oxygen shortage
-
Israel-Hamas war: గాజా ఆస్పత్రిని చుట్టుముట్టిన ఐడీఎఫ్
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు. -
Andhra Pradesh: లక్షణంగా ఆరోగ్యం
Andhra Pradesh: రాష్ట్రంలో గతంలో ఒక్క వీఆర్డీఎల్ (వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్) ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం రోజూ లక్ష మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి ల్యాబ్‌లను నెలకొల్పామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. కోవిడ్‌తో ఆర్థిక కష్టాలు తలెత్తినా ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నాడు – నేడు ద్వారా వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. కోవిడ్ మేనేజ్మెంట్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని, పిల్లలకు వ్యాక్సినేషన్లోనూ అందరి కన్నా ముందున్నామని చెప్పారు. ఫిబ్రవరి నాటికి వైద్య రంగంలో 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 23 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్పీఎం సామర్ధ్యం కలిగిన 144 (ఆక్సిజన్ జనరేషన్) పీఎస్ఏ ప్లాంట్లతో పాటు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. 247 పీఎస్ఏ ప్లాంట్లు దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను అంటే సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకునే ప్లాంట్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 పీఎస్ఏ ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. ఈ 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పి ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. 50 పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వంద పడకలకుపైగా ఉన్న మరో 71 ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వమే 30 శాతం సబ్సిడీని భరిస్తూ చేయూత అందిస్తోంది. తద్వారా 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఏర్పాటవుతాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల చిత్రాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఆక్సిజన్ కొరతతో అస్తవ్యస్తం.. కోవిడ్ సమయంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆక్సిజన్ కొరత వల్ల దేశవ్యాప్తంగా ఎంత ఇబ్బందులు ఎదురయ్యాయో అంతా చూశాం. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై కోవిడ్ వైరస్ ప్రభావం చూపింది. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్లను ఏకంగా విమానాల్లో తరలించాల్సి వచ్చింది. విదేశాల నుంచి కూడా తెప్పించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. క్రయోజనిక్ ట్యాంకుల్లో విదేశాల నుంచి ఓడల్లో కూడా తర లించాల్సి వచ్చింది. నిమిషానికి 44 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి.. అలాంటి పరిస్థితులను సమర్థంగా అధిగమించి ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టాం. రూ.426 కోట్లు ఖర్చు చేసి నిమిషానికి 44 వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 144 ప్లాంట్లను ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఆదాయం తగ్గినా.. సంక్షేమం తగ్గలేదు కోవిడ్‌తో రెండేళ్లుగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు, వారికి మంచి జరగాలనే ఆరాటంతో సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. నాడు –నేడు ద్వారా ఆస్పత్రులు, స్కూళ్లను బాగు చేశాం. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం. ముఖ్యమంత్రి దూరదృష్టితో సిద్ధం.. కోవిడ్ మేనేజ్మెంట్లో మరో కీలక ఘట్టం మొదలైంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రజల ప్రాణాల పరిరక్షణ, ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.వేల కోట్లు వెచ్చించారు. కోవిడ్‌ను మనం ఎంత కట్టడి చేసినా ఆక్సిజన్ కోసం కేంద్రంపై ఆధారపడటం, ఇతర రాష్ట్రాల నుంచి కోటా మేరకు పొందటాన్ని గతంలో చూశాం. వీటిని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరదృష్టితో ఆదేశించారు. భవిష్యత్‌లో ఎన్ని వేవ్‌లు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి చిత్తూరు, తిరుపతి వెళ్లాల్సిన పనిలేదు.. చిత్తూరు జిల్లాలో 27 పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. పుంగనూరు ఆసుపత్రిలో కూడా ప్లాంట్ ఏర్పాటైనందున ఆక్సిజన్ కొరతతో రోగులను చిత్తూరు, తిరుపతి పంపాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే వైద్యం అందించగలుగుతున్నాం. – డాక్టర్ కిరణ్, మెడికల్ ఆఫీసర్æ, పుంగనూరు సీహెచ్‌సీ, చిత్తూరు మందులు.. మంచి భోజనం కోవిడ్ సెకండ్ వేవ్‌లో వైరస్ తీవ్రంగా సోకడంతో నాకు ఆక్సిజన్ లెవల్స్ 75కి పడిపోయాయి. గుంటూరు జీజీహెచ్‌లో ఐసీయూకి తరలించి మెరుగైన చికిత్స అందించారు. మందులతో పాటు మంచి భోజనం కూడా పెట్టారు. ఆ సమయంలో మీరు (సీఎం వైఎస్ జగన్) చక్కగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మీ ముందు నిలుచుని ఇలా మాట్లాడుతున్నానంటే అది మీరు పెట్టిన భిక్షే. – శైలజ, కోవిడ్ బాధితురాలు -
Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’
Highest ever surge in world న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను తక్షణమే సమీక్షించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం లేఖలు రాసింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, హెల్త్ కేర్ సౌకర్యాలను పెంచడంతోపాటు ఆక్సిజన్ లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని సెక్రెటరీ రాజేష్ భూషణ్ లేఖల్లో పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం నిన్న ఒక్క రోజులోనే (డిసెంబర్ 31న) అత్యధికంగా 16,764 కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 70 రోజులతో పోల్చితే పెద్ద మొత్తంలో నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు ఐరోపా, అమెరికా దేశాలు గత కొన్ని వారాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదించాయి. తాజా పరిణామాలన్నీ కూడా వైరస్ అధిక వ్యాప్తినే సూచిస్తున్నాయని సెక్రెటరీ లేఖలో ఉటంకించారు. చదవండి: 12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్.. శనివారం ఉదయం నాటికి దేశంలో మిక్రాన్ సంఖ్య 1,431 మార్క్‌ను దాటింది. 5 రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలాగే 22,775 కోవిడ్ కేసులు నమోదుకాగా, 406 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నందువల్ల హెల్త్ కేర్ ఫెసిలీటీస్ కొరత ఏర్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. తేలికపాటి నుండి మితమైన లక్షణాలున్న రోగుల కోసం రాష్ట్రాలు హోటల్ వసతిని కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది.హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలు, కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి రాష్ట్రాలను కోరింది. గ్రామీణ ప్రాంతాలు, పీడియాట్రిక్ కేసులపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. జ్వరాలు, ఒళ్లు నొప్పులతో వస్తున్న రోగులందరికీ కోవిడ్ టెస్ట్లుచేయాలని కోరింది. అంతేకాకుండా చాలా మంది ఒమిక్రాన్ రోగులు లక్షణరహితంగా ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఐతే రోగులను సకాలంలో గుర్తించకపోతే, కుటుంబ సభ్యులకు సంక్రమణ ప్రమాదం ఎక్కువని తెల్పింది. ఈ మేరకు కోవిడ్ కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు! -
రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
సాక్షి అమరావతి: థర్డ్ వేవ్ వచ్చినా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. పీహెచ్‌సీల స్థాయి నుంచే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 20 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు చేరుకున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల వాటి పనితీరును పర్యవేక్షించారు కూడా. వీటితో పాటు కీలక పాత్ర పోషించే డి టైప్ సిలిండర్లను కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 27,311 డి టైప్ సిలిండర్లు చేరుకున్నాయి. మెడికల్ గ్యాస్ పైప్లైన్ల ఏర్పాట్లు సాగుతున్నాయి.146 ఆస్పత్రులకు 6,151 ఆక్సిజన్ బెడ్లకు అవసరమైన పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మూడు ఆస్పత్రులకు సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్) కింద ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తుండగా, 143 ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. ఇవి కాకుండా ఆక్సిజన్ సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే భవిష్యత్తులో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లతో అవసరం ఉండదు. -
కోవిడ్ మరణాలపై డేటా ఇవ్వండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని, దీనికి సంబంధించిన రిపోర్టులేవీ తమ వద్ద లేదన్న కేంద్రం తాజాగా కీలక ఆదేశాలు చేసినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ కొరతతో మరణాల సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల లోపే ఆయా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఈ డేటాను సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెడికల్ ఆక్సిజన్ కొరతతో చనిపోయిన కరోనా బాధితుల డేటాని సమర్పించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ముగిసే (ఆగస్టు 13) నాటికి ఈ డేటాను పార్లమెంటులో సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కరోనా రెండో దశలో వేవ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదన్న కేంద్రం ప్రకటనపై విమర్శలు చెలరేగాయి. ఈ నెల 20న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు కోవిడ్ మరణాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక మరణాలను నివేదించలేదని ఆరోగ్యశాఖ సహాయమంత్రి సమాధానం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడిన సంగతి తెలిసిందే. -
ఈ లెక్క తేలేదేనా?
సత్యం వేరు... సాంకేతికంగా చూపించే లెక్క వేరు! ఆ సంగతి కొందరు పాలకులకు బాగా తెలుసు. ఈ మధ్యే పదవి చేపట్టిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ కూడా అప్పుడే ఆ సంగతి ఒంటబట్టించుకున్నట్టున్నారు. అందుకే కావచ్చు... సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఆమె కరోనా సెకండ్ వేవ్ వేళ దేశంలో ఆక్సిజన్ కొరతతో ఎవరూ మరణించలేదని నిష్పూచీగా చెప్పేశారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమైన ఆ ప్రకటన దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత తలెత్తిన మాటను ఒకపక్క ఒప్పుకుం టూనే, మరోపక్క దాని వల్ల మరణాలంటూ ఏవీ లెక్కల్లో లేవని మంత్రి గారు చెప్పడం విడ్డూరం. ఆక్సిజన్ కొరత మరణాలంటూ ఎక్కడా లెక్క చూపలేదన్నది సాంకేతికంగా – మెడికో లీగల్ కేసుల పరంగా నిజమే కావచ్చు. కానీ, ఈ ఏప్రిల్, మే నెలల్లో ఆక్సిజన్ అందక ఢిల్లీ, జైపూర్ ఆస్ప త్రులతో సహా అనేకచోట్ల ఎంతెంత మంది అర్ధంతరంగా కన్నుమూశారో ఏకంగా అంతర్జాతీయ వార్తల్లో వచ్చింది. ఆసుపత్రుల్లో పడకల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం జనం పడ్డ అవస్థలు తెలుసు. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విజ్ఞప్తులు, సిలిండర్ల సరఫరాను ఆపారంటూ రాష్ట్రాల మధ్య పంచాయతీలూ, అధిక రేట్ల బ్లాక్‌మార్కెటింగ్– అన్నీ నేటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. బాధిత కుటుంబాలకు కళ్ళ నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి, రాష్ట్రాలిచ్చిన లెక్కలను బట్టి, ఆక్సిజన్ కొరత మరణాలు లేవన్నారట. కేంద్రంలోని పాలక బీజేపీ ఇలా సమర్థించుకోవాలని చూస్తుంటే ఏమనాలి? అదేమంటే, అప్పట్లో ఆక్సిజన్ కొరత అంటూ కేంద్రాన్ని ఇరుకునపెట్టిన ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీరా లెక్కల్లో మాత్రం ప్రత్యేకంగా ఆక్సిజన్ కొరత మరణాలంటూ పేర్కొనలేదని పాలకపక్షం విమర్శిస్తోంది. అసలు ఆ సమాచారం కేంద్రం అడిగిందా? అడిగినా రాష్ట్రాలు ఇవ్వలేదా అన్నది ప్రశ్న. కేంద్రం ఆ వివరాలు అడగనే లేదనీ, అడగకుండానే రాష్ట్రాలు ఇవ్వలేదంటారేమిటని కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు గురువారం నిగ్గదీశాయి. ఉదాహరణకు, సెకండ్ వేవ్ విలయ తాండవంలో రాజస్థాన్‌లో దాదాపు 6500 మంది చనిపోతే, అందులో అధిక శాతం మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు పోయినవారే! ఇది ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రే చెబుతున్న లెక్క. దేశమంతటా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కాగా, రాష్ట్రాలను కేంద్రం అడిగిన కరోనా లెక్కల సమాచారంలో ‘ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు’ అనే విభాగమే లేదు. ఆ సంగతి ఛత్తీస్‌గఢ్ సర్కార్ కుండబద్దలు కొట్టింది. ‘అడిగారా, ఇచ్చారా– లేదా’ అన్నది పక్కనబెడితే కరోనా మరణాలకు ప్రధాన కారణం ఏమిటో పాలకపక్షానికీ తెలుసు. కర్ణాటక, గోవా, ఢిల్లీలలో అక్కడి కోర్టులు ఆక్సిజన్ కొరత మరణాలపై ఇటీవల వివిధ రకాల ఉత్తర్వులు ఇచ్చిన సంగతీ చూశాం. సత్యం తెలిసి, చూసి కూడా రాష్ట్రాలిచ్చిన డేటాలో లేదనే సాంకేతికపరమైన సాకు చూపితే? ప్రత్యేకంగా నమోదు చేసే పద్ధతి లేదు కాబట్టి, అసలు ఆక్సిజన్ కొరత మరణాలే లేవంటే? అది అన్యాయం! ఆత్మవంచన! అందరినీ నమ్మించాలని చూస్తే నయ వంచన! ఆ మాటకొస్తే– ఆక్సిజన్ కొరత మరణాలనే కాదు... అసలు కరోనా మరణాలనైనా పాలకులు సరిగ్గా లెక్క చెబుతున్నారని నమ్మలేం. దేశం మొత్తం మీద ఇప్పటికి 4.18 లక్షల మంది మరణిం చారని కేంద్రం లెక్క. కరోనా పాజిటివ్ అని తేలినవాళ్ళలో అది 1.34 శాతమే. అందులో 2.35 లక్షల మంది రెండో వేవ్ ఉద్ధృతిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మూడు నెలల్లోనే మరణిం చారట. అంటే, ఇప్పటి వరకు దేశంలో జరిగిన కరోనా మరణాలలో 56 శాతం ఈ మూడు నెలల్లో జరిగినవే. అసలు లెక్కలు ఈ తగ్గింపు లెక్కల కన్నా ఎక్కువేనని అనేక అధ్యయనాలు ఘోషిస్తు న్నాయి. పోనీ ఆ మాట అటుంచినా, వీటిలో ఏ ఒక్కటీ ఆక్సిజన్ కొరత చావు కాదంటున్న ప్రభుత్వ ఉద్ఘాటనను ఎంతటి అమాయకులైనా ఎలా నమ్ముతారు! ఇదంతా చూస్తే, ‘కళ్ళెదుటి అంతెత్తు ఏనుగూ లేదు... అది పారిపోవడమూ లేదు’ (గజం మి«థ్య, పలాయనం మి«థ్య) అనే చిన్ననాటి అసత్యవాద కథ గుర్తొస్తుంది. కరోనా కట్టడి, ఆక్సిజన్ సరఫరా తన చేతిలో ఉన్న కేంద్రం మాటలు వింటే, అచ్చం అలాగే... ‘ఆక్సిజన్ కొరత మిథ్య. దానివల్ల చావులూ మిథ్య’ అనుకోవాలి. ఇంకా నయం... ఏకంగా ‘కరోనానే మిథ్య’ అనడం లేదని సంతోషించాలి. కరోనా వచ్చి ఏణ్ణర్ధం దాటినా ఇప్పటికీ మన పాలకులకు సమస్యపై సరైన అవగాహన, సత్యాన్ని ధైర్యంగా చెప్పే బాధ్యత లేవేమో అని అనుమానం కలుగుతోంది. రెండో వేవ్ ఉద్ధృతిలో ఎదురైన సమస్యలు, వైఫల్యాలు, విజయాలు– అన్నింటినీ సాకల్యంగా సింహావలోకనం చేసుకొని, పార్లమెంట్ సాక్షిగా చర్చించుకోవడానికి ఇది సరైన సమయం. జరిగిన తప్పులను ఆత్మపరిశీలనతో సరిదిద్దుకొని, మరిన్ని వేవ్‌లు రావడానికి ముందే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావడం పాలకుల కర్తవ్యం. అదే ప్రజలకూ ఉపయోగం. ఆక్సిజన్ కొరత మరణాల అంశంతో మొదలుపెట్టి అవన్నీ నిజాయతీగా కలబోసుకొనే అవకాశాన్ని మోదీ సర్కార్ చేజార్చుకుంది. అదే విచారకరం. కట్టెదుటి కఠిన సత్యాన్ని అంగీకరించి, తప్పులు ఒప్పుకొని, చక్కదిద్దుకోవాల్సింది పోయి... ‘సాంకేతికంగా సరైనదే మాట్లాడాం’ లెమ్మని సంతృప్తి పడితే, ప్రజలు క్షమించరు. కొంగుతో కప్పేయాలనుకుంటే నిప్పులాంటి నిజాలు దహించివేస్తాయి. ఒళ్ళు కాలక ముందే పాలకులు కళ్ళు తెరుస్తారా? -
‘ఆక్సిజన్ మరణాల’ పై తీవ్ర దుమారం: ఖండిస్తున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ ఈ ఏడు దేశాన్ని గజగజ వణికించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసులు రెండు లక్షలు దాటగా.. మృతుల సంఖ్య పదివేలు దాటడం కల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వైద్యారోగ్య సేవలు కరువయ్యాయి. ముఖ్యంగా ప్రాణవాయువు ఆక్సిజన్ తీవ్రంగా వేధించింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక వందలాది మృతి చెందారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరతతో ఎవరూ మృతి చెందలేదని తాజాగా మంగళవారం ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రకటన ‘పచ్చి అబద్ధం’ అని ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రకటనపై ఢిల్లీ, కర్ణాటక మంత్రులు స్పందించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఈ ప్రకటన ‘పూర్తి అవాస్తవం’ అని పేర్కొన్నారు. చాలా మరణాలు ఆక్సిజన్ కొరతతో సంభవించాయని బుధవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సత్యేందర్ జైన్ తెలిపారు. ఆక్సిజన్ కొరతతో మరణాలు లేకుంటే ఆస్పత్రులు ఎందుకు హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఆస్పత్రులు, మీడియా ఆక్సిజన్ కొరత వార్తలను చూస్తునే ఉన్నాయి. ఆక్సిజన్ మరణాలు సంభవిస్తున్నాయని టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయా లేదా అని నిలదీశారు. కళ్లారా మరణాలను చూశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. ఇలాగే ఉంటే త్వరలోనే కరోనా వైరస్ కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని సత్యేందర్ జైన్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అయితే ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్క జిల్లాలోనే (చామరాజ్నగర్ జిల్లా ఆస్పత్రి) 36 మంది ఆక్సిజన్ కొరతతో మరణించారని ఓ నివేదిక ధర్మాసనానికి చేరింది. ఈ నివేదికను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్నారాయణ్ ఖండించారు. అవి ఆక్సిజన్ మరణాలు కాదని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో సంభవించిన మరణాలుగా అభివర్ణించారు. ‘ఆ మరణాలు ఆక్సిజన్‌తో జరగలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది’ అని తెలిపారు. ‘గుడ్డిగా కేంద్రం ప్రభుత్వం అనాలోచితంగా చేసిన ప్రకటన’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘చాలామంది తమ ఆత్మీయులు, బంధువులను ఆక్సిజన్ కొరతతో కోల్పోయారు. ఆస్పత్రులు, మీడియా వీటిని రోజూ చూస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొరతతో మరణించారని టీవీల్లో ప్రసారాలు వచ్చాయి’ అని తెలిపారు. ఈ అంశంపై వేణుగోపాల్ రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేసిందని.. తప్పించుకునే ధోరణిలో చేసిన ప్రకటనగా ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కరోనా మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పించుకోవడానికి ఈ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు. -
ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదా: చిదంబరం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం తాజాగా ప్రకటించడం దుమారాన్ని రాజేసింది. దీనిపై ప్రతిపక్షపార్టీనాయకులు, ఇతరనేతలు కేంద్రంపై దుమ్మెత్తి పోశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీచిదంబరం మరోసారి నరేంద్రమోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. గుడ్డి, చెవిటి ప్రభుత్వం సత్యాన్ని చూడలేదు, నిజాలను వినలేదంటూ మండిపడ్డారు. ప్రతీ విషాదాన్ని అబద్దాలు, అసత్యాలతో మాయం చేసే ఆర్ట్ ప్రభుత్వం సొంతమని ఆయన ఎద్దేవా చేశారు. మొదట వ్యాక్సీన్ల కొరత లేదన్నారు. మధ్యప్రదేశ్‌లో టీకాల కొరత ఏర్పడింది. దేశంలో చాలా టీకా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇపుడు ఆక్సిజన్ కొరత కారణంగా మరణాల నివేదికలు లేవని కేంద్రం చెబుతోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరణాలు లేవని ప్రకటించలేదు... మరణాల నివేదికలు లేవని మాత్రమే మంత్రిగారు ప్రకటించారు దీన్ని గమనించాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా రెండో దశలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో ఆక్సిజన్ కారణంగా కరోనా మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలియజేశారు. అయితే ఆక్సిజన్‌కు డిమాండ్‌లో భారీగా పెరగడంతో రాష్ట్రాల మధ్య సమాన పంపిణీకి కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మొదటి దశలో 3,095 మెట్రిక్ టన్నులతో పోలిస్తే రెండోదశలో దాదాపు 9,000 మెట్రిక్ టన్నులకు చేరిందని వివరించింది. ఏప్రిల్ 15 న మొదటి కేటాయింపు జరగ్గా, తీవ్రతను బట్టి ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఆక్సిజన్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2021 మే 28 నాటికి అధిక భారం ఉన్న 26 రాష్ట్రాలకు మొత్తం 10,250 మెట్రిక్ టన్నుల కేటాయించినట్టు వెల్లడించారు. Now, it is “no reports of deaths due to shortage of oxygen”. Read that carefully. Minister did not say there were “no deaths”. He said “no REPORTS of deaths” A blind and deaf government will not be able to “see” or “hear” the truth. — P. Chidambaram (@PChidambaram_IN) July 20, 2021 -
ఆక్సిజన్‌కు కొరత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో అవసరమైనంత ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని, కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఆక్సిజన్ అందక పేషెంట్లు మృతి చెందారంటూ.. తప్పుడు వార్తలతో అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో.. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని చెప్పారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో తగినంత ఆక్సిజన్ ఉందని వివరించారు. కానీ ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషెంట్లు మృతి చెందారంటూ వార్తలు వచ్చాయన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించే సమీక్షా సమావేశాలపై కూడా అవాస్తవాలు ప్రచురించడం తగదని అనిల్ సింఘాల్ సూచించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామని సింఘాల్ చెప్పారు. ఐదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయసు తల్లులు 18,75,866 మంది ఉండగా.. 12,99,500 మందికి టీకా మొదటి డోసు పూర్తయ్యిందని తెలిపారు. జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి 53,14,740 డోసులు అందజేయనున్నట్లు కేంద్రం సమాచారమిచ్చిందని చెప్పారు. -
డాక్టర్‌పై భయానక దాడి.. వెంటాడి.. వేటాడి
డిస్పూర్: మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి మరి కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల జనాలు వారి త్యాగాన్ని మర్చిపోయి.. వైద్య సిబ్బందిపై దాడి చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి అసోంలో చోటు చేసుకుంది. ఆక్సిజన్ కొరత వల్ల కరోనా బాధితుడు ఒకరు మృతి చెందారు. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు మృతుడికి వైద్యం చేసిన డాక్టర్‌పై దారుణంగా దాడి చేశారు. కింద పడేసి తంతూ.. చేతికి దొరికిన వస్తువులతో చితకబాదారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే.. వెంటపడి మరీ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. అసోం గువహటి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజై నగరంలోని ఉడాలి మోడల్ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పిపాల పుఖురి గ్రామానికి చెందిన ఉద్దీన్ అనే వ్యక్తికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని హుజైలని ఉడాలి మోడల్ ఆస్పతిలో చేర్పించారు. డాక్టర్ సీజ్ కుమార్ సేనాపతి అతడికి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న ఉద్దీన్ మంగళవారం సాయంత్రం మరణించాడు. డాక్టర్ సేనాపతి నిర్లక్ష్యం వల్లనే ఆక్సిజన్ కొరతతో ఉద్దీన్ మరణించాడని భావించిన అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సేనాపతిని వెంటాడి మరీ చితకబాదారు. డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. ‘‘మంగళవారం సాయంత్రం నేను విధుల్లో ఉండగా ఉద్దీన్ సహాయకుడు ఒకరు వచ్చి అతడి పరిస్థితి విషమిస్తుందని నాకు తెలిపాడు. నేను రూమ్‌లోకి వెళ్లేసరికే ఉద్దీన్ మరణించాడు. దీని గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశాను. వారంతా నా వల్లనే ఉద్దీన్ చనిపోయాడని భావించి నాపై దాడికి దిగారు. సుమారు 30 మంది వరకు ఆస్పత్రిపై దాడి చేశాను. వారికి భయపడి నేను ఓ రూమ్‌లోకి పరిగెత్తి దాక్కుందామని ప్రయత్నించినప్పటికి దాని డోర్ తెరుచుకుని వచ్చి.. నాపై దాడి చేశారు. నా మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, మోబైల్ ఫోన్ లాక్కున్నారు’’ అని తెలిపాడు. Such barbaric attacks on our frontline workers won't be tolerated by our administration. @gpsinghassam @assampolice Ensure that the culprits brought to justice. https://t.co/HwQfbWwYmn — Himanta Biswa Sarma (@himantabiswa) June 1, 2021 ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సేనాపతిని వెంటనే నాగావ్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జె.ఎ.జయలాల్ ఈ దాడిపి తీవ్రంగా ఖండించారు. అసోం చాప్టర్ ఆఫ్ అసోం మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (అమ్సా) సభ్యులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుడిపై దాడికి నిరసనగా అన్ని ప్రభుత్వ వైద్య సదుపాయాలలో వారు ఈ రోజు ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) సేవలను బహిష్కరించారు. అత్యవసర సేవలు, కోవిడ్ విధులు కొనసాగుతాయని.. బ్లాక్ బ్యాడ్జీ ధరించి వైద్యులు విధుల్లోకి హాజరవుతారని తెలిపారు. ఈ దాడిపై దర్యాప్తు జరిపి బాధ్యులను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోలీసులను ఆదేశించారు. చదవండి: లక్షలతో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో కరోనా పేషెంట్లను బ్రతికిస్తున్నాడు -
ఆక్సిజన్ మృతులపై అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మృతి చెందిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. ఈమేరకు నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ఆరుగురు వైద్యులతో ఆమ్ఆద్మీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. పరిహారం విషయంలో కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం బాధితులకు సహాయం అందించనుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీ వారం చొప్పున వైద్య ఆరోగ్య కార్యదర్శికి నివేదిక అందిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈనెల ఆరంభంలో ఢిల్లీలోని బత్రా ఆస్పత్రిలో 12 మంది ఆక్సిజన్ అందక మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24వ తేదీన ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా బాధితులు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. మృతుల విషయమై ప్రభుత్వం ఫిర్యాదులు, దరఖాస్తులు నేరుగా లేదా, ఆన్లైన్లో స్వీకరిస్తుంది. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. -
Cyclone Yaas: అదనంగా 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 32వేల ఆక్సిజన్ బెడ్స్‌కి 660 మెట్రిక్ టన్నులు ప్రాణ వాయువు కావాలి. కానీ కేంద్రం ఇచ్చేది 590 మెట్రిక్ టన్నులు మాత్రమే. దాంతో ప్రతిరోజూ అదనంగా 150 మెట్రిక్ టన్నులు తీసుకొస్తున్నాం’’ అన్నారు కృష్ణబాబు. ‘‘యస్ తుపాను వల్ల ఇబ్బందులొస్తాయని ముందస్తుగా.. అదనంగా 400 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ తీసుకొచ్చాం. ఇప్పటివరకు జామ్‌నగర్ నుంచి నాలుగు ఆక్సిజన్ రైళ్లు వచ్చాయి. ఆక్సిజన్ రవాణా కోసం 92 లారీలను వినియోగిస్తుండగా.. సరఫరా కోసం 16 కంటైనర్లను ఏర్పాటు చేశాం. ప్రైవేట్ సెక్టార్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం పాలసీని ప్రకటించారు. 120 కోట్ల రూపాయలతో ఆస్పత్రుల్లో ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నాం అని కృష్ణబాబు తెలిపారు. -
ఆక్సిజన్ కొరత, చైనాకు ఆర్డర్ పెట్టాం: చిరంజీవి
ఈ కోవిడ్ సంక్షోభంలో ఆక్సిజన్ కొరత వల్ల పలువురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు ప్రముఖ హీరో చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాట్లు, వాటి కార్యకలాపాలను ఆచరణలో పెట్టారు. చిరంజీవి జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. ఈ ఆక్సిజన్ బ్యాంకుల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ట్విట్టర్లో అకౌంట్‌ను ప్రారంభించారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొరత ఉండటం మూలాన చైనాకు ఆర్డర్ పెట్టాం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలాచోట్ల ఆక్సిజన్ కొరత ఉంది. ముందుగా అత్యవసరం ఎక్కడ ఉందో అక్కడికి ఆక్సిజన్ సిలిండర్లు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఉంటున్నాయన్నది తెలుసుకునేందుకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు కార్యాలయం నుంచి ఈ ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణపై పర్యవేక్షణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్నిచోట్ల ఈ ఆక్సిజన్ బ్యాంకుల సేవలు సద్వినియోగం కావాలన్నదే మా సంకల్పం. రామ్‌చరణ్ ఈ ఏర్పాట్లను చూస్తున్నారు’’ అన్నారు. -
పీఎం కేర్ నిధులతో 1.5 లక్షల ఆక్సీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సమస్యను తీర్చేందుకు డీఆర్డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను సరిచేసుకోగల టెక్నాలజీ ఉన్న ఆక్సిజన్ వ్యవస్థలను సేకరించనుంది. దాదాపు 1.5 లక్షల ఈ వ్యవస్థలను అందుబాటులోకి తేనుంది. పీఎం కేర్స్ నిధుల నుంచి రూ.322.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు అనుమతులు లభించినట్లు డీఆర్డీవో బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవస్థను కొద్ది నెలల కిందట డీఆర్డీవోలోని డెబెల్ సంస్థ ఆక్సికేర్ పేరుతో స్వయంగా అభివృద్ధి చేసింది. ఎత్తయిన ప్రాంతాల్లో పనిచేసే సైనికుల కోసం అభివృద్ధి చేసిన ఈ ఆక్సికేర్ వ్యవస్థలను కరోనా చికిత్సకు సమర్థంగా ఉపయోగించొచ్చని తెలిపింది. ఈ 1.5 లక్షల ఆక్సికేర్ యూనిట్లలో లక్ష యూనిట్లు సాధారణమైనవి కాగా.. మిగిలినవి ఆటోమేటిగ్గా పనిచేసేవి. సాధారణ ఆక్సికేర్ యూనిట్లో 10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్, పీడన, ప్రవాహాలను నియంత్రించే కంట్రోలర్, తేమను చేర్చే హ్యుమిడిఫయర్, ముక్కుకు అనుసంధానించుకునే నాసల్ క్యానులా ఉంటాయి. రక్తంలోని ఆక్సిజన్ మోతాదుకు అనుగుణంగా కంట్రోలర్ సాయంతో ఆక్సిజన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ఆక్సీమీటర్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఏర్పాటు చేశా రు. ఇందులో రక్తంలోని ఆక్సిజన్ మోతాదు గుర్తిం చి లెక్కకట్టేందుకు ఓప్రోబ్ ఉంటుంది. ప్రోబ్ గుర్తిం చిన ఆక్సిజన్ మోతాదులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఆక్సిజన్ విడుదలను నియంత్రిస్తుంది. ఈ ఆటోమేటిక్ ఆక్సీమీటర్ వినియోగం ద్వారా అవసరమైనంత మాత్రమే ఆక్సిజన్‌ను అందిం చొచ్చు. ఆక్సిజన్‌ను 30 నుంచి 40 శాతం ఆదా చేయొచ్చని డీఆర్డీవో వివరించింది. పరిమితులను ముందుగానే నిర్ధారించడం ద్వారా ఈ ఆక్సీ మీటర్లను ఉపయోగిస్తున్న రోగులను నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఆక్సీమీటర్ పనిచేయని పక్షంలో అలారం మోగి, వైద్య సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఇళ్లు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నింటిలోనూ వీటిని వాడుకోవచ్చని వివరించింది. -
చనిపోయే ముందు వీడియో.. యూట్యూబర్ ఆఖరి మాటలు
తన యూట్యూబ్ ఛానల్‌తో లక్షలాది నెటిజన్లను ఆకర్షించిన యువకుడు చివరకు మహమ్మారి కరోనా వైరస్‌కు బలయ్యాడు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే చనిపోయే ముందు అతడు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఆస్పత్రిలో చేరాను.. కానీ సౌకర్యాలు బాగాలేవు. ముక్కుకి ఆక్సిజన్ పైపు పెట్టారు. కానీ ఆక్సిజన్ రావడం లేదు’ అంటూ శ్వాస కోసం ఇబ్బంది పడుతూ మాట్లాడారు. ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు. ఢిల్లీకి చెందిన రాహూల్ వోహ్ర యూట్యూబర్. నటుడిగా కూడా మారాడు. ఇటీవల కరోనా బారిన పడడంతో ఢిల్లీ తహీర్పూర్లోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అయితే తన భర్త రాహుల్ తీసుకున్న వీడియోను ఆయన భార్య జ్యోతి చూసి ‘నా భర్త చనిపోయాడని అందరికీ తెలుసు.. కానీ ఎలా చనిపోయాడో చూడండి’ అంటూ రాహుల్ మాట్లాడుతున్న వీడియోను సోమవారం పోస్టు చేసింది. ‘నాకు ఈ రోజు విలువైనది. ఇది (ఆక్సిజన్ పైపు) లేకుంటే నేను లేను. ఈ పైపు నుంచి ఆక్సిజన్ రావడం లేదు. ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదు. అటెండర్లను పిలిస్తే ఒక్క నిమిషం అని అంటారు. ఇక అటే వెళ్తారు. కొన్ని గంటలైనా రారు. రోగుల పరిస్థితి అర్ధం చేసుకోరు. ప్రతి రాహుల్‌కు న్యాయం జరగాలి’ అంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్ ప్రారంభించారు. ఈ ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్లో మార్మోగుతోంది. దేశంలో ప్రతి రోగి పరిస్థితి రాహుల్ మాదిరి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాహుల్‌కు న్యాయం జరగాలని.. మరో రాహుల్ బలి కాకుండా చర్యలు చేపట్టాలని ట్వీట్లు చేస్తున్నారు. రాహుల్ మృతికి సంతాపం తెలుపుతూనే ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని, బెడ్లు, వ్యాక్సిన్, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని నెటిజన్లతో పాటు ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఇప్పటివరకూ లాక్డౌన్ విధించిన రాష్ట్రాలు ఇవే! చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా View this post on Instagram A post shared by Jyoti Tiwari (@ijyotitiwari) -
‘కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు’
సాక్షి, హిమాయత్‌నగర్: ఆక్సిజన్ అందక కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఎవరూ మరణించలేదని వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆదివారం మరణించిన ముగ్గురివీ సహజ మరణాలని స్పష్టం చేశారు. ఈ విపత్తు వేళలో ఆక్సిజన్ లేక మరణించారన్న వార్తలు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని చెప్పారు. ఆదివారం ఆక్సిజన్ అందక ముగ్గురు మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ ఓపీ వద్ద పరిస్థితి, ఎంతమంది చికిత్స పొందుతున్నారనే విషయాలను వైద్య బృందం నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా అవుతున్న గదిని, ఆక్సిజన్ నింపే ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజతో కలసి పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఆస్పత్రుల్లో సహజ మరణాలు జరుగుతూనే ఉంటాయని, ఆదివారం చనిపోయిన ముగ్గురు కూడా సహజంగానే చనిపోయారని పునరుద్ఘాటించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నయం కాకపోవడంతో చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు ఎవరూ రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరాపై ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఉందని, ఆ కమిటీ ఆక్సిజన్ నిల్వలు, అవసరాలపై నిత్యం మానిటరింగ్ చేస్తుందని పేర్కొన్నారు. కాగా, కింగ్‌కోఠి ఆస్పత్రికి 46 కేజీల ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 50 సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలో ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ జెనరేటర్ నిర్మాణం పూర్తవుతుందని, అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చదవండి: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ -
ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత
‘‘మనందరం ఎంతో కొంత సాయం చేయాల్సిన తరుణం ఇది. ప్రతి ఒక్కరికీ మనం సాయం చేయలేకపోవచ్చు. కానీ మన సహాయం కొద్దిమందికి ఉపయోగపడినా చాలు’’ అంటున్నారు హీరోయిన్ ప్రణీత. ఈ విషయం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మా ఫౌండేషన్ తరఫున చాలామంది కరోనా బాధితులకు అన్నదానం చేశాం. ఇటీవల కూడా కొంత మొత్తాన్ని సేకరించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను కోవిడ్ ఆస్పత్రులకు ఇచ్చాం’’ అన్నారు. ఇంకా కరోనా జాగ్రత్తల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు. నేనైతే వీలు కుదిరినంతవరకు కాలు బయటపెట్టడంలేదు. బయటకు వెళ్లి నాతో పాటు నా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టలేను. అందుకే ఇంట్లో నుంచే సాయం చేయాలనుకున్నాను. నా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కోవిడ్ బాధితులకు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నాను. ఇది కొందరికి ఉపయోగపడినా చాలు. నేనే కాదు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సహాయం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రణీత. -
ఈ వాహనాలకు టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు..!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరతతో రోజు వందల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఆస్పత్రులకు వాయు, రోడ్డు, రైలు మార్గాలగుండా ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్‌ను రవాణా చేసే ట్యాంకర్లపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల మీదుగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మోసే ట్యాంకర్లు, కంటైనర్లకు టోల్ ఫీజును మినహాస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్హెచ్ఎఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ట్యాంకర్లు, కంటైనర్లను అంబులెన్స్ వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా చూడాలని ప్రకటించారు. కాగా ఈ వాహనాలను టోల్ ఫీజు నుంచి రెండు నెలలపాటు మినహాయింపును ఇచ్చింది. తదుపరి ఆదేశాల వచ్చేంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని ఎన్హెచ్ఎఐ పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌కు గణనీయంగా డిమాండ్ ఏర్పడటంతో ఎన్హెచ్ఎఐ ఈ నిర్ణయం తీసుకుంది. Toll Fee for Tankers Carrying Liquid Medical Oxygen exempted on National Highways. Click here for more details: https://t.co/GmiogH1l8D — NHAI (@NHAI_Official) May 8, 2021 చదవండి: Break The Chain: లాక్‌డౌన్‌పై ఉత్కంఠ! -
ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌న్యూస్
సాక్షి, హైదరబాద్: కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృస్టిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత కారణంగానే ఎక్కువమంది మృత్యువాతపడుతున్నారు. అయితే కరోనా సోకిన వీరిలో చాలా వరకు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆక్సిజన్ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. కోవిడ్ కష్ట కాలంలో ఆక్సిజన్ కొరత నెలకొన్న తరుణంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓ శుభవార్త అందించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చైనీస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సరిగా చేయడం లేదన్నారు. అదే తను చెప్పబోయే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గాలి నుంచి వాయువులను పీల్చుకొని ఫిల్టర్ ద్వారా నైట్రోజన్, 98శాతం కచ్చితమైన ఆక్సిజన్‌ను వేరు చేసి నైట్రోజన్‌ను బయటకు పంపి ఆక్సిజన్‌ను పైపు ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇటీవల సిలీండర్లు దొరకడం లేదని, ఒకవేళ దొరికినా తొందరగా అయిపోతుందన్నారు. జపాన్‌లో రూపొందించిన ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంట్‌తో నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని కరెంట్ పెడితే 30 రోజులు ఏకధాటిగా వాడుకోవచ్చని తెలిపారు. ఇప్పుడే రీఫిల్లింగ్ అవసరం లేదని, ఏడాది.. రెండేళ్ల తరువాత మార్చుకోవచ్చన్నారు. వీటిలో ఒకటి యజ్ఞ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన కజిన్ అనిత మరో రెండు విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక వికారాబాద్, చేవెళ్లలో 15, 20 బెడ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ Chinese oxygen concentrators don't work well. The specs say the oxygen flow is 5 liters/min at 97% purity, but they barely deliver barely 3 liters of oxygen at 80% purity. So my cousin Anitha and I are donating 3 German made Oxygen Concentrators to Yagyna Foundation in Vikarabad. pic.twitter.com/egPLZXGkiO — Konda Vishweshwar Reddy (@KVishReddy) May 8, 2021 -
కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల విజృంభణ, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు, ఆక్సిజన్ పంపిణీ కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు 6 నెలల కాలపరిమితితో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులైన 12 మందిని అందులో సభ్యులుగా చేర్చింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రణాళికను రూపొందించే బాధ్యతను కూడా ఆ కమిటీకి అప్పగించింది. అలాగే, ఎయిమ్స్‌కు చెందిన రణదీప్ గులేరియా, మాక్స్ హెల్త్‌కేర్‌కు చెందిన సందీప్ బుధిరాజా, సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని ఇద్దరు ఐఏఎస్ అధికారులతో ఒక సబ్ కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా, నగరంలో వైద్య వ్యవస్థ మౌలిక వసతులను ఆ కమిటీ సమీక్షిస్తుంది. విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారం జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా కేంద్ర కేబినెట్ సెక్రటరీని, ఎక్స్ అíఫీషియో మెంబర్‌గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం నియమించింది. ఈ మేరకు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెబ్సైట్లో శనివారం అప్లోడ్ చేశారు. టాస్క్‌ఫోర్స్‌లో బాబాతోష్ బిశ్వాస్(వెస్ట్‌బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్‌లర్), దేవేందర్ సింగ్ రాణా(ఢిల్లీ్లలోని సర్ గంగారామ్ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్పర్సన్), దేవీప్రసాద్ శెట్టి(బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్ చైర్పర్సన్, ఈడీ), గగన్‌దీప్ కాంగ్(వెల్లూర్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్) తదితరులున్నారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శాస్త్రీయ ప్రణాళికలను టాస్క్‌ఫోర్స్ నిపుణులు రూపొందిస్తారని, అలాగే, విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవసరాల మేరకు ఆక్సిజన్ డిమాండ్, సరఫరాలపై శాస్త్రీయ అంచనా సహా 12 విధులను కోర్టు ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఇందుకు రాష్ట్రాల వారీగా సబ్ కమిటీలను టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ సబ్ కమిటీల్లో ఆయా రాష్ట్రాల కార్యదర్శి స్థాయి అధికారి, అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పేషెంట్ల చికిత్స సమయంలో వైద్యులు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం కాదని, మెడికల్ ఆక్సిజన్ పంపిణీ, వినియోగంలో పారదర్శకత నెలకొనాలని, అవసరాల మేరకు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా జరగాలనేదే తమ ఉద్దేశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ నివేదికను సమర్పించేంతవరకు.. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు తమకు మధ్యంతర నివేదికలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించింది. -
రాష్ట్రానికి కేటాయింపులు పెంచండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కేటాయింపులను పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాని గురువారం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. తమిళనాడు లోని శ్రీపెరంబదూర్, కర్ణాటకలోని బళ్లారి నుం చి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ రావడం లేదని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వైద్య సేవల కోసం నగరంపైనే ఆధారపడుతున్నారని తెలియజేశారు. కరోనా చికిత్స కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రోగులు హైదరాబాద్‌కు వస్తుండటంతో నగరంపై ఒత్తిడి పెరిగిందని, దీంతో ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమిడెసివిర్ కు తీవ్రంగా కొరత ఏర్పడుతోందని వివరించారు. రాష్ట్రానికి రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుతోందని, 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రోజుకు 4,900 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని, వాటిని 25 వేలకు పెంచాలని కోరారు. ఇప్పటివరకు కేంద్రం రాష్ట్రానికి 50 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేసిందని, రాష్ట్రంలో రోజుకు 2–2.5 లక్షల డోసుల వాక్సిన్ల అవసరం ఉందని, వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి కేసీఆర్ విన్నవించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేసీఆర్‌తో మాట్లాడారు. ప్రధానికి చేసిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ను సత్వరమే సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూస్తామన్నారు. -
"అలా జరిగితే ఒక్కరిని కూడా చావనివ్వం"
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆక్సిజన్ కొరతపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఢిల్లీకి సరిపడా ఆక్సిజన్ సరఫరా చేస్తే.. ప్రాణవాయువు కొరతతో ఒక్కరిని కూడా చనిపోనివ్వను అన్నారు. ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలో ఇప్పటికే పలువురు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "మాకు రావాల్సిన మేరకు ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయిస్తే.. ఢిల్లీలో ప్రాణవాయువు కొరతతో ఒక్క మరణం కూడా సంభవించదు. సరిపడా ఆక్సిజన్ లభిస్తే మేం ఢిల్లీలో 9,000-9,500 పడకలు ఏర్పాటు చేస్తాం. ఆక్సిజన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. మేం మీకు హామీ ఇస్తాం.. మాకు సరిపడా ఆక్సిజన్ సరఫరా చేస్తే.. ప్రాణవాయువు కొరతతో ఢిల్లీలో ఒక్కరు కూడా మరణించారు" అన్నారు. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఆరోగ్య సంక్షోభంలో ఢిల్లీ ఆసుపత్రులు, రోగులకు సరిపడా ఆక్సిజన్ అందించలేకపోయినందుకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హర్యానాకు ప్రాధాన్యత ఇవ్వగా.. ఢిల్లీకి అధికారికంగా కేటాయించిన ఆక్సిజన్ మొత్తంలో కేంద్రం సగం పరిమాణాన్ని మాత్రమే సరఫరా చేస్తుందని ఆరోపించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,12,262 కొత్త కోవిడ్ కేసులను నమోదు కాగా 3,980 మరణాలను వెలుగు చూశాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 2.1 కోట్ల దాటిపోయాయని.. మరణాలు 2,30,168 గా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: అధికారులను జైలులో పెడితే ఆక్సిజన్ రాదు: సుప్రీంకోర్టు -
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్‌లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది. కర్ణాటకలో నలుగురు మృతి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్‌గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఐదుగురు కరోనా బాధితులు మృతి డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది. తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
అధికారులను జైలులో పెడితే ఆక్సిజన్ రాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ధిక్కరణ ఉత్తర్వులపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది. గత మూడు రోజులుగా దేశ రాజధానికి కేంద్రం ఎంత ఆక్సిజన్‌ను సరఫరా చేసిందని కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. ‘‘ఢిల్లీకి ప్రతిరోజు 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అని.. ఈ మేరకు సరఫరా చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. ‘‘అధికారులను జైలులో పెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం రెండు కోవిడ్ కట్టడికి ఉత్తమంగా కృషి చేయాలి. ఢిల్లీకి ఇవ్వాల్సిన కోటా మేరకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయండి’’ అని కోర్టు ఆదేశించింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాపై వివరాలు ఇవ్వాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. చదవండి: సెకండ్‌వేవ్: లాక్‌డౌన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు -
ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి
సాక్షి, అనంతపురం: ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8-9 గంటల మధ్యన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని తెలిపారు. లోపాలు సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు -
ఆక్సిజన్ అందక 24 మంది మృతి
మైసూరు: దేశంలో మెడికల్ ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న దారుణ ఘటనలు ఆగేలాలేవు. ఇందుకు కొనసాగింపుగా కర్ణాటకలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 గంటల వ్యవధిలో 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన 24 మందిలో 23 మంది కోవిడ్ బాధితులే. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో ఆస్పత్రి ఆవరణం దద్దరిల్లింది. అయితే కోవిడ్ బాధితులందరూ ఆక్సిజన్ కొరత కారణంగానే మరణించారా? మరేదైనా ఆరోగ్య సమస్యా? అనేది ఇంకా నిర్ధారించలేదని జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి అన్నారు. ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి శివయోగి నేతృత్వంలో విచారణ చేపడతామని రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుల బంధువులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చామరాజనగర్ ఘటన కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ సోమవారం ఉదయం చామరాజనగర్ ఆస్పత్రిని పరిశీలించారు. కేవలం మగ్గురు ఆక్సిజన్ అందక మరణించారన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి సూచించినట్లు హోం మంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. రాహుల్ గాంధీ ఆగ్రహం ‘కోవిడ్ బాధితులు చనిపోయారా? లేక చంపేశారా?. బీజేపీ సర్కార్ మేల్కొనేలోపు ఇంకా ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాలి?’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘యడియూరప్ప ప్రభుత్వం నిర్లక్ష్యంతో చేసిన హత్య ఇది’ అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. -
బెంగళూరులో ఆక్సిజన్ కొరత: 24 మంది మృతి
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల ఆక్సిజన్ కొరత వల్ల కోవిడ్ పేషెంట్లు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా కర్ణాటకలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతి చెందారు. చామరాజనగర్‌లో ఉన్న కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన కోవిడ్ బాధితులంతా ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతోనే వారు మరణించారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పించినట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మృతి చెందిన వారి పోస్టుమార్టం నివేదికలు వస్తే బయటపడతాయని అన్నారు. కాగా మృతి చెందిన రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, అదీకాక వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఆర్.రవి వెల్లడించారు. వారు కచ్చితంగా ఆక్సిజన్ కొరతతో మరణించారా లేదా అన్న అంశం తేలాల్సి ఉందన్నారు. ఈ విషాద ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప.. చామరాజనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Corona Cases in India: కరోనా విస్ఫోటం -
హృదయ విదారకం: తల్లికి నోటితో శ్వాసనందించిన కూతురు..
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మరణహోమం సృష్టిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఆసుపత్రిలో బెడ్స్ లేక, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమ వారిని కాపాడుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. రాష్ట్రంలోని భైరాచి జిల్లాలోకో మహిళ ఇటీవల కరోనా బారిన పడింది. కోవిడ్ బాధితురాలిని ఆమె ఇద్దరు కూతుళ్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించే లోపే బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. దీంతో తమ తల్లిని ఎలాగైనా కాపాడుకోవడం కోసం ఓ కూతురు తన నోటితో శ్వాస అందిస్తూ అమ్మను బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. ఇక దృశ్యాలు చూసిన ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు చలించిపోయారు. కోవిడ్ బారినపడి ఊపిరాడక అల్లాడిపోతున్న తల్లిని కాపాడుకునేందుకు కూతురు పడ్డ కష్టం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్లోఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ భార్య తన భర్తకు నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించింది. ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ అనే మహిళ.. కరోనా సోకిన తన భర్త రవి సింఘాల్‌ను కాపాడుకోవడానికి ఎవ్వరూ చేయని సాహసం చేసింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త నోటిలో నోరు పెట్టి శ్వాసనందించింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. భర్త ప్రాణాలు నిలవలేదు. కరోనా కాటుకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. చదవండి: ఏప్రిల్ నెల వచ్చిందంటే దేశవాసుల గుండెల్లో రైళ్లు #CoronaVirus: इन दिनों पूरा देश ऑक्सीजन की कमी से जूझ रहा है।ऑक्सीजन की कमी से मरने वालों की खबरें लगातार सामने आ रही हैं। बहराइच के एक अस्पताल में कोरोना संक्रमित महिला को जब ऑक्सीजन नहीं मिली तो लाचार बेटी ने मुंह से सांस देने का प्रयास किया। ये वीडियो काफ़ी वायरल हो रहा। pic.twitter.com/cODPxzT64o — amit singh (@Join_AmitSingh) May 2, 2021 -
ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి
కర్నూలు (హాస్పిటల్): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రి కేఎస్ కేర్‌లో శనివారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్వహణ వైఫల్యంతో ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. వీరిలో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఆర్ఎస్ పెండేకల్‌కు చెందిన మద్దిలేటి (40), డోన్‌కు చెందిన అనంతయ్య (70), ఎమ్మిగనూరు మండలం నందవరం గ్రామానికి చెందిన హంపమ్మ(65)తోపాటు వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన రఘునాథరెడ్డి(40), కడపకు చెందిన జైనాబీ (53) ఉన్నారు. మరొకరు వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అయితే ఆక్సిజన్ అందకపోవడమే మరణాలకు కారణమని చెప్పలేమని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్‌కు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి మరో ముగ్గురు మృతి! ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స అందిస్తున్న కేఎస్ కేర్ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి కూడా ముగ్గురు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా.. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్న విషయం తెలుసుకున్న మిగిలిన రోగుల బంధువులు వారిని హుటాహుటిన ఇతర ఆస్పత్రులకు తరలించారు. తమవారిని కాపాడుకునేందుకు ప్రైవేటుగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి.. వారికి అమర్చి కాపాడుకునే ప్రయత్నం చేశారు. అనుమతులు లేకుండానే.. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కేఎస్ కేర్ హాస్పిటల్ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నా.. ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు అనుమతి నిరాకరించారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ రోగులను చేర్చుకుని రెండు వారాలుగా చికిత్స అందిస్తోంది. యాజమాన్యంపై క్రిమినల్ కేసు అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం అందించిన కేఎస్ కేర్ ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఎండీ డాక్టర్ లాల్‌బహుదూర్ శాస్త్రిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్‌తో కలిసి ఆయన ఆస్పత్రికి చేరుకుని ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరులో ప్రైవేటు ఆస్పత్రిపై అధికారుల దాడులు గుంటూరు రూరల్: అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స చేస్తూ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిపై శనివారం అధికారులు దాడులు చేశారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరులోని ప్రవీణ్ ఆస్పత్రి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అనుమతులు తీసుకోకుండా కోవిడ్‌కు చికిత్స అందిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆస్పత్రికి ఒక వలంటీరును పంపి కోవిడ్ పరీక్ష చేయించారు. దీనికి ఆస్పత్రిలోని ల్యాబ్ అసిస్టెంట్ రూ.3,500 వసూలు చేశాడు. పరీక్ష రసీదును తీసుకున్న వలంటీర్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆస్పత్రిలో 12 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండటాన్ని గుర్తించారు. ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో రోగి వద్ద కోవిడ్ పరీక్షకు రూ.3,500, రోజుకు ఒక బెడ్‌కు రూ.30 వేలు, ఇతర ఇంజక్షన్లు, చికిత్స నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం అధికారుల దృష్టికొచ్చింది. దీంతో డాక్టర్ ప్రవీణ్‌తోపాటు మరో వైద్యుడిపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి రికార్డులను సీజ్ చేశారు. -
ఆక్సిజన్ కొరత ప్లానింగ్ లోపమే!
భారతదేశం ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు తగినంత ఆక్సిజన్ అందేలా చూడటంలో దేశం మొత్తం విఫలమవుతోంది. ఆక్సిజన్ లేమి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే రెండు ఆసుపత్రులు సకాలంలో ఆక్సిజన్ అందక యాభైమంది మరణించినట్లు ప్రకటించాయి. ఆసుపత్రుల బయట రోగుల క్యూలు, ఆక్సిజన్ సిలిండర్లతో పడుకుని ఉన్న రోగుల వీడియోలు టీవీ చానళ్లలో కనిపిస్తూంటే గుండె బరువెక్కిపోతోంది. సామాన్యుడిలో భయం మరింత పెరుగుతోంది. ఇవే వీడియోలు ప్రపంచం మొత్తం ప్రత్యక్షమవుతూండగా.. చాలామంది కోవిడ్ నిర్వహణలో భారత్ విఫలమైందని ఆరోపణలూ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకుండా వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందే. ఉదాహరణకు... అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను తీసుకుందాం. అన్నీ సవ్యంగానే ఉన్నాయని సీఎం స్వయంగా ప్రకటించారు. కానీ టీవీ చానళ్లలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలా ఎంతకాలమని వాస్తవానికి దూరంగా రాజకీయాలు చేస్తూంటాం? ముందు చూపు లేకపోవడమే... దేశంలో ప్రస్తుత పరిస్థితికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడం, పర్యవేక్షించడం వంటి వాటిల్లో దారుణంగా విఫలమయ్యాము. తప్పులను మాత్రమే ఎత్తి చూపుకుంటూ రాజకీయాలు నడుపుతున్నాం. నైతికంగా ఈ పరిస్థితికి ఎవరూ బాధ్యత కూడా వహించడం లేదు. భారత్‌లో ఇలాంటిది కొత్త కాకపోయినా పరిస్థితిని చక్కదిద్దేందుకు కనీసం కొందరిపై వేటు పడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న నేతలు ఒకరిద్దరైనా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. దేశం మొత్తమ్మీద ఆక్సిజన్ ఉత్పత్తికి పెద్దగా సమస్యల్లేకపోయినా.. ఢిల్లీ వంటి నగరాల్లో అకస్మాత్తుగా పెరిగిన కేసులకు తగ్గట్టుగా సరఫరా లేదన్నది మాత్రం కఠిన వాస్తవం. సమస్య రవాణాకు సంబంధించింది. ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఎక్కువగా పశ్చిమబెంగాల్, ఒడిశా, కొన్ని పశ్చిమ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల నుంచి ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలంటే రోజుల సమయం పడుతుంది. ద్రవ ఆక్సిజన్‌ను వాయుమార్గంలో తీసుకొచ్చే అవకాశం లేదు. మరోవైపు రోడ్డుపై ఆక్సిజన్‌ను రవాణా చేసేందుకు తగినన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడం ఇంకో సమస్య. ఇవన్నీ పరిశీలిస్తే.. తొలి దఫా కోవిడ్ కేసుల తరువాత ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక ఏమీ చేయలేదా? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతాలకూ అవసరమైన ప్రాంతాలకూ మధ్య అంతరం చాలా ఉందన్నది కూడా వాస్తవం. భారత్‌లో ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏడాది క్రితమే ఈ సమస్యలన్నింటినీ ఊహించి తగిన సిఫారసులు చేసిన మాట నిజమే. అందుకు తగ్గట్టుగా 150 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు జారీ చేసింది కూడా. వీటి ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ ఇప్పటివరకూ కేవలం 33 ప్లాంట్లు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఢిల్లీలో ఒకే ఒక్క ప్లాంట్ సిద్ధమైంది. పర్యవేక్షణ కొరవడింది ఎందుకు? ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను కేటాయించినప్పుడు దాన్ని అందుకుని సమర్థంగా పంపిణీ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఢిల్లీలో ఒక్క క్రయోజెనిక్ ట్యాంక్ కూడా లేదు. ఎందుకు? కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు కానీ.. సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం రెండూ అవసరమైన వాటిని దిగుమతి చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి. ఫలితంగా పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈ మధ్యకాలంలో బ్లాక్‌మార్కెటీర్లు ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ మందులను అక్రమంగా నిల్వ చేసుకుని డబ్బులు దండుకోవడం మొదలు పెట్టారు. సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఇప్పుడు ఆక్సిజన్ కొరత నివారణకు ఏం చేస్తున్నారని ప్రభుత్వాలను ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ఏ చర్య అయినా కానీ దేశంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగున ఉండే చిన్న ఆసుపత్రులకు ఈ ఆసుపత్రుల నుంచే ఆక్సిజన్ సరఫరా జరగాలి. దీనికి అదనంగా దేశం మొత్తమ్మీద అన్ని ప్రాంతాల్లోనూ ద్రవ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో తగినన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లు ఉండాలి. వీటితోపాటు ప్రధాన నగరాల్లో ఊపిరితిత్తులను దెబ్బతీసే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరత నివారణకు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. నిపుణులు సూచించిన వినూత్నమైన ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత కాలావధిలో ఈ పనులను చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో కరోనా మరోసారి విజృంభించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఆ సందర్భంలో వైద్య వ్యవస్థ కుప్పకూలకుండా ఇప్పటినుంచే చర్యలు మొదలుపెట్టాలి. బి.ఎల్. వోరా, మాజీ ఐపీఎస్ అధికారి -
కర్నూలులో విషాదం
-
ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి
సాక్షి, కర్నూలు: కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. అనుమతి లేకుండానే కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్ తెలిపారు. కర్నూలులోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి చెందారు. అనుమతి లేకుండానే కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో కోవిడ్ వైద్యానికి అనుమతి లేదు కలెక్టర్ స్పష్టం చేశారు. ఘటనపై డీఎంహెచ్ఓ విచారణ చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రిగా నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారనితెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. కేఎస్కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్‌ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వం/జిల్లా యంత్రాంగం అనుమతి లేకుండా అనధికారికంగా కోవిడ్ ఆస్పత్రులు లేదా కోవిడ్ కేర్ సెంటర్స్ నడిపితే క్రిమినల్ కేస్ పెడతాం... సీజ్ చేయిస్తామని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం చదవండి: ఈటల మాట ఎత్తకుండానే టీఆర్ఎస్ ప్రెస్‌మీట్ -
ఆక్సీజన్ లెవల్స్: ప్రోనింగ్ టెక్నిక్ అంటే తెలుసా?
రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది బాధితులు ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇలాంటి కొందరిలో ఆరోగ్య పరిస్థితి మరీ సీరియస్‌గా లేకపోయినా.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతుండటం కనిపిస్తోంది. అలాంటి వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయులను సహజంగా పెంచుకునేలా ‘ప్రోనింగ్’ అనే టెక్నిక్ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్వల్పంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో.. ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోకుండా ఉండేందుకు, వీలైతే స్థాయులు పెరిగేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుందని సూచించింది. అసలు ఈ ప్రోనింగ్ టెక్నిక్ ఏమిటి? ఎలా చేయాలి? శ్వాస సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.. ప్రోనింగ్ టెక్నిక్ అంటే? ఊపిరి సరిగా అందని సమయంలో బోర్లా పడుకోవడం, పక్కలకు తిరగడం, వాలుగా కూర్చోవడం వంటివి చేయడమే ప్రోనింగ్. కరోనా సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆవశ్యకత ఏంటి? ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారు రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా గాలి పీల్చుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. వాయుకోశాలు తెరుచుకోవడం ద్వారా శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఆక్సిజన్ లెవల్స్ 94 కన్నా తగ్గితే ప్రోనింగ్ ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు. ప్రోనింగ్‌కు ఏమేం కావాలి? ప్రోనింగ్‌కు కావాల్సిందల్లా 4 నుంచి 5 దిండ్లు. బోర్లా పడుకుని ఒక దిండు తల కింద పెట్టుకోవాలి. 1 లేదా 2 దిండ్లు ఛాతీ నుంచి తొడల వరకు నిలువుగా ఉంచుకోవాలి. రెండు దిండ్లు మోకాళ్ల కింద నిలువుగా ఉంచుకోవాలి. ఏ పొజిషన్లో కూడా ఎక్కువ సేపు పడుకోవద్దు. 30 నిమిషాలకోసారి పడుకునే పొజిషన్లను మారుస్తూ ఉండాలి. సొంతంగా కదలగలిగితే పేషెంట్ స్వయంగా దీనిని అనుసరించవచ్చు. పేషెంట్ సొంతంగా కదిలే పరిస్థితి లేకుంటే కొందరి సాయంతో ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది. సొంతంగా ఎలా చేయాలి..? ప్రతి పొజిషన్ కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. రెండు గంటలకు మించి మాత్రం ఒకే పొజిషన్లో ఉండొద్దు. పొజిషన్–1: బోర్లా పడుకోవాలి. పొజిషన్–2: కుడివైపు తిరిగి పడుకోవాలి. పొజిషన్–3: వాలుగా కూర్చోవాలి. పొజిషన్–4: ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. పొజిషన్–5: తిరిగి మొదటి పొజిషన్లో పడుకోవాలి. అంటే బోర్లా పడుకోవాలి. ఎవరు ప్రోనింగ్ చేయొద్దు? ► గర్భంతో ఉన్న వారు ప్రోనింగ్ చేయొద్దు ► సిరల్లో రక్తం గడ్డ కట్టుకుపోయిన వారు (వీనస్ త్రాంబోసిస్) (48 గంటలలోపు చికిత్స తీసుకున్నవారు) ► తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారు ► వెన్నెముక, తొడ ఎముక, కంటి ఎముకలకు తీవ్రంగా గాయాలైన వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► ఆహారం తీసుకున్న గంట వరకు ప్రోనింగ్ చేయొద్దు. ► ఏ పొజిషన్లో అయినా భరించగలిగినంత సేపు మాత్రమే పడుకోవాలి. ► శరీర భాగాలపై ఒత్తిడి తగ్గించేందుకు దిండ్లను మార్చుకుంటూ ఉండొచ్చు. ► ఎక్కడైనా నొప్పి కానీ, బొబ్బలు కానీ వస్తున్నాయో గమనించాలి. ► పెద్దగా ఇబ్బందేమీ లేకుంటే ప్రోనింగ్ను రోజుకు 16 గంటల వరకు దశలు దశలుగా చేయొచ్చు. కదలలేని పేషెంట్లకు ప్రోనింగ్ ఎలా? ► పలుచటి బెడ్‌షీట్ ఉపయోగించి రోగిని బెడ్‌పై ఒక పక్కకు జరపాలి. ► పేషెంట్‌ను ఒక పక్కకు తిప్పి మరో బెడ్‌షీట్‌ను పరచాలి. తర్వాత పేషెంట్‌ను మరోవైపునకు తిప్పి ఆ బెడ్‌షీట్‌ను రెండోవైపు లాగాలి. ► ఆ బెడ్షీట్లను పైకి లాగుతూ.. పేషెంట్ బోర్లా పడుకునేలా తిప్పాలి. అదే సమయంలో దిండ్లను ఛాతీ కింద, మోకాళ్ల దిగువన ఏర్పాటు చేయాలి. ► తర్వాత రోగిపై బెడ్‌షీట్‌ను తొలగించాలి. ► ఇదే తరహాలో బెడ్షీట్లను ఉపయోగిస్తూ పేషెంట్‌ను పక్కలకు తిప్పాలి. (చదవండి: టీకా వేసుకున్నా కరోనా వస్తుందా? వస్తే రెండో డోసు పరిస్థితి ఏమిటి? ) -
శభాష్ ప్యారే ఖాన్: రూ.కోటితో ఆక్సిజన్ ట్యాంకర్లు
నాగపూర్: కరోనాతో అల్లాడుతున్న నాగపూర్ ఆస్పత్రులకు నగరానికి చెందిన ప్యారే ఖాన్ ఉదారతతో ఆక్సిజన్ అందే ఏర్పాట్లు చేశారు. ట్రాన్స్పోర్ట్ కంపెనీ అధిపతైన ఖాన్ నగరానికి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను సొంత డబ్బును వెచ్చించి తెప్పించారు. ఇందు కోసం ఆయన దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. పవిత్ర రంజాన్ ఆరంభమైందని, ఈ సందర్భంగా తనవంతు బాధ్యతగా చేయాల్సిన జకాత్ (దాక్షిణ్య కార్యక్రమాలు)కు సొమ్ములిచ్చే బదులు అవే డబ్బులను రోగుల కోసం ఆక్సిజన్‌ను తెప్పించేందుకు ఉపయోగిం చాలని నిర్ణయించానని ఖాన్ తెలిపారు. తొలుత ఆయన బెంగుళూరు నుంచి అధిక ధర వెచ్చించి ట్యాంకర్లు తెప్పించారు. అనంతరం నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ సాయంతో విశాఖపట్నం నుంచి ట్యాంకర్లను తెప్పించామని తెలిపారు. ఇవేకాకుండా ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో 116 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు రూ.50 లక్షలు విరాళమిచ్చినట్లు తెలిపారు. ఖాన్ సాయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ కొనియాడారు. చదవండి: లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు -
ఆక్సిజన్ కొరతకు అధికారుల చెక్
గన్నవరం: కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చూపిన చొరవ సత్ఫలితాలనిచ్చింది. చెన్నై, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను గుర్తించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కోవిడ్ ఆస్పత్రులకు 19 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. మొదట చెన్నై నుంచి తెలంగాణలోని ఖమ్మంకు వెళుతున్న క్యూమెన్ ఎయిర్ ప్రొడక్ట్ ఏజెన్సీకి చెందిన ట్యాంకర్ 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో గన్నవరం మండలం సూరంపల్లికి వచ్చింది. విజయవాడ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉంగుటూరు తహసీల్దార్ వనజాక్షి సదరు కంపెనీ యజమానితో చర్చలు జరపడంతో 13 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ఇవ్వడానికి అంగీకరించారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్‌ను కూడా అధికారులు ఆపారు. సదరు సంస్థ ప్రతినిధులతో మాట్లాడి 6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచేందుకు ఒప్పించారు. సీఐ కోమాకుల శివాజీ, ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పారదర్శకతే ప్రస్తుతావసరం
ఒక జాతీయ సంక్షోభం ఏర్పడినప్పుడు మౌన సాక్షిగా మిగిలిపోవడం సాధ్యంకాదని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పిన తీరు దేశంలో వర్తమాన స్థితిని ప్రతిబింబిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్షోభం నెలకొన్న సంగతి నిజమే అయినా, దాన్ని అన్ని ప్రభుత్వాలు ఒకే తీరుగా ఎదుర్కొ నడంలేదు. ఇందువల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్‌కు ఎంత మాత్రం కొరత లేదని, కావాలని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. అలాంటివారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కానీ అయోధ్యకు చెందిన ఒక జంట కేవలం ఆక్సిజన్ కొరత కారణంగా అక్కడి ఆసుపత్రులు చేర్చుకోవడానికి నిరాకరించటంతో 850 కిలోమీటర్లు అంబులెన్సులో ప్రయాణించి పశ్చిమబెంగాల్లోని హుగ్లీకొచ్చి ఒక ఆసుపత్రిలో చేరాల్సివచ్చింది. అలాగే బెడ్లు, వెంటిలేటర్లు, కరోనా రోగులకు ఇచ్చే రెమిడెసివిర్ వగైరాల కొరత కూడా. వెబ్సైట్లలో వాటి లభ్యత గురించి కనిపిస్తున్న అంకెలకూ, వాస్తవ పరిస్థితికీ పొంతన ఉండటం లేదు. ఒక పెను విపత్తు విషయంలో ప్రభుత్వాలు ఇలా వ్యవహరించకూడదు. రెమిడెసివిర్ వంటి ఔషధాలు, ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్లో భారీ రేటు పలుకుతున్నాయి. ఇక వ్యాక్సిన్ల ధరల విషయంలోనూ అయో మయ స్థితి ఏర్పడింది. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న దేశంలోని రెండు సంస్థలూ వేర్వేరు ధరలు ప్రక టించాయి. కనీసం ప్రభుత్వాలకిచ్చే టీకాల ధరలైనా ఒకే విధంగా లేవు. కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర. ప్రైవేటు ఆసుపత్రులకు మరో ధర. అంతిమంగా వయోజనుల్లో కనీసం 70 శాతం మంది... అంటే 65 కోట్ల 70 లక్షలమంది వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరైనప్పుడు ఇన్ని రకాల ధరలుంటే అవి గమ్యం చేరుతాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ధరల సంగతలా వుంచి అంతమందికి అవసరమైన టీకాల ఉత్పత్తి ఎప్పటికి పూర్తవుతుందన్నది ప్రశ్న. రెండో దశ కరోనా వైరస్ తీవ్రతపై సకాలంలో సరైన అంచనాలుంటే, దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించి వుంటే ఇప్పుడున్న పరిస్థితి తలెత్తేది కాదు. కనుక ఈ సంక్షోభంపై సమీక్షించి, అవసరమైన ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతించాల్సిందే. సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు విచారణ మొదలుపెట్టినప్పుడు రాష్ట్రాల హైకోర్టుల్లో వున్న కేసుల్ని తన వద్దకు తెచ్చుకోవడానికే ఈ ప్రయత్నం జరుగుతోందని కొందరు తప్పుబట్టారు. ఈ విష యంలో మరోసారి సుప్రీంకోర్టు స్పష్టతనీయడం హర్షించదగింది. స్వాతంత్య్రానంతరం దేశం ఆరోగ్యపరమైన సంక్షోభాలను అనేకం చవిచూసింది. అయితే ప్రతిసారీ ప్రభుత్వాలే చొరవ ప్రదర్శించి రోగులకు ఔషధాలనూ, వ్యాక్సిన్లనూ పంపిణీ చేశాయి. ఇప్పటికీ ఇదే సరైనది. చదువుకున్నవారూ, స్తోమతవున్నవారూ పరిస్థితుల్ని గ్రహించి సకాలంలో ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రయత్నిస్తారు. కానీ గ్రామసీమల్లో వున్న నిరక్షరాస్యులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన వుండదు. ఉన్నా అంత ఖర్చు పెట్టే స్తోమత వుండదు. టీకాలను వేర్వేరు ధరలకు విక్రయించుకోవడానికి ప్రభుత్వమే అనుమతిస్తే సహజంగానే మెజారిటీ పౌరులకు అవి లభ్యమయ్యే పరిస్థితి వుండదు. దానికితోడు రాష్ట్రాలు వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో చర్చించుకుని టీకాలు తెచ్చుకోవాలని చెప్పడం కూడా సరికాదు. ఇందువల్ల రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడుతుంది. ఎవరికి టీకాలివ్వాలో ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారు. డిమాండ్ ఆధారంగా ధరను పెంచినా పెంచొచ్చు. నిరుడు దేశం అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొందని అందరికీ తెలుసు. సుదీర్ఘ లాక్ డౌన్లు అన్ని వర్గాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. కానీ వ్యాక్సిన్లు లభ్యమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాటి చుట్టూ ఒక మాయ అల్లుకుంటే... అందరికీ సక్రమంగా అందుబాటులోకి రాకుంటే అంతకుమించిన ఉత్పాతం దేశం చవిచూడాల్సి రావొచ్చు. మీడియాలో రోజూ కనబడు తున్న శవ దహనాలైనా, శ్మశానవాటికల ముందు క్యూ కడుతున్న అంబులెన్సులైనా ప్రజానీకంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. భవిష్యత్తుపై బెంగటిల్లే స్థితిని కల్పిస్తున్నాయి. ఒకపక్క ఈ ఏడాది ఆర్థికంగా కోలుకుని 11 శాతం అభివృద్ధిని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం భరోసా ప్రకటించింది. రేపన్నరోజు ఎలావుంటుందో తెలియని అయోమయం ఏర్పడినప్పుడు ఆర్థిక రంగం పుంజుకోగలుగుతుందా? అందుకే ప్రతిష్టకు పోకుండా ఇప్పుడు తక్షణం చేయాల్సిందేమిటన్న అంశంపై అందరితో చర్చించాలి. మన దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటాన్ని, దాని పర్యవ సానాలనూ అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అందుకే అనేక దేశాలు సాయం చేయడానికి సిద్ధపడ్డాయి. వ్యాక్సిన్‌లో ఉపయోగించే ముడిపదార్థాల ఎగుమతికి మొన్నటివరకూ నిరాకరించిన అమెరికా తన వైఖరి మార్చుకుంది. ‘ఇంటికి గుట్టు... రోగానికి రొష్టు’ వుండాలం టారు. కరోనా వంటి పెనుసంక్షోభాన్ని ఎదుర్కొనాలంటే ఎప్పటికైనా పారదర్శకతే తోడ్పడుతుంది తప్ప గోప్యత కాదు. అన్ని రకాల కొరతలనూ ప్రజల దృష్టికి తీసుకురావడం, వాటిని నివారిం చేందుకు అవస రమైన చర్యలు తీసుకోవడం, కృత్రిమ కొరత కారకుల్ని గుర్తించి శిక్షించడం ఇప్పటి అవసరం. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే సూచనలు శిరోధార్యం కావాలి. -
కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్!
