనస్సు నొప్పించని విధంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల కోసం ప్రమాద బీమా, వైద్య బీమా తీసుకోవడం మంచిది. ఇక, బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్రా ఆస్తులకు నామినేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇదంతా భర్తను, అతని కుటుంబసభ్యుల నిబద్ధతను అనుమానిం చటం కాదు. అలాంటి భావన కలిగేలా వ్యవహరించకూడదు కూడా. భవిష్యత్‌లో ఒడిదుడుకులు ఎదురుకాకుండా భార్య, భర్త ఆర్థికంగా స్థిరపడగలిగేలా చూసుకోవాలన్నదే దీని సారాంశం.