fishes
-
రైలు పట్టాలపై ఈత కొడుతున్న చేపలు
-
చేపలెందుకు ఒడ్డుకు వచ్చేశాయి?
-
అత్యంత అరుదైన చేప! ఐతే ఇది ఈత కొట్టదట..ఏకంగా..
నీటిలో చేపలు ఈతకొడతాయి. అయితే, ఇదొక వింత చేప. నీటి అడుగున ఇది నడుస్తుంది. దీనికి ముందు వైపు చేతుల్లా ఉపయోగపడే కాళ్లు పెద్దగా ఉంటాయి. వెనుకవైపు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల దీనిని హ్యాండ్‌ఫిష్ అంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ రకమైన చేప కెమెరా కంటికి చిక్కింది. ఇదివరకు విక్టోరియా తీరానికి చేరువలోని సముద్రంలో 1986లో ఒకసారి, 1996లో ఒకసారి ఇలాంటి హ్యాండ్‌ఫిష్ చేప కనిపించింది. ఇటీవల టాస్మానియా ఈశాన్యాన ఉన్న ఫ్లిండర్స్ దీవికి చేరువలో సముద్రం అడుగున నడుస్తున్న ఈ హ్యాండ్‌ఫిష్ అండర్‌వాటర్ కెమెరాకు చిక్కింది. ఇది నీటికి 292 అడుగుల లోతున ఉండగా కెమెరాకు చిక్కినట్లు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్త కార్లీ డివైన్ తెలిపారు. సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు టాస్మానియా సముద్ర జలాల్లో పరిశోధనల కోసం ‘ఆర్వీ ఇన్వెస్టిగేటర్’ ఓడలో అన్వేషణ సాగిస్తుండగా, ఈ అరుదైన చేప వారి కెమెరాకు చిక్కడం విశేషం. (చదవండి: అక్కడ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!) -
కొర్రమీను చేపలు తింటున్నారా?తస్మాత్ జాగ్రత్త! క్యాన్సర్ ముప్పు
నిషిద్ధ ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌లను మన ప్రజలు ఇష్టంగా తినే కొర్రమీను చేపలుగా చూపి అక్రమంగా విక్రయిస్తున్న వారిపై, తరలిస్తున్న వారిపై మత్స్యశాఖ అధికారులు కేసులు పెడుతున్న సందర్భాలు అడపాదడపా మనం చూస్తున్నాం. అయితే, ఈ ఆఫ్రికన్/ అమెరికన్ క్యాట్ఫిష్లపై ఎందుకు నిషేధం విధించారు? ఇవి చేపల జీవవైవిధ్యానికి ఏ విధంగా విధ్వంసకరంగా పరిణమిస్తున్నాయి? ఇవి మన చేపల రైతులు, మత్స్యకారుల ఆదాయానికి గండికొట్టే ముప్పు పొంచి ఉందా? వీటిని అరికట్టే మార్గాలేమిటి?.. ఇటువంటి ప్రశ్నలకు సికింద్రాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలెక్యులర్ బయాలజీ (సిఎస్ఐఆర్–సిసిఎంబి) సీనియర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి.ఉమాపతి సమాధానాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం ఆయన మాటల్లోనే... కొరమీనుకు డూప్లికేట్ వచ్చి పడింది. ఏదీ కొర్రమీనో.. ఏదీ దాని డూప్లికేటో తెలియకుండా కొనేస్తున్నారు కొందరు. సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాటు..చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్‌లు మాత్రం అలా కాదు. కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు..కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్‌లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు గానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్‌లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్‌లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్‌లు మంచినీటిలోనే కాదు మురుగునీరు..ఆఖరికి డ్రైనేజీ నీటిలో కూడా పెరుగుతాయి. మన దేశపు నీటి వనరుల్లోకి చొరబడిన అమెరికన్, ఆఫ్రికన్ కాట్ ఫిష్‌ల వంటి విదేశీ జాతి చేపలు స్థానిక చేపల జాతుల మనుగడకు, జీవవైవిధ్యానికి, చేపల రైతులు/ మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలిపెట్టుగా పరిణమించాయి. ఈ విదేశీ చేపలు మన చెరువుల్లో, కాలువల్లో, వాగులు, వంకలు, సరస్సులు, నదుల్లోకి చేరిపోయి తమ సంతతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నాయి. సాధారణంగా అమెరికన్, ఆఫ్రికన్ కాట్ ఫిష్‌లు విపరీతమైన మాంసాహారులు కాబట్టి, అవి మన చేపల గుడ్లు, చేపపిల్లలతో పాటు ఇతరత్రా జలచరాలను ఈ బకాసుర కాట్ఫిష్లే ఆరగించేస్తుంటాయి. ఆ విధంగా స్థానిక చేపల సంతతి బాగా తగ్గిపోతోంది. ఒక్కోసారి ఇవి పూర్తిగా అంతరించిపోయే ముప్పు కూడా ఉంది. అమెరికన్ / ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌ల తీవ్రమైన ఆహారపు అలవాట్లు, భూమిని తవ్వి బొరియలు చేసే అలవాట్ల వల్ల నీటి మొక్కల పెరుగుదలను, నీటి ప్రవాహదారులు మారిపోతున్నాయి. జలచరాల ఆవాసాలు చెల్లాచెదురవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక జాతులను ఇవి చెలకట్టనియ్యట్లేదు. దుష్ప్రభావాలు విదేశీ జాతుల క్యాట్‌ఫిష్‌ల వల్ల చేపల రైతులు.. చెరువులు, సరస్సులు, జలాశయాల్లో చేపలపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మనోల్లాసం కోసం చేపలు పట్టడం వంటి వ్యాపకాల ద్వారా ఆదాయం తగ్గిపోతోంది. ఆ విధంగా చెరువులు, సరస్సులు, నదుల్లో స్థానిక చేప జాతుల జీవవైవిధ్యం నశిస్తుంది. కొన్నిసార్లు ఈ జాతులు అంతరించిపోనూవచ్చు. ఈ నష్టం ఆహార చక్రాల్లో, పర్యావరణ వ్యవస్థ అందించే సేవల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకొని, మొత్తంగా పర్యావరణ వ్యవస్థ గొలుసుకట్టు దుష్ప్రభావాలకు లోనవుతోంది. వీటి సంతతిని నియంత్రించడం లేదా నిర్మూలించడం అంత సులభసాధ్యమైన పని కాదు సరికదా, ఖరీదైనది కూడా. వీటి నిర్మూలనకు రసాయనాలు ప్రయోగించటం లేదా ఏరివేయటం వంటి సాంప్రదాయ నిర్వహణ పద్ధతుల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అంతేకాదు, ఈ పనుల వల్ల పర్యావరణానికి అనుకోని రీతిలో హాని జరగొచ్చు. చెరువులు, జలాశయాలు, సరస్సుల్లో విధ్వంసక విదేశీ జాతుల చేపల జాడను ఈ–డిఎన్ఎ విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి గుర్తించటం, పర్యవేక్షించడం, వాటి సంతతిని అంచనా వేయడం వంటి పనులు చేయొచ్చు. ఈ విషయంలో సీసీఎంబీలోని జీవజాతులు అంతరించిపోకుండా సంరక్షించే ‘లకోన్స్’ విభాగం సహాయపడుతుంది. విదేశీ క్యాట్‌ఫిష్ జాతుల వల్ల ఉన్న ప్రమాదాల గురించి స్థానికులకు, ఆక్వా రైతులకు అవగాహన కల్పించడానికి ‘లకోన్స్’ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. విదేశీ చేప జాతుల డేటాబేస్‌ను ఏర్పాటు చేసే వీలుంది. దేశవ్యాప్తంగా సమర్థవంతమైన పరిష్కారాలు వెతికేందుకు పరిశోధకులు, రైతుల మధ్య లకోన్స్ అనుసంధానం చేస్తుంది. విదేశీ జాతుల ఉనికిని క్షేత్రస్థాయిలో ముందస్తుగా గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయడంలో ‘లకోన్స్’ సహాయపడుతుంది. మత్స్య శాఖ అధికారులకు, స్థానిక ఆక్వా రైతులకు శిక్షణ ఇవ్వటానికి కూడా ‘లకోన్స్’ సహాయపడుతుంది. జిల్లా స్థాయిలో నిఘా అవసరం చేపలు ఇతర జలచరాలకు సంబంధించిన చట్టాల్లోని నిబంధనలను స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు అమలు చేయాలి. ఆక్వా చెరువులను తనిఖీ చేయటం (అక్రమ చెరువులను అరికట్టడం), విదేశీ చేప జాతుల ముప్పుపై అవగాహన కలిగించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, జిల్లా స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం అవసరం. మత్స్య శాఖ పరిశోధనా సంస్థల సహకారంతో విదేశీ చేప జాతులను అరికట్టే పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. ఈ పద్ధతులను అనుసరించే రైతులు, మత్స్యకారులకు ప్రోత్సాహకాలను అందించవచ్చు. కొర్రమీను,క్యాట్‌ఫిష్ తేడా ఇదొక్కటే కొర్రమీనుకు క్యాట్ ఫిష్‌కు మధ్య చిన్న తేడా మాత్రమే ఉంటుంది. చూడటానికి రెండింటిలో ఒకటే తేడా.. ఈ క్యాట్ ఫిష్‌కు పొడగాటి మీసాలుంటాయి. నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతే, మిగిలిన అంతా సేమ్ టు సేమ్.చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. ఆఫ్రికన్/అమెరికన్ క్యాట్‌ఫిష్‌లను నియంత్రించాలి మన దేశంలోని చేపల జాతులతో సంకరం చేసి కొత్త జాతులను అభివృద్ధి చేయడానికి పరిశోధనల నిమిత్తం ఆఫ్రికా, అమెరికా ఖండాల నుంచి క్యాట్‌ఫిష్‌లను కొన్ని దశాబ్దాల క్రితం మన దేశానికి తీసుకొచ్చారు. అయితే, కాలక్రమంలో అవి సహజ జలవనరుల్లోకి చేరిపోయి, ఇప్పుడు చేపల జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయి. వీటిని తింటే ఫలానా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పలేం. అయితే, ఆఫ్రికన్ / అమెరికన్ క్యాట్‌ఫిష్‌లు అత్యంత కలుషిత నీటి సరస్సుల్లో కూడా నిక్షేపంగా పెరుగుతాయి. కాబట్టి ఈ చేపలు అత్యంత కలుషితాలతో కూడి ఉంటాయి. ఇవి మన చేపల చెరువుల్లో, సరస్సులు, జలాశయాల్లో జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించినందున వీటి పెరుగుదలను నిశితంగా గమనిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాల్సిన అవసరం ఉంది.∙ – వినయ్ కె నందికూరి, సంచాలకులు, సిఎస్ఐఆర్–సిసిఎంబి, సికింద్రాబాద్director@ccmb.res.in నిర్వహణ: పంతంగిరాంబాబు సాగుబడి డెస్క్ -
చేపల వేటకు వెళ్లి పలువురి మృతి!
నిజామాబాద్: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన బక్కని సాయిలు(35) గురువారం చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతు అయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో శుక్రవారం చెరువుగట్టుపై చూడగా చెప్పులు, బట్టలు కనిపించాయి. చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో మృతి చెందినట్లు మృతుని భార్య మౌనిక ఫిర్యాదు చేశారు. మృతుడికి కూతురు మనుస్మిత, కుమారుడు గంగాప్రసాద్ ఉన్నారు. టీసీసీసీ సభ్యుడు కాసుల బాలరాజు, బుడిమి సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మల్కాపూర్ శివారులో ఒకరు నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ శివారులోని చెరువులో శుక్రవారం చేపలు పట్టేందుకు వెళ్లిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. నిజామాబాద్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సిర్నాపల్లి సాయారెడ్డి(52) చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడని పేర్కొన్నారు. ఈత రాకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు కేసు నమోదు చేశామన్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం నల్లవాగు మత్తడి వరద నీటిలో గల్లంతైన జంగం కృష్ణ (48) మృత దేహం శుక్రవారం లభ్యమైందని ఎస్సై నాగగోని రాజు తెలిపారు. పిట్లంకు చెందిన జంగం కృష్ణ చేపల వేట కోసం నల్లవాగు మత్తడి దిగువన వాగు ఒడ్డుకు వచ్చాడు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణ నీటిలో కొట్టుకుపోయాడు. కృష్ణ కోసం గాలింపు చేపట్టగా గల్లంతైన ప్రదేశం నుంచి కిలోమీటర్ దూరంలో చెట్టు కొమ్మకు తట్టుకొని మృతదేహం లభ్యమైంది. -
ఒకవైపు వర్షాలతో అతలాకుతలం.. వరద నీటిలో చేపల వేట (ఫొటోలు)
-
చేపలు తెచ్చిన తంటా..
సంగారెడ్డి: ఒక వ్యక్తిపై ఇద్దరు కత్తి, కర్తతో మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో అతడి తలకు గాయమైంది. ఈ ఉదంతం తోటపల్లిలో మంగళవారం జరిగింది. చేపలు పట్టే వాగు వద్ద వీరన్నకు, సంపత్‌కు గొడవైంది. ఈ గొడవలో సంపత్‌కు గాయాలయ్యాయి. అనంతరం ఆయన చికిత్సపొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత సంపత్ బంధువులు భాస్కర్, మరొక వ్యక్తితో కలిసి వీరన్నపై దాడికి వెళ్లారు. వీరన్న, భాస్కర్ మధ్య గొడవ జరుగుతోంది. ఈ గొడవ విషయం వీరన్న కుటుంబసభ్యులతో అతడి వెంట ఉన్న వ్యక్తి చెప్పారు. వీరన్న తండ్రి మల్లేశం, సోదరుడు రమేశ్ కత్తి, కర్త తీసుకొని గొడవ పడుతున్న స్థలానికి చేరుకొని భాస్కర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో భాస్కర్‌కు తల పగిలింది. దీనిపై స్థానికులు పోలీసులకు, భాస్కర్ కుటుంబీకులు సమాచారం అందించారు. భాస్కర్ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ పీ మహేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్రం వడ్డున గుట్టలు,గుట్టలుగా చేపలు
-
బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో చేపల మృత్యువాత
-
చేపలకు పొతే నోట్ల కట్టలు దొరికాయోచ్..
-
వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు!
సహజ నీటి వనరుల్లో పెరిగే 2 అంగుళాల మెత్తళ్లు (ఆంగ్లంలో ‘మోల’ (Amblypharyngodon mola) వంటి చిరు చేపలను తినే అలవాటు ఆసియా దేశాల్లో చిరకాలంగా ఉంది. ఎండబెట్టిన మెత్తళ్లను నిల్వ చేసుకొని ఏడాదంతా తింటూ ఉంటారు. ఈ చిరు చేపల్లో అద్భుతమైన సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండటంతో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో వీటి పాత్ర విశిష్టమైనది. అయితే, వీటి సైజు వేలెడంతే ఉండటం వల్ల కృత్రిమ విత్తనోత్పత్తి ఇన్నాళ్లూ అసాధ్యంగా మిగిలిపోయింది. అయితే, ఈ పెనుసవాలును శాస్త్రవేత్తలు ఇటీవలే ఛేదించారు. చేపల విత్తనోత్పత్తి రంగంలో ఇది పెద్ద ముందడుగని చెప్పచ్చు. జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ జి.ఐ.జడ్. ఆర్థిక తోడ్పాటుతో ‘వరల్డ్‌ఫిష్’ సంస్థ శాస్త్రవేత్తలు మన దేశంలో మెత్తళ్ల విత్తనోత్పత్తికి సులభమైన సాంకేతిక పద్ధతులను రూపొందించడంలో కొద్ది నెలల క్రితం ఘనవిజయం సాధించారు. దీంతో మెత్తళ్లు, తదితర చిరు చేపలను మంచినీటి చెరువుల్లో సాగు చేసుకునే అవకాశం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. నేచురల్ సూపర్ ఫుడ్స్ భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ప్రజల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని ఆహారం ద్వారా సహజమైన రీతిలో అధిగమించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, ఎషెన్షియల్ ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉండే మెత్తళ్లు నేచురల్ సూపర్ ఫుడ్స్ అని వరల్డ్‌ఫిష్ అభివర్ణించింది. పౌష్టికాహార లోపంతో మన దేశంలో 36% మంది పిల్లలు వయసుకు తగినంతగా ఎదగటం లేదు. 32% మంది తక్కువ బరువు ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మెత్తళ్లు భేషుగ్గా ఉపయోగపడుతాయని ‘వరల్డ్‌ఫిష్’ చెబుతోంది. విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మెత్తళ్లు తింటే తగ్గిపోతాయి. ఈ చిరు చేపల్లో ఐరన్, జింక్, కాల్షియం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలను పీడించే సూక్ష్మపోషక లోపాలు మెత్తళ్లను తింటే తగ్గిపోతాయి. 70 లక్షల సీడ్ ఉత్పత్తి అధిక పోషకాలున్న మెత్తళ్లు వంటి చిరు చేపల సాగు ప్రోత్సాహానికి ఒడిషా, అస్సాం రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లో వరల్డ్‌ఫిష్ సంస్థ గత దశాబ్దకాలంగా కృషి చేస్తోంది. ఒడిషాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో గల బిశ్వాల్ ఆక్వాటెక్ హేచరీతో కలిసి వరల్డ్‌ఫిష్ చేసిన పరిశోధనలు ఫలించాయి. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ ద్వారా మెత్తళ్ల సీడ్ ఉత్పత్తిలో అవరోధాలను 2022 జూన్‌లో అధిగమించటం విశేషం. 70 లక్షల మెత్తళ్లు సీడ్‌ను ఉత్పత్తి చేయగలిగారు. ప్రత్యేకంగా నిర్మించిన చిన్న చెరువుల్లో ఆక్సిజన్‌తో కూడిన నీటిని ఎయిరేషన్ టవర్ ద్వారా అందిస్తూ ప్రయోగాలు చేశారు. ఆ నీటిలో గుడ్ల నుంచి వెలువడిన చిరుపిల్లలు చక్కగా బతికాయి. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 3–4 రోజుల్లోనే అతిచిన్న పిల్లలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వీటిని కొద్ది రోజులు నర్సరీ చెరువుల్లో పెంచి తర్వాత సాధారణ చేపల చెరువుల్లోకి మార్చాల్సి ఉంటుంది. తొలి విడత మెత్తళ్లు పిల్లలను ఒడిషా రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలకు అందించారు. మెత్తళ్ల చేప పిల్లలను తెలుగు రాష్ట్రాల్లోనూ చేపల రైతులకు, మహిళా బృందాలకు అందుబాటులోకి తేవాలి. నగరాల్లో/గ్రామాల్లో ఇంటిపంటలు /మిద్దె తోటల సాగుదారులకు కూడా మెత్తళ్లు చేప పిల్లలను అందించాలి. ప్రజలకు పౌష్టికాహార భద్రతను చేకూర్చడంలో చిరు చేపలు ఎంతగానో దోహదపడతాయి. మెత్తళ్ల చేప పిల్లలను ఒక్కసారి వేస్తే చాలు! ‘మోల’ చేపలు చూపుడు వేలంత పొడవుండే అద్భుత పోషకాల గనులు.. వీటిని మనం మెత్తళ్లు /పిత్త పరిగెలు /కొడిపెలు /ఈర్నాలు అని పిలుచుకుంటున్నాం . ► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని, రక్తహీనతను, రేచీకటిని పారదోలే వజ్రాయుధాలు అ చిరుచేపలు. ► మంచినీటి ఆక్వా చెరువుల్లో బొచ్చె, రాగండి, మోసు, శీలావతి వంటి పెద్ద చేపలతో కలిపి లేదా విడిగానూ ఈ చిరుచేపలను సునాయాసంగా సాగు చేయొచ్చు. ► గ్రామ చెరువులు, కుంటల్లో, పెరటి తోటల్లోని తొట్లలో, మిద్దెల పైన ఫైబర్ టబ్లలోనూ ఎంచక్కా చిరు చేపలను పెంచుకోవచ్చు. ► వానాకాలంలో వాగులు, వంకల్లో కనిపించే సహజ దేశవాళీ చేపలివి. ► మెత్తళ్లు చేప తన సంతతిని తనంతట తానే(సెల్ఫ్ బ్రీడర్) వృద్ధి చేసుకుంటుంది.. ఈ చేప పిల్లలను ఒక్కసారి చెరువులో/తొట్లలో వేసుకుంటే చాలు.. నిరంతరం సంతతి పెరుగుతూనే ఉంటుంది. ► ప్రతి 10–15 రోజులకోసారి వేలెడంత సైజుకు పెరిగిన చేపలను పెరిగినట్లు పట్టుబడి చేసి వండుకు తినొచ్చు. ► వాణిజ్య స్థాయిలో పెంపకం చేపట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముకొని ఆదాయం కూడా పొందవచ్చు. ► మగ చేపలు 5.0–5.5 సెం.మీ. (2 అంగుళాలు) పొడవు, ఆడ చేపలు 6.0–6.5 సెం.మీ. పొడవు పెరిగేటప్పటికి పరిపక్వత చెందుతాయి. ఆ దశలో పట్టుబడి చేసి వండుకొని తినొచ్చు. ఎండబెట్టుకొని దాచుకోవచ్చు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ చేపల్లో సంతానోత్పత్తి జరుగుతుందని కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సి.ఐ.ఎఫ్.ఇ.) ఎమిరిటస్ సైంటిస్ట్ డాక్టర్ అప్పిడి కృష్ణారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నిజానికి, మెత్తళ్ల విత్తనోత్పత్తి ఆవశ్యకత గురించి ఆయన రాసిన వ్యాసాన్ని ‘సాక్షి సాగుబడి’ ఐదేళ్ల క్రితమే ప్రచురించింది. (క్లిక్ చేయండి: నల్ల తామరను జయించిన దుర్గాడ) -
తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!
సోన్: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) -
మబ్బుల మధ్య చేపలు.. ఎన్నున్నాయో చూశారా..!
నీటిలో ఉండాల్సిన చేపలు నింగిలో మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్కు చెందిన టీనా టోర్మెనెన్ హోంకాలెంపీ సరస్సులో తీశారు. ‘అండర్‌వాటర్ వండర్ల్యాండ్’లా టోర్మెనెన్ అభివర్ణిస్తున్న ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో ఎన్నదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వివిధ విభాగాల్లో విజేతలను అక్టోబర్ 11న ప్రకటిస్తారు. ఆ మేఘాల్లా కనిపిస్తున్నవి ఒకరకమైన నాచు అట. ముందు ఫొటోలోని చేపలు స్వర్గంలో విహరిస్తున్నట్లు కనిపిస్తుంటే.. ఇవేమో.. వందలాదిగా నిర్జీవంగా శ్మశానంలో ఉన్నట్లుగా పడి ఉన్నాయి.. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన మన్నెపురి శ్రీకాంత్ తీశారు. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్లో ఎన్నదగిన ఫొటోల్లో ఇది కూడా ఉంది. అసలు ఎన్నున్నాయో చూశారా.. ఒకేచోట ఇన్ని పెద్ద చేపలు.. వీటిని చూసి ఆశ్చర్యపోయే.. కాకినాడ ఫిష్ మార్కెట్ భారీతనాన్ని చూపించడానికి ఆయన డ్రోన్ ద్వారా ‘వన్డే క్యాచ్’ పేరుతో ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించారు. (క్లిక్: మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!) -
బందరు చేప భలే భలే..
సాక్షి, మచిలీపట్నం: బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతున్నారు. అలాగే దేశంలోని విశాఖ, కాకినాడ, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు చెందిన ఏజెంట్లు ఎగరేసుకుపోతుంటారు. రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలతో పోల్చుకుంటే మచిలీపట్నంలో కాలుష్యం చాలా తక్కువ. ఇక్కడ నుంచి గత కొన్నేళ్లుగా సముద్ర ఉత్పత్తులు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 111 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. జిల్లాలో ఏకైక ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండిలో ఏర్పాటైంది. ఈ హార్బర్‌కు యూరోపియన్ దేశాల గుర్తింపు కూడా ఉంది. వందల రకాల మచిలీలు.. మచిలీపట్నం తీరంలో ఎక్కువగా తెల్ల చందువా (సిల్వర్ అండ్ వైట్ పాంప్రెట్), నల్ల చందువా (బ్లాక్ పాంప్రెట్), కోణాం, ముక్కు కోణాం (స్వర్డ్ ఫిష్), నెమలి కోణాం (సెయిల్ ఫిష్), వంజరం (సీర్ ఫిష్), నాలుకలు (సోల్), నామాల తూర (స్కిప్ జాక్ టూనా), పసుపురెక్క తూర (ఎల్లో ఫిన్), పెద్దకన్ను తూర (బిగ్ ఐ), కానా కంతలు (మాకేరల్స్), పావడాయి (రిబ్బన్), గొరక (క్రోకర్స్), సొర చేప, కండువ, మూడు చుక్కల పీత (త్రీస్పాట్ స్విమ్మింగ్ క్రాబ్)లతోపాటు టైగర్, వైట్ నారన్, పింక్, పువాలన్ (కలందన్), కరికేడి, శంఖు, డీప్ సీ ఫ్రాన్స్, కుక్కరొయ్యలు, సారగొరక, గులిగింత, జల్లలు, కుక్కసావడాయి, మెత్తా్తళ్లు, తెంగుడు రొయ్యపొట్టు ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో ప్రధానంగా టూనా, కోణాంలతోపాటు వంజరం, చందువా, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అయితే అత్యధిక ధర తెల్ల చందువా (కిలో రూ.2 వేల వరకు), కోణం (కిలో రూ.700) పలుకుతున్నాయి. వేటకు వెళ్లిన వారు రోజూ అనేక రకాల చేపలను గిలకలదిండి హార్బర్‌కు తెస్తున్నారు. అక్కడ వ్యాపారులు వేలంపాట ద్వారా చేపలను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు నేరుగా విశాఖ, కాకినాడ, చెన్నై తీసుకెళ్లి అక్కడే విక్రయిస్తున్నారు. సీజన్‌ను బట్టి వీటికి మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మచిలీపట్నంలో చేపల చెరువుల్లో ప్రత్యేకంగా పెంచే చేపల్లో పండుగప్ప, శీలవతి, తుల్లులు, నేమ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. టూనా చేపలకు డిమాండ్ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రసాయన పరిశ్రమలు లేవు. పెద్ద ఓడల రాకపోకలూ తక్కువే. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దొరికే వాటిలో రసాయన ధాతువులు ఎక్కువగా ఉంటున్నాయని.. మచిలీపట్నంలో నామమాత్రంగా కూడా ఉండడం లేదని యూరోప్, జపాన్ దేశస్తులు గుర్తించడం విశేషం. మచిలీపట్నం తీరంలో దొరికే టూనా చేపల కోసం జపాన్ దేశస్తుల నుంచి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) నుంచి తీసుకునే క్యాచింగ్ సర్టిఫికెట్లో మచిలీపట్నం సీకోస్ట్ అని ఉంటే చాలు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని చెబుతున్నారు. బందరు చేపల కోసం విశాఖ, కాకినాడ, చెన్నై, కోచి, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, సికింద్రాబాద్ వ్యాపారులు ఇక్కడ కొందరు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. రోజూ మత్స్యకారుల నుంచి కొనుగోలు చేసిన చేపలను ఏజెంట్లు ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
చేపల పట్టుబడి.. మెలకువలతో అధిక రాబడి
కైకలూరు: ఏపీలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొల్లేరు పరీవాహక ప్రాంత నియోజకవర్గాలన్నీ ఒకే గూటికి చేరాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. చేప ఉత్పత్తులలో మేలైన విధానాలు అవలభించకపోతే 30 శాతం నష్టపోయే అవకాశం ఉంది. చేపలను పట్టిన తర్వాత మెత్తబడటం, పొలుసులు ఊడటం, మొప్పలు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని ప్యాకింగ్ చేయకూడదు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది. చెరువుల్లో చేపలను సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయడం ఎంత ముఖ్యమో పట్టుబడి తర్వాత కూడా తాజా చేపలను మార్కెటింగ్ చేసి అధిక ధర దక్కించుకోవడమూ అంతే కీలకం. నీటి నుంచి చేపలను బయటకు తీసిన తర్వాత వాటి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఆ వెంటనే జీవ రసాయన, సూక్షజీవుల చర్య మొదలవుతుంది. మాంసం సహజగుణం కోల్పోకుండా ప్యాకింగ్ చేసే వరకు చేపల రైతులు కొన్ని మెలకువలు పాటించాలని కలిదిండి మత్స్యశాఖ అభివృద్థి అధికారి సీహెచ్ గణపతి సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే.. పట్టుబడికి ముందు ఈ జాగ్రత్తలు అవసరం ∙రైతులు మార్కెట్లో చేపల ధరలను ముందే తెలుసుకోవాలి ∙చెరువుగట్టు వద్దే తూకం జరిగేలా వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి ∙పట్టుబడి ముందు రోజు చెరువులో చేపలకు మేతలను నిలుపుదల చేయాలి ∙చిన్న చెరువు అయితే ఒక్క రోజులో పట్టుబడి ముగిసేలా చూడాలి. ∙చెరువులో నీరు తోడటానికి డీజిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకోవాలి ∙కూలీలను, ఐస్ ప్యాకింగ్ చేసే వారిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ∙ప్యాకింగ్‌కు ఐస్ ఎంత కావాలో ముందుగానే అంచనా వేయాలి పట్టుబడి సమయంలో.. ∙ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున పట్టుబడి చేయాలి ∙చెరువులో నీటిమట్టం మూడో వంతుకు వచ్చిన తర్వాత లాగుడు వలలతో చేపలను పట్టాలి ∙నీరు బయటకుపోయే తూముకు సంచి కట్టాలి ∙పట్టుబడి చేసేటప్పుడు నీటిని ఎక్కువగా బురద చేయకూడదు ∙చేపల పట్టుబడికి రసాయనాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు ∙చేపలు ఎగరకుండా ట్రేలను ఉపయోగించాలి ∙చేపలను బయటకు తీసిన వెంటనే తూకం వేసే ప్రదేశానికి తరలించాలి పట్టుబడి తర్వాత.. ∙పట్టుబడి చేసిన చేపలను మంచినీటిలో శుభ్రపర్చాలి ∙నేలపై పరిచిన ప్లాస్టిక్ సంచి మీద మాత్రమే చేపలను వదలాలి ∙దెబ్బలు తగలకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙తూకం, రవాణా ప్రదేశం ఒకే చోట ఉండేలా చూడాలి ∙పరిశుభ్రమైన మంచినీటితో తయారు చేసిన ఐస్‌ను వాడాలి ∙రవాణా సమయాన్ని బట్టి 1:1 నిష్పత్తిలో ఐస్ ఉపయోగించాలి ∙మోతాదుకు మించి ఎక్కువ వరసలో చేపలను ట్రేలలో ఉంచకూడదు ∙ప్లాస్టిక్ ట్రేలలో చేపలను ప్యాకింగ్ చేసినప్పుడు అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పాటు చేయాలి ∙మిషన్ ఆడించి పొడిగా చేసిన ఐస్‌ను మాత్రమే ప్యాకింగ్‌కు ఉపయోగించాలి గ్రేడింగ్ ఇలా.. ∙చేపల పట్టుబడి తర్వాత గ్రేడింగ్ ఎంతో కీలకం ∙మెత్తబడిన చేపలు, గ్రహణం మొర్రి, వంకర తిరిగిన చేపలు, జన (గుడ్లు)ను గుర్తించాలి ∙ఆరోగ్యంగా లేని చేపలను విడిగా ప్యాకింగ్ చేయాలి ∙చేపలను ప్లాస్టిక్ ట్రేలు, థర్మకోల్ బాక్సుల్లోనే ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసిన సమయంలో మెత్తబడిన చేపలను విడిచేటప్పుడు మిగిలిన చేపలతో కలవకుండా చూడాలి ∙చేపల సైజులను గుర్తించి విడివిడిగా ప్యాకింగ్ చేయాలి ∙గ్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా శుభ్రత పాటించాలి చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! -
విశాఖ: మత్స్యకారుల వలకు భారీగా చిక్కిన చేపలు (ఫొటోలు)
-
తక్కువ ముళ్లు.. ఎక్కువ రుచి! అప్పలు చేప.. లాభాలు గొప్ప!
కష్టాలకు ఎదురీదుతూ చేపలు పడుతూ.. కడుపు నింపుకొంటున్న గంగపుత్రులకు సంద్రమంత లాభాలు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తూ.. జలపుష్పాలు పెంచేందుకు నీలివిప్లవం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాల్లో లాభాల పంట పండిస్తున్న అప్పలు చేపను విశాఖ మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సముద్ర మత్స్య పరిశోధన కేంద్ర సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) చేస్తున్న ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. సాక్షి, విశాఖపట్నం : లుట్జానిడే కుటుంబానికి చెందిన జాన్ స్నాపర్ (అప్పలు చేపలు) ఇండో–వెస్ట్ పసిఫిక్‌లో తూర్పు ఆఫ్రికా నుంచి ఫిజీ వరకు, దక్షిణాన ఆస్ట్రేలియా వరకు విస్తరించిన సముద్ర జలాల్లో విరివిగా పెరుగుతుంటాయి. మన దేశంలోనూ ఈ చేపలు పశి్చమ, తూర్పు తీరాల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ చేపలు ఎక్కువగా పగడపు దిబ్బలు, రాళ్లు, లోతైన సముద్రాల్లో పెరుగుతుంటాయి. వేగవంతమైన వృద్ధి, పరిస్థితులకు సులభంగా పెరిగే స్వభావం వీటి సొంతం. అందుకే విశాఖతో పాటు తమిళనాడు, కొచ్చి తీర ప్రాంతంలో ప్రజలకు పెంపకానికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు. నాలుగేళ్లుగా పరిశోధనలు.. విశాఖలోని సీఎంఎఫ్ఆర్ సంస్థ అప్పలు రకం చేపను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వేటకు వెళ్లే వారికి చాలా అరుదుగా దొరికే ఈ చేపల్లో తక్కువ ముళ్లు, ఎక్కువ రుచితో ఉండే ఆయా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. కేజీ రూ.450 నుంచి రూ.500వరకు ధర పలుకుతోంది. ఈ కారణంగా వీటిని పెంచేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగపుత్రులకు అప్పలు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు శ్రమించి 100కిపైగా ఆడ జాన్ స్నాపర్స్, మగ జాన్ స్నాపర్స్ని సముద్రం నుంచి సేకరించారు. ఇందులో 20 మేలుజాతి జతల ద్వారా పరిశోధనలు చేపట్టారు. సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ రితేశ్ రంజన్, డాక్టర్ శుభదీప్ ఘోష్, డాక్టర్ శేఖర్ బృందం కలిసి భారత బయో టెక్నాలజీ విభాగం నుంచి ఒక ప్రాజెక్టుకు అర్హత సాధించారు. సేకరించిన అప్పలు చేపలను కృత్రిమంగా పెంచే విధానంపై పరిశోధనలు ప్రారంభించారు. చివరి దశకు చేరుకున్న పరిశోధనలు ప్రయోగశాలలో ఉంచిన సముద్రపు నీటిలో అప్పలు చేపలు పెరుగుదల ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. పెరుగుదలతో పాటు ఉత్పత్తి కూడా అద్భుత ఫలితాల్ని ఇచ్చినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కాలంలో అప్పలు చేపలకు వివిధ రకాల ఆహారాల్ని అందించి ఏ ఆహారం సులువుగా జీర్ణమవుతుందోనని పరీక్షలు నిర్వహించి అన్నివిధాలుగా సఫలీకృతులయ్యారు. ఇందుకోసం ఆడ,మగ చేపలు ఒకదానికొకటి ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చి ఉత్పత్తిని పెంచేలా చేసిన పరిశోధనలు సత్ఫలితాలిచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 42 గంటల్లో ఆడమగ చేపలు ప్రేరిపితమై సంతానోత్పత్తికి సిద్ధమైనట్లు గుర్తించారు. గుడ్లు పెట్టేలా చేయడంలోనూ సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ గుడ్లను పిల్లలుగా మారేందుకు ప్రయోగశాలల్లో ప్రత్యేకంగా ఉన్న 2 టన్నుల సామర్థ్యం కలిగిన హేచరీల్లో అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేశారు. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 14 గంటల లార్వా నుంచి బయటికి వచ్చినట్లు వెల్లడించారు. తర్వాత వేల సంఖ్యలో చేప పిల్లలు బతకడంతో పాటు పెద్దవిగా పెరిగాయి. 42 రోజుల పెంపకం తర్వాత 3.67% మనుగడ రేటు సాధించినట్లు గుర్తించారు. సాధారణంగా ఏడాది వ్యవధిలో కిలోకి పైగా బరువు పెరగడాన్ని గమనించారు. ఒక్కోచేప మూడున్నర కేజీల వరకూ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా 125 టన్నుల వరకూ చేపల్ని పెంచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనలు చివరి దశకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే మత్స్యకారులకు ఈ అప్పలు చేపలను పెంపకానికి అందిస్తామని వెల్లడించారు. తీరాలలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ విధానంలో వీటిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ చేపల పెంపకం విజయం సాధిస్తే.. మత్స్యకారులకు అప్పలు చేపలు లాభాల పంట పండించినట్లే. -
చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్: సముద్రపు చేపలను ఉద్దేశించి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గుజరాత్లో మాట్లాడుతూ.. సముద్రపు చేపలు లక్ష్మీదేవికి చెల్లెళ్లుగా అభివర్ణించారు. సముద్రం అనేది లక్ష్మీదేవి జన్మించిన స్థలమని, ఆమె సముద్రపు పుత్రిక అని పేర్కొన్నారు. అయితే చేపలు కూడా సముద్రపు పుత్రికలని, అందుకే సముద్రపు చేపను లక్ష్మీదేవికి సోదరిగానే చూడాలని వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవి అశీస్సులు ఉంటే సంపద కలుగుతుందని, అలాగే చేపల ఆశీస్సులు కూడా ఉండాలని తెలిపారు. చదవండి: ఇంత లావుగా ఉన్నావ్ పిల్లల్నెప్పుడు కంటావ్! ఈ లోకంలో ఉండలేను.. దేవుడు ఒకప్పుడు మత్స్య(చేప) రూపంలో కనిపించాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆధీనంలోని వాటర్‌బాడీలో చేపలు పట్టే మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు(కేసీసీ) ఇస్తామని తెలిపారు. అయితే వ్యవసాయదారులకు కేసీసీ ద్వారా ఇస్తున్న 4 శాతం వడ్డీ రేటు తగ్గింపు మాదిరిగా.. రాష్ట్రాలు కూడా మత్స్యకారులకు మరో నాలుగు శాతం వడ్డీ రేటును తగ్గించాలని కేంద్ర మంత్రి రూపాలా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో చేపలకు పవిత్ర హోదా ఇస్తారా? ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. -
చైనా చర్యలు.. ఆ నదిలో నీళ్లు నల్లగా మారాయి.. తీవ్ర ఇబ్బందుల్లో భారత ప్రజలు
Kameng River Suddenly Turns Black సాధారణంగా నదులంటే మంచి నీటితో పరవళ్లు తొక్కుతూ జీవ రాశులతో కళకళలాడుతుంది. అలాంటిది అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవహిస్తున్న కామెంగ్ నది మాత్రం అకస్మాత్తుగా నల్లగా మారి కళ తప్పింది. దీనికి కారణం ఏదైనా, కారకులెవరైనా నదిలో వేలాది చేపలు కూడా చనిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి ఈ నదిలోని నీరంతా విషమయం కావడానికి కారణమేంటో తెలుసా ! మన పొరుగు దేశమైన చైనానే అని నదికి సమీపంలో నివసిస్తున్న నివాసితులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని సెప్పా వద్ద శుక్రవారం నదిలో వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి (డీఎఫ్‌డీవో) హాలి తాజో తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, మరణాలకు కారణం నదిలోని నీళ్లలో టీడీఎస్ అధిక శాతం ఉండడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. నది నీటిలో అధిక టీడీఎస్ ఉన్నందున, చేపలు ఆక్సిజన్‌ను పీల్చుకోవడం కష్టంగా మారుతుందని దీని కారణంగా అవి చనిపోయినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ నదిలో టీడీఎస్ లీటరుకు 6,800 మిల్లీగ్రాములుగా ఉంది. సాధారణంగా అయితే నీటిలో ఒక లీటరుకు 300-1,200 మిల్లీగ్రాముల ఉంటుంది. తూర్పు కమెంగ్ జిల్లా యంత్రాంగం కామెంగ్ నదికి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, చనిపోయిన చేపలను విక్రయించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. నదిలో టిడిఎస్ పెరగడానికి చైనా కారణమని సెప్పా ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రాగన్ దేశం చేస్తున్న భారీ నిర్మాణ కార్యకలాపాల వల్ల నీటి రంగు నల్లగా మారిందని ఆరోపించారు. కమెంగ్ నది నీటి రంగు ఆకస్మికంగా మారడం, పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Even after three days, there is no sign of improvement in Kameng River. Water continues to be muddied, flowing in huge quantities of fresh logs while fishes and aquatic lives washed to the bank. State govt constitutes fact finding committee. pic.twitter.com/XBNjpEm8Iz — The Arunachal Times (@arunachaltimes_) October 31, 2021 చదవండి: కేంద్రం మరోషాక్ ! భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర -
చేపలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాం: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేళ్లలో చేపలను ఉత్తర భారతదేశంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రంగనాయకసాగర్, సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాల్లో 4కోట్ల19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామన్నారు. తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా మారిందని, ఎక్కడ చూసినా ధాన్యం, మత్స్య సంపద కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు. కుల వృత్తులకు పూర్వవైభవం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తులకు పూర్వవైభవం కోసం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగు కోసం తమ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కోట్ల చేప పిల్లలను, 20 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. రెండేళ్లలో ఫెడరేషన్ ద్వారా చేప పిల్లలను కొని మార్కెటింగ్ చేయాలనే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అప్పుడు చేపలకు మంచి ధర వస్తుందన్నారు. అప్పటివరకు మత్స్యకారులు చేపలను తక్కువ ధరకు అమ్మకుండా డిమాండ్ ఉన్న హైదరాబాద్, ఇతర రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. భవిష్యత్‌లో మొబైల్ ఔట్ లెట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మురిసిన మంత్రి హరీశ్‌రావు చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఓ చేపపిల్లను చూడగానే తె లియని ఆనందం కలిగింది. దాన్ని చేతితో పట్టుకుని చూస్తూ మురిసిపోయారు. అనంతరం ఆ చేపను నీటిలో వదిలారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో మంత్రి హరీశ్‌రావు చేపపిల్లలను వదులుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను
సాక్షి, అమరావతి బ్యూరో/కైకలూరు: తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడా కొల్లేరు కొర్రమీనులకు కష్టకాలం దాపురించింది. సరస్సులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు, పంట కాలువలు, గుంతలు, వరి చేలల్లో కొర్రమీను చేపలు పుట్టి పెరుగుతుంటాయి. ప్రాంతాలను బట్టి పూమేను, కొర్రమీను, మట్టమీను, బురద మట్ట వంటి పేర్లతో పిలుచుకునే ఈ జాతి చేపలు సహజంగా నీటి అడుగున బురదలో జీవిస్తుంటాయి. నీరు లేనప్పుడు భూమి పొరల్లోకి కూడా చొచ్చుకుపోయి అక్కడి తేమను ఆధారం చేసుకుని జీవించగలిగే మొండి జాతి ఇది. కాలుష్యమే అసలు సమస్య కొల్లేరు సరస్సులోకి చేరుతున్న వ్యర్థ జలాలు సరస్సు గర్భంలో పురుడు పోసుకుంటున్న సహజ నల్ల జాతి చేపల ఉసురుతీస్తున్నాయి. స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు నీరు కాలకూట విషంగా మారింది. సరస్సులో ఉప్పు శాతం ప్రమాదకర స్థాయికి చేరడం అందోళన కలిగిస్తోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై మృత్యు పాశం విసురుతున్నాయి. దీనికి తోడు సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను చేప ‘జీరో’ సెలినిటీ (ఉప్పు శాతం లేని) మంచినీటిలో పెరిగే చేప. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత నీటి కాలుష్యం వల్ల కొర్రమీను ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ (ఈయూఎస్) వ్యాధులకు గురవుతోంది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, మట్టగిడస, గురక, ఇంగిలాయి, మార్పు, జెల్ల వంటి నల్ల చేప జాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొండి జాతి రకమైన కొర్రమీను సైతం వాటి జాబితాలో చేరుతోంది. నీటి కాలుష్యాన్ని అరికట్టాలి కొల్లేరు సరస్సులోకి ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలు రాకుండా నియంత్రించాలి. కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎండీ ఆసిఫ్‌పాషా, జాతీయ ఉత్తమ చేపల రైతు, కైకలూరు కృత్రిమ సాగు మేలు కొర్రమీను రకం చేపలను కృత్రిమ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. కొర్రమీను సీడ్‌ను కొల్లేరు సరస్సుతోపాటు, కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరిస్తున్నారు. కొర్రమీను సాగుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ప్రోత్సాహకాలు అందిస్తోంది. – పి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు -
Photo Feature: చేపలు.. గుంపులు.. నిరసనలు
మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చేపలను కొనేందుకు వినియోగదారులు దుకాణాల ముందు గుమిగూడారు. కరోనా నిబంధనలకు ఖాతరు చేయకుండా గుంపులు గుంపులుగా తిరగడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా, కోవిడ్ వ్యాక్సిన్, ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. -
కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్!
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): కరోనా బాధితులకు ఆక్సిజన్ దొరక్క ఆస్పత్రుల్లో మృత్యువాత పడుతున్న ప్రస్తుత తరుణంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఓ మత్స్యకారుడు ఆదివారం చేపలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసి విక్రయించాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మత్స్యకారుడు పప్పు ప్రభాకర్ చేపలు విక్రయించేందుకు ట్రాక్టర్లో వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేసి దానికి ఆక్సిజన్ బిగించాడు. బతికిఉన్న చేపలు కొనడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారని, అందుకే చేపలకు ఇలా ఆక్సిజన్ అందిస్తూ విక్రయిస్తున్నట్లు తెలిపాడు. -
తెలంగాణ లో చేపల డిమాండ్ ఎక్కువ
-
గప్పీలతో నెలకు రూ.25వేలు
కోవిడ్–19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బతుకుదెరువు కోల్పోయి రోడ్డున పడ్డారు. కేరళలోని ఎర్నాకులానికి చెందిన 39 ఏళ్ల ఆయ్యప్పదాసు కూడా లాక్‌డౌన్‌తో తన కార్పెంటర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బాగా ఆలోచించి గప్పీ చేపలను అమ్ముతూ నెలకు రూ.25000 వరకు గడిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇండియాలో కోవిడ్–19 విజృంభిస్తున్న తొలి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. అప్పటివరకు అయ్యప్పదాస్ కార్పెంటర్‌గా చాలా బిజీగా ఉండేవాడు. లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లలో ఉండిపోవడంతో ఆర్డర్లు లేక అతని జీవన భృతి ఆగిపోయింది. అప్పుడు ఆదాయం వచ్చే మార్గాలు ఏవైనా ఉన్నాయా అని దాస్ ఇంటర్నెట్లో వెతకడం ప్రారంభించాడు. ఇంట్లోనుంచే చేసే బిజినెస్ ఐడియాలు అనేకం కనిపించాయి కానీ వాటిలో ఏవీ తనకు నచ్చలేదు. ఈ క్రమంలోనే తన ఇంట్లోని ఆక్వేరియంలో ఉన్న గప్పీ చేపలు (మిలియన్ ఫిష్) కనిపించాయి. వెంటనే గప్పీ చేపలు పెంచి అమ్మితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది దాస్‌కు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే గప్పీలను అమ్మడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని అనుకుని, ఆలస్యం చేయకుండా కార్యాచరణ మొదలు పెట్టాడు. కొన్ని రకాల గప్పీలను తీసుకొచ్చి ఇంట్లో పెంచడం మొదలు పెట్టాడు. రెండు నెలల వయస్సున్న రెండు జతల మగ, ఆడ గప్పీలు కొని రెండింటిని రెండు ట్యాంకుల్లో విడివిడిగా ఉంచి నాలుగునెలల వయసు వచ్చేంత వరకు పెంచి ఆ తరువాత రెండింటిని ఒక ట్యాంక్‌లో ఉంచాడు. మూడు నెలల తరువాత అవి పిల్లల్ని పెట్టడం మొదలు పెట్టాయి. మొదటిదశలో అవి 10–25 పిల్లలు పెడితే.. తరువాతి దశలో 80వరకు పెట్టాయని దాస్ చెప్పాడు. అలా పెరిగిన గప్పీ పిల్లల ఫోటోలను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో.. అవి చూసిన ఫ్రెండ్స్, బంధువులు తమకు కావాలని ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టారు. దీంతో గప్పీలకు ఎంత డిమాండ్ ఉందో అర్ధమైంది దాస్‌కు. వెంటనే మరో రెండు కొత్త ఫిష్ ట్యాంక్‌లను కొని గప్పీల సంఖ్యను పెంచాడు. ప్రస్తుతం 18 రకాల్లో 1500కు పైగా గప్పీలను దాస్ పెంచుతున్నాడు. వీటిలో రెడ్, చిల్లీ రెడ్, ఆల్బీనో రెడ్, రెడ్డ్రాగన్ వంటి రంగుల్లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఐదువేలకుపైగా గప్పీలను దాస్ అమ్మాడు. ఇలా అమ్ముతూ నెలకు 25 వేలరూపాయలు సంపాదిస్తున్నట్లు దాస్ చెప్పుకొచ్చాడు. గప్పీ చేపలను మిలియన్ ఫిష్, రెయిన్బో ఫిష్ అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా ఆక్వేరియాల్లో పెంచుతుంటారు. గప్పీల పరిమాణం, తోక సైజు, ఆకృతి, రంగుని బట్టి వివిధ రకాలు లభ్యమవుతున్నాయి. -
సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను సాగు
బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాలో రెండు దశాబ్దాలకుపైగా పనిచేసిన షేక్ సలీం ఇంటికి తిరిగి వచ్చి, వినూత్న పద్ధతిలో చేపల సాగు చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సలీం ఇంటర్ ఎంపీసీ విద్యనభ్యసించారు. 23 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లి రియాద్ నగరంలో పనిచేశారు. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో అతని స్నేహితుడు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండేవాడు. ప్రతి శుక్రవారం సెలవు రోజు అతని దగ్గరకు వెళ్లి వారి సాగు పద్ధతులను పరిశీలిస్తూ ఉండేవారు. సిమెంటు ట్యాంకుల్లో చేపల పెంపకం, పురుగులను మేతగా వేయటం అక్కడే నేర్చుకున్నారు సలీం. 6 ట్యాంకుల్లో కొర్రమీను ఈ నేపథ్యంలో స్వగ్రామంలోనే చేపల సాగు చేపట్టి మంచి ఆదాయం గడించవచ్చనే తలంపుతో ఏడాది క్రితం నుంచి తండ్రి సహాయంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చారు. దేవరుప్పులలో 15 గుంటల (20 గుంటలు = అరెకరం) స్థలంలో 20 అడుగుల చుట్టుకొలత, 5 అడుగుల లోతు ఉండే గుండ్రని ఆరు సిమెంటు ట్యాంకులను నిర్మించారు. 3 ట్యాంకుల్లో 3 నెలలుగా కొర్రమీను (బొమ్మ చేపల) పెంపకం చేపట్టారు. మూడు నెలల్లో కొర్రమీను చేపలు 200 గ్రాముల బరువుకు పెరిగాయని, ఏడాదికి కిలో బరువు పెరుగుతాయని సలీం తెలిపారు. కిలోన్నర మేత మేపితే కిలో బరువుకు పెరుగుతాయన్నారు. 15 రోజుల క్రితం మరో మూడు ట్యాంకుల్లో కూడా కొర్రమీను సాగు ప్రారంభించారు. మొత్తం 6 ట్యాంకుల్లో 36,000 కొర్రమీను పిల్లలను వదిలారు. కొర్రమీను చేప పిల్లలకు మేపుతున్న పురుగులను చూపుతున్న రైతు సలీం చేపలకు పురుగుల ఆహారం బురద నీటిలో పెరిగే కొర్రమీను (బొమ్మ చేపల)కు మంచి గిరాకీ ఉండటంతో వీటిని సిమెంటు ట్యాంకుల్లో పెంచుతున్నారు సలీం. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పురుగులను ఆహారంగా వేస్తూ పెంచుతున్నారు. పల్లి చెక్క, తౌడును కలిపి తగిన తేమతో వారం రోజులు ట్రేలలో ఉంచితే.. పురుగులు తయారవుతున్నాయి. వీటిని బొమ్మ చేపలకు మేతగా వేస్తే రెండు నెలల్లో రెండు వందల గ్రాముల బరువు పెరిగాయని సలీం తెలిపారు. మొదటి నెల వరకు పురుగులను మాత్రమే రోజూ మేతగా వేశారు. ఆ తర్వాత నుంచి పురుగులతోపాటు కొనుగోలు చేసిన బలపాల (పెల్లెట్ల) మేతను కూడా కలిపి వేస్తున్నారు. ఇందుకోసం షెడ్లో 10 వరకు ట్రేలను ఏర్పాటు చేసి, ప్రతి రోజూ కొన్ని ట్రేలలో పల్లి చెక్క, తవుడు కలిపి పెడుతున్నారు. ముందే పెట్టిన ట్రేలలో సిద్ధమైన పురుగులను తీసి చేపలకు వేస్తున్నారు. రోజుకు 300–400 గ్రాముల పురుగులను వేస్తున్నారు. మరో 26 ట్యాంకులు ప్రస్తుతం కొర్రమీను చేపలు సాగు అవుతున్న 6 ట్యాంకులకు తోడు మరో 26 సిమెంటు ట్యాంకులను నిర్మించారు. 12“12 అడుగుల కొలతలో చతురస్త్రాకారంలో ఈ ట్యాంకులను నిర్మించారు. వీటిపైన 6“6 అడుగుల మేరకు సిమెంటు శ్లాబ్ ఏర్పాటు చేశారు. ట్యాంకు పై కప్పు సగం మూసి ఉంటే, ట్యాంకులో నీటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచటం వీలవుతుందని ఆయన చెబుతున్నారు. దానితోపాటు ట్యాంకు పై కప్పు మీద ఆక్వాపోనిక్స్, రీసర్క్యులేటరీ పద్ధతిలో చేపల ట్యాంకులో నీటితోనే అజొల్లాను సాగు చేసి చేపలకు ఆహారంగా వేస్తానన్నారు. ఈ నీటితోనే కూరగాయలు సాగు చేయాలని కూడా ఆలోచిస్తున్నానని సలీం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 50 వేల కొర్రమీను చేప అతిచిన్న పిల్లల(ఒకటిన్నర అంగుళం)ను తీసుకు వచ్చి.. రెండు నెలలు సిమెంటు ట్యాంకుల్లో 8–10 అంగుళాల సైజు వరకు పెంచిన తర్వాత రైతులకు మట్టి చెరువుల్లో పెంపకానికి అమ్ముతానని సలీం తెలిపారు. తనతో పాటు తోటి రైతులు కూడా కొర్రమీను చేపలు పెంచి మంచి ఆదాయం గడించాలన్నదే తన అభిమతమని ఆయన తెలిపారు. – నల్ల లక్ష్మీపతి, సాక్షి, దేవరుప్పుల, జనగాం జిల్లా సిమెంటు ట్యాంకుల్లో చేపలు పెరగవన్నారు! సౌదీ మూడేళ్ల కిందట సిమెంటు ట్యాంకుల్లో పురుగుల మేతతో చేపలు, కూరగాయల పెంపకాన్ని చూసినప్పుడు నాలో ఆసక్తి కలిగింది. స్వగ్రామంలోనే 15 గుంటల్లో 32 సిమెంటు ట్యాంకులు నిర్మించా. సుమారు 65 లక్షల ఖర్చయ్యింది. తండ్రి ఇమామ్ తోడ్పాటుతో ఎడాది క్రితం నుంచి పనులు చేయిస్తున్నారు. సహజ పద్ధతిలో పురుగుల మేత, పెల్లెట్ల మేతలతో కొర్రమీను సాగు చేస్తున్నా. ఏడాదిలో కిలో సైజుకు పెంచి బతికున్న చేపలనే అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. సిమెంటు ట్యాంకుల్లో కొర్రమీను పెరగదని అందరూ అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా పెంచి చూపిస్తున్నా. కొర్రమీను పిల్లలను 2 నెలలు పెంచి రైతులకు అమ్ముతా. మట్టి చెరువుల్లో జాగ్రత్తలు తీసుకొని పెద్ద పిల్లలను పెంచితే 8 నెలల్లో వారికీ మంచి ఆదాయం వస్తుంది. కొర్రమీనుకు ఏ కాలంలో అయినా ఏ ఊళ్లో అయినా మంచి గిరాకీ ఉంటుంది. –షేక్ సలీం (93110 47909), దేవరుప్పుల, జనగామ జిల్లా -
మడ్డువలస చేప.. ఆ రుచే వేరప్పా!
సాక్షి, శ్రీకాకుళం: మీరు ఎన్నో రకాల నాన్‌వెజ్ వంటకాలు తిని ఉంటారు. అయితే మడ్డువలస చేపల కూర రుచే వేరు. రిజర్వాయర్ ప్రాంతంలో మాత్రమే దొరికే అరుదైన చేపలు కావడం, తక్కువ ధరలో లభ్యమవడంతో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. అన్నీ అరుదైనవే.. జిల్లాలో మడ్డువలస రిజర్వాయర్‌లో దొరికే చేపలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు పది వేల ఎకరాల విస్తీర్ణంలోని ఈ రిజర్వాయర్‌లో తిలాఫియా, ఎర్రమైలు, రాగండి, బంగారుపాప, రొయ్య, బొచ్చు వంటి అరుదైన రకాలు ఇక్కడ లభ్యమవుతాయి. ధర ఎంతంటే.. ఒక్కో చేప బరువు కిలోకు పైగా బరువుంటుంది. కేజీ రూ.100 నుంచి రూ. 120 వరకు ధర పలుకుతుంది. తక్కువ ధర, తాజా చేపలు కావడంతో పరిసర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ. పొరుగు ప్రాంతాలకు కూడా.. స్థానిక ప్రాంతాల్లోనే కాకుండా రాజాం, పాలకొండ, వీరఘట్టం, పొందూరు, చీపురుపల్లి, బలిజిపేట, బొబ్బిలి, పార్వతీపురం వంటి పట్టణాలతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా, కలకత్తా రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నాయి. రిజర్వాయర్‌లో చేపల వేట ఆధారంగా సుమారు 754 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు.. రిజర్వాయర్‌లో కేజ్ కల్చర్‌లో పెంపకం చేస్తున్న తిలాఫియా చేపలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఏటా లక్షలాది రూపాయల చేపలను ఎగుమతి చేపడుతుంటారు. ఈ చేపల వంటకాలకు హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. విందు భోజనాలకు పెద్దఎత్తున ఆర్డర్లు వస్తుంటాయి. -
కుప్పలుగా చేపలు.. ఎగబడ్డ జనం
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. భారీగా వరదలు రావడంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తివేశారు. దీంతో బ్యారేజీల్లోని చేపులు భారీ సంఖ్యల్లో కొట్టుకుని వచ్చాయి. దీంతో చేప ప్రియలు గత 15 రోజులుగా పండగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా గోదావరి నదిపై గల సుందిల్ల ప్రాజెక్టు వద్ద గ్రామస్తులు చేపల కోసం భారీగా ఎగబడ్డారు. సుందిళ్ళ బ్యారేజ్‌లో వరద ఉధృతి తగ్గడంతో అధికారులు సోమవారం గేట్లను మూసి వేశారు. దీంతో బ్యారేజ్ ముందు భాగంగా చేపలు కుప్పలు కుప్పలు బయటపడ్డాయి. ఈ విషయం కాస్తా జైపూర్ మండలంలోని కిష్టాపూర్, కుందారం గ్రామ ప్రజలుకు తెలియడంతో చేపల కోసం తండోప తండాలుగా జనం తరలివచ్చారు. బస్తాలకు బస్తాలు చేపలు దొరకడంతో ఆటోలు బైకులు ఇతర వాహనాలపై స్థానికులు తీసుకుని వెళ్లారు. -
మంచిర్యాల: కుప్పలుగా చేపలు..
-
ఈ చేపలను తింటే ప్రాణాలు పోతాయ్
చెన్నై : రామనాథపురం జిల్లా సేతుకరై సముద్రతీరంలో అరుదైన విషపూరిత తేలు చేపలు వెలుగులోకి వచ్చాయి. మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అరుదైన సముద్ర జలచరాలు జీవిస్తున్నాయి. ప్రపంచంలో వేరెక్కడా లేని విధంగా చేపలు, సముద్రపు పశువులు సహా నాలుగువేలకు పైగా అరుదైన జలచరాలు జీవిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించి పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇలా ఉండగా కేంద్ర మత్స్యశాఖ పరిశోధన సీనియర్ సైంటిస్టు జయభాస్కరన్ ఆధ్వర్యంలో పరిశోధక బృందం మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో సోమవారం పరిశీలనలు జరపగా తిరుపుల్లాని సమీపంలోని సేతుకరై సముద్ర ప్రాంతంలో మృతి చెందిన స్థితిలో తేలు చేపలు కనిపించాయి. వీటిని పరిశోధనల నిమిత్తం వెలికి తీశారు. ఇవి తరచుగా రంగులు మార్చే చేపలుగా జయభాస్కరన్ పేర్కొన్నారు. ఇవి మనిషిని కుడితే లేదా ఈ చేపలను ఆరగిస్తే శరీరంలో విషం వ్యాపించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నట్లు తెలిపారు. చదవండి : హెయిర్‌కట్‌కు ఆధార్ తప్పనిసరి! -
సార్.. నాకు చేపలు కొనిపెట్టరూ..!
సాక్షి, చెన్నై: లాక్డౌన్ సమయంలో ఓ వృద్ధురాలు అమాయకంగా అడిగిన కోరికను ఓ పోలీస్ అధికారి వెంటనే నెరవేర్చారు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లా, కుళచ్చల్‌లో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలో లాక్డౌన్ కారణంగా తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధం ఉంది. కాగా కుళచ్చల్ ఏఎస్పీ విశ్వేష్‌శాస్త్రి కరోనా నివారణ విధుల్లో ఉన్నారు. అనాథలు, పేదలు, సామాన్య ప్రజలకు పోలీసుల తరఫున కూరగాయలు, బియ్యం అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. కుళచ్చల్ టీఎంసీ కాలనీ ప్రాంతంలో ఉన్న వృద్ధులు సహా పలువురికి కూరగాయలు, బియ్యం వంటివి అందజేస్తూ వచ్చారు. (చెన్నైలో భయం.. భయం) ఆయన శుక్రవారం ఆ ప్రాంతంలో మళ్లీ విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక ఇంటి అరుగుపై దిగాలుగా కూర్చున్న వృద్ధురాలిని గమనించాడు. ఏమైనా సాయం కావాలా? అని ప్రశ్నించాడు. అందుకు వృద్ధురాలు అయ్యా! లాక్డౌన్ ఉంది కదా, అందుకే చేపలు తిని చాలా రోజులయ్యింది, కొంచెం చేపలు కొనివ్వండని అమాయకంగా అడగటంతో ఏఎస్పీ వెంటనే స్పందించారు. చేపలు కొనుక్కోని రావాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. కుళచ్చల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణన్, ఏఎస్ఐ అలెక్స్ హార్బర్‌కు వెళ్లి చేపలు కొనుగోలు చేసి వృద్ధురాలికివ్వడంతో స్థానికులు వారిని ప్రశంసలతో ముంచెత్తారు. (పోలీసులపై దాష్టీకాలా?) -
వైరల్ వీడియో: స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం
స్నేహం.. ఈ పదానికి అర్థం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ విషయాన్ని అయినా ముందుగా స్నేహితుని దగ్గరే చెప్పేస్తాం. మన సంతోషాలతో పాటు బాధలను కూడా పంచుకునే వాడే నిజమైన స్నేహితుడు. కుటుంబం తర్వాత ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది ఆ స్నేహితుల దగ్గరే. మరి ఆ స్నేహితులు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఇక్కడ చేపలకు దొరికింది. అవును చేపలకు ఓ మంచి స్నేహితుడు దొరికాడు. అతని పేరు బాతు. నమ్మడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవమే.. ఓ సరస్సుకు ఆనుకుని బాతులు ఉన్నాయి. అందులో ఓ బాతుకు చేపతో స్నేహం కుదిరింది. అక్కడ బాతు తింటున్న గింజలను నోటితో చేపలకు అందించింది. దీంతో అక్కడికి చేరుకునే చేపల సంఖ్య పెరిగింది. అయినా వచ్చిన వాటన్నింటికీ ఆహారాన్ని అందిస్తూనే ఉంది. ఈ దృశ్యాన్ని బెంగుళూరుకు చెందిన అటవీశాఖ అధికారి వీడియో తీసి తన ట్విటర్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా మంత్రముగ్దులు అవుతున్నారు. ‘‘స్వచ్ఛమైన స్నేహానికి ఇది నిదర్శనం. కేవలం జంతువులు మాత్రమే ఏలాంటి కల్మషం లేని మనస్సును కలిగి ఉంటాయి. మనం నేర్చుకోవాలనుకుంటే ప్రకృతి మనకు చాలా నేర్పిస్తుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.’’ -
అక్వేరియం.. ఆహ్లాదం.. ఆనందం
ఇంటిని నిర్మించుకోవడం.. ఆ ఇంటికి అందాలు అద్దడం ఓ కళ. ఇంటి పరిసరాలను కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు రంగు రంగుల బొమ్మలు, పోస్టర్లు అతికిస్తారు. ఇంటి బయట అరుదైన మొక్కలు నాటుతారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇంటీరియల్ డెకరేషన్‌కు ఎంత ఖర్చు అయినా వెనకాడటం లేదు. అరుదైన విగ్రహాలు, ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అక్వేరియం ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటికొచ్చే వారిని ఆకట్టుకునేందుకు కొందరు, వాస్తు పేరుతో మరి కొందరు అక్వేరియాన్ని తెచ్చేసుకుంటున్నారు. అందులో అందమైన చేపలు పెంచుతూ ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని పొందుతున్నారు. సాక్షి, ఒంగోలు: మనిషి జంతువులను పెంచుకోవడం, వాటితో సరదాగా గడపడం ఎప్పటి నుంచో ఉంది. అలాగే పురాతన కాలం నుంచి జంతువులను, జలచరాలను పూజిస్తున్నారు. జలచరాల్లో తాబేలు, చేపకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో చేప, తాబేలు ఉంచితే అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో పూర్వం సంప్లాంటి నిర్మాణంల్లో వాటిని ఉంచే వారు. ప్రస్తుతం వాటి స్థానంలో అక్వేరియాలు వచ్చేశాయి. గాజు ఫలకాలతో నిర్మించిన డబ్బాలో అందమైన చేపల కదలికలను చూస్తే మనసుకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది భావిస్తున్నారు. దీంతో అక్వేరియం ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. నివాసాల్లో, పెద్ద పెద్ద హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, బ్యాంకులు, వ్యాపార సంస్థల్లో అక్వేరియాలు ఏర్పాటు చేసి అందులో అరుదైన చేపలను ఉంచి ఆకట్టుకుంటున్నారు. గతంలో దేశవాళి చేపలనే పెంచుకునే వారు. ప్రస్తుతం అమెరికా, స్వీడన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి 40కిపైగా చేపలు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతా, ముంబాయి, బెంగళూరు వంటి మహానగరాలకు చేపలు దిగుమతి కాగా.. అక్కడి నుంచి జిల్లాలో పలువురు వ్యాపారులు తెచ్చుకుని స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు, ఆదోని, నంద్యాల తదితర ప్రాంతాల్లో 20కి పైగా అక్వేరియం షాప్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఆన్లైన్లో రోజుకు 10 నుంచి 15 వరకు అక్వేరియం డబ్బాలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో అక్వేరియం ధర రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. చేపల్లో అత్యధికంగా ప్రజలు ఆసక్తి చూపి కొనే చేప గోల్డ్ ఫిష్ కాగా, దానికి ఆహారంగా ఇచ్చే బ్లడ్మాన్స్ ధర అత్యధికంగా రూ.1500 ఉంది. ఆహారం ధర అనీఫుడ్ రూ.160 టయాఫుడ్ రూ.40 వసాకిఫుడ్ రూ.40 ఫ్రాన్స్ఫుడ్ రూ.1000 బ్లడ్‌మూన్ ఫుడ్ రూ.1500 తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి కావడంతో సాధారణ వాతావరణంలోనే జీవిస్తాయి. ► అక్వేరియంలో ప్రత్యేకంగా నీటి పంపు, ఆక్సిజన్ పంపు అవసరం. ► చేపలకు సమపాళ్లలో, రెండు పూటల ఆహారం అందించాలి. ► అక్వేరియం అందంగా ఉంచేందుకు ఆల్చిప్పలు, గవ్వలు, చిన్నపాటి పడవ తదితర ఆకారాలతో పాటు సముద్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ► అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపలు ఉంచితే చేపల విసర్జితాలు ఎక్కువై అమ్మోనియం పాలు అధికమవుతోంది. ఈ పదార్థం చేపలకు హానికరంగా మారుతుంది. ► అక్వేరియంలో నీటిని మార్చకపోతే బ్యాక్టిరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. ► నీటిని తరుచూ మార్చుతూ ఉండాలి. పెద్దది అయితే వారానికో సారి, చిన్నది అయితే రెండు రోజులకోసారి మార్చాలి. ► చేపలను నేరుగా నెట్ అవుట్ చేయకుండా నీళ్లు ఉన్న కంటైనర్ సహాయంతో బయటకు తీస్తే మంచిది. లేదంటే కొన్ని చేపలు అభద్రతభావంతో చనిపోయే ప్రమాదం ఉంది. చేపల ఆహారం చేపలకు మామూలు ఆహారం ఇస్తే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ప్రత్యేకించి తయారు చేసిన ఆహారాన్నే వాటికి ఇవ్వాలి. వాటికిచ్చే ఆహారంలో నాణ్యత తక్కువైనా, పరిమాణం ఎక్కువైనా చేపలకు ప్రమా దమే. ప్రత్యేకంగా తయార య్యే ఆహారాన్ని వ్యాపారులు బెంగళూరు నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. చేపలకు రెండు పూటలా ఆహారం ఇవ్వాలి చేపలు.. రకాలు అక్వేరియంలో పెంచే చేపలు చాలా అరుదైనవి. వాటిలో గోల్డ్‌ఫిష్, షార్క్, టైగర్‌ఫిష్, ఫైటర్, బ్లాక్మాలిష్, సిల్వర్మాలిష్, పికాక్ ఫిష్, ఎస్కే గోల్డ్, ఎంజల్ఫిష్, సోలైన్, అర్తోనా, ఫ్లోరేన్ఫిష్, ఫిరోనాస్, చిక్స్లైట్స్, ఆస్పర్స్, ఇస్కార్స్, షిఫర్, సియాంజల్ వంటి చేపలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని శాస్త్రీయ నామాలతోనే పెంపకం దారులు పెంచుకుంటున్నారు. ఇవన్నీ సముద్రపు చేపల సంతతి. -
నీటిలో ప్రభుత్వ ఆస్పత్రి ; ఐసీయూలోకి చేపలు
పట్నా : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పట్నాలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లనే కాకుండా నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను కూడా వరద నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జనరల్ వార్డుతో పాటు, ఐసీయూలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పెషేంట్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఐసీయూలోకి వచ్చిన నీటిలో చేపలు కూడా దర్శనం ఇవ్వడంతో వారు షాక్‌కు గరయ్యారు. వరద నీటితో పాటు విష సర్పాలు, ఇతర హానికర కీటకాలు వస్తే తమ పరిస్థితేంటని పెషేంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నీటిని వెంటనే బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెషేంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. తాము కూడా పెషేంట్ల సేవలు అందించడం కష్టం మారిందన్నారు. ఆస్పత్రి పరిసరాల్లో పూర్తిగా వరద నీరు చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని ఈ ఘటన తెలియజేసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజధానిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నీటిలో ప్రభుత్వ ఆస్పత్రి ; ఐసీయూలోకి చేపలు
-
ఆంధ్రా చేపలు తినొచ్చు
భువనేశ్వర్ (ఒరిస్సా) : రాష్ట్రంలో ప్రజలు చేపల్ని నిర్భయంగా తినవచ్చు. రాష్ట్రంలో విక్రయిస్తున్న చేపల్లో విషపూరిత ఫార్మాలిన్ ప్రయోగం లేనట్టు పరీక్షల్లో తేలింది. సముద్రం, చెరువు, ఏరుల్లో లభించిన చేపల్లో ఎటువంటి అపాయకర ప్రయోగం లేనట్టు ఈ పరీక్షలు స్పష్టం చేశాయని రాష్ట్ర మత్స్య, పశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రశాంత సేనాపతి తెలిపారు. చెరువు చేప, సముద్రపు చేప అయినా నిర్భయంగా తినవచ్చని బుధవారం ప్రకటించారు. నిరవధికంగా మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లు, గోదాంలపై మెరుపు దాడులు నిర్వహించడం నిరవధికంగా సాగుతుంటుందని ఆయన స్పష్టం చేయడం విశేషం. జిల్లా కలెక్టర్లు చేపల నమూనాల్ని సేకరించి పరీక్షల కోసం పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. కటక్, బరంపురం, రౌర్కెలా ప్రాంతాల్లో బుధవారం చేపల మార్కెట్లపై ఇటువంటి దాడులు చేపట్టి నమూనాల్ని సేకరించి పరీక్షల కోసం సిఫారసు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల కలెక్టర్లతో పాటు 5 మున్సిపల్ కార్పొరేషన్లకు చేపల పరీక్షల కోసం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అనుబంధ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించాలని ఆహార భద్రత కమిషనర్ తెలిపారు. -
ఆంధ్రా చేపలు..విషపూరితం
భువనేశ్వర్ : ఆంధ్రప్రదేశ్ నుంచి విష పూరిత చేపలు ఎగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగపరిచింది. ఒడిశా రాష్ట్రానికి కూడా నిత్యం ఆంధ్రప్రదేశ్ నుంచి విశేషంగా చేపలు దిగుమతి అవుతాయి. రాష్ట్ర చేపల అంగడిలో ఆంధ్రప్రదేశ్ చేపల వాటా సింహభాగంగా కొనసాగుతోంది. అస్సాం ప్రభుత్వం వెలువరించిన భయానక ప్రకటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న చేపల్ని పరీక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ–పశు సంవృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నిపుణుల పరీక్షల నివేదిక ఆధారంగా బాధ్యుల్ని గుర్తించి కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ–పశు సంవృద్ధి శాఖ మంత్రి ప్రదీప్ మహారథి హెచ్చరించారు. విషపూరిత చేపల విషయంలో తమ విభాగం ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన మేరకు తగిన చర్యలు చేపడుతుందని రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసిన చేపలకు అస్సాం ప్రభుత్వం గత నెల 29వ తేదీన ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విషపూరిత చేపల్ని దిగుమతి చేసినట్లు తేలిందని అస్సాం సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిజూష్ హజారికా ప్రకటించారు. చేపలకు విష పూరిత ఫార్మాలిన్ రసాయనం ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ ఎగుమతి చేస్తోంది. అక్కడినుంచి పలు ప్రాంతాలకు చేపలు విరివిగా ఎగుమతి అవుతున్నాయి. వాటిలో ఒడిశా ఒకటి కావడంతో కలకలం రేగింది. అస్సాంలో ఆంధ్రా చేపల నిషేధం ఫార్మాలిన్ విష పూరిత రసాయనం ప్రయోగంతో ఆ రాష్ట్రం ఎగుమతి చేసిన ఆంధ్రప్రదేశ్ చేపల వినియోగాన్ని నిషేధించినట్లు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. 10 రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్ చేపల్ని అస్సాంలో విక్రయాలకు నిషేధించినట్లు అస్సాం సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పిజూష్ హజారికా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు ఆంధ్ర ప్రదేశ్ చేపల విక్రయంపట్ల నిఘా వేస్తారు. ఉల్లంఘనల్ని అధిగమించి ఫార్మాలిన్ పూత కలిగిన ఆంధ్రా చేపల్ని విక్రయించే వారికి భారీగా జరిమానా విధించే అధికారాల్ని జిల్లా కలెక్టర్లకు కల్పించారు. నిందితులకు 2 నుంచి 7 ఏళ్ల వరకు ఖైదు, రూ.10 లక్షల జరిమానా విధిస్తామని అస్సాం ప్రభుత్వం హెచ్చరించింది. ఫార్మాలిన్ రసాయనం ఏమిటి? మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. మొప్పల గుండా ఫార్మాలిన్ రసాయనాన్ని చేపల్లోనికి చొప్పిస్తారు. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి. ఫార్మాలిన్ ఛాయలు ఇలా.. ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. ఈ చేపల్ని తింటే రబ్బరులా అనిపిస్తాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. కళ్లు సజీవతను సంతరించుకుంటాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మాలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉన్నట్లు కొన్ని వర్గాలు హెచ్చరిస్తున్నాయి. -
చేపా చేపా నీకేమైంది?
చేపా చేపా... ఎందుకు ఎదగలేదు? నాణ్యమైన విత్తనం వేయక... అదనులో వానల్లేక... చెరువుల్లో నీరు అడుగంటి... ...ఇలా ఒకటా, రెండా? కర్ణుడి చావు మాదిరిగా ఎన్నో కారణాలున్నాయి!! సాక్షి నెట్వర్క్: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. చెరువులు, కుంటల్లో మత్స్య శాఖ మూడేళ్లుగా చేప పిల్లలను వదులుతోంది. వాటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇంత చేస్తున్నా ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఈ ఏడాది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. నిర్వహణ లోపాల వల్ల అనుకున్న ప్రగతి సాధించలేకపోయారు. గతేడాది అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు కురవకపోవడం, చేప విత్తనాలను ఆలస్యంగా వదలడం, ఫీడింగ్ సరఫరా చేయకపోవడంతోపాటు చేపపిల్లల్లో నాణ్యత లేకపోవడం ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది మత్స్యకారులు లాభాలను కళ్లచూడలేకపోయారు. ఈ ఏడాది మిషన్ కాకతీయలో భాగంగా బాగు చేసిన చెరువుల్లో మాత్రం గతేడాది కన్నా ఈసారి చేపల దిగుబడి అధికంగా వచ్చింది. వాటిల్లో ఏడాది పొడువునా నీరుండటంతో చేపలు బతికి మత్స్యకారులు కాస్త ఆదాయం కళ్లజూశారు. భువనగిరి మండలం రాయగిరి చెరువులో నీరు లేకపోవడంతో చేపలు పడుతున్న మత్స్యకారులు వానల్లేక... చెరువుల్లో చేపల పెంపకం పథకం కోసం ఈ–టెండర్ విధానంలో ఏపీలోని కైకలూరు నుంచి చేప విత్తనాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు, మ్రిగాల, బంగారు తీగ, బొచ్చలతో పాటు అక్కడక్కడ నీలకంఠ రకం రొయ్యలను పోస్తున్నారు. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్‌లో వదలాల్సిన చేప విత్తనాలను ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వదిలారు. కొన్ని ప్రాంతాల్లోనైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో పోశారు! చిన్నాచితక వర్షాలు మినహా అనుకున్న స్థాయిలో వానల్లేక వర్షాధార చెరువుల్లో నీరు తగ్గింది. నీటికుంటలూ ఎండిపోయాయి. దాంతో దాదాపుగా 30 శాతం చెరువుల్లో సగానికి పైగా చేపలు చనిపోయాయి. ఇది చాలదన్నట్టు ఎదిగీ ఎదగక ముందే చలికాలం ప్రారంభమవడం చేపల పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. గత సెప్టెంబర్‌లో వదిలిన చేప పిల్లలు ఇప్పుడు కేవలం 600 గ్రాముల నుంచి 800 గ్రాముల మధ్య మాత్రమే ఎదిగాయి. నిజానికి వర్షాకాలం ప్రారంభంలోనే చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. జూన్, జూలై తర్వాత వదిలితే ఎదుగుదల సరిగా ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు. ఏడాదంతా నీరు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ. సైజున్న చేపలను, వర్షాధార చెరువులు, కుంటల్లో 35 నుంచి 40 మి.మీ. చేపలను వదులుతున్నారు. వీటిలో 50 నుంచి 60 శాతం మాత్రమే వృద్ధి అవుతున్నాయని మత్స్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. నాణ్యమైన పిల్లలనూ ఇవ్వడం లేదు... ఉన్న సమస్యలకు తోడు ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లల్లో నాణ్యత కూడా లోపిస్తోందని రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల మత్స్యకారులూ వాపోతున్నారు. ఆ విత్తనాలను కూడా ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. దాంతో, 8 నెలల్లో 3 నుంచి 4 కిలోలు పెరగాల్సిన చేపల బరువు కిలో లోపే ఉంటుండటం దుస్థితికి అద్దం పడుతోంది. ఈ ఆలస్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న దళారులు మత్స్యకారులతో మాట్లాడుకుని తమకే తెగనమ్మేలా ఒప్పందం కుదుర్చుకుంటూ చేపపిల్లలను తెచ్చి వదులుతున్నారు. ఇలా దళారుల వలకు చిక్కి మత్స్యకారులు బిక్కమొకం వేస్తున్నారు. మార్కెట్ సదుపాయమేది? మార్కెట్ సదుపాయాల లేమి కూడా మత్స్యకారులకు శాపంగా మారింది. పలు ప్రాంతాల్లో చేపల మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ అవి పలు కొన్ని చోట్ల స్థల ఎంపిక దశలో ఉండగా మిగతా చోట్ల అది కూడా జరగలేదు. చేపలు పట్టిన వెంటనే నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో దళారులు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని పట్టణాలకు తరలించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన దళారులే చేపల మార్కెట్‌ను నియంత్రిస్తున్నారు. చేపలు పాడవకుండా లాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నా ఆ దిశగా అడుగు పడలేదు. పలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 275 మత్స్యకార సంఘాలున్నాయి. గతేడాది 918 చెరువులు, 14 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో రూ.8.41 కోట్ల విలువైన చేపపిల్లలు వదిలారు. ఈ ఏడాది 20,900 టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపలు త్వరగా పెరగడం లేదనేది ఇక్కడి మత్స్యకారులు ఆవేదన. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 963 చెరువులు, 230 మత్య్సకార సంఘాలున్నాయి. ఈ ఏడాది రూ.3.40 కోట్ల విలువైన 4.92 కోట్ల చేప పిల్లలను వదిలారు. 13,800 టన్నుల చేప పిల్లలు ఉత్పత్తి అయ్యాయి. ఉత్పత్తి గతేడాది 8 వేల టన్నులే ఉండగా ఈసారి 12 వేల టన్నులకు పెరిగిందని అధికారులు అంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గతేడాది 1.72 కోట్ల చేప పిల్లలు వదిలారు. ఇప్పుడు నీరు తగ్గడంతో చేపలు పడుతున్నారు. ఇప్పటికి 3,071 మెట్రిక్ టన్నుల చేపలను విక్రయించారు. రూ.27.63 కోట్ల ఆదాయం సమకూరింది. నల్లగొండ జిల్లాలో 90 శాతం చెరువులను కాంట్రాక్టర్లే గుప్పిట్లో పెట్టుకున్నారు. జిల్లాలో 177 డిపార్ట్మెంట్ చెరువులు, 8 జలశయాలు, 490 గ్రామ పంచాయితీ చెరువులున్నాయి. వీటిలో గతేడాది రూ.2.96 కోట్ల విలువ గల 3.7 కోట్ల చేప పిల్లలను పోస్తే ఇప్పటికీ చాలా చెరువుల్లో కేజీ లోపు మాత్రమే పెరిగాయి. వరంగల్ జిల్లాలో గతేడాది 10.49 కోట్ల చేప పిల్లలు వదిలారు. 32,174 టన్నులు చేపల ఉత్పత్తి జరిగింది. మత్స్య కార్మికులకు రూ.207 కోట్ల ఆదాయం సమకూరింది. చేపలు పెరగలేదు.. మా ఊరి చెరువులో లక్ష చేప పిల్లలు వదిలాం. మాకు సెప్టెంబర్ చివరి వారంలో పంపిణీ చేశారు. సకాలంలో వానలు రాక పిల్లలు పెరగలేదు. రూ.70 వేల విలువైన పిల్లలు వేస్తే రూ.70 వేల దిగుబడే వచ్చింది. ఒక్కో చేప కనీసం కిలోన్నర పెరగాలి. కానీ ఈసారి ఒక్కో పిల్ల ముప్పావు కిలో మాత్రమే పెరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యంగా కాకుండా చేప పిల్లలను జూలై తొలి వారంలో పంపిణీ చేయాలి. అప్పుడు అధిక వర్షాలకు చేప పిల్లలు పెరుగుతాయి. మత్స్యకారులకు లాభం చేకురుతుంది. – ఎడ్ల భీమయ్య, కనికి సొసైటి అధ్యక్షుడు, కౌటాల మండలం, కుమురం భీం జిల్లా. ఆశలకు గండి కొట్టారు యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని గండి చెరువులో 4 నెలల కింద 50 వేల చేప పిల్లలను వదిలాం. ఇప్పుడవి ఎదిగే దశలో ఉన్నాయి. బాగా వానలు పడితే మా బతుకులు మారుతాయని 150 మంది మత్స్యకారులం సంతోషించాం. కానీ గండి చెరువును అభివృద్ధి చేస్తున్న కాంట్రాక్టర్లు ఆ ఆశలకు గండి కొట్టారు. అభివద్ధి పేరుతో గండి పెట్టి నీటిని తరలించడంతో చేప పిల్లలన్నీ కొట్టుకుపోయాయి. 4 నెలలు ఆగితే అవి పెరిగి మా బతుకులు బాగుపడేవి. – పల్లెపాటి రాంనర్సయ్య, మత్స్యకారుడు, యాదగిరిగుట్ట చేపల మార్కెట్లు లేక నష్టపోతున్నాం పాలేరు చెరువుపై వందలాది మంది మత్స్యకారులం బతుకుతున్నాం. ఏటా 250 టన్నుల చేపలు పడుతుంటాం. మాకు మార్కెట్లు లేక ఉన్న చేపంతా ఒక్క రోజే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. నాయకన్‌గూడెం, పాలేరుల్లో చేపల మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తే చేపలను మంచి ధరకు అమ్ముకోగలుగుతాం. జనానికీ ఎక్కువ రోజులు చేపలను అందుబాటులో ఉంచగలుగుతాం. – దేశబోయిన ఏడుకొండలు, మత్స్య సొసైటీ కార్యదర్శి చేపల ఉత్పత్తి పెరిగింది.. ఈసారి నాగార్జున సాగర్‌తో పాటు చెరువుల్లోకీ నీరు రావడంతో చేపల పెంపకం ఆశాజనకంగా ఉంది. మిషన్ కాకతీయతో చెరువుల్లోనూ నీరు నిల్వ ఉండటం చేపల ఉత్పత్తి, పెంపకానికి దోహదపడింది. దిగుబడి గతేడాది 8 వేల టన్నులు మించలేదు. ఈసారి 12 వేల టన్నులొచ్చింది. రిజర్వాయర్‌లో పోసిన చేపలు కిలోన్నర దాకా, పంచాయతీ చెరువుల్లోని చేపలు ముప్పావు కిలో దాకా పెరిగాయి. – హన్మంతరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం -
చేపలు.. చేదు నిజాలు!
కొరమేను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్యా.. అంటూ అమ్మాయిని అభివర్ణించాడు ఒక సినీ కవి. ∙∙ ఒరేయ్ ఆడు బొమ్మిడాయిలా జారిపోతాడు. జాగ్రత్తగా పట్టుకోండి.. అంటూ గ్రామీణ ప్రాంతాల్లో కూతకొచ్చిన కబడ్డీ ఆటగాడిని ఉద్దేశించి ప్రత్యర్ధి టీమ్ సభ్యులు అప్రమత్తమవుతుంటారు. ∙∙ ఏంట్రా మట్టగిడసలా కొట్టుకుంటున్నావ్ అంటూ పల్లెల్లో స్నేహితుల మధ్య తగువులు వచ్చినప్పుడు పరస్పరం హెచ్చరించుకుంటారు. సాక్షి, అమరావతి: ... సరదాగా ఆటపట్టించినా.. కోపంతో హెచ్చరించినా.. ప్రేమతో పలకరించినా.. ఆట, మాట, పాటల్లో చేపల ప్రస్తావన వస్తుంటుంది. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు.. పైన పేర్కొన్న కొరమేను, బొమ్మిడాయి, మట్టగిడసలతోపాటు గురక, ఇంగిలాయి, జెల్ల వంటి నల్లజాతి చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా కొల్లేరులోను ఒకప్పుడు కిలకలలాడిన ఈ చేపలు ప్రతికూల పరిస్థితులను ఈదలేక అంతరించే దశకు చేరుకోవడం బాధాకరం. బొమ్మిడాయి బతకనంటోంది.. చేపల్లో బొమ్మిడాయి పులుసుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాలువలు, ఏరులు, నదుల్లో బాగా లభ్యమయ్యేవి. గోదావరి జిల్లాల వాసులు బొమ్మిడాయి కూరతో రాజకీయ నాయకులు, అధికారులతో ఏ పని అయినా చేయించుకునే వారని చెబుతారు. అటువంటి బొమ్మిడాయి ఇప్పుడు అరకొరగా దొరకుతుండడంతో మార్కెట్లో ఖరీదైన చేపల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు సామాన్యుడి కూరకు దొరికిన ఈ చేప ఇప్పుడు ప్రముఖ హోటళ్లలో ప్రత్యేక వంటకంగా మారిపోయింది. గురకకు గడ్డుకాలమే.. పల్లెటూరులోని కాలువలు, పంటబోదెల్లో ఒకప్పుడు గుట్టలుగుట్టలుగా దొరికిన గురకలు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ముళ్లులాంటి పొలుసు, ప్రత్యేక శరీర నిర్మాణంతో ఉండే గురకలు వర్షాకాలం వస్తే నీటిలోని మొక్కలపైకి కూడా ఎగబాకగలవు. నారుమడుల్లోనూ ఇవి బాగా దొరికేవి. కూలి పనులకు వెళ్లిన పేదలు దోసిళ్లతో గురకలను పట్టుకుని క్యారేజీల్లో ఇంటికి తెచ్చుకుని తినేవారు. పంటలకు రసాయన ఎరువుల వాడకం మితిమీరిపోవడంతో వీటి ఉనికి కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది. కొరమేనుకు కష్టకాలం.. సహజ సిద్ధంగా పెరిగే నల్లజాతి చేపల్లో కొరమేను అంటే మాంసాహార ప్రియులకు చాలా మక్కువ. వీటిని తింటే గుండెకు మేలు జరగడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తుంటారు. ఇప్పుడు ఆ కొరమేనుకు పెద్ద కష్టమొచ్చిపడింది. కాలువలు, సహజసిద్ధమైన చెరువుల్లో నీటి అడుగున బతికే కొరమేను చేపలు నీటి కాలుష్యం దెబ్బకు చనిపోతున్నాయి. కొరమేను జాతి చేపలు దాదాపు 90 శాతం అంతరించాయి. కేవలం 10 శాతం మాత్రమే మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. మరుగున పడుతున్న మార్పు వాతావరణంలో వస్తున్న మార్పులతో మనుగడ సాగించలేక ‘మార్పు’ చేపలు కనుమరుగవుతున్నాయి. ఈ జాతి అంతరించే దశకు చేరడంతో దీనిని పరిరక్షించేందుకు శాస్త్రవేత్తలు ప్రాజెక్టును నెలకొల్పి కృషిచేస్తున్నారు. నోటి వద్ద పెద్ద మీసాలు ఉండే ఈ చేపలకు శరీరంలో ముళ్లు ఉండవు. రబ్బరు మాదిరిగా మెత్తగా ఉండే ఈ చేపలను మాంసాహారులు ఇష్టపడతారు. ఇవి వాగుల్లో ఎక్కువగా దొరుకుతాయి. మట్టగిడస కొట్టుమిట్టాడుతోంది.. కొరమేనును పోలి ఉండే మట్టగిడసకు మంచి డిమాండ్ ఉండేది. కొరమేను కంటే కాస్త పొట్టిగా ఉంటుంది. మట్టగిడస పులుసును మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుని మరీ తింటారు. గతంలో నీటి వనరులు ఉన్న ప్రతీచోటా ఇవి విరివిగా దొరికేవి. ఇప్పుడు ఈ చేపలను కొని చెరువుల్లో పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగిలాయి ఈదలేనంటోంది.. కృష్ణా–పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించిన కొల్లేరులో ఇంగిలాయి రకం ఒకప్పుడు బాగా దొరికేది. ఈ చేపలు లేత పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. తలపై ఉండే ముల్లుతో తనను రక్షించుకుంటుంది. పట్టుకునే ప్రయత్నం చేసినా.. ఆహారంగా తినేందుకు పాములు ప్రయత్నించినా తలపై ఉన్న ముల్లుతో కుట్టి తప్పించుకుంటుంది. కోల్‌కత వంటి నగరాల్లో ఈ చేపల నుంచి ఔషధాలను తయారుచేస్తుంటారు. కొల్లేరులో మావులతో వీటిని వేటాడుతుంటారు. పరిశ్రమలు, డ్రెయిన్ల వ్యర్థాలు చేరడంతో కొల్లేరులో ఇవి కనుమరుగవుతున్నాయి. భావితరాలకు అందించాలంటే.. సహజ సిద్ధంగా పెరిగి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటున్న నల్లజాతి చేపలను భావితరాలకు అందించాలంటే వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం.. ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. అంతరించే దశకు చేరిన చేపల సంతతిని పెంపొందించేలా ప్రత్యేక హేచరీస్, ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలి. మత్స్య పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)ల పర్యవేక్షణలోని శాస్త్రవేత్తలను ఉపయోగించుకుని నల్లజాతి చేపల పరిరక్షణ, ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలి. అంతరించిపోతున్న చేపల మనుగడ కోసం జలకాలుష్యాన్ని నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మత్స్య సంపదకు చేటు తెస్తున్నవి ఇవే.. ఒకనాడు స్వచ్ఛంగా ఉండే జలవనరులు ఇప్పుడు తీవ్ర కాలుష్యం బారిన పడుతున్నాయి.. పరిశ్రమల వ్యర్థాలు (మోలాసిస్)లను శుద్ధి చేయకుండా నేరుగా కాలువలు, డ్రెయిన్లలోకి వదిలేయడం.. విచ్చలవిడిగా తవ్విన చెరువుల్లో చేపలకు రసాయన మందులు, మేత, మృత కళేబరాలు వేస్తున్నారు. చెరువుల్లో రోజుల తరబడి అవి నిల్వ ఉండడంతో నీరు కలుషితమవుతోంది. ఆ నీటిని నేరుగా కాలువలు, డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారు. వరి చేలల్లో ఎరువులు, పురుగుమందులు చల్లి ఆ నీటిని నేరుగా కాలువల్లోకి వదిలేయడం. వర్షాభావ పరిస్థితుల్లో సముద్రం నీరు డ్రెయిన్ల ద్వారా నేరుగా చొచ్చుకురావడంతో భూమిలో ఉప్పునీటి సాంద్రత పెరుగుతోంది. దీంతో మంచినీటి చెరువుల్లోను, కాలువల్లోను పెరిగే చేపలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. -
పాలేరు జలాశయంలో చేపపిల్లల విడుదల
ఖమ్మం : మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ బుధవారం ఉదయం పాలేరు జలాశయంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 70 కోట్ల చేపపిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ వర్తింపచేస్తామన్నారు. ప్రతి గొర్రె పిల్లకు బీమా సదుపాయం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు గొర్రెల పంపిణీని విమర్శించడం విడ్డూరమని కోపోద్రిక్తులయ్యారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంచార వైద్యశాలలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని తెలిపారు. -
చేపల చెరువులో విషం
- భారీగా నష్టం రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాలలో దారుణం వెలుగుచూసింది. గ్రామ శివారులోని ఓ చేపల చెరువులో గుర్తుతెలియని దుండగులు రసాయన పదార్థాలు కలిపారు. దీంతో చెరువులోని చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు కోటి రూపాయల విలువైన చేపలు మృతి చెందినట్లు మత్యకారులు తెలిపారు. ఇంత జరిగినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదంటూ వారు వాపోతున్నారు. -
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
-
చేత్తో చేపలు పట్టేస్తున్నాడు!
ఎప్పుడైనా సరదాగా చేపలు పట్టాలంటే ఏం చేస్తాం?. ఓ గాలం దానికి ఏర ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని వేటకు బయల్దేరుతాం. కానీ, అమెరికాలోని అలబామాలో నివసిస్తున్న రాబర్ట్ మాత్రం ఒట్టి చేతులతో చేపల వేటకు బయల్దేరతాడు. చిన్న చేపను ఎరగా చూపి పెద్ద చేపను పట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. చిన్న చేపను ఎరగా చూపిన రాబర్ట్.. పెద్ద చేప దాన్ని తినడానికి నోరు తెరిచింది. అంతే తన వేళ్లతో చేపను గట్టిగా పట్టుకుని బయటకు తెచ్చేశాడు రాబర్ట్. ఆ తర్వాత మళ్లీ దాన్ని తిరిగి నీటిలోకి వదిలేశాడు. మరి చేపలను చేతితో పట్టే టెక్నిక్ మీరు కూడా చూసేయండి. -
మీనం.. ధర హీనం
15 రోజుల్లో కేజీకి రూ.14 తగ్గుదల పెద్ద నోట్ల రద్దుతో మందగించిన ఎగుమతులు పట్టుబడులు నిలిపేసిన రైతులు భీమవరం అర్బన్ : కొంతకాలంగా స్థిరంగా ఉన్న చేపల ధరపై పెద్ద నోట్లు రద్దు ప్రభావం పడింది. దీంతో రెండు వారాలుగా చేపల ధరలు పతనమవుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో కేజీకి రూ.14 మేర ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. పట్టుబడుల వేళ ధర పతనంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చాలామంది రైతులు పట్టుబడులను నిలిపేశారు. అయితే ఎక్కువ కాలం ఆగే పరిస్థితి లేదని, మేత ఖర్చు పెరిగిపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తే అసలుకే మోసం వస్తుందని వారు వాపోతున్నారు. పెద్దనోట్ల రద్దుతో మందగించిన ఎగుమతులు భీమవరం మండలంలోని వెంప, పెదగరువు, శ్రీరామపురం, గూట్లపాడు, ఈలంపూడి, దెయ్యాలతిప్ప, రామాయణపురం, కొత్తపూసలమర్రు, కొమరాడ, ఎల్‌వీఎన్‌పురం, గొల్లవానితిప్ప, దొంగపిండి, లోసరి తదితర గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో చేపలు, 4 వేల ఎకరాల్లో వనామీ రొయ్యలు సాగు చేస్తున్నారు. ఉప్పుటేరు, బొండాడ డ్రెయిన్, మందచేడు, కోటిమొగ డ్రెయిన్లను ఆనుకుని ఎక్కువగా శిలావతి, కట్ల, రూప్‌చంద్, ఫంగస్, గడ్డి చేప, జాడిమోస్ వంటి సప్పనీటి చేపలను పెంచుతున్నారు. భీమవరం కేంద్రంగా నిత్యం సుమారు 700 టన్నులు కోల్‌కతా, పాట్నా, తిరువిడి, ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. అయితే నెలన్నర క్రితం పెద్దనోట్లు రద్దు చేయడంతో క్రమేపీ ఎగుమతులు మందగిస్తూ వచ్చాయి. నగదు కష్టాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. 15 రోజుల క్రితం శిలావతి కేజీ మార్కెట్లో రూ.104 ఉంటే ప్రస్తుతం రూ.90 పలుకుతోంది. రెండు కేజీల కట్ల చేప 103 నుంచి రూ.91కి, ఫంగస్ రూ.62 నుంచి రూ.56కి పడిపోయింది. రూప్‌చంద్ పదిరోజుల కిందట కేజీ రూ.90 ఉంఽడగా నేడు రూ.60 పలుకుతోంది.గడ్డిచేప రూ.70, జాడీమోస్ రూ.65 పలుకుతున్నాయి. నిలిచిన పట్టుబడులు చేప ధర ఒక్కసారిగా తగ్గడంతో పట్టుబడులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పట్టుబడికి వచ్చిన చేపలను మేపేందుకు భారీ పెట్టుబడులు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిలావతి, కట్ల, రూప్‌చంద్, ఫంగస్ చేపలకు పెట్టే మేతను బట్టి 7 నెలలు లోపు పట్టుబడికి రావాల్సి ఉంది. అయితే కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల కారణంగా చేప ఎదుగుదల మందగించింది. దీంతో రైతులకు ఖర్చు అధికమైంది. కుదేలైన కౌలు రైతులు చేపల ధర పతనంతో కౌలు రైతులు కుదేలయ్యారు. చెరువును బట్టి ఒక్కో ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు ఉంది. ఈ ఏడాది చేపల మేతల ధర విపరీతంగా పెరగడం, పట్టుబడి వేళ ధర పతనం కావడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. -
20లోగా చేప పిల్లల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20లోగా పూర్తి చేయాలని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి బుధవారం జిల్లాస్థాయి మత్స్యశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్, మత్స్యశాఖ అధికారులు, ఆయా జిల్లాల సహకార సంఘాల కమిటీ సభ్యులు కాన్ఫరెన్సలో పాల్గొన్నారు. పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు మంత్రితోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 4,318 చెరువులు, రిజర్వాయర్లలో 30 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 60 శాతం లక్ష్యం నెరవేరిందన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన అధికారులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లోని చెరువులలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. యాదాద్రి, నల్లగొండ, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో చేపపిల్లలు వదిలే కార్యక్రమం పూర్తకావడంతో అక్కడి అధికారులను మంత్రి అభినందించారు. నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ కార్యక్రమం నత్తనడకగా సాగుతోందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకార సొసైటీల సభ్యులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. -
నాగాయలంకలో నెదర్లాండ్, ఆస్ట్రేలియా విద్యార్థులు
నాగాయలంక : నెదర్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన విద్యార్థులు ఆదివారం సాయంత్రం నాగాయలంకను సందర్శించారు. ఆయా దేశాల్లో పదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులు నదీ పరిశీలన కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్‌లో వారం రోజుల నుంచి సొంతగా తయారు చేసిన నాలుగు పడవలను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి నదిలో విహరించారు. ఈ బోటులో పయనిస్తూ అలల తాకిడి, గాలుల తీవ్రత, నదిలో మత్స్య సంపదను పరిశీలించారు. అనంతరం ప్రత్యేక బోటులో లైట్‌హౌస్, మడ అడవుల పరిశీలన కోసం వెళ్లారు. చల్లపల్లి ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్ (లంకబాబు), ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, కో–ఆర్డినేటర్లు నరేంద్ర, శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
వీధుల్లో చేపల వేట
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాలతో జలమయమైన కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. శ్రీరామలింగేశ్వర కాలనీలో వరద నీటిలో కాంగ్రెస్‌నేతలు స్థానికులతో కలిసి చేపలు పట్టి నిరసన తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం కనీస చర్యలు తీసుకోలేదని మాజీ ఎంఎల్ఏ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నగర ప్రజలు చెల్లిస్తున్న పన్నులను ఇతర అవసరాలకు వినియోగిస్తూ ప్రజా సమస్యలను విస్మరించారని ఆరోపించారు. -
మల్లన్న మంటలు
-
వావ్ నగరంలోనే..
ఇటీవల కురిసిన వర్షాలకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పక్కన ఉన్న మేడికుంటలో నీళ్లు చేరాయి. దీంతో అక్కడ చేపలను పట్టే వారిలో ఆనందం కనిపిస్తోంది. గురువారం ఓ యువకుడు ఉత్సాహంగా వల వేస్తూ... చేపలు పట్టుకునే యత్నం చేశాడు. -
‘గోదావరి’లో బలిసిన చేప
తూర్పుగోదావరి : చెరువుల్లో పెరిగే చేపలు 10 కేజీల బరువు పెరగడమే అరుదు. అలాంటిది తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని రక్షిత మంచినీటి పథకం చెరువులో అనేక చేపలు.. వస్తాదుల్లా ‘ఒళ్లు’ చేసి అంతకు రెట్టింపు బరువు తూగారుు. వాటిలో ఒకటైతే ఏకంగా 25 కేజీల బరువుంది. చెరువులో చేపలు పట్టుకునే అవకాశాన్ని వేలం పాటలో రూ.17 వేలకు దక్కించుకున్న వ్యక్తి బుధవారం చేపలు పట్టించగా.. చెరువు ఆయన పాలిట ‘సిరుల నెలవు’గా మారింది. చేపలు పుష్కలంగా ఉండటంతో పాటు భారీ సైజులో ఉండడంతో.. అమ్మకాల ద్వారా ‘రూ.లక్షలు’ వచ్చినట్టు అంచనా. - ఐ.పోలవరం -
చేపలు మనుషులను గుర్తుపడతాయి..
లండన్: చేపలు మనుషుల ముఖాన్ని కచ్చితత్వంతో గుర్తు పట్టగలవని తేలింది. మనుషుల ముఖాలన్నీ ప్రాథమికంగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయనీ, అయినా ఆశ్చర్యకరంగా చేపలు వివిధ వ్యక్తుల ముఖాల మధ్య తేడాలను గుర్తించాయని అధ్యయనం జరిపిన క్వీన్స్లాండ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ మెదడులో మనుషులను గుర్తించే ప్రాంతం చిన్న జంతువుల్లో కూడా ఉంటుందో లేదో తాము పరీక్షించామన్నారు. చేపలు 44 వరకు ముఖాల మధ్య తేడాలను గుర్తించాయన్నారు. -
చేపా..చేప ఎందుకు రాలేదు?
గడువు దాటి 7 నెలలు గడుస్తున్నా అరణియార్ ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదలని వైనం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యం ఉపాధి కోల్పోరుు వీధిన పడుతున్న మత్స్యకార్మిక కుటుంబాలు జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ అరణియార్‌లో నిండా నీరున్నా అధికారుల నిర్లక్ష్యం వుత్స్యకారులకు శాపంగా మారింది. దశాబ్దాల తర్వాత గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. గడువు దాటి 8 నెలలు గడుస్తున్నా చేప పిల్లలను వదలక పోవడంతో 2వేల మందికి పైగా లెసైన్స్డ్ మత్స్యకారులు బతుకుదెరువు కోల్పోతున్నారు. రిజర్వాయుర్‌లో పది అడుగులు నీరున్నా ఏటా అక్టోబర్‌లో 10 లక్షల చేపపిల్లలు వదిలేవారని, పుష్కలంగా నీరున్నా ఎందుకు వదలడం లేదోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చాటూరు:అరణియూర్ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వుత్స్యశాఖ బోర్డు అధ్వర్యంలో ఏటా అక్టోబర్‌లో బయట నుంచి చేపపిల్లలు తెచ్చి రిజర్వాయుర్‌లో వదులుతున్నారు. పదేళ్లుగా ఏ టా కనీసం 10 లక్షలు చేపపిల్లలు వదులుతున్నారు. అవి పెరిగి పెద్దదైతే వా టిని పట్టి అమ్ముకుంటూ మత్సకార్మికుల కుటుంబాలు జీవనం సాగించేవి. ఇందుకోసం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారు 2 వేల వుంది మత్స్యకార్మికులు రిజర్వాయుర్‌లో చేపలు పట్టేందుకు ప్రభుత్వం నుంచి లెసైన్సులు సైతం పొంది ఉన్నా రు. దశాబ్దాల తరువాత అరణియార్ రిజర్వాయర్ గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థారుులో నిండింది. ఈ నీటిలో ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేస్తే సువూరు రెండేళ్ల వరకు తవు జీవనోపాధికి కొదవ ఉండదని మత్స్యకార్మికులు సంబరపడ్డారు. కానీ గత ఏడాది అక్టోబర్‌లో వదలాల్సిన చేపపిల్లలను ప్రభుత్వం ఇంతవరకు వదల లేదు. తామ బతుకు తెరువును కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు.. రిజర్వాయుర్‌లో చేపపిల్లలు వదలడానికి గడువుదాటి ఏడు నెలలు కావస్తున్నా మత్స్యశాఖ అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని మత్స్యకార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయుర్‌లో చేపపిల్లలు వదలాల్సిందిగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పో తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బోర్డు అధికారులను వివరణ కోరగా, తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. అధికారులు స్పందించాలి.. రిజర్వాయుర్‌లో చేపపిల్లలను వదలాలి. లేదంటే మాకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే దారిలేదు. ఆరు నెలలుగా రిజర్వాయర్‌లో చేపలు దొరకడం లేదు. రోజూ చేపల వేటకు వెళ్లడం వల్ల మాకు కష్టం తప్ప ఇంకేమి మిగలడం లేదు. -కె.బాబు రెడ్డి, వుత్స్యకార్మికుడు, పిచ్చాటూరు కుటుంబాలు వీధినపడుతున్నాయి... రిజర్వాయర్‌లో చేపలు పడక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రిజర్వాయర్‌లో కనీసం 10 అడుగు లు నీరు ఉన్నప్పుడు కూడా పది లక్షల చేపపిల్లలు వదిలేవారు. ఈసారి చేప పిల్లలను ఎందుకు వదలడం లేదో అంతుపట్టడం లేదు. పూట గడవటం కష్టంగా ఉంది. -రాఘవరెడ్డి, మత్స్యకార్మికుడు కీళపూడి -
ఎండ తీవ్రతకు రెండు టన్నుల చేపలు మృతి
కేసముద్రం(వరంగల్ జిల్లా): ఎండతీవ్రతకు వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో రెండు టన్నుల చేపలు చనిపోయాయి. గ్రామానికి చెందిన మంగి ఉప్పలయ్య చెరువును లీజుకు తీసుకుని 4.50 లక్షల చేప పిల్లలను తెచ్చి చెరువులో పోశాడు. ఇటీవల ఎండల తీవ్రతకు చెరువులో నీళ్లు అడుగంటాయి. ఇప్పటివరకు లీజు దారుడు కేవలం రూ.30 వేల విలువైన చేపలను మాత్రమే పట్టి అమ్మాడు. తీరా ఎండతీవ్రత ఎక్కువకావడంతో, చేపలన్నీ నీళ్ల వేడిమికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. ఒక్కరోజులోనే సుమారు రెండు టన్నుల చేపలు మృతిచెందాయని వీటి విలువ రూ.2లక్షలు ఉంటుందని ఉప్పలయ్య వాపోయాడు. -
చేపల చెరువులో విషం
వంగర (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరపాడు గ్రామంలోని బారికబంద చెరువులో గుర్తుతెలియని దుండగులు విషం కలిపారు. దీంతో గురువారం చెరువులో ఉన్న చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్న స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. -
చేపలు పట్టే యత్నంలో వ్యక్తి గల్లంతు
ఆగిరిపల్లి: చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ కాలు జారడంతో వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంతెని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆగిరిపల్లి గ్రామానికి చెందిన బోనం కొండయ్య (40) చేపలు పట్టేందుకు ఆదివారం వాగు దగ్గరకు వెళ్లాడు. వల విసిరే క్రమంలో కాలు జారి వాగులో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు. -
ఆకాశం నుంచి రాలిన చేపలు..
విజయవాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ శివారు రామవరప్పాడులో ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి. పిన్నమనేని హైట్ అపార్టుమెంట్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నిద్ర లేచేసరికి బతికే ఉన్న చిన్న చిన్న చేపలు పరిసరాల్లో పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి చేపలు పడి ఉంటాయని భావిస్తున్నారు. స్థానికులు వాటిని ఏరుకున్నారు. గతంలోనూ కృష్ణాజిల్లాలో ఆకాశం నుంచి చేపలు రాలిపడిన విషయం తెలిసిందే. -
ఒత్తిడి ఫినిష్..
-
చేపపిల్లల్ని వదిలిన మంత్రి
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఆదివారం నాడు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపపిల్లల్ని వదిలారు. ఈ ప్రాజెక్టులో 2.2 లక్షల చేపపిల్లల్ని వదలడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించినట్లు అవుతుందన్నారు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్య కారులను, రైతులను ఆదుకుంటామని మంత్రి పోచారం అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను త్వరితగతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఓ పావు కిలో చేపలు ఇవ్వు బాబూ!
ఈక్వెడార్‌లోని శాంతా క్రజ్ ద్వీపం.. కొలంబియాకు చెందిన ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్ కాస్ట్రో సముద్ర తీరం వద్ద తిరుగుతూ ఫొటోలు తీసుకుంటున్నాడు. అంతలో అతడు ఎన్నడూ ఊహించని దృశ్యం కనిపించింది.. ఒక సీలయన్ సముద్రంనుంచి బయటకొచ్చి.. తీరానికి సమీపంలో ఉన్న చేపలు అమ్మే దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే దుకాణం రష్‌గా ఉంది. చాలా మంది తమ వంతు కోసం వేచిఉన్నారు. ఆ సీలయన్ కూడా ఓపిగ్గా క్యూ కట్టింది. దాదాపు గంటపాటు తమ వంతు కోసం వేచి చూసింది. చివరకు తన వంతు రాగానే.. చేపలమ్మే వ్యక్తి వేసిన ముక్కలు నోట కరుచుకుని, లొట్టలేస్తూ.. తాపీగా సముద్రంలోకి తిరిగి వెళ్లిపోయింది. కాస్ట్రోకు ఇది కొత్త విషయం గానీ.. అక్కడోళ్లకు కామన్ అట. ఆ సీలయన్ తరచూ ఇలా వస్తుందట. వీళ్లు కూడా దాన్నేమీ అనరు. తాకడానికి ప్రయత్నించరు. దీంతో అది కూడా మనుషులంటే భయపడకుండా ఎంచక్కా వచ్చేస్తుందట. -
చేపలు బట్టలుతుకుతాయి..
నిజం.. ఈ వాషింగ్మెషీన్లో చేపలే బట్టలుతుకుతాయి. అయితే.. అవి రోబో చేపలు. ఇప్పుడు చాలా మల్టీప్లెక్స్‌లలో మృత శరీర కణాలను తినే డాక్టర్ ఫిష్‌లతో కూడిన తొట్టెలు పెడుతున్నారు. వాటిలో మనం కాళ్లు పెడితే.. ఆ చేపలు వచ్చి.. కాళ్ల వద్ద ఉన్న మృత శరీర క ణాలను తినేస్తాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకునే దక్షిణ కొరియాకు చెందిన చాంగ్ జియాంగ్ ‘పెసెరా’ అనే ఈ వాషింగ్ మెషీన్ డిజైన్‌ను రూపొందించారు. ఇందులో డిటర్జెంట్ అవసరముండదు. మామూలు వాషింగ్ మెషీన్ తిరిగినట్లే తిరుగుతుంది. అయితే.. బట్టల్లోని మురికిని ఇందులోని రోబో చేపలు తినేస్తాయి. రోబో చేపల ముందు భాగంలో ఉండే కెమెరా మురికిని గుర్తిస్తుంది. దీంతో రోబో చేప అక్కడికి చేరి.. పనికానిచ్చేస్తుంది. పైగా.. ఇది అక్వేరియం తరహాలో ఉండటంతో హాలులో అలంకరణ సామగ్రిగానూ పనిచేస్తుంది. అంతేకాదు.. సున్నితమైన శరీర స్వభావం ఉన్నవారికి డిటర్జెంట్లు పడకపోవడం వల్ల దద్దుర్లు రావడం వంటివి జరుగుతుంది. ఈ వాషింగ్ మెషీన్‌తో ఆ సమస్య ఉండదు. -
ఉపాధికి వేదిక... ఆక్వాకల్చర్
అప్‌కమింగ్ కెరీర్: ఆక్వా కల్చర్ అంటే కేవలం చేపలు, రొయ్యల పెంపకమే కాదు. ఔషధాల తయారీకి ఉపయోగించే ఒకరకమైన నాచును, మొక్కలను చెరువుల్లో పెంచడాన్ని కూడా ఆక్వాకల్చర్గా పరిగణిస్తున్నారు. చేపలు, రొయ్యల సాగును కెరీర్‌గా ఎంచుకుంటే మెరుగైన భవిష్యత్తుకు, ఆకర్షణీయమైన ఆదాయానికి ఢోకా ఉండదని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ రైతులతోపాటు ఉన్నత చదువులు చదువుకున్న ఆధునిక యువత సైతం ఇటీవల ఆక్వా రంగంలోకి ప్రవేశించి, విజయవంతంగా ముందుకు సాగుతుండడం గమనార్హం. అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ఏదైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్ఎస్)లో ప్రవేశం పొందొచ్చు. వేతనాలు: పనిచేస్తున్న సంస్థ పరిధిని బట్టి వేతనాలు మారుతుంటాయి. సాధారణంగా ఆక్వా నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పోలిస్తే ఆక్వా రంగంలో అధిక ఆదాయం ఉంటుంది. ఆక్వాకల్చర్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్-ముంబై వెబ్సైట్: http://www.cife.edu.in/ 2. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్-భువనేశ్వర్ వెబ్సైట్: http://www.cifa.in/web/ 3. రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్-తమిళనాడు వెబ్సైట్: http://www.rgca.org.in/ 4. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్-కేరళ వెబ్సైట్: http://www.kufos.ac.in/ 5. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.ignou.ac.in/ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు ‘‘అగ్రికల్చర్, అక్వాకల్చర్ వంటి కోర్సులు చేసిన వారికి ఉద్యోగాల పరంగా ఢోకా ఉండదు. ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగింది. బహుళ జాతి కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అక్వాకల్చర్ కోర్సును పూర్తిచేసి.. సబ్జెక్టుపై ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచుకుంటే నెలకు రూ.40 వేలకు తక్కువ కాకుండా వేతనం సంపాదించే వీలుంది. ప్రభుత్వ రంగంలోనూ మంచి అవకాశాలున్నాయి’’. - పి.హరి, మత్స్యశాఖ ఉద్యోగి, ముంబై -
తింటే ఫినిష్
చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఇది డాక్టర్లు చెప్పే మాట క్యాట్‌ఫిష్ తింటే ఆరోగ్యానికి ముప్పు... ఇదీ డాక్టర్లు చెప్పే మాటే క్యాట్‌ఫిష్... కోళ్ల వ్యర్థాలు.. ఇంకా చెప్పాలంటే జంతు కళేబరాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.. వీటి శరీరంలో సీసంతో పాటు అనేక విషరసాయనాలు ఉంటాయి.. వీటి పెంపకం, విక్రయాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగడంతో చేపల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరు టౌన్ : అవి సాధారణ చేపలు కాదు. రక్త మాంసాలు తిని అనతి కాలంలోనే చాలా బరువు పెరిగే క్యాట్‌ఫిష్‌లు. వీటి పెంపకం, విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేదాజ్ఞలను అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా క్యాట్ ఫిష్‌లను పెంచే చెరువులు వెలిశాయి. క్యాట్ ఫిష్‌లతో పాటు వాటి ఆహారంగా తీసుకెళుతున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ క మిషనర్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరు పట్టణం గాంధీరోడ్డులోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట వ్యాపారులు ప్రతి రోజు వివిధ రకాల చేపలను విక్రయిస్తుంటారు. కిలో రూ.100- రూ.200 వరకు విక్రయించే ఈ చేపలకు గిరాకీ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసి అక్కడ క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే ఈ చేపల పెంపకానికి ఎలాంటి ఖర్చు లేకుండా చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తుంటారు. కళేబరాలను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దుర్గంధం వెదజల్లే మురికి నీటిలో ఇవి పెరుగుతాయి. గాంధీరోడ్డులోని ఓ చికెన్ దుకాణం ముందు కొద్దిరోజుల క్రితం వాహనంలోని డబ్బాలలో చికెన్ వ్యర్థాలను నింపుతున్న విషయాన్ని గమనించి ‘సాక్షి’ ఆరా తీసింది. చేపలకు ఆహారంగా వేసేందుకు తీసుకెళుతున్నట్లు వాహన డ్రైవర్ తెలిపాడు. క్యాట్‌ఫిష్‌ల కోసమే ఈ వ్యర్థాలను తీసుకెళుతున్నట్లు తెలియవచ్చింది. కమిషనర్‌కు సమాచారంతో దాడులు... గాంధీరోడ్డులో, విజయ్‌కుమార్ థియేటర్ వద్ద క్యాట్‌ఫిష్ విక్రయిస్తున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణకు ఆదివారం సమాచారం అందిచారు. దీంతో కమిషనర్ వెంటనే అక్కడికి వచ్చి చేపలు విక్రయిస్తున్న వారిని ఆరా తీశారు. డబ్బాల్లో బతికి ఉన్న క్యాట్‌ఫిష్‌లను కమిషనర్ చూసి వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు పెట్టాలని జేసీ ఆదేశించారు. వ్యర్థాలను తీసుకెళ్లే వాహనం పోలీసులకు అప్పగింత... ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ02 ఎక్స్ 5784 నెంబర్ గల టాటా వాహనం గాంధీరోడ్డులోని చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను తీసుకెళుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి తిరిగి కమిషనర్‌కు సమాచారం ఇచ్చారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డు, బీజీఆర్ కాంప్లెక్స్ రోడ్డుల్లో ఉన్న చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను వాహనంలో వేస్తుండగా శానిటరీ ఇన్స్పెక్టర్ సింగ్, మేస్త్రీ మత్తేసు, మున్సిపల్ సిబ్బంది డ్రైవర్‌ను ప్రశ్నించారు. వాహనాన్ని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ప్రాణాంతకం : ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాట్ ఫిష్‌లు ప్రాణాంతకరమైనవని, వీటిని తిని అనారోగ్యం పాలు కావద్దని ఫిషరిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రెడ్డయ్య తెలిపారు. వీటి వల్ల జలకాలుష్యం ఏర్పడటంతో ఇతర జల చరాలు ఏవీ ఆ నీటిలో బతకవన్నారు. వీటి శరీరంలో సీసంతో సహా అనేక విష రసాయనాలు ఉంటాయన్నారు. నీరు లేకున్నా గంటల తరబడి బతికి ఉండే చేప క్యాట్‌ఫిష్ ఒక్కటేనన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగడం వల్ల వీటిని అక్రమంగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. క్యాట్‌ఫిష్‌ల పెంపకం, అమ్మకంపై ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. వీటిని తినడం వల్ల క్యాన్సర్, కిడ్నీ తదితర ప్రాణాంతకర వ్యాధులు వస్తాయన్నారు. ఎక్కడైనా వీటిని విక్రయిస్తుంటే తమకు సమాచారం అందించాలన్నారు. కోళ్ల వ్యర్థాలతో క్యాట్ ఫిష్ పెంపకం క్యాట్ ఫిష్‌ల పెంపకంపై నిషేదాజ్ఞలు ఉన్నా కొందరు వ్యాపారులు వాటిని అక్రమంగా పెంచుతున్నారు. కోళ్ల వ్యర్థాలే కాక జీవాల కళేబరాలను కూడా వాటికి ఆహారంగా అందిస్తుంటారు. ప్రొద్దుటూరులో దాదాపు 100కు పైగా కోళ్ల మాంసం అమ్మే వ్యాపారులు ఉన్నారు. పెద్ద ఎత్తున కోళ్లను కోసి మాంసం విక్రయిస్తుంటారు. కోళ్లను కోయగా వచ్చే వ్యర్థాలను పారేస్తుంటారు. అయితే జమ్మలమడుగు ప్రాంతం నుంచి వచ్చే వాహనాలలో వ్యర్థాలను తీసుకెళుతుండటం పలు అనుమానాలకు తావిచ్చింది. క్యాట్‌ఫిష్‌లకు ఆహారంగా వేసేందుకే వ్యర్థాలను తీసుకెళుతున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. పతి రోజు ప్రొద్దుటూరుకు రెండు ప్రత్యేక వాహనాలు వస్తాయి. వాటిలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. వ్యర్థాలను వాటిలో వేసి తీసుకెళుతుంటారు. జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో అక్రమంగా పెంచుతున్న క్యాట్‌ఫిష్‌లకు వీటిని ఆహారంగా వేస్తుంటారు. క్యాట్ ఫిష్‌లను తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబతున్నారు. ఈ చేపలు కళేబరాలు, కోళ్ల వ్యర్థాలను తిని జీవిస్తాయన్నారు. ఒక విధంగా ఇవి విషంతో సమానమని చెబుతున్నారు. -
మీనం మాయం
-
మత్స్య మాయ
సొరంగంలా ఏర్పడిన వేలాది చేపల మధ్య నుంచి దూసుకుపోతున్న సీ లయన్ ఫొటో.. అద్భుతంగా ఉంది కదూ.. ఈ అందమైన ఫొటో వెనుక ఆ వేలాది చేపల జీవన్మరణ సమస్య దాగుని ఉందట. ఈ చేపలు వేలాదిగా ఒకదాని వెంట ఒకటి గుంపుగా సంచరిస్తుంటాయి. తమను తినేయడానికి వచ్చే భారీ చేపలు, సీ లయన్లాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి అప్పటికప్పుడు ఇలా రకరకాల ఆకారాల్లో మారిపోయి తప్పించుకుంటాయని ఈక్వెడార్‌కు సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఈ చిత్రాన్ని తీసిన అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్ డే విడ్ ఫ్లీట్హాం చెప్పారు. ఈ చేపలు ఆ క్షణంలోనే దాదాపు 500 అడుగుల పొడవునా సొరంగంలా ఏర్పడి.. ఆ సీ లయన్ నుంచి తప్పించుకున్నాయని తెలిపారు. -
చేపలతో మెదడుకు చేవ!
వాషింగ్టన్: ‘మెదడు ఉందా? లేదా’ అని మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారా? అయితే చేపలను బాగా లాగించేయండి. చేపలను బాగా తింటే మెదడు పెద్దదవుతుందని, అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిజేరవని తేలింది. చేపనూనెలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల స్థాయి ఎక్కువగా ఉండే వారిలో వృద్ధాప్యంలో మస్తిష్కం ఆరోగ్యంగానే కాకుండా పరిమాణంలోనూ పెద్దగా ఉంటుందని సౌత్ డకోటా వర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా 1,111 మంది మహిళల ఎర్ర రక్తకణాల్లోని ఒమేగా-3 స్థాయిలను పరీక్షించారు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత అంటే.. వారికి 78 ఏళ్లు వచ్చాక మెదడు పరిమాణాన్ని కొలిచారు. ఒమేగా-3 స్థాయిలు ఎక్కువగా ఉన్న వారి మెదడు మిగతావారికంటే 0.7 శాతం పెద్దగా, జ్ఞాపకశక్తిలో కీలకమైన ‘హిపోకేంపస్’ భాగం 2.7 రెట్లు పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీని వల్ల మెదడు కణాల నాశనం, వృద్ధాప్యం ఆలస్యమవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన జేమ్స్ పొటాలా చెప్పారు. -
అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!
ఫుడ్ మార్కెట్లో ఏముంటాయి? రకరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, ఇతరత్రా తినుబండారాలు... ఇవేగా! కానీ మీరింతవరకూ చూసి ఉండని ఓ విచ్రితమైన మార్కెట్ షాంఘైలో ఉంది. దాన్ని చూడటం సంగతి తర్వాత... దాని గురించి వింటేనే షాకయిపోతాం మనం! షాంఘైలోని గ్వాండాంగ్ ప్రావిన్స్‌లో ఉండే ఓ ఫుడ్ మార్కెట్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడా చూడలేనంత నాన్‌వెజ్ దొరుకుతుంది. ఎవరూ తినలేనన్ని రకాల మాంసాలు అక్కడ ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, మటన్ మామూలే. కానీ వాటితో పాటు మొసలి మాంసం, ఆక్టోపస్ మాంసం, స్టార్‌ఫిష్‌లు, తేళ్లు, జైలు, పాములు, ఎలుకలు, పురుగులు... దొరకని జీవి అంటూ ఏదీ ఉండదక్కడ. పచ్చివి, ఎండబెట్టినవి అంటూ వేరు చేసి మరీ అమ్ముతుంటారు. అంతేనా! తేళ్లతో చేసిన క్యాండీలు, ఫ్రూట్ పీసెస్ బదులు చిన్ని చిన్ని పురుగులను అద్దిన ఐస్‌క్రీములు, వేయించిన ఎలుకలు... అబ్బో, తినాలే గానీ బోలెడన్ని! మనకి వినడానికే వెగటుగా ఉంటుంది కానీ... షాంఘై వారికి ఆ మార్కెట్లో దొరికే ఐటెమ్స్ అంటే మహా ప్రీతి. ఎంత ఖరీదైనా పెట్టి వాటిని కొనేసుకుంటారు. ఏమాత్రం సంకోచం లేకుండా రకరకాల జీవుల్ని వండుకుని స్వాహా చేసేస్తుంటారు. వారికవి తినడం అలవాటు మరి! మీకేమైనా వాటి మీద ఇంటరెస్ట్ ఉంటే... ఎప్పుడైనా షాంఘై వెళ్లినప్పుడు చక్కగా టేస్ట్ చేసి రావచ్చు! ఆకాశంలో చందమామ ఎంత హుందాగా కనబడుతుందో... దుబాయ్‌లోని జుమేరియా బీచ్‌లో అంతకంటే ఠీవిగా కనిపిస్తుంది బుర్జ అల్ అరబ్ హోటల్. ప్రపంచంలోని అతి ఎత్తయిన హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న ఈ స్టార్ హోటల్ అందాన్ని వర్ణించి లాభం లేదు. స్వయంగా చూడాల్సిందే! బుర్జ అల్ అరబ్ ఏర్పాటు కోసం ముందుగా సముద్రపు నీటిలో ఓ ఆర్టిఫీషియల్ దీవిని ఏర్పరిచారు. దాని మీద హోటల్‌ను నిర్మించారు. దీని ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. అటు పూర్తిగా అర్థ చంద్రాకారంలో కాకుండా, ఇటు పూర్తి నిటారుగా కాకుండా... ఓ విచిత్రమైన ఆకృతిలో ఉంటుంది. ఓడల రాకపోకలకు ఆటకం కలుగకుండా, ఓడల కారణంగా హోటల్‌కి నష్టం వాటిల్లకుండా ఉండేలా నిర్మించేందుకే ఈ ఆకారాన్ని ఎంచుకున్నారు. మొదట్లో దీనిని దుబాయ్ చికాగో బీచ్ హోటల్ అనేవారు. కానీ 1997లో బుర్జ అల్ అరబ్‌గా పేరు మార్చారు. జుమేరియన్ గ్రూప్ వారిది కావడంతో దీనికి జుమేరియన్ బీచ్ హోటల్ అనే పేరు కూడా వచ్చింది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో, విలాస వంతంగా ఉండే ఈ హోటల్లో విడిది చేస్తే స్వర్గంలో ఉన్నట్టేనంటారు సందర్శకులు! టామ్ రైట్, అట్కిన్స అనే ఇద్దరు ఆర్కిటెక్టులు కలిసి ఈ హోటల్‌కు రూపకల్పన చేశారు. కెనడాకు చెందిన ఇంజినీర్ రిక్ గ్రెగరీ 1994లో దీన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. 1999లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ యేడు డిసెంబర్లో హోటల్‌ను తెరిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఇది లక్షలాది మందిని ఆకర్షించింది. దుబాయ్‌లో ప్రతిష్టాత్మకమైన, సుందరమైన నిర్మాణాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ హోటల్లో మొత్తం 202 సూట్స్ ఉన్నాయి. రాయల్ సూట్ పేరుతో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి 18,776 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మన కరెన్సీలో దాదాపు 12లక్షల పైమాటే. మామూలు సూట్ కూడా తక్కువేమీ ఉండదు. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదిహేను హోటళ్లలో ఒకటిగా పేర్కొంటారు. సామాన్యుడు ఇందులో అడుగు పెట్టడం కల్లే. అందుకే బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు మాత్రమే ఇందులోకి వెళుతుంటారు. -
చేపలు గుటకాయ స్వాహా !
అల్లూరు, న్యూస్‌లైన్: అడవి పండింది..కాకుల పాలైంది..అనే సామెతలా తయారైంది అల్లూరు చెరువులో చేపలు పట్టే వ్యవహారం. ఎవరికి దొరికిన చేప వాళ్లు ఎత్తుకెళుతుండటంతో నెల రోజులుగా సుమారు రూ.1.50 కోట్ల విలువైన చేపలు పరులపాలవుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. అయినా ఏ దారిన వెళ్లే చేపలు ఆ దారిన గట్టు దాటేస్తున్నాయి. సుమారు 2,100 ఎకరాల్లో అల్లూరు చెరువు విస్తరించి ఉంది. అందులో 500 ఎకరాలు ఆక్రమణకు గురికాగా మిగిలిన 1,600 ఎకరాల్లో సాగునీటి నిల్వ ఉంటుంది. వరుసగా తొమ్మిదేళ్ల పాటు ఈ చెరువు ఆయకట్టులో ఎడగారు సాగు జరగడంతో చేపలు పట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ తొమ్మిదేళ్లలో చేపలు ఒక్కోటి 10 నుంచి 20 కేజీల వరకు పెరిగాయి. గతంలో విడవలూరు మండలం పొన్నపూడి సొసైటీకి మత్స్యకారులు ఈ చెరువులో చేపలు పట్టుకునేవారు. పెద్దల కాలంలోనే జమీందార్లు వారికి ఈ అవకాశం కల్పించారు. అల్లూరు చుట్టుపక్కల ఉన్న వారికి అవకాశం లేకుండా, ఎక్కడో దూరంగా ఉన్న వారు చేపలు పట్టుకుంటుండటంపై అసంతృప్తి వెల్లువెత్తింది. అల్లూరుకు చెందిన ఇరువర్గాల వారు చెరువుపై హక్కు తమదంటే తమదంటూ ఏడాది క్రితం కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాలకు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. కోర్టులో విచారణ సాగుతుండగానే రెండు వర్గాల వారు చెరువును పంచేసుకున్నారు. ఆరు నెలలుగా చెరోవైపు గుడిసెలు వేసుకుని రాత్రివేళలో చేపలు వేట సాగిస్తూ చేతి నిండా సంపాదిస్తున్నారు. ఉన్నతాధికారులు అటువైపు రాకుండా చేతులు తడిపే వారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జూలై 7, 8, 9 తేదీల్లో అల్లూరు ప్రాంతానికి చెందిన అన్ని కాలనీల వారు, అన్ని వర్గాల ప్రజలు చెరువులో చేపలు పట్టుకున్నారు. మరోవైపు అల్లూరు చెరువులో భారీ సైజు చేపలు ఉన్న విషయం తెలుసుకున్న ఇస్కపల్లి మత్స్య కారులు సముద్రంలో వేటసాగించే వలలతో ఇక్కడ చేపలు పట్టేశారు. అనంతరం రంగంలోకి దిగిన మత్స్యశాఖాధికారులు అల్లూరు పోలీసుల సాయం తో అందరి వద్ద వలలు స్వాధీనం చేసుకున్నారు. చెరువులో ఎవరూ దిగరాదంటూ, దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కొద్దిరోజుల పాటు చేపల వేట తాత్కాలికంగా ఆగినా సోమ, మంగళవారాల్లో మళ్లీ ఊపందుకుంది. అధికారులు ఓవైపు పడవల్లో తిరుగుతూ తరుముతున్నా చేపలు పట్టే వాళ్లు తమ పని కానించేస్తున్నారు. ఇప్పటికే దాదాపు కోటి రూపాయల విలువైన చేపలు పరులపాలయినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారులు మొదటి నుంచి పకడ్బందీగా వ్యవహరించి ఉంటే పంచాయతీకి సుమారు రూ.75 లక్షల ఆదాయం వచ్చి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.