చేపా..చేప ఎందుకు రాలేదు?
గడువు దాటి 7 నెలలు గడుస్తున్నా
అరణియార్ ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదలని వైనం
అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యం
ఉపాధి కోల్పోరుు వీధిన పడుతున్న మత్స్యకార్మిక కుటుంబాలు
జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ అరణియార్‌లో నిండా నీరున్నా అధికారుల నిర్లక్ష్యం వుత్స్యకారులకు శాపంగా మారింది. దశాబ్దాల తర్వాత గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. గడువు దాటి 8 నెలలు గడుస్తున్నా చేప పిల్లలను వదలక పోవడంతో 2వేల మందికి పైగా లెసైన్స్‌డ్ మత్స్యకారులు బతుకుదెరువు కోల్పోతున్నారు. రిజర్వాయుర్‌లో పది అడుగులు నీరున్నా ఏటా అక్టోబర్‌లో 10 లక్షల చేపపిల్లలు వదిలేవారని, పుష్కలంగా నీరున్నా ఎందుకు వదలడం లేదోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
పిచ్చాటూరు:అరణియూర్ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వుత్స్యశాఖ బోర్డు అధ్వర్యంలో ఏటా అక్టోబర్‌లో బయట నుంచి చేపపిల్లలు తెచ్చి రిజర్వాయుర్‌లో వదులుతున్నారు. పదేళ్లుగా ఏ టా కనీసం 10 లక్షలు చేపపిల్లలు వదులుతున్నారు. అవి పెరిగి పెద్దదైతే వా టిని పట్టి అమ్ముకుంటూ మత్సకార్మికుల కుటుంబాలు జీవనం సాగించేవి. ఇందుకోసం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారు 2 వేల వుంది మత్స్యకార్మికులు రిజర్వాయుర్‌లో చేపలు పట్టేందుకు ప్రభుత్వం నుంచి లెసైన్సులు సైతం పొంది ఉన్నా రు.
దశాబ్దాల తరువాత అరణియార్ రిజర్వాయర్ గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థారుులో నిండింది. ఈ నీటిలో ప్రభుత్వం చేప పిల్లలను విడుదల చేస్తే సువూరు రెండేళ్ల వరకు తవు జీవనోపాధికి కొదవ ఉండదని మత్స్యకార్మికులు సంబరపడ్డారు. కానీ గత ఏడాది అక్టోబర్‌లో వదలాల్సిన చేపపిల్లలను ప్రభుత్వం ఇంతవరకు వదల లేదు. తామ బతుకు తెరువును కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు..
రిజర్వాయుర్‌లో చేపపిల్లలు వదలడానికి గడువుదాటి ఏడు నెలలు కావస్తున్నా మత్స్యశాఖ అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని మత్స్యకార్మికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వాయుర్‌లో చేపపిల్లలు వదలాల్సిందిగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పో తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బోర్డు అధికారులను వివరణ కోరగా, తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు.
అధికారులు స్పందించాలి..
రిజర్వాయుర్‌లో చేపపిల్లలను వదలాలి. లేదంటే మాకు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే దారిలేదు. ఆరు నెలలుగా రిజర్వాయర్‌లో చేపలు దొరకడం లేదు. రోజూ చేపల వేటకు వెళ్లడం వల్ల మాకు కష్టం తప్ప ఇంకేమి మిగలడం లేదు.
-కె.బాబు రెడ్డి, వుత్స్యకార్మికుడు, పిచ్చాటూరు
కుటుంబాలు వీధినపడుతున్నాయి...
రిజర్వాయర్‌లో చేపలు పడక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రిజర్వాయర్‌లో కనీసం 10 అడుగు లు నీరు ఉన్నప్పుడు కూడా పది లక్షల చేపపిల్లలు వదిలేవారు. ఈసారి చేప పిల్లలను ఎందుకు వదలడం లేదో అంతుపట్టడం లేదు. పూట గడవటం కష్టంగా ఉంది.
-రాఘవరెడ్డి, మత్స్యకార్మికుడు కీళపూడి