Brahmin
-
తొలిసారి ఆ రెండు వర్గాలకు కాంగ్రెస్ టిక్కెట్లు నిల్!
రాజస్థాన్‌లో లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ తొలిసారిగా ప్రత్యేక వైఖరి అవలంబించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా బ్రాహ్మణ, ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించలేదు. అయితే కుల, మతాల ప్రాతిపదికన కాకుండా సర్వే ఆధారంగానే టిక్కెట్లు కేటాయించామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ గతంలో చాలాసార్లు బ్రాహ్మణ కార్డును ప్లే చేసింది. ఇప్పడు పార్టీ తన వైఖరిని మార్చుకోవడం పలువురు నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాజస్థాన్ చరిత్రలో ముస్లిం, బ్రాహ్మణ అభ్యర్థికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. సర్వ బ్రాహ్మణ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా మాట్లాడుతూ కాంగ్రెస్‌కు బ్రాహ్మణుల ఓట్లు అక్కర్లేదని తెలుస్తోంది. జైపూర్ నుంచి బ్రాహ్మణ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారున్నారని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వరుణ్ పురోహిత్ మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గానికి కాంగ్రెస్ గౌరవం ఇవ్వనప్పుడు ఓటమిని చవిచూసిందన్నారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్‌రూమ్ అధ్యక్షుడు జస్వంత్ సింగ్ గుర్జార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సర్వే, ఫీడ్‌బ్యాక్, డిమాండ్ మేరకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. కులం, సంఘం లేదా తరగతి ఆధారంగా టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. -
ఆ కులాల ఓటే శాసనం
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్పుట్లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్పుట్లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్పుట్గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది. 50% జనాభా ఆ రెండు కులాలే రాష్ట జనాభాలో రాజ్పుట్లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్పుట్లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్పుట్లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు. బీసీ, ఎస్టీలపై బీజేపీ వల రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్పుట్లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంత కష్టం.. 40 ఏళ్లు వచ్చినా పిల్ల కరువాయే!.. పెళ్లి లేదాయే! ఛలో బీహార్, యూపీ
చెన్నై: గతంలో ఆడపిల్లలు పుడితే ఆర్థిక పరిస్థితులు, పున్నామ నరకం నుంచి రక్షించేది కొడుకేననే భావనతో పురిట్లోనే చంపేసేవాళ్లు. టెక్నాలజీ పెరిగిన తరువాత స్కానింగ్ చేసి ఆడ బిడ్డ అని తెలిసుకుని భ్రూణ హత్యలకు పాల్పడేవాళ్లు. మారిన పరిస్థితులు, ప్రభుత్వాల చర్యల ఫలితంగా ఈ అకృత్యాలు కొద్ది తగ్గుముఖం పట్టాయి. అయితే, అప్పట్లో జరిగిన దారుణాలకు నేడు కొందరు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా తమిళనాడులో బ్రాహ్మణ యువకులకు పెళ్లి చేసుకొందామంటే ఆ రాష్ట్రంలో ఆడపిల్లలు కరువయ్యారట. వివరాల ప్రకారం.. తమిళనాట 10 బ్రాహ్మణ బాలురకు కేవలం ఆరుగురే బాలికలు మాత్రమే ఉన్నారని దీని ప్రకారం 30-40 ఏళ్ల నలభై వేల మంది బ్రాహ్మణ అబ్బాయిలకి వివాహం చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకడం లేదని ఆ రాష్ర్టానికి చెందిన బ్రాహ్మణ సంఘం తెలుపుతూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూపీ, బీహార్‌లో అమ్మాయిలను వెతకనున్నారట. ఈ విషయాన్ని తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణన్ తెలిపారు. దీని ప్రకారం యూపీ, బీహార్‌లో వివాహాల కోసం అమ్మాయిలను వెతికేందుకు ఆ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలకు సమాచారం ఇవనున్నట్లు చెప్పారు. మరోవైపు 30 నుంచి 40 ఏళ్ల వయసొచ్చిన పెళ్లిళ్లు కాకపోవడంతో ఆ బ్రాహ్మణ అబ్బాయిల్లో కొందరు డిప్రెషన్లోకి వెళ్తున్నారని నారాయణన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెద్ద మనసుతో స్థలం దానం.. గత 7నెలలుగా విసుగెత్తి అక్కడే వంటా–వార్పు -
ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్ వర్గ్ విచార్ సమ్మేళన్ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్) ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్ హితయ్.. సర్వజన్ సుఖయ్’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. కేబినెట్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు. ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13% బ్రాహ్మణ ఓటర్లు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, దేవరియా, జౌన్పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
సురేశ్ రైనా వివాదాస్పద వ్యాఖ్యలు; ఉతికారేస్తున్న నెటిజన్లు
చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే ఉన్న రైనాను తన సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. దీనిపై రైనా స్పందింస్తూ.. '' నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది '' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రైనా చేసిన కామెంట్స్ దుమారాన్ని లేపాయి. చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్లే ఉంటారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. '' రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు'' అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం సీఎస్కే తరపున ఆడాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు చేశాడు. గతేడాది ఫేలవ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. What the heck @ImRaina sir.. you shouldn’t use that word ….. https://t.co/v8AD1Cp0fT pic.twitter.com/TltPoMbYec — udayyyyyy 👨🏻💻👨🏻💼👨🏻🍳🏋️ (@uday0035) July 19, 2021 So watched the video, I once liked Raina very much and now im sad how ignorant or he has been hiding all these days. Lost it! No more respect — vijay renganathan (@MarineRenga) July 20, 2021 -
‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాడు’
తిరువనంతపురం: కేరళ హై కోర్టు న్యాయమూర్తి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఆయన ఎవరిని కించపర్చలేదు.. కానీ ఓ సామాజిక వర్గం వారిని కీర్తించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళకు చెందిన వి.చింతాబరేష్ హై కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగబద్దంగా ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన.. ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. బ్రాహ్మణుల గుణగణాలను కీర్తించడంలో మునిగిపోయాడు చింతాబరేష్. వివరాలు.. కొద్ది రోజుల క్రితం చింతాబరేష్ తమిళ్ బ్రాహ్మణ్స్ గ్లోబల్ మీట్‌కు హాజరయ్యారు. సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘పూర్వజన్మ సుకృతం ఉంటేనే బ్రాహ్మణుడిగా పుడతారు. బ్రాహ్మణుడు ద్విజుడు.. అంటే రెండు జన్మలు కలవాడు. శుభ్రమైన అలవాట్లు, ఉన్నతమైన ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, శాఖహారి, కర్ణాటక సంగీతాన్ని ఇష్టపడే లక్షణాలన్ని ఒక్క బ్రాహ్మణుడిలో మాత్రమే ఉంటాయి. గత జన్మలో ఎన్నో మంచి పనులు చేస్తేనే ఈ బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. ఇంత ఉన్నతులైన బ్రాహ్మణులకు సమాజంలో సముచిత స్థానం దక్కడం లేదు. వారు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఆందోళన చేయాలని’ ఈ సందర్భంగా చింతాబరేష్ పిలుపునిచ్చారు. దేశంలో ఉన్నతమైన పదవి దక్కించుకోవడానికి బ్రాహ్మణులకే ఎక్కువ అర్హతలు ఉన్నాయన్నారు చింతాబరేష్. బ్రాహ్మణ సమాజంలోకి ఇతరులను అనుమతించకూడదన్నారు. బ్రాహ్మణుడు స్వచ్ఛమైన లౌకికవాది.. ప్రజలను ప్రేమిస్తూ.. వారి శ్రేయస్సు కోసం ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు. అలాంటి వాడు అధికారంలో ఉండే జనాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయమూర్తి వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సేనకుడి జీవ కారుణ్యం
పూర్వం వారణాసిని జనకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని మహామంత్రి సేనకుడు పరమ ధార్మికుడు. అంతకు మించి ప్రజ్ఞావంతుడు. ఆయన తెలివి తేటలు, సమయస్ఫూర్తి లోకంలో ప్రజలందరికీ తెలిసి వేనోళ్ల కీర్తించేవాళ్లు. వారణాసి నగర శివారులో ఒక పేద వృద్ధ బ్రాహ్మణ దంపతులుండేవారు. ఆ బ్రాహ్మణుడు యాయవారంతో జీవనం సాగిస్తుండేవాడు. ఒకరోజున భిక్షకోసం దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి బయలు దేరాడు. భర్తకు అల్పాహారంగా ఒక సంచిలో సత్తుపిండి కలిపి ఇచ్చింది భార్య. బియ్యపు పిండిలో బెల్లం పలుకులు కలిపి ఇచ్చిన ఆ సత్తు పిండి సంచిని భుజానికి తగిలించుకుని బయలు దేరి వెళ్లాడు. భిక్షానంతరం మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనిపిస్తే అక్కడ ఆగాడు. చెట్టుకింద కూర్చొని సంచి మూట విప్పి పిండి తిన్నాడు. నీటికోసం దిగుడు బావిలో దిగాడు. ఆ చెట్టు తొర్రలో ఒక నల్ల నాగు ఉంది. పిండి వాసన పసిగట్టి వచ్చి సంచిలో దూరింది. వృద్ధుడు నీరు తాగి వచ్చి, పాముని గమనించకుండా మూతి కట్టేశాడు. ముందుకు కదిలాడు. ఆ దగ్గరలో ఒక చెట్టు మీద ఒక యక్షుడు ఉన్నాడు. వాడు బ్రాహ్మణుడితో – ఓయీ సాయంత్రానికి ఇంటికి చేరుకోలేక పోయావంటే నీవు మరణిస్తావు. చేరుకున్నావంటే నీ భార్య మరణిస్తుంది’’ అని హెచ్చరించి అక్కడ నుండి వెళ్లిపోయాడు. అతని మాటలకు భయపడ్డ బ్రాహ్మణుడు దిగులుగా ఇంటిదారి పట్టాడు. తన సమస్యకు సేనకుడు మాత్రమే పరిష్కారం చెప్పగలడని అనుకొని సేనక మంత్రి దగ్గర కు వెళ్లాడు. సేనకుడు ధర్మసభలో ఉన్నాడు. వృద్ధబ్రాహ్మణుడు విషయం చెప్పగా, సేనకుడు ఆలోచించి... అతని భుజం మీది సత్తుపిండి సంచిని చూశాడు. ‘‘మధ్యాహ్నం ఎక్కడ భోం చేశావు’’ అని అడిగి, వివరాలు తెలుసుకుని –‘‘ఓయీ! భయపడకు. నీ సంచిలో పాముంది. నీవు సాయంత్రం లోపు ఇంటికి చేరలేకపోతే, ఆ సంచిని విప్పి పిండి తినాలి కదా! అప్పుడు అందులోని పాము కాటేసి మరణిస్తావు. ఒకవేళ ఇంటికి చేరితే, ఆ సంచి భార్యకు ఇస్తావు కాబట్టి, ఆమె ఆ సంచి విప్పగానే పాము కాటుతో మరణిస్తుంది. ఏదీ సంచి మూతి విప్పు’’ అన్నాడు. సేనకుడు చెప్పినట్లే బుసలు కొడుతూ, బైటకొచ్చి పడగ విప్పి లేచింది కాలనాగు. సభికులు సేనకుని తెలివికి చప్పట్లు కొట్టారు. కొందరు సభికులు కర్రలు తీసుకు వచ్చి పాముని చంపబోయారు. సేనకుడు వద్దని వారించి – పాముల వాణ్ణి పిలిపించి, ‘‘నాగును పట్టి అడవిలో వదిలిరా’’అని చెప్పి పంపాడు. అతని జీవ కారుణ్యానికి సభికులు హర్షధ్వానాలు చేశారు. తమ ప్రాణాలు కాపాడినందుకు బ్రాహ్మణుడు నిండు మనస్సుతో మంత్రిని ఆశీర్వదించాడు. జీవ కారుణ్యం గురించి, ప్రతిజీవికీ జీవించే హక్కు ఉంటుందనీ, దాన్ని కాలరాయకూడదనే ధర్మ ప్రబోధానికి బుద్ధుడు చెప్పిన ఈ కథ నేటికీ ఆవశ్యకమే. జీవ వైవిధ్యాన్ని ఆనాడే ప్రకటించిన బుద్ధ ప్రబోధం అజరామరం. డా. బొర్రా గోవర్ధన్ -
‘అతడు బ్రాహ్మణుడు కాదు.. రాక్షసుడు’
శబరిమల : అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనక దుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి.. అయ్యప్ప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో.. పూజారి కందరు రాజీవేరు ఆలాయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇవి కాస్తా వివాదాస్పందగా మారాయి. దీని గురించి కేరళ మంత్రి జీ సుధాకరన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తమ సోదరిని అపవిత్రురాలిగా భావిస్తారా’ అంటూ ప్రశ్నించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణున్ని రాక్షసుడంటూ విమర్శించారు. ఈ పూజలు నిర్వహించిన వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు కాదు. అతనికి అయ్యప్ప పట్ల ఎటువంటి భక్తి, మర్యాద లేవు. ఇతను బ్రాహ్మణుడు కాదు.. బ్రాహ్మణ రాక్షసుడు. ఇలాంటి వాడు తీవ్రవాదిగా కూడా మారతాడన్నారు. -
మగాళ్ల ఏడుపు
రుడాలి తెలుసుకదా.. అంటే ఊళ్లో కాస్త పెద్దవాళ్లిళ్లోఎవరైనా చనిపోతే ఏడ్వడానికి వెళ్లేవాళ్లు. ఈ ఆడవాళ్లు గుండె బాదుకుంటూ ఏడ్చి ఆ ఇళ్లల్లో విషాదచ్ఛాయలు తీసుకువస్తారన్నమాట. జగా బ్రాహ్మన్ తెగ కూడా ఇలాంటిదే. బీహార్ రాష్ట్రంలో దాదాపు 12 ఊళ్లల్లో వీళ్ల జనాభా ఉంది. ఊళ్లో ఎవరైనా చనిపోతే ఈ తెగలోని మగవాళ్లు ఆ ఇళ్లకు వెళ్లి పెద్ద శోకాలు పెట్టుకుంటూ చనిపోయిన వాళ్లను కీర్తిస్తుంటారు. కర్మకాండ అయిపోయాక పెరుగు, అటుకులు తిని.. కొత్త బట్టలు, డబ్బులు దక్షిణగా తీసుకుని వెళ్లిపోతారు. సాధారణంగా ఈ అనవాయితీని తండ్రి నుంచి కొడుకు వారసత్వంగా తీసుకుంటాడు. కాని ఇప్పుడు యువతరం వాళ్లెవ్వరూ ఈ పని చేయడానికి ఒప్పుకోవడం లేదట. చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగాలు చేసుకోవడానికే ఉత్సాహం చూపిస్తున్నారట. అయితే కొడుకులు తమ వారసత్వ వృత్తిని తిరస్కరించడం పట్ల తండ్రులు అసంతృప్తితో ఉన్నారట. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి వృత్తి రాదని, తమ కీర్తనలతో చనిపోయిన వాళ్లను స్వర్గానికి పంపే జాతి తమదని చెప్తున్నారు జగా బ్రాహ్మలు. -
‘బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్’
రాజాం: బ్రాహ్మణుల సంక్షేమానికే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ సీఈఓ అభిజిత్ జయంతి అన్నారు. ఆయన బుధవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అరుంధతి, వశిష్ట వంటి గ్రూపులు ఏర్పాటు చేసి అందులోని మహిళా సభ్యులకు రుణ సౌకర్యం కల్పించి వారి ద్వారా పచ్చళ్లు, పొడులు తదితర వాటిని తయారుచేయించి మార్కెట్లో విక్రయించడానికి ఆర్ధిక స్వావలంబన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాడ సంతోష్‌కుమార్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.30వేలు చెక్కును అందించారు. కార్యక్రమంలో క్రెడిట్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు కె.తిరుమలేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ కేవీఎస్కేజే శర్మ, గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు రంప జగదీశ్వరరావు, వాయునందనశర్మ, కాలేటి కృష్ణమూర్తి , శ్రీను పంతులు తదితరులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులపై ప్రచారం
సింహాచలం : బ్రాహ్మణ కార్పరేషన్ నిధులను బ్రాహ్మణులు ఏవిధంగా వినియోగించుకోవాలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో తెలియజేసే కార్యక్రమం ని నిర్వహిస్తున్నామని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు జ్వాలాపురపు శ్రీకాంత్ తెలిపారు. సింహాచలంలోని ఓ కల్యాణమండపంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణులకు విద్యాభారతి, చాణుక్య, గరుడ, వశిష్ట అనే పథకాలు అమలులో ఉన్నాయని, వీటికి అర్హులైనవారు ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఖర్చూ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇక, ఇటీవల దేవాలయాల్లో అర్చకులకు, పురోహితులకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం, ఇడ్లీ, దోశ అమ్మినట్టు కష్ణా పుష్కరాల్లో బ్రాహ్మణ సేవలకు ధరలు నిర్ణయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కాపు, ఖమ్మ, వెలమ, క్షత్రియ కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తమ సంఘం పోరాటం చేయనుందని తెలిపారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యదర్శి ఎమ్ఎల్ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం నుంచి జరిగే గోదావరి అంత్య పుష్కరాల్లో సేవలకొచ్చే బ్రాహ్మణులకు అసౌకర్యం కలగకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. కష్ణా పుష్కరాల్లో పాల్గొనే బ్రాహ్మణుల కోసం టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు జిల్లాల పురోహితులకు మాత్రమే కష్ణాపుష్కరాల్లో విధులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని, రాష్ట్రంలో ఉన్న పురోహితులందరికీ ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రిని, కమిషనర్‌ను కోరామన్నారు. బ్రాహ్మణ భవనం నిర్మాణానికి విశాఖలో 22 సెంట్ల స్థలం ఇచ్చారని, సెప్టెంబరు నెలాఖరులో బ్రాహ్మణ భేరి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు కనీసం పది సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సుసర్ల ఉదయ్‌కుమార్, ప్రతినిధులు హరి, రాపత్తి కన్నా, కె. సుబ్రహ్మణ్యం, జెఎస్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఖజానా నుండి కరుణించండి!
-
మా మధ్య ఉండడానికి వీల్లేదు..
మొరాదాబాద్: ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యల్ని సహించం, విధ్యంసకర చర్యల్ని క్షమించమంటూ ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంటే... మరోవైపు బీజేపీ శ్రేణులు, పలువురు పార్టీ నాయకులు మాత్రం మత విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీ ఇలాంటి వివాదంలోనే చిక్కుకొంది. పార్టీ కౌన్సిలర్ విద్యాశరన్ శర్మ అలియాస్ బిట్టూ ఒక ముస్లిం కుటుంబాన్ని ఇంట్లోంచి గెంటివేసిన కేసులో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... కౌన్సిలర్ శర్మ బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే తమ ప్రాంతంలో ముస్లింలు ఉండడానికి వీల్లేదంటూ హూంకరించాడు. ఉన్మాదిలా మారి ఓ ముస్లిం కుటుంబాన్ని వేధిస్తూ వచ్చాడు. తమ ఇల్లు అమ్ముకున్న తర్వాత వెళ్లిపోతామని ఆ కుటుంబం వేడుకున్నా వినిపించుకోలేదు. చివరికి సొంత ఇంట్లో ఉంటున్న మహిళను బయటికి గెంటేసి, ఇంటికి తాళం వేశాడు. అంతేకాదు ఆ ఇంటిని ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వడానికి వీల్లేదని బెదిరించాడు. దీంతో వివాదం రగిలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తమ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు ఉండడానికి వీల్లేదని ఏది ఏమైనా సరే తాము అనుమతించమని విద్యాశరన్ శర్మ ఈ సందర్భంగా పోలీసులతో వాదించినట్టు తెలుస్తోంది. బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే తమ మధ్య ముస్లింలు ఎలా ఉంటారంటూ పోలీసు అధికారి అనిల్ కుమార్ తో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. దీంతో విసిగి వేసారిన ఆ ముస్లిం కుటుంబం తమ ఇల్లును కొనుక్కునే నాధుడి కోసం ఎదురు చూస్తోందట. -
వెనుకబడిన కులాల జాబితాలోకి ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ చిక్కబళ్లాపురం : ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి కసరత్తు చేస్తున్నట్లు రాష్ర్ట సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ వెల్లడించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదివారం స్థానిక హర్షోదయ కల్యాణమంటపంలో ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రదానం చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సమాజంలో జాతి, కుల, మత విభేదాలు ఉండరాదని జాతిపిత మహాత్మగాంధీ అనాడే చాటి చెప్పారన్నారు. ఆర్యవైశ్యులకు వివిధ సౌలభ్యాలను అందించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారని తెలిపారు. ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి అంగీకరించారన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో నవంబరు నుంచి కులాలవారీగా గణన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విధానపరిషత్ సభాపతి డీహెచ్.శంకరమూర్తి మాట్లాడుతూ విద్యకు ఉన్న విలువ దేనికీ లేదన్నారు. అనంతరం వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలను మంత్రి ఆంజనేయ, డీహెచ్.శంకరమూర్తిఅందజేశారు. అంతకు ముందు కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారి శోభయాత్రను రాష్ర్ట విద్యాశాఖ కమిషనర్ నందకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధాకర్, మంజునాథ్, జగదీశ్‌కుమార్, ఎమ్మెల్సీ శరవణ, డీఐజీ గుప్తచరపద్మనయన. ఆర్యవైశ్య మండలి చిక్కబళ్లాపుర శాఖాధ్యక్షుడు నజుండరామశెట్టి, ఆర్యవైశ్యమహాసభా అధ్యక్షుడు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు
హన్మకొండకల్చరల్, న్యూస్‌లైన్ : కాజీపేటలోని రైల్వే స్టేడియంలో ఆదివారం తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు నిర్వహిస్తున్నారు. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఓరుగల్లులో మొదటిసారిగా బ్రాహ్మణులంతా ఐక్య ఫ్రంట్‌గా ఏర్ప డి భారీస్థాయిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే సదస్సుకు రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలచారి, పాలకుర్తి, సిద్ధిపేట, హన్మకొండ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, మ హాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ.రమణాచారి, బీజేపీ జాతీయ నాయకుడు వి.ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ తిరువరంగం సంతోష్‌కుమార్, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సౌందరరాజన్, కార్యనిర్వహణ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొననున్నారు. సదస్సు విజయవంతం కావాలని ర్యాలీ.. కాజీపేట రైల్వే స్టేడియంలో తెలంగాణ బ్రాహ్మణ అర్చక శ్రీవైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ బ్రాహ్మణ ఐక్యతా సదస్సు విజయవంతం కావాలని కోరుతూ శనివారం సాయంత్రం సంఘం నాయకులు భారీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు అయినవోలు వెంకటసత్యమోహన్ జెం డా ఊపి ప్రారంభించారు. కాగా, వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోచమ్మమైదాన్, వరంగల్ రైల్వేస్టేషన్, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్, భద్రకాళీ రోడ్, ములుగురోడ్, హన్మకొండచౌరస్తా, బ్రాహ్మణవాడ, లష్కర్‌బజార్, అదాలత్ మీదుగా కాజీపేట రైల్వేస్టేడియం చేరుకుంది. ఈ సందర్భంగా నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహానికి బ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ వి.విశ్వనాథరావు, బ్రాహ్మణ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తిరవరంగం ప్రభా కర్రావు, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జీవీఎస్.శ్రీనివాసచారి, గుదిమెల్ల విజయకుమారాచార్య, తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య కన్వీనర్ వెన్నెంపల్లి జగన్మోహన్శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గంగు ఉపేంద్రశర్మ, సమాఖ్య అర్చక అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్, శివపురం రామలింగారాధ్య, శ్వేతా ర్క గణపతి దేవాలయం ప్రధానర్చకులు ఐనవోలు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టేడియంలో గణపతి హోమం.. కాజీపేట : కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యత సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం అర్బన్ అధ్యక్షుడు వల్లాది పవన్‌కుమార్, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జీవీఎస్ శ్రీనివాసచారిలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వారు రైల్వే స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బ్రాహ్మణులు గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్‌కుమార్, జీవీఎస్ శ్రీనివాసచారిలు మాట్లాడారు. ‘తెలంగాణ ఐక్యత ముద్దురా.. సమైక్యాంధ్ర వద్దురా’ అనే నినాదంతో బ్రాహ్మణ, అర్చక, శ్రీవైష్ణవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులకు చట్టసభల్లో, పార్టీల్లో రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లాలోని బ్రాహ్మణులందరూ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ వి.విశ్వనాథరావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వెన్నంపెల్లి జగన్మోహన్శర్మ, తిరువగం ప్రభాకర్‌రావు, రాధాకృష్ణశర్మ, శివపురం రామలింగంచార్యులు పాల్గొన్నారు.