అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొద్దిరోజుల్లో జరగనుండగా కేంద్రమంత్రి పర్షోత్తమ్ రూపాలా చేసిన వ్యాఖ్యలు గుజరాత్‌లో బీజేపీకి తలనొప్పిగా మారాయి. క్షత్రియులపై పర్షోత్తమ్ రూపాలా వ్యాఖ్యలతో రాజ్‌కోట్‌లో రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రూపాలా ఇంటి ముందు ఆయన దిష్టిబొమ్మను కాల్చారు.
దీంతోపోలీసులు రూపాలా ఇంటి వద్ద భద్రత పెంచారు. క్షత్రియులపై తాను చేసిన వ్యాఖ్యలపై రూపాలా క్షమాపణలు చెప్పినప్పటికీ రాజ్‌పుత్‌లు వెనక్కి తగ్గడం లేదు. రాజ్‌కోట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రూపాలాను లోక్‌సభ రేసు నుంచి డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ 22 దళితులతో జరిగిన ఓ కార్యక్రమంలో రూపాల గతంలో మహారాజాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బ్రిటీష్ వారితో ఒకే కంచంలో తినడంతో పాటు వారికి తమ కూతుళ్లనిచ్చి మహారాజాలు పెళ్లి చేశారని రూపాలా విమర్శించారు. దళితులు మాత్రం బ్రిటీష్ వారి వేధింపులు తట్టుకున్నారని, మతం మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్‌లో దుమారం రేపాయి. రాజ్‌పుత్ కమ్యూనిటీ ఓట్లు బీజేపీలో 17 శాతం మేర ఉంటాయి.
ఇవన్నీ మొన్నటిదాకా బీజేపీ ఖాతాలో పడే ఓట్లే. రూపాలా నోటీ నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలతో లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్లు తమ పార్టీకి పడతాయా లేదా అని బీజేపీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో రాజ్‌పుత్‌లు ఎన్నికల ఫలితాలను చాలా వరకు ప్రభావితం చేస్తారు.
ఇదీ చదవండి.. వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment