Controversial remarks
-
హిందుత్వ ఒక వ్యాధి: ఇల్తీజా
జమ్మూ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి అని, అది హిందూవాదాన్ని అప్రతిష్ట పాలుచేస్తోందని విమర్శించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులు, హత్యలకు హిందుత్వ కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి బీజేపీ హిందుత్వ కార్డును వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇల్తీజా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘రామ నామం జపించడానికి నిరాకరించినందుకు ఓ ముస్లిం బాలుడిని చెప్పులతో కొట్టారు. ఘోరంగా జరుగుతున్నా అడ్డుకోకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినందుకు శ్రీరాముడు సిగ్గుతో ఉరి వేసుకోవాలి. హిందుత్వ ఒక వ్యాధి. దాంతో కోట్లాది మంది భారతీయులు బాధలు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. బాలుడిని కొట్టిన వీడియోను షేర్చేశారు. అనంతరం ఆమె జమ్మూలో మీడియాతో మాట్లాడారు. హిందుత్వ, హిందూయిజం మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. హిందుత్వ అనేది విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు. భారతదేశం హిందువులదే అని బోధిస్తుందని చెప్పారు. హిందుయిజం మాత్రం ఇస్లాం మతం తరహాలోనే లౌకికవాదాన్ని, సామరస్యాన్ని ప్రబోధిస్తుందని వివరించారు. హిందుత్వ అనే వ్యాధిని నయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జైశ్రీరామ్ అనే నినాదం రామరాజ్యం స్థాపనకు సంబంధించింది కాదని అన్నారు. మూకదాడుల సమయంలో ఆ నినాదం వాడుకుంటున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఇల్తీజా ముఫ్తీ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ ఇతరుల మతపరమైన మనోభావాలను గాయపర్చే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. -
భారత్, బంగ్లాదేశ్ రెండూ ఒక్కటే
జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ఏఎస్ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు. -
చొరబాటుదార్లను తరిమికొట్టాలి
రాంచీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని అన్నారు. లేకపోతే రాష్ట్రంలో హిందువుల జనాభా మరో 20 ఏళ్లలో సగానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. శనివారం పాలాములో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హిమంతబిశ్వ శర్మ ప్రసంగించారు. ఆయన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ–ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. చొరబాటుదార్లను బయటకు వెళ్లగొట్టడానికి, హిందువులను కాపాడడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్‌లో పలు ప్రాంతాల్లో హిందువుల జనాభా ఇప్పటికే భారీగా తగ్గిపోయిందని గుర్తుచేశారు. భారతదేశాన్ని హిందువులు కాపాడుతున్నారని, జైశ్రీరామ్ అని నినదించడానికి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం ప్రజలు ఎల్లప్పుడూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకే ఓటు వేస్తున్నారని, హిందువుల ఓట్లు మాత్రం పారీ్టల వారీగా చీలిపోతున్నాయని తెలిపారు. అలా కాకుండా హిందువులంతా ఒక్కటై జేఎంఎం కూటమిని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీపై హిమంతబిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. అస్సాంలో జార్ఖండ్ గిరిజనులకు గుర్తింపేదీ?: హేమంత్ సోరెన్ అస్సాంలో జార్ఖండ్ గిరిజనుల గుర్తింపును హిమంతబిశ్వ శర్మ ప్రభుత్వం చెరిపేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్ నుంచి వెళ్లిన గిరిజనులకు అస్సాంలో ఎస్టీ హోదా కలి్పంచడం లేదని విమర్శించారు. శనివారం కుంతీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సోరెన్ మాట్లాడారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు అస్సాం టీ తోటల్లో పని చేస్తున్నారని, వారి బతుకులు దుర్బరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అస్సాం ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. బీజేపీపై సోరెన్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కుల మతాల పేరిట సమాజాన్ని విచి్ఛన్నం చేస్తోందని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హేమంత్ సోరెన్ ధీమా వ్యక్తంచేశారు. -
న్యాయమూర్తులు హద్దు మీరొద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.అసలేం జరిగింది? బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్‌తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు. -
Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది. అయ్యర్ అన్నదేంటి? ఏప్రిల్‌లో ‘చిల్పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్‌కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్‌పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్‌తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్‌లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్‌కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్‌లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్‌తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు. -
Gujarat: కేంద్రమంత్రి నోటి దురుసు.. ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పి
అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొద్దిరోజుల్లో జరగనుండగా కేంద్రమంత్రి పర్షోత్తమ్ రూపాలా చేసిన వ్యాఖ్యలు గుజరాత్లో బీజేపీకి తలనొప్పిగా మారాయి. క్షత్రియులపై పర్షోత్తమ్ రూపాలా వ్యాఖ్యలతో రాజ్‌కోట్‌లో రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రూపాలా ఇంటి ముందు ఆయన దిష్టిబొమ్మను కాల్చారు. దీంతోపోలీసులు రూపాలా ఇంటి వద్ద భద్రత పెంచారు. క్షత్రియులపై తాను చేసిన వ్యాఖ్యలపై రూపాలా క్షమాపణలు చెప్పినప్పటికీ రాజ్‌పుత్‌లు వెనక్కి తగ్గడం లేదు. రాజ్‌కోట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రూపాలాను లోక్‌సభ రేసు నుంచి డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ 22 దళితులతో జరిగిన ఓ కార్యక్రమంలో రూపాల గతంలో మహారాజాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ వారితో ఒకే కంచంలో తినడంతో పాటు వారికి తమ కూతుళ్లనిచ్చి మహారాజాలు పెళ్లి చేశారని రూపాలా విమర్శించారు. దళితులు మాత్రం బ్రిటీష్ వారి వేధింపులు తట్టుకున్నారని, మతం మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్లో దుమారం రేపాయి. రాజ్‌పుత్ కమ్యూనిటీ ఓట్లు బీజేపీలో 17 శాతం మేర ఉంటాయి. ఇవన్నీ మొన్నటిదాకా బీజేపీ ఖాతాలో పడే ఓట్లే. రూపాలా నోటీ నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలతో లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్లు తమ పార్టీకి పడతాయా లేదా అని బీజేపీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో రాజ్‌పుత్‌లు ఎన్నికల ఫలితాలను చాలా వరకు ప్రభావితం చేస్తారు. ఇదీ చదవండి.. వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ -
వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వైఎస్సార్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వలంటీర్లపై శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు, వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను టెర్రరిస్ట్లంటూ బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. వలంటీర్ల సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని ప్రస్తావించారు. ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వలంటీర్లపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు తమ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. టీడీపీ నేతలు వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి: వలంటరీ వ్యవస్థపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బొజ్జల సుధీర్ తండ్రి మంత్రిగా పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. బొజ్జల సుధీర్‌కు బుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రజలకు అందించే వ్యవస్థ వలంటరీ వ్యవస్థ.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేస్తుందన్నారు. ‘2 లక్షల 50 వేల మంది వలంటీర్లు అంటే ఎవరు, వాళ్లంతా మన ఇంట్లో పిల్లలు, ఇరుగు పొరుగు పిల్లలు కాదా? కేరళ రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఆనాడు పవన్ కల్యాణ్ వలంటరీ వ్యవస్థను విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని పిచ్చి కూతలు కూశాడు. వలంటీర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి. వలంటరీ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తప్పుడు తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. వలంటీర్లపై విషం అవ్వతాతాలు గడప దాటకుండా ఒకటో తారీఖున టంచన్‌గా పింఛన్ ఇస్తున్న వాలంటరీలపై కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుదీర్ రెడ్డి విషం కక్కుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిలిచినా వాలంటరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్‌తో పోల్చిన బొజ్జల సుదీర్ రెడ్డి అసలు మనిషేనా అని ప్రశ్నించారు. వలంటరీలను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. అలాంటి వాళ్ళను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదీలతో పోల్చిన బొజ్జలపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు , పవన్‌లు వలంటరీలపై విషం కక్కి అబాసు పాలయ్యారపి. వంలంటరీ వ్యవస్థపై పడి ఏడుస్తున్న వీరందరికి త్వరలో ప్రజలు బుద్ది చెప్తారని అన్నారు కృష్ణా జిల్లా: వలంటీర్లను తీవ్రవాదులుగా పోల్చి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య. చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇళ్లదగ్గర మగవాళ్ళు లేని సమయంలో వలంటీర్లు తలుపులు కొడతారని అన్నడం విన్నామని. దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ఒంటరి మహిళలను వలంటీర్లు ట్రాప్ చేస్తున్నారని అన్నారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు అధికార దాహంతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది. 2006 నుంచి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేసి పట్టిసీమ నీరు రైతులకు అందిస్తున్నారు. అదే క్రమంలో ప్రస్తుత రైతుల అవసరాల కోసం మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. వంశీ రైతులకు మేలు చేస్తుంటే టీడీపీ నాయకులకు కళ్ళు కుడుతున్నాయి. కావాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల కుయుక్తులు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం.’ అని పేర్కొన్నారు. కాగా వలంటీర్లు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లు టెర్రరిస్టులతో సమానమని, స్లీపర్ సేల్స్లాగా మారి శ్రీకాళహస్తిని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వలంటీర్ల అంతు చూస్తామని అన్నారు. -
బెదిరింపులపై ఉదయ్‌నిధి స్టాలిన్ స్పందన
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల నుంచే కాకుండా.. మిత్ర కూటమి ఇండియా(INDIA) కూటమిలో కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. తాజాగా.. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ఒకరు ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తన వద్దకు తీసుకువస్తే రూ.10కోట్ల నగదు బహుమతి ఇస్తానని ఉత్తరప్రదేశ్ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఒకవేళ ఎవరూ సాహసించక పోతే.. తానే అతన్ని కనిపెట్టి మరీ చంపేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఆచార్య తన తలపై రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు. బెదిరింపులు తమకు కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని ఉదయనిధి చెప్పారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని ఆయన పేర్కొన్నారు(సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న పారిశ్రామికవేత్త దాల్మియాస్ కుటుంబం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కార్యకర్తలు ట్రాక్‌లపై పడుకుని తమ నిరసనను తెలిపారు.). రూ.10 కోట్లు ఎందుకని.. తన తల దువ్వు కోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని ఆచార్య బెదిరింపును ఉదయనిధి తేలికగా చెప్పారు. మళ్లీ అదే చెబుతున్నా.. సనాతన ధర్మ మలేరియా, డెంగ్యూలాంటిదని.. దానిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, హిందూ సంఘాలు ఉదయ్‌నిధికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టడంతో పాటు పలుచోట్ల ఫిర్యాదులు చేశాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ రవిని కలిసి.. మంత్రి ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. అయితే.. ఉదయ్‌నిధి స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మళ్లీ అదే చెబుతున్నా.. మళ్లీ అదే చెబుతా కూడా అంటూ వ్యాఖ్యానించారు. ‘‘సనాతన ధర్మం గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడాను. నేను ఏదైతే మాట్లాడానో.. అదే పదే పదే చెబుతాను నేను హిందూమతాన్నే కాదు అన్ని మతాలను కలుపుకుని.. కులవిభేదాల్ని ఖండిస్తూ మాట్లాడాను, అంతే’’ అని చెన్నై కార్యక్రమంలో పేర్కొన్నారాయన. ప్రతిపక్షాల ఐక్యతపై భయపడి.. బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోంది. వాళ్లు నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఉదయ్‌నిధి స్టాలిన్ మండిపడ్డారు. ఉదయ్‌నిధి హిట్లర్ అంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ, మరోవైపు మిత్రపక్ష ఇండియా కూటమిలోనూ ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. ఉదయ్‌నిధి స్టాలిన్ ఇలా తన వ్యాఖ్యలపై దిద్దుబాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
సనాతన ధర్మంపై ఇంకా మాట్లాడుతా..
సాక్షి, చైన్నె: సనాతన ధర్మం వ్యవహారంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.., ఇంకా చెప్పాలంటే, నిర్మూలనే లక్ష్యంగా ఎక్కడ కావాలంటే, అక్కడ మరింతగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని.. మంత్రి ఉదయ నిధిస్టాలిన్ స్పష్టం చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆయనపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నాయి. బిహార్‌లో ఉదయనిధిపై సోమవారం కేసు కూడా నమోదైంది. ఓబీజేపీతో పాటు హిందూ సంఘాల డీఎంకేను టార్గెట్ చేసి విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అ న్నామలై ఒక అడుగు ముందుకు వేసి, సనాతన ధర్మం గురించి ఉదయ నిధి అనుచిత వ్యాఖ్యలపై దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ఈనెల 10వ తేదీలోపు శేఖర్‌బాబు పదవి నుంచి వైదొలగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ, సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా తరహాలో నిర్మూలించలేమని, అది విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందన్నారు. సనతాన ధర్మానికి వ్యతిరేకం అంటే, హిందూ, దేవదాయ శాఖ ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కా గా తనకు వ్యతిరేకంగా కేసుల నమోదు, ఫిర్యాదులు హోరెత్తడంతో ఉదయ నిధి స్టాలిన్ తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. తాను స నాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానే గానీ, హిందువుల గురించి కాదని స్పష్టంచేశారు. సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ సనాతన ధర్మంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానని, తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడ లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి మరో మార్గంలో తీసుకెళ్తున్నారని వివరించారు. మంత్రి శేఖర్‌బాబు రాజీనామాకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. క్షమాపణకు పట్టు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయ నిధి స్టాలిన్ తక్షణం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీలోని బీజేపీ నేతలు తమిళనాడు భవన్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని తమిళనాడు భవన్, డీఎంకే కార్యాలయానికి భద్రతను మరింతగా పెంచారు. -
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి
చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆయన కరోనా వైరస్, మలేరియా, డెంగీ జ్వరం, దోమలతో పోల్చారు. ఇలాంటి వాటిని వ్యతిరేకించడం కాదు, నాశనం చేయాలన్నారు. శనివారం చెన్నైలో తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి మాట్లాడారు. ‘సనాతన్ అనేది సంస్కృత పదం. సనాతన్ అంటే ఏమిటి? ఇది శాశ్వతమైంది. అంటే మార్చేందుకు వీల్లేనిది. ఎవరూ ప్రశ్నించలేనిది. మతం, కులం ఆధారంగా ఇది ప్రజలను విడదీస్తుంది’ అని ఉదయనిధి అన్నారు. ‘సనాతన ధర్మం కారణంగా భర్త కోల్పోయిన మహిళలు నిప్పుల్లోకి నెట్టివేయబడ్డారు(గతంలో సతీసహగమనం). వితంతువులకు శిరోముండనం చేయించారు. తెల్ల చీరలు ధరింపజేశారు. బాల్య వివాహాలూ జరిగాయి. ద్రవిడ విధానంలో అటువంటి వాటిని లేకుండా చేశాం . వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విశ్వకర్మ యోజన పథకం, 1953లో రాజగోపాలాచారి తీసుకువచ్చిన కులాధారిత విద్యా పథకం వంటిదే. డీఎంకే దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుంది. వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు నోచుకోరాదనే నీట్ వంటి వాటిని కేంద్రం తీసుకు వచ్చింది. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం’అని ఉదయనిధి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అని ఉదయనిధి అన్నారు. ‘అన్ని కులాల వారు ఆలయా ల్లో అర్చకత్వానికి అర్హులేనంటూ కరుణా నిధి చట్టం తెచ్చారు. మన సీఎం స్టాలిన్ అర్చకత్వంలో శిక్షణ పొందిన వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించారు. ఇదే ద్రవిడియన్ మోడల్’ అని ఆయన చెప్పారు. అది విద్వేష ప్రసంగం: బీజేపీ సనాతన ధర్మాన్ని ఆచరించే 80% మందిని సామూహికంగా చంపేయాలంటూ ఉదయనిధి వ్యాఖ్యానించడం విద్వేష ప్రసంగమేనని బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ అన్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకవైపు ప్రేమ దుకాణం తెరుద్దామని పిలుపునిస్తుండగా డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారన్నారు. సామూహికహననం వ్యాఖ్యలపై కాంగ్రెస్ మౌనం మద్దతు నివ్వడమే అవుతుంది. పేరుకుతగ్గట్లే ఇండియా కూటమికి అధికారమిస్తే వేలాది సంవత్సరాల భారత సంస్కృతిని ధ్వంసం చేస్తుంది’ అని పేర్కొన్నారు. నేనలా అనలేదు: ఉదయనిధి తన వ్యాఖ్యలపై చెలరేగిన విమర్శలపై ఉదయనిధి ‘ఎక్స్’లో స్పందించారు. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని సాధించడమే. సనాతన ధర్మం కారణంగా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన వారి తరఫున మాట్లాడాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని సామూహికంగా హతమార్చాలని మాత్రం నేను అనలేదు. సమాజంపై సనాతన ధర్మం ఎటువంటి చెడు ప్రభావం చూపిందనే విషయంలో అంబేడ్కర్, పెరియార్ వంటి వారు అధ్యయనం చేసి రాసిన పుస్తకాల్లో ఏముందో చూపిస్తాను. ఎటువంటి సవాళ్లయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం’అని పేర్కొన్నారు. ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుంగార్పూర్(రాజస్తాన్): సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ ఈ విధమైన ఆరోపణలకు దిగుతున్నాయని మండిపడ్డారు. లష్కరే తోయిబా కంటే హిందుత్వ సంస్థలే మరింత ప్రమాదకరమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇలాంటివి వీరికి కొత్తకాదు, ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని పేర్కొన్నారు. -
జనాభాను నియంత్రించలేం
పాట్నా: జనాభా పెరుగుదలను అరికట్టే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ రాష్ట్రంలో స్త్రీలు నిరక్షరాస్యులని, పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువని, అందుకే జనాభా పెరుగుదలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వైశాలీలో బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు చదువుకుంటే జనాభా తగ్గుతుందని, ఇదే వాస్తవమని అన్నారు. గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్షరాస్యులైన మహిళలకు తెలుస్తుందని వెల్లడించారు. జనాభా నియంత్రణపై పురుషులు సైతం దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు. ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న ఆలోచన వారిలో ఉండడం లేదన్నారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తప్పుపపట్టారు. బిహార్ ప్రతిష్టను దెబ్బతీసేలా నితీశ్ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
భుట్టోపై భగ్గుమన్న బీజేపీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. భుట్టో వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ దేశవ్యాప్తంగా శనివారం పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బిలావల్ దిష్టిబొమ్మలను దగ్ధంచేశారు. శనివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ‘ భారత ప్రధానిపై అనాగరిక, హేయమైన నిందలు వేస్తున్న పాక్ మంత్రికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనల్లో ప్రజలంతా పాల్గొనాలి’ అంటూ బీజేపీ ఒక ప్రకటన చేసింది. -
జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనసుల్ని విషపూరితం చేస్తూ మోదీ సర్కార్ అప్రజాస్వామికంగా పాలిస్తోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాకిస్తాన్లో ఒకప్పటి సైనిక నియంత జనరల్ ముహమ్మద్ జియా ఉల్ హక్ పాలనా.. మోదీ సర్కార్ పరిపాలనా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదాను తొలగించిన మోదీ సర్కార్‌పై జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా పోరాడాలని మెహబూబా పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జమ్మూలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ‘ పాక్‌లో ఒక శ్రీలంక జాతీయుడిని అమానుషంగా కొట్టి చంపేస్తే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెంటనే స్పందించి కఠిన చర్యలకు పూనుకున్నారు. కానీ, భారత్‌లో మూకదాడికి పాల్పడి ప్రాణాలను హరిస్తున్న వారికి పూలదండలతో సత్కరిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగా న్ని ఖూనీ చేస్తున్నారు. నాటి జియా ఉల్ హక్ పాలనకు, నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు తేడా ఏముంది? రెండూ ఒక్కటే’ అని మెహబూబా అన్నారు. ‘ భారత్‌ను, ముస్లింలను విడదీస్తున్నారని నాడు పాక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నాపై అందరూ పగతో రగలిపోయారు. ఇప్పుడు భారత్‌లో ఎందరో జిన్నాలు ఉద్భవించారు. వారంతా భారతస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పార్టీకి చెందిన వారే’ అని బీజేపీని మెహబూబా పరోక్షంగా విమర్శించారు. -
ఆ ప్రైవేటు విద్యాసంస్థలు వ్యభిచార కొంపలట
బెంగళూరు: అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకునే కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి హెచ్ ఆంజనేయ మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాల్లా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం లేకుంటే ఏ మధ్యతరగతి విద్యార్థికానీ, పేద విద్యార్థిగానీ ఈ విద్యాసంస్థల్లో చదవలేడని చెప్పారు. కర్ణాటక ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్యను ఈ సందర్భంగా ఆయన ఏకీపారేశారు. 'విద్య పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఈ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ వ్యభిచార కొంపలు. అయితే, కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మతపరమైన విద్యాసంస్థలు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేదవారు అస్సలు చదువుకోలేకపోయేవారు. బలవంతంగా అధికమొత్తం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలన్నీ వ్యభిచారం చేస్తున్నట్లే' అంటూ ఆయన మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఆంజనేయ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఆంధ్రానేతల బూట్లునాకి మంత్రిని కాలే!
శాసనసభలో మంత్రి జగదీశ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డితో వాగ్వాదం.. అదుపుతప్పిన మంత్రి భగ్గుమన్న కాంగ్రెస్, పోడియం ఎదుట బైఠాయించి నిరసన గందరగోళంతో సభ పలుమార్లు వాయిదా విచారం వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి అయినా శాంతించని కాంగ్రెస్ సభ్యులు సీఎం జోక్యం చేసుకోవాలంటూ సీఎల్పీనేత జానారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రా నేతల బూట్లు నాకి మంత్రిని కాలేదు.. ’ అంటూ కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డిని ఉద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభను కుదిపేశాయి. జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలం టూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించినా.. వారు వెనక్కి తగ్గలేదు. పైగా తన వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే ఉపసంహరించుకుంటున్నానంటూ జగదీశ్‌రెడ్డి ముక్తసరిగా పేర్కొనడంతో కాంగ్రెస్ సభ్యులు మరింతగా ఆగ్రహానికి గురయ్యారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దే ఆందోళనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరకు సీఎం కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పారు. జరిగిందేమిటి..? మహబూబ్‌నగర్ జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు అంశంలో ప్రశ్నలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం ఇస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు మైక్‌తో సంబంధం లేకుండా ప్రశ్నలు అడిగారు. దీంతో మంత్రి అసహనానికి గురయ్యారు. థర్మల్ ప్రాజెక్టును తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్నా... కొన్ని ప్రత్యేక పరిస్థితులతో దామరచెర్లలో ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు ఏర్పాటుకు మహబూబ్‌నగర్ అనుకూలంగానే ఉంటుందని డీకేఅరుణ పేర్కొన్నారు. దీనిపై జగదీశ్‌రెడ్డి బదులిస్తూ.. ‘ఆ జిల్లాలో ఏవి అవసరమో అవి పెడతాం. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు..’’ అని చెప్పారు. ఈ దశలో కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి లేచి.. ‘మంత్రికి అనుభవం లేనందున సమాధానం సరిగ్గా చెప్పడం లేద’ని అన్నారు దీంతో జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెలిచి మంత్రిని అయ్యాను. ఆంధ్రా నాయకుల చెప్పులు నాకి, వైఎస్సార్ బూట్లు నాకి మంత్రిని కాలేదు..’’ అని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్‌పై చర్యల తీసుకోవాల్సిందే.. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. జగదీశ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని, చిన్నారెడ్డికి మాట్లాడేందుకు అవకాశమిస్తామని స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి హరీశ్‌రావు చెప్పినా.. వెనక్కి తగ్గలేదు. స్పందించిన జగదీశ్‌రెడ్డి.. తన వ్యాఖ్యల్లో అభ్యంతరకర మాటలుంటే రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అభ్యంతరకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టువీడకపోవడంతో ఉదయం 10.30కు స్పీకర్ టీబ్రేక్ ప్రకటించారు. మళ్లీ 11.40కు సభ మొదలైంది. కాంగ్రెస్ సభ్యులు మళ్లీ పోడి యం వద్దకు వచ్చి నిరసన ప్రారంభించారు. అవినీతి మంత్రి జగదీశ్‌రెడ్డిని బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో సీబీఐ కేసుల చరిత్ర కాంగ్రెస్‌దేనంటూ మంత్రి హరీశ్ వ్యాఖ్యానించడంతో.. పరిస్థితి మళ్లీ అదుపుతప్పి, సభ వాయిదా పడింది. మళ్లీ అదే సీన్.. 12.15కు సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితి మారలేదు. మంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీపక్ష నేత లక్ష్మణ్, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. సభను హుందాగా నడిపేందుకు అన్ని పక్షాలు సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కానీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేచి చిన్నారెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ‘నన్ను తప్పుపట్టడం నాకు అవమానం కాదా? నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం లేకున్నా.. ఉద్యమ నేతగా ప్రజల మధ్య గడిపాను’ అని పేర్కొన్నారు. తన మాటల్లో అభ్యంతరకర పదాలుంటే ఉప సం హరించుకుంటున్నానని ప్రకటించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు తప్పోకాదో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని వ్యాఖ్యానించారు. ఈ దశలో స్పీకర్ పలుఅంశాలపై చర్చను ప్రారంభిం చారు. తమను పట్టించుకోకుండా సభను నడపటంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో... సభ మళ్లీ వాయిదా పడింది. ముఖ్యమంత్రి రావాల్సిందే.. 1.30కి సభ తిరిగి మొదలయ్యాక సీఎల్పీ నేత జానారెడ్డి సభలోకి వచ్చి మాట్లాడడానికి ఉపక్రమించటంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద నుంచి వెళ్లి తమ స్థానాల్లో కూర్చున్నారు. సభలో ఏం జరిగిందో, ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో తెలియాలంటే రికార్డులను పరిశీలించాలని, కెమెరా ఫుటేజ్‌లు చూడాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. సభ అదుపులోకి రావాలంటే ముఖ్యమంత్రిని పిలిపించాలని కోరారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని జగదీశ్‌రెడ్డి మరోసారి చెప్పారు. కానీ సీఎం రావాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు గట్టిగా నిలదీయడంతో 2 గంటల సమయంలో మరోసారి సభ వాయిదా పడింది. నేను క్షమాపణ చెబుతున్నా..: కేసీఆర్ సాయంత్రం సభ ప్రారంభమయ్యాక సీఎం వచ్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారని, సభ్యులను అవమానపరిచేలా మాట్లాడ్డం సరికాదని పేర్కొన్నారు. కొందరు సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. మొక్కుబడిగా క్షమాపణ చెప్పి, తర్వాతరోజు మళ్లీ అదే రీతిన ప్రవర్తిస్తున్నారని చెప్పారు.ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ.. తాను ఆంధ్రా పాలకుల బూట్లు నాకితే మంత్రి పదవి వచ్చిందో.. సోనియా స్వయానా తనను మంత్రి పదవికి సిఫార్సు చేశారో మంత్రి జగదీశ్‌రెడ్డి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో సీఎం కేసీఆర్ కలుగజేసుకొని చిన్నారెడ్డికి మంత్రి పదవి రావాల్సింది కాబట్టి వచ్చిందని, అందులో ఎటువంటి సందేహం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను సంయమనంతో ఎదుర్కోవాలేగానీ, నువ్వెంత అంటే.. నువ్వెంతనే ధోరణి వద్దని తమ మంత్రులందరికీ చెప్పానన్నారు. జరిగిన దానిపై తాను క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. దీంతో వివాదానికి తెరపడింది. -
సీఎం గారూ...నోరు అదుపులో పెట్టుకోండి!
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీకి సొంతపార్టీ జేడీ(యూ) కళ్లెం వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు సూచించింది. అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ, నాయకులకు ఇబ్బందికరంగా ఉంటాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మాంజీకి ఆయన సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కోరారు. మాంజీని సీఎం పదవి నుంచి తప్పించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా...దీనిపై జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని త్యాగి సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుంటే బీహార్ కు చెందిన కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని మాంజీ బుధవారం వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
బాజ్‌పాయి వ్యాఖ్యలను అంగీకరించం: వెంకయ్య
న్యూఢిల్లీ: ముస్లింలపై ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అంగీకరించబోమని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. లక్ష్మీకాంత్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించలేమని స్పష్టం చేశారు. రేప్, తీవ్రవాదానికి మతం లేదని అన్నారు. అత్యాచారం, తీవ్రవాదం నేరాలని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఒక మతానికి చెందిన పురుషులు వేరొక మతానికి చెందిన మహిళలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారని లక్ష్మీకాంత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంగీకరించబోరని వెంకయ్య నాయుడు అన్నారు. -
ధర్మాగ్రహం...!
రాజకీయ నాయకులను విమర్శించడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మన దేశంలో కొత్తకాదు. ధనం, కులం, మతం, ప్రాంతం, నేరం వంటి అనేకానేక చట్రాల్లో ఇరుక్కుపోయిన రాజకీయరంగంలో... విశ్వసనీయత అన్న పదమే పరాయిదైపోయింది. గెలుపే లక్ష్యంగా, అధికారమే ధ్యేయంగా పనిచేసే రాజకీయ నాయకులవల్లా, పార్టీలవల్లా ఈ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. ఈ స్థితిపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తడంలో వింతేమీ లేదు. అలాంటివారిలో భారతరత్న పురస్కారాన్ని అందుకోనున్న శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక వ్యవహారాల సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు చేరారు. భారతరత్న ప్రకటించిన మర్నాడే ఆయన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులంతా ఉత్త మూర్ఖులని అన్నట్టు మీడియాలో వచ్చింది. అయితే, తాను రాజకీయ నాయకులందరినీ అనలేదని, అసలు తానన్న మాటల్నే మీడియా వక్రీకరించిందని ఆయన వివరణనిస్తున్నారు. ఆయన రాజకీయ నాయకుల్ని ఏమన్నారన్న సంగతిని పక్కనబెడితే ఆ సందర్భంగా ఆయన లేవనెత్తిన అంశాలు మాత్రం చాలా విలువైనవి. మన దేశంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉన్నదని ఆయనన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పోలిస్తే శాస్త్రవేత్తలు చేస్తున్నది చాలా ఎక్కువేనని కూడా ఆయన చెప్పారు. పరిశోధనా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు గతంలోనూ అసంతృప్తి వ్యక్తంచేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉండాలన్నా... కనీసం ఇప్పుడున్న స్థితికంటే ముందుకెళ్లాలన్నా ఇతోధికంగా నిధులివ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఏడాదిక్రితం సూచించారు. ఆయన మాటకు విలువిచ్చి నిధులు పెంచుతామని ప్రధాని హామీ ఇచ్చినా అది సాకారం కాలేదు. విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రొఫెసర్ సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించి 84ఏళ్లు కావస్తున్నది. అటు తర్వాత అందుకు సరితూగగల పరిశోధనలేవీ మన దేశంనుంచి లేవంటేనే మనం ఎక్కడున్నామో అర్ధమవుతుంది. అసలు ప్రామాణికమైన విద్యనందించే అగ్రశ్రేణి సంస్థలే మన దేశంలో కరువయ్యాయి. మొన్నామధ్య మన ఐఐటీల గురించి, వాటి స్థితిగతుల గురించి ఒక విదేశీ రేటింగ్ సంస్థ చేసిన వ్యాఖ్యానాలు చాలామందిని నొప్పించాయి. ఆ రేటింగ్లలో శాస్త్రీయత లేదని పలువురు విమర్శించారు. కానీ, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యనందించే తొలి 200 సంస్థల్లో మన దేశానికి చెందిన ఒక్కటీ లేదని అనేకసార్లు నిర్ధారణైంది. ప్రాథమిక పాఠశాలల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్య విషయంలో మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఆ రంగంలో నిష్ణాతులను రూపొందించడంలో పెద్ద అవరోధంగా మారాయి. పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లయినా ఉండాలన్న సంగతి సుప్రీంకోర్టు చెప్పిన రెండేళ్లకు కూడా ప్రభుత్వాలకు అర్ధంకావడంలేదు. ఇక టీచర్లు, నల్లబల్లలు, పుస్తకాలు వగైరా సంగతులు చెప్పేదేముంది? నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలద్వారా ఒకప్పుడు ప్రపంచానికి విజ్ఞానభిక్ష పెట్టిన దేశం ఇప్పుడు దీనావస్థకు చేరుకుంది. ప్రొఫెసర్ రావు చెబుతున్నదాన్నిబట్టి నవకల్పన రంగానికి సంబంధించి రూపొందించిన 140 దేశాల జాబితాలో మన దేశం స్థానం 66! విద్యారంగాన్ని గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన పాలకుల పాపానికి ప్రతిఫలమిది. మన పాలకులు అవకాశం వచ్చినప్పుడల్లా విజ్ఞానశాస్త్ర రంగానికి ప్రాధాన్యమిస్తామని చెబుతారు. ఆ రంగంలో మనం వెనకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తుంటారు. ఏటా జరిగే సైన్స్ కాంగ్రెస్ సదస్సుల్లో ఆ మాదిరి మాటలు చాలా వినబడుతూ ఉంటాయి. కానీ, మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 0.9 శాతం మొత్తాన్ని మాత్రమే పరిశోధనలపై ఖర్చు పెడుతున్నట్టు నిరుడు మన్మోహన్సింగే స్వయంగా వెల్లడించారు. దీన్ని రెట్టింపు చేస్తామని ఆయన హామీ ఇచ్చినా ఆచరణలో అది ఒక శాతం మించలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో కనీసం 6శాతాన్ని ఖర్చుచేస్తే తప్ప ఈ రంగంలో మనం ముందుకెళ్లడం సాధ్యంకాదని ప్రొఫెసర్ రావు అంటున్నారు. ఆయన చెప్పినట్టు చైనాతో పోలిస్తే ఈ రంగంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. అసలు ప్రాథమ్యాలను గుర్తించడంలోనే మనకూ, చైనాకూ ఎంతో అగాథం ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి నాణ్యమైన విద్యను అందించడానికి కృషిచేస్తోంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నది. క్షేత్రస్థాయి సమస్యలకూ, విద్యాలయాల్లో బోధించే విద్యకూ మధ్య అనుబంధం ఉండేలా చూస్తున్నది. ప్రపంచంలో పరిశోధనా రంగానికి వెచ్చించే నిధుల్లో 7శాతం చైనాయే ఖర్చుచేస్తున్నదంటే ఆ రంగానికి అది ఇస్తున్న ప్రాముఖ్యత ఎంతో అర్ధమవుతుంది. చైనా వరకూ అవసరం లేదు... మనకంటే ఎంతో చిన్న దేశమైన దక్షిణ కొరియాతో పోల్చినా మనం ఎంతో వెనకబడి ఉన్నాం. సంఖ్యాపరంగా చూస్తే విజ్ఞాన శాస్త్రాల్లో ఏటా మన దేశంలో దాదాపు 9,000 మంది పీహెచ్‌డీలు పొందుతున్నారు. కానీ, అమెరికా నుంచి మేథోపరమైన పేటెంట్లు పొందేవారు ఏటా 4,000 మంది ఉంటే మన దేశంలో వందకు మించడంలేదు. వ్యవసాయం, వాతావరణం, వైద్యం, రక్షణ రంగాలకు ఈ పరిశోధనలవల్ల ఒనగూడే ప్రయోజనం దాదాపు ఏమీ ఉండటంలేదు. మన ఇంజనీరింగ్ కళాశాలలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో పదోవంతు కూడా పరిశోధనలకివ్వడం లేదు. 2010-20ని ‘సృజన దశాబ్ది’గా ప్రకటించాక కూడా ఇవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయంటే మనం సిగ్గుపడాలి. ఇప్పుడు ప్రొఫెసర్ రావు చేసిన వ్యాఖ్యల పర్యవసానంగానైనా పాలకులు మేల్కొని లోపాలను సరిదిద్దాలి. పరిశోధనారంగానికి జవసత్వాలివ్వాలి.