జైపూర్: సమాజంలో పేరు రావాలనే ఉద్దేశంతోకాకుండా ఎలాంటివి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయండని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. రాజస్తాన్‌లోని జామ్దోలీలో జరుగుతున్న సేవా సంఘ్‌లో ‘రాష్ట్రీయ సేవా భారతి’ ప్రతినిధులు, సంఘ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవత్ ఉపన్యసించారు. ‘ వ్యవస్థీకృతమైన శక్తులు ఎల్లప్పుడూ ఘన విజయాలను సొంతం చేసుకుంటాయి.
విశ్వమానవాళి శ్రేయస్సు కోసం నిశ్శబ్దంగా సేవచేసే కార్యకర్తలం మనం. నిస్వార్థ సేవ అలవాటు చేసుకోండి. మనల్ని ఇంకెవరో పొగడాల్సిన అవసరం లేదు. పేరు ప్రఖ్యాతలపైకి దృష్టిని పోనివ్వకండి. సామాజిక సేవ చేస్తే పేరు అదే వస్తుంది. అంతమాత్రానికే దానిపై ధ్యాస పెట్టొద్దు. అహం మీకు అవరోధంగా మారొద్దు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటపుడు హుందాగా ఉండాలి. మనమేం గొప్ప పని చేయడంలేదు. సమాజం కోసం మన బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment