Parshottam Rupala
-
Gujarat: కేంద్రమంత్రి నోటి దురుసు.. ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పి
అహ్మదాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొద్దిరోజుల్లో జరగనుండగా కేంద్రమంత్రి పర్షోత్తమ్ రూపాలా చేసిన వ్యాఖ్యలు గుజరాత్లో బీజేపీకి తలనొప్పిగా మారాయి. క్షత్రియులపై పర్షోత్తమ్ రూపాలా వ్యాఖ్యలతో రాజ్‌కోట్‌లో రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రూపాలా ఇంటి ముందు ఆయన దిష్టిబొమ్మను కాల్చారు. దీంతోపోలీసులు రూపాలా ఇంటి వద్ద భద్రత పెంచారు. క్షత్రియులపై తాను చేసిన వ్యాఖ్యలపై రూపాలా క్షమాపణలు చెప్పినప్పటికీ రాజ్‌పుత్‌లు వెనక్కి తగ్గడం లేదు. రాజ్‌కోట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రూపాలాను లోక్‌సభ రేసు నుంచి డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ 22 దళితులతో జరిగిన ఓ కార్యక్రమంలో రూపాల గతంలో మహారాజాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ వారితో ఒకే కంచంలో తినడంతో పాటు వారికి తమ కూతుళ్లనిచ్చి మహారాజాలు పెళ్లి చేశారని రూపాలా విమర్శించారు. దళితులు మాత్రం బ్రిటీష్ వారి వేధింపులు తట్టుకున్నారని, మతం మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్లో దుమారం రేపాయి. రాజ్‌పుత్ కమ్యూనిటీ ఓట్లు బీజేపీలో 17 శాతం మేర ఉంటాయి. ఇవన్నీ మొన్నటిదాకా బీజేపీ ఖాతాలో పడే ఓట్లే. రూపాలా నోటీ నుంచి వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలతో లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్లు తమ పార్టీకి పడతాయా లేదా అని బీజేపీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో రాజ్‌పుత్‌లు ఎన్నికల ఫలితాలను చాలా వరకు ప్రభావితం చేస్తారు. ఇదీ చదవండి.. వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ -
మత్స్య రంగంలో ఏపీ అద్భుత ప్రగతి
-
పశుసంవర్థక అభివృద్ధికి మరింత కృషి
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక రంగం మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించే ఈ రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి కేంద్రం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, స్టార్టప్ ఇండియా, సీఐఐ సహకారంతో కేంద్ర పశుసంవర్థ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ స్టార్టప్ సదస్సులో మంత్రి మాట్లాడారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమ అభివృద్ధితో రైతులు తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడానికి వీలవుతుందన్నారు. పశుసంవర్ధక రంగంలో పెట్టుబడులు మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రులు బాల్యన్, మురుగన్ మాట్లాడుతూ శాస్త్రీయ చర్యలతో పశుసంవర్ధక రంగంలో మార్పులు తీసురావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచ మాంసం ఎగుమతుల రంగంలో భారతదేశం 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల రంగంలో 3వ స్థానంలో ఉందని వివరించారు. గణనీయంగా పెరిగిన గొర్రెల సంపద రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడి రంగానికి అనేక విధాలుగా చేయూతనిస్తున్నామని అన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడంతో రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని తెలిపారు. గ్రామాల్లో అత్యధికులు పాడి పరిశ్రమ, జీవాల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారికి మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు వర్ష జోషి, రాజేష్ కుమార్ సింగ్, లచ్చిరాం భూక్యా, పెద్ద ఎత్తున పాడి రైతులు పాల్గొన్నారు. -
ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలి: మోపిదేవి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్సార్సీపీ ఎంపీలు బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి.. మత్స్య సంపద, మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.1509 కోట్లతో మేజర్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దశలవారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్: సముద్రపు చేపలను ఉద్దేశించి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గుజరాత్లో మాట్లాడుతూ.. సముద్రపు చేపలు లక్ష్మీదేవికి చెల్లెళ్లుగా అభివర్ణించారు. సముద్రం అనేది లక్ష్మీదేవి జన్మించిన స్థలమని, ఆమె సముద్రపు పుత్రిక అని పేర్కొన్నారు. అయితే చేపలు కూడా సముద్రపు పుత్రికలని, అందుకే సముద్రపు చేపను లక్ష్మీదేవికి సోదరిగానే చూడాలని వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవి అశీస్సులు ఉంటే సంపద కలుగుతుందని, అలాగే చేపల ఆశీస్సులు కూడా ఉండాలని తెలిపారు. చదవండి: ఇంత లావుగా ఉన్నావ్ పిల్లల్నెప్పుడు కంటావ్! ఈ లోకంలో ఉండలేను.. దేవుడు ఒకప్పుడు మత్స్య(చేప) రూపంలో కనిపించాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆధీనంలోని వాటర్‌బాడీలో చేపలు పట్టే మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు(కేసీసీ) ఇస్తామని తెలిపారు. అయితే వ్యవసాయదారులకు కేసీసీ ద్వారా ఇస్తున్న 4 శాతం వడ్డీ రేటు తగ్గింపు మాదిరిగా.. రాష్ట్రాలు కూడా మత్స్యకారులకు మరో నాలుగు శాతం వడ్డీ రేటును తగ్గించాలని కేంద్ర మంత్రి రూపాలా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో చేపలకు పవిత్ర హోదా ఇస్తారా? ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. -
పీఓకేను స్వాధీనం చేసుకుంటాం
సాక్షి, మహబూబ్‌నగర్: త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ను స్వాధీనం చేసుకుం టామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నా రు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన జనజాగరణ అభియాన్‌లో ఆయన మాట్లాడారు. జమ్మూ–కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తీసుకురావడానికే ఆర్టికల్ 370 రద్దు చేశామన్నారు. ఆనాడు దేశానికి స్వతంత్రం వచ్చినా హైదరాబాద్, జనాఘడ్, కశ్మీర్ భారతదేశంలో విలీనం కాలేదన్నారు. సర్దార్‌వల్లభాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్‌ను విలీనం చేసి 1948 లో జాతీయజెండా ఎగురవేశారన్నారు. నెహ్రూ నిర్ణయాల వల్లే కశ్మీర్‌ను అప్పట్లోనే విలీనం చేయలేకపోయారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కశ్మీర్లో ప్రత్యేక రా జ్యంగం అమలు, పాకిస్తాన్ దేశస్తులకు పౌరసత్వం కల్పిం చడం వంటి అంశాల నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయన్నారు. దీంతో అక్కడ ఉగ్రవాదులు చెలరేగిపోవడానికి కారణమైందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ప్రజలకు ఎ దురయ్యే ఇబ్బందులపై ఇంతవరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలు, మాజీ మంత్రులు డి.కె. అరుణ, పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ ఎమ్మెల్యే చిం తల రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పడాకుల బాల్‌రాజ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రామమందిరం తథ్యం ఎన్నికలముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నరేంద్రమోడీ నాయకత్వంలో అయోద్యలో రామమందిరం నిర్మాణం తథ్యమని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. 70 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ స్వాతంత్ర ఫలాలు అందుకోలేకపోయారని, ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు స్వచ్ఛా స్వాతంత్రాలు కల్పించారన్నారు. అనంతరం మాజీ మంత్రి డీకె.అరుణ మాట్లాడారు. గత పాలకులు చేయని సాహసం బీజేపీ చేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. -
ఏపీలో 409 మంది రైతుల ఆత్మహత్య: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్ళ కాలంలో 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి పురోషత్తమ్ రూపాల శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గడచిన నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో 2 వేల మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రైతు రుణమాఫీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోపాటు రుణాల ఊబిలో కూరుకుపోవడమే రైతు ఆత్మహత్యలకు కారణాలన్న విషయం వాస్తవమేనా అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో ఏర్పాటైన త్రిసభ్య సంఘం సమర్పించిన నివేదికల ప్రకారం 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మంత్రి వెల్లడించారు. ‘2014 నుంచి 2018 వరకు 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోరు బావుల వైఫల్యం, భారీ ఖర్చుతో వాణిజ్య పంటల సేద్యం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యం కాకపోవడం, నోటిమాటతో చేపట్టే కౌలు సేద్యం, బ్యాంకు రుణాలు పొందే అర్హత లేకపోవడం, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం, వర్షాభావం, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, పిల్లల చదువుల కోసం భారీగా వ్యయం, అనారోగ్యం వంటి అంశాలే రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలు. ఈమేరకు వివిధ జిల్లాలకు చెందిన త్రిసభ్య సంఘాలు గుర్తించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. వ్యవసాయ రంగం అభివృద్ధి ఆయా రాష్ట్రాల ప్రాధమిక బాధ్యత. అయితే తగిన విధానపరమైన చర్యలు, బడ్జెట్ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుంద’ని కేంద్ర మంత్రి తెలిపారు. -
మూడేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు..
పెద్దపల్లి: మూడేళ్ల మోదీ పాలనలో నయాపైసా అవినీతి ఆరోపణలు ఎదుర్కొలేదని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం "సబ్కా సాత్.. సబ్కా వికాస్" కార్యక్రమంలో మాట్లాడారు. మూడేళ్లలో కేంద్రం నుంచి లక్ష కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి అందజేశామన్నారు. గత ప్రభుత్వాలు నింగి నుంచి నేలదాకా కుంభకోణాలకు పాల్పడ్డాయని విమర్శించారు. ఫసల్‌బీమా యోజన ద్వారా రైతులకు నయాపైసా నష్టం జరగకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, సంబంధిత నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందజేయకపోతే పన్నుల రూపంలో జరిమానాతోపాటు గ్రామాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔషధ నియంత్రణ బీజేపీ ఘనతే స్వాతంత్ర్య భారతంలో ఔషధ ధరలను నియంత్రించిన ఘనత బీజేపీకే దక్కిందని మంత్రి అన్నారు. ఔషధ కంపెనీలపై నియంత్రణ పెట్టడంతో పాటు ప్రజలకు చౌకగా మందులు అందించేందుకు జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, ఎన్టీపీసీ ఈడీ వివేక్ దుబే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, రాష్ట్ర నాయకులు ఎస్.కుమార్ పాల్గొన్నారు. -
గుజరాత్ కొత్త సీఎం ఎవరు?
న్యూఢిల్లీ: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటన చేయడంతో ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ మొదలైంది. రెండుమూడు రోజుల్లో నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశముంది. గుజరాత్ కొత్త సీఎంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. నారన్‌పురా అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ షా... గతంలో గుజరాత్ హోంమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి వదులుకోవడాన్ని ప్రధాని మోదీ అంగీకరిస్తారా, లేదా అనేది చూడాలి. అమిత్ షా తర్వాత పురుషోత్తం రూపాల(62), నితిన్ పటేల్(60), విజయ్ రూపాని(60), భికుభాయ్ దాల్సానియా(52), శంకర్ చౌదరి(46) పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. అమిత్ షాను గుజరాత్ సీఎంగా పంపకపోతే వీరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న పురుషోత్తం రేసులో ముందున్నారు. సౌరాష్ట్రలోని కడవా పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఆయన గుజరాత్ బీజేపీలో మోదీ తర్వాత మంచి వక్తగా పేరు గాంచారు. అమిత్ షా కంటే సీనియర్ అయిన ఆయన కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయారు. గుజరాత్ ప్రభుత్వంలో అధికారికంగా నంబర్ టూగా కొనసాగుతున్న ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ కూడా సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఆనందీబెన్ వారసుడిగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపాని పేరు కూడా విన్పిస్తోంది. జైన్ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొవడంలో సిద్ధహస్తుడు. సంఘ పరివార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి భికుభాయ్ దాల్సానియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మోదీ హాయంలో శక్తివంతమైన నేతగా ఉన్న ఆయన బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు సంధానకర్తగా కీలకభూమిక పోషించారు. ఉత్తర గుజరాత్ కు చెందిన బీసీ నాయకుడు శంకర్ చౌదరి పేరు విన్పిస్తున్నా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.