క‌రోనా బాధితుల‌కే క‌రువైందంటే.. చేపలకు ఆక్సిజన్‌!  | Karimnagar: Fisherman Provided Oxygen To Fish And Sold It | Sakshi
Sakshi News home page

క‌రోనా బాధితుల‌కే క‌రువైందంటే.. చేపలకు ఆక్సిజన్‌! 

Published Mon, Apr 26 2021 2:55 PM | Last Updated on Mon, Apr 26 2021 3:44 PM

Karimnagar: Fisherman Provided Oxygen To Fish And Sold It - Sakshi

సాక్షి, శంకరపట్నం(మానకొండూర్‌): కరోనా బాధితులకు ఆక్సిజన్‌ దొరక్క ఆస్పత్రుల్లో మృత్యువాత పడుతున్న ప్రస్తుత తరుణంలో కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలో ఓ మత్స్యకారుడు ఆదివారం చేపలకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేసి విక్రయించాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మత్స్యకారుడు పప్పు ప్రభాకర్‌ చేపలు విక్రయించేందుకు ట్రాక్టర్‌లో వాటర్‌ట్యాంక్‌ ఏర్పాటు చేసి దానికి ఆక్సిజన్‌ బిగించాడు. బతికిఉన్న చేపలు కొనడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారని, అందుకే చేపలకు ఇలా ఆక్సిజన్‌ అందిస్తూ విక్రయిస్తున్నట్లు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement