బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులపై ప్రచారం
Published Sun, Jul 31 2016 12:05 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
సింహాచలం : బ్రాహ్మణ కార్పరేషన్ నిధులను బ్రాహ్మణులు ఏవిధంగా వినియోగించుకోవాలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో తెలియజేసే కార్యక్రమం ని నిర్వహిస్తున్నామని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షుడు జ్వాలాపురపు శ్రీకాంత్ తెలిపారు. సింహాచలంలోని ఓ కల్యాణమండపంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణులకు విద్యాభారతి, చాణుక్య, గరుడ, వశిష్ట అనే పథకాలు అమలులో ఉన్నాయని, వీటికి అర్హులైనవారు ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి ఖర్చూ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇక, ఇటీవల దేవాలయాల్లో అర్చకులకు, పురోహితులకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం, ఇడ్లీ, దోశ అమ్మినట్టు కష్ణా పుష్కరాల్లో బ్రాహ్మణ సేవలకు ధరలు నిర్ణయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కాపు, ఖమ్మ, వెలమ, క్షత్రియ కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తమ సంఘం పోరాటం చేయనుందని తెలిపారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యదర్శి ఎమ్‌ఎల్‌ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం నుంచి జరిగే గోదావరి అంత్య పుష్కరాల్లో సేవలకొచ్చే బ్రాహ్మణులకు అసౌకర్యం కలగకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. కష్ణా పుష్కరాల్లో పాల్గొనే బ్రాహ్మణుల కోసం టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు జిల్లాల పురోహితులకు మాత్రమే కష్ణాపుష్కరాల్లో విధులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని, రాష్ట్రంలో ఉన్న పురోహితులందరికీ ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రిని, కమిషనర్‌ను కోరామన్నారు. బ్రాహ్మణ భవనం నిర్మాణానికి విశాఖలో 22 సెంట్ల స్థలం ఇచ్చారని, సెప్టెంబరు నెలాఖరులో బ్రాహ్మణ భేరి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు కనీసం పది సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా యూత్ ప్రెసిడెంట్ సుసర్ల ఉదయ్‌కుమార్, ప్రతినిధులు హరి, రాపత్తి కన్నా, కె. సుబ్రహ్మణ్యం, జెఎస్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Advertisement
Advertisement