
మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