Tamil Brahmin 40000 Bachelors Not Find Brides Looking For Up Bihar - Sakshi
Sakshi News home page

ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్‌, యూపీ

Published Thu, Nov 18 2021 4:22 PM | Last Updated on Thu, Nov 18 2021 8:50 PM

Tamil Brahmin 40000 Bachelors Not Find Brides Looking For Up Bihar - Sakshi

చెన్నై: గతంలో ఆడపిల్లలు పుడితే ఆర్థిక పరిస్థితులు, పున్నామ నరకం నుంచి రక్షించేది కొడుకేననే భావనతో పురిట్లోనే చంపేసేవాళ్లు. టెక్నాలజీ పెరిగిన తరువాత స్కానింగ్ చేసి ఆడ బిడ్డ అని తెలిసుకుని భ్రూణ హత్యలకు పాల్పడేవాళ్లు. మారిన పరిస్థితులు, ప్రభుత్వాల చర్యల ఫలితంగా ఈ అకృత్యాలు కొద్ది తగ్గుముఖం పట్టాయి. అయితే,  అప్పట్లో జరిగిన దారుణాలకు నేడు కొందరు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా తమిళనాడులో బ్రాహ్మణ యువకులకు పెళ్లి చేసుకొందామంటే ఆ రాష్ట్రంలో ఆడపిల్లలు కరువయ్యారట.

వివరాల ప్రకారం.. తమిళనాట 10 బ్రాహ్మణ బాలురకు కేవలం ఆరుగురే బాలికలు మాత్రమే ఉన్నారని దీని ప్రకారం 30-40 ఏళ్ల నలభై వేల మంది బ్రాహ్మణ అబ్బాయిలకి వివాహం చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకడం లేదని ఆ రాష్ర్టానికి చెందిన బ్రాహ్మణ సంఘం తెలుపుతూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూపీ, బీహార్‌లో అమ్మాయిలను వెతకనున్నారట.

ఈ విషయాన్ని తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణన్‌ తెలిపారు. దీని ప్రకారం యూపీ, బీహార్‌లో వివాహాల కోసం అమ్మాయిలను వెతికేందుకు ఆ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలకు సమాచారం ఇవనున్నట్లు చెప్పారు. మరోవైపు 30 నుంచి 40 ఏళ్ల వయసొచ్చిన పెళ్లిళ్లు కాకపోవడంతో ఆ బ్రాహ్మణ అబ్బాయిల్లో కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని నారాయణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: పెద్ద మనసుతో స్థలం దానం.. గత 7నెలలుగా విసుగెత్తి అక్కడే వంటా–వార్పు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement