గుజరాత్: సముద్రపు చేపలను ఉద్దేశించి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గుజరాత్‌లో మాట్లాడుతూ.. సముద్రపు చేపలు లక్ష్మీదేవికి చెల్లెళ్లుగా అభివర్ణించారు. సముద్రం అనేది లక్ష్మీదేవి జన్మించిన స్థలమని, ఆమె సముద్రపు పుత్రిక అని పేర్కొన్నారు. అయితే చేపలు కూడా సముద్రపు పుత్రికలని, అందుకే సముద్రపు చేపను లక్ష్మీదేవికి సోదరిగానే చూడాలని వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవి అశీస్సులు ఉంటే సంపద కలుగుతుందని, అలాగే చేపల ఆశీస్సులు కూడా ఉండాలని తెలిపారు.
చదవండి: ఇంత లావుగా ఉన్నావ్ పిల్లల్నెప్పుడు కంటావ్! ఈ లోకంలో ఉండలేను..
దేవుడు ఒకప్పుడు మత్స్య(చేప) రూపంలో కనిపించాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆధీనంలోని వాటర్‌బాడీలో చేపలు పట్టే మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు(కేసీసీ) ఇస్తామని తెలిపారు. అయితే వ్యవసాయదారులకు కేసీసీ ద్వారా ఇస్తున్న 4 శాతం వడ్డీ రేటు తగ్గింపు మాదిరిగా.. రాష్ట్రాలు కూడా మత్స్యకారులకు మరో నాలుగు శాతం వడ్డీ రేటును తగ్గించాలని కేంద్ర మంత్రి రూపాలా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో చేపలకు పవిత్ర హోదా ఇస్తారా? ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment