ఆశకు హద్దేముంది: ఆరెస్సెస్ చీఫ్ భగవత్
మోదీపై చేసిన విమర్శలే: విపక్షాలు
గుమ్లా (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీపై తరచూ సునిశిత విమర్శలు గుప్పిస్తున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు. ఆనక అతీత శక్తులున్న సూపర్‌మ్యాన్ కావాలని ఆశపడతాడు. తర్వాత దేవుడు, భగవంతుడు కావాలనుకుంటాడు. ఆ తర్వాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు. దాన్నీ దాటితే? ఆపైన ఏముందో ఎవరికీ తెలియదు. అంతర్గత, బహిర్గత వికాసానికి అంతన్నదే ఉండదు’’ అన్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచాన్ని అందమైన నివాసయోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పాటుపడటమే మన బాధ్యతన్నారు.
మోదీపై ఆరెస్సెస్ అగ్ని క్షిపణి: కాంగ్రెస్
మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ పేర్కొంది. ‘‘అవి లోక్ కల్యాణ్ మార్గ్ (ఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం)పైకి నాగ్‌పూర్ (ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం) ప్రయోగించిన అగ్ని క్షిపణి’ అంఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందరిలా తాను తల్లి కడుపు నుంచి పుట్టలేదని చెప్పుకున్న ప్రధానికి ఆరెస్సెస్ తాజా సందేశం విన్పించే ఉంటుందంటూ వాగ్బాణాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment