న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా అధికార ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్), ప్రతిపక్ష బీజేపీ మధ్యే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం స్టార్టైంది.
BJP वालों, तुम्हारा दूल्हा कौन है❓ pic.twitter.com/yHJCwKY4hb
— AAP (@AamAadmiParty) January 5, 2025
మరోవైపు సోషల్‌మీడియాలోనూ ఆప్,బీజేపీలు పోటాపోటీగా పొలిటికల్ పోస్టులు పెడుతున్నాయి. బీజేపీకి ఇప్పటివరకు సీఎం అభ్యర్థే దిక్కులేడని ఆప్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టగా ఆప్ పార్టీ ‘ఆప్‌దా’ పార్టీ అని బీజేపీ వ్యంగ్యాస్త్రం సంధిస్తూ అంతకుముందు మరో ట్వీట్ చేసింది. ఇటీవల పీఎం మోదీ ఢిల్లీలో పర్యటించినపుడు ఆప్ పార్టీని ఆప్‌దా(విపత్తు) పార్టీగా ఎద్దేవా చేశారు.
AAPदा को नहीं सहेंगे, बदल के रहेंगे pic.twitter.com/3iSuJQf0bG
— BJP Delhi (@BJP4Delhi) January 4, 2025
ఆప్ పార్టీ నేతలంతా అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీకి విపత్తుగా పరిణమించారని మోదీ విమర్శించారు. దీనినే బీజేపీ తమ క్యాంపెయిన్‌లో వాడుకుంటోంది. మరోవైపు ఎన్నికల కోసం ఆప్ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితా విడుదల చేయగా బీజేపీ శనివారం(జనవరి 4) తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment