న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు.
ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.
ఇదీ చదవండి: సోషల్‌మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్
Comments
Please login to add a commentAdd a comment