
రుడాలి తెలుసుకదా.. అంటే ఊళ్లో కాస్త పెద్దవాళ్లిళ్లోఎవరైనా చనిపోతే ఏడ్వడానికి వెళ్లేవాళ్లు. ఈ ఆడవాళ్లు గుండె బాదుకుంటూ ఏడ్చి ఆ ఇళ్లల్లో విషాదచ్ఛాయలు తీసుకువస్తారన్నమాట. జగా బ్రాహ్మన్ తెగ కూడా ఇలాంటిదే. బీహార్ రాష్ట్రంలో దాదాపు 12 ఊళ్లల్లో వీళ్ల జనాభా ఉంది. ఊళ్లో ఎవరైనా చనిపోతే ఈ తెగలోని మగవాళ్లు ఆ ఇళ్లకు వెళ్లి పెద్ద శోకాలు పెట్టుకుంటూ చనిపోయిన వాళ్లను కీర్తిస్తుంటారు.
కర్మకాండ అయిపోయాక పెరుగు, అటుకులు తిని.. కొత్త బట్టలు, డబ్బులు దక్షిణగా తీసుకుని వెళ్లిపోతారు. సాధారణంగా ఈ అనవాయితీని తండ్రి నుంచి కొడుకు వారసత్వంగా తీసుకుంటాడు. కాని ఇప్పుడు యువతరం వాళ్లెవ్వరూ ఈ పని చేయడానికి ఒప్పుకోవడం లేదట. చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగాలు చేసుకోవడానికే ఉత్సాహం చూపిస్తున్నారట. అయితే కొడుకులు తమ వారసత్వ వృత్తిని తిరస్కరించడం పట్ల తండ్రులు అసంతృప్తితో ఉన్నారట. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి వృత్తి రాదని, తమ కీర్తనలతో చనిపోయిన వాళ్లను స్వర్గానికి పంపే జాతి తమదని చెప్తున్నారు జగా బ్రాహ్మలు.
Comments
Please login to add a commentAdd a comment