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): కరోనా బాధితులకు ఆక్సిజన్ దొరక్క ఆస్పత్రుల్లో మృత్యువాత పడుతున్న ప్రస్తుత తరుణంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఓ మత్స్యకారుడు ఆదివారం చేపలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసి విక్రయించాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మత్స్యకారుడు పప్పు ప్రభాకర్ చేపలు విక్రయించేందుకు ట్రాక్టర్లో వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేసి దానికి ఆక్సిజన్ బిగించాడు. బతికిఉన్న చేపలు కొనడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారని, అందుకే చేపలకు ఇలా ఆక్సిజన్ అందిస్తూ విక్రయిస్తున్నట్లు తెలిపాడు. -
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
-
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆక్సిజన్ ప్రవాహం తక్కువ కావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. సకాలంలో అధికారులు స్పందించి, 15 మంది రోగులను వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ స్పందిస్తూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు. సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇతర అనారోగ్య కారణాల వల్లే ఇద్దరు చనిపోయారని స్పష్టం చేశారు. ఖాళీ అయిన సిలిండర్లు ఎప్పటికప్పుడు నింపుతున్నామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు అదే విధంగా ఈ ఘటనపై డీప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు. 15 మంది రోగులను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో 296 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 150మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్ సరఫరా -
భారత్‌కు సౌదీ నుంచి 80 టన్నుల ఆక్సిజన్
దుబాయ్: తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు సౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్‌ను పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్‌లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్ ట్యాంకులు నౌకలో దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. Thank you @IndianEmbRiyadh. Indeed, actions speak louder than words. We are on an urgent mission to secure oxygen supplies from across the world. This first shipment of 4 ISO cryogenic tanks with 80 tons of liquid oxygen is now on its way from Dammam to Mundra. (1/3) https://t.co/BLZ0SbQ499 pic.twitter.com/lFKnx0hIhX — Gautam Adani (@gautam_adani) April 24, 2021 -
ఆక్సిజన్ కాన్సట్రేటర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఎక్కడా సిలిండర్లు దొరకని పరిస్థితులు ఉండటంతో అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. దీన్ని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ తరహాకు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. సిద్ధి అంబర్‌బజార్ ప్రాంతానికి చెందిన ఆనంద్ శర్మ ఆక్సిజన్ కాన్సట్రేటర్ మిషన్ ఖరీదు చేయాలని భావించారు. విద్యుత్‌తో పని చేసే ఈ యంత్రం చుట్టూ గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను సమీకరించి రోగికి అందిస్తుంది. ఇది స్థానికంగా మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో నరీన ఆక్సిజన్ కాన్సట్రేటర్ పేరుతో ఓ సంస్థ వివరాలు కనిపించాయి. వారిని ఫోన్లో సంప్రదించగా... అవసరమైన యంత్రాలు పంపిస్తామంటూ రూ. 2.73 లక్షలు బదిలీ చేయించుకుని మోసం చేశారు. మరో ఉదంతంలో సికింద్రాబాద్ వాసి ఇలాంటి యంత్రం విక్రేతల వివరాలు చెప్పాలని తన స్నేహితుడిని కోరారు. ఆయన ద్వారా మరో స్నేహితుడి నంబర్ వచ్చింది. ఇలా మొత్తం ఆరుగురిని సంప్రదించారు. ఆఖరి వ్యక్తి ఇండియా మార్ట్ వెబ్సైట్లో చూసి ఓ నంబర్ ఇచ్చారు. సికింద్రాబాద్ వ్యక్తి ఆ నంబర్‌కు ఫోన్ చేసి రెండు యంత్రాలు కావాలని చెప్పారు. ఒక్కోటి రూ. 52,700 సరఫరా చేస్తానని చెప్పిన సైబర్ నేరగాడు రూ. 1,05,400 బదిలీ చేయించుకుని మోసం చేశారు. వీరిద్దరి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి నకిలీ సంస్థలు మరిన్ని సోషల్ మీడియా, ఇంటర్నెట్ల్లో ఉన్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో ఆగని మృత్యుఘోష -
ఆక్సిజన్, టీకాల దిగుమతికి ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత 15 పరికరాలపై దిగుమతి సుంకాన్ని మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. వీటిపై హెల్త్ సెస్‌ను కూడా తొలగించింది. ఈ మినహాయింపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్–19 టీకాల దిగుమతిపైనా మూడు నెలలపాటు దిగుమతి సుంకాన్ని మినహాయించింది. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, టీకాల దిగుమతిపై సుంకం మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, ఇళ్లలో కరోనా చికిత్సకు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాతోపాటు రోగుల సంరక్షణకు అవసరమైన పరికరాల సరఫరాను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి సూచించారు. ఆక్సిజన్, వైద్య సామగ్రి లభ్యతను పెంచడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్లపై.. కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 3 నెలల కాలానికి మినహాయించాలని నిర్ణయించారు. దీనివల్ల ఆక్సిజన్, వైద్య పరికరాల లభ్యత పెరుగుతుందని, చవకగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయా పరికరాల దిగుమతికి కస్టమ్స్ క్లియరెన్స్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రెవెన్యూ శాఖను ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల కస్టమ్స్ క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కస్టమ్స్ జాయింట్ సెక్రెటరీ గౌరవ్‌ను నోడల్ అధికారిగా ప్రభ్వుత్వం నామినేట్ చేసింది. సాధారణంగా మెడికల్ ఆక్సిజన్‌పై 5 శాతం, వ్యాక్సిన్లపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి నేపథ్యంలో ఈ సుంకాల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆక్సిజన్ సంబంధిత పరికరాలపై 5 నుంచి 15 శాతం కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం హెల్త్ సెస్ వసూలు చేస్తారు. వీటి నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది. మినహాయింపు లభించేవి ► మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ► ఆక్సిజన్ జనరేటర్లు ► ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబుల సహిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ► వాక్యూమ్ ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్, ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ ► ఆక్సిజన్ కానిస్టర్ ► ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్ ► ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్స్, ట్యాంక్స్, క్రయోజెనిక్ సిలిండర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం ఐఎస్వో కంటైనర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం క్రయోజెనిక్ రోడ్ రవాణా ట్యాంకులు ► ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ లేదా నిల్వ కోసం పరికరాల తయారీకి విడిభాగాలు ► ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఇతర పరికరాలు ► వెంటిలేటర్లు, కంప్రెషర్లు, విడిభాగాలు ► హై ఫ్లో నాజల్ కాన్యులా డివైజ్ ► నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్‌లో వాడే హెల్మెట్లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ ఓరోనాసల్ మాస్క్‌లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ నాసల్ మాస్క్‌లు -
ఢిల్లీలో ఆగని మృత్యుఘోష
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగింది. ఢిల్లీలోని తమ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ సరిపడ పీడనంతో సరఫరా కాకపోవడంతో కన్నుమూశారని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డీకే బలూజా చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయానికి మా ఆస్పత్రిలో 200 మంది రోగులున్నారని, కేవలం అరగంటకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. వీరిలో 80 శాతం మంది రోగులకు కృత్రిమ ఆక్సిజన్ అవసరమని, మిగతా వారిని ఐసీయూలో ఉంచామని చెప్పారు. ఇంకా కష్టాల్లోనే గంగారాం ఆస్పత్రి ‘మాకు రోజుకు 11వేల ఘనపు మీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ మా వద్ద కేవలం 200 ఘనపు మీటర్ల ఆక్సిజన్ ఉంది. రోగులు తమ సొంత ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రిలో చేరుతున్నారు. అందరు ఉన్నతాధికారలు, నోడల్ అధికారులను కలిశాం. వందల ఫోన్‌కాల్స్ చేశాం. స్పందన శూన్యం. మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది’ అని పరిస్థితిని గంగారాం ఆస్పత్రి చైర్పర్సన్ డీఎస్ రాణా వివరించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమవడంతో కోవిడ్ బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సాయంచేయండంటూ ఢిల్లీ ఆస్పత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి. ఏదో విధంగా ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకోండంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి, జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి, బాత్రా ఆస్పత్రి, సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచాలి. లేదంటే ఆక్సిజన్సరఫరాను అడ్డుకునే ఏ వ్యక్తినైనా సరే మేం ఉరితీస్తాం. ఎవరికీ వదిలిపెట్టం’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రప్రభుత్వ హామీ ఇచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా 380 మెట్రిక్ టన్నులఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం కేవలం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. వాల్వ్ మూసేయడంతో ఇద్దరి మృత్యువాత మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసే వాల్వ్‌ను ఎవరో మూసేయడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్లు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వాల్వ్ మూసేసి ఉన్న సమయంలో ఏ రోగీ కృత్రిమ ఆక్సిజన్‌పై లేరని ఆస్పత్రి సిబ్బంది చెబుతుండగా, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతోనే ఇద్దరూ మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగనుంది. పంజాబ్‌లో ఆరుగురి మృతి కోవిడ్ బాధితులకు సరిపడ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌లోని నీలకంఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కోవిడ్ బాధితులు శనివారం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరణించారు. ఆక్సిజన్ కొరతపై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయితే, ఆక్సిజన్ కొరత తీవ్రతను పేర్కొనలేదని, కేవలం సంబంధిత వాట్సప్ గ్రూప్‌లో ఒక చిన్న మెసేజ్ మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం పంపిందని రాష్ట్ర వైద్య విద్య మంత్రి చెప్పారు. మృతి ఘటనపై పంజాబ్ సీఎం విచారణకు ఆదేశించారు. -
సీఎంలకు కేజ్రివాల్ లేఖ: ప్లీజ్ మాకు ఆక్సిజన్ పంపండి
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వారికి వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయి. దాంతో పాటు ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆక్సిజన్ ఎక్కడెక్కడ నిల్వ ఉందో పంపించాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శనివారం లేఖ రాశారు. ఆక్సిజన్ లభ్యత ఉంటే దయచేసి మాకు పంపండి అని కోరుతూ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్నా అది చాలడం లేదని అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు. తమ దగ్గర ఉన్న వనరులు చాలడం లేదని గుర్తుచేశారు. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు ట్విటర్లో కేజ్రివాల్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బాధితులకు అందించేందుకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. చదవండి: ఏపీలో ప్రారంభమైన రాత్రి కర్ఫ్యూ.. రోడ్లన్నీ వెలవెల I am writing to all CMs requesting them to provide oxygen to Delhi, if they have spare. Though Central govt. is also helping us, the severity of corona is such that all available resources are proving inadequate. — Arvind Kejriwal (@ArvindKejriwal) April 24, 2021 -
అలాంటి వారిని ఉరి తీస్తాం: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు మూడు లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ఈ సారి ఆక్సిజన్ వినియోగం అత్యధికంగా ఉంది. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు దగ్గరపడుతుండటంతో కొత్త వారిని చేర్చుకోవడం లేదు. ఇక ఢిల్లీ, రాజస్తాన్ వంటి చోట్ల ఆక్సిజన్ కొరతతో పలువురు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సప్లైని అడ్డుకునే వారిని ఉరి తీస్తామని హెచ్చరించింది. ఆక్సిజన్ కొరతపై రాష్ట్రంలోని మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విపిన్ సంఘి, రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సరఫరా అడ్డుకునే వారికి సంబంధించి ప్రభుత్వం ఎవరిమీద అయినా తమకు ఫిర్యాదు చేస్తే.. కోర్టు సదరు వ్యక్తిని తప్పక ఉరి తీస్తుంది అని తెలిపింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఎంత పెద్ద అధికారి అయినా సరే.. తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. అంతేకాక ఇలాంటి అధికారుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం వారి వారి మీద తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టు వెల్లడించింది. చదవండి: వ్యవస్థ ఇలా నాశనమవుతోంది: సుప్రీంకోర్టు -
కోవిడ్ రోగులకు ఊపిరి ఆడట్లే
కోవిడ్ రోగులకు ఊపిరి ఆడట్లే..అందట్లే. బెడ్లు లేక..రోగులను చేర్చుకోక నగర ఆస్పత్రుల్లో విపత్కర..దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయి. చికిత్సలో అతిముఖ్యమైన ఆక్సిజన్ అందక వందలాది మంది రోగులు విలవిల్లాడుతున్నారు. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్ కోసం ఆరేడు ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేక శుక్రవారం ఒక మహిళ అంబులెన్స్‌లోనే మృతిచెందడం ఇందుకు తార్కాణం. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా..కేవలం 260 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో వందలాది ఆస్పత్రులు ఆక్సిజన్ లేదంటూ సీరియస్ రోగులకు అడ్మిషన్లు నిరాకరిస్తున్నాయి. వెంటిలేటర్ రోగులను ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటూ వదిలించుకుంటున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటిలేటర్లు, వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్లే కోవిడ్ రోగులను చేర్చుకోవడం లేదు. ‘ఉప్పల్ సమీపంలోని 150 పడకల స్పెషాలిటీ ఆస్పత్రి అది. కోవిడ్ రోగులకు 30 పడకలు కేటాయించగా, వీటిలో 9 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి. ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందే 25 మందికి రోజుకు 60 లీటర్ల ఆక్సిజన్ అవసరమైతే..ఒక్క ఐసీయూ వెంటిలేటర్ రోగికే హై ఫ్రీక్వెన్సీలో 60 లీటర్లు అవసరం అవుతుంది. రోగుల అవసరాలకు రోజుకు కనీసం పది సిలిండర్ల ఆక్సిజన్ అవసరం కాగా...ప్రస్తుతం రోజుకు ఒకటి రెండుకు మించి సరఫరా కావడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్యులు ఐసీయూ చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉన్న వారిని కూడా ఇతర ఆస్పత్రులకు తరలించారు’ .. ఇలా ఒక్క ఉప్పల్‌లోని స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాదు..25 నుంచి 150 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రులన్నీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రిలో రోగులకు సరిపడా వెంటిలేటర్లు, వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రాణవాయువు సహా రెమిడెసివిర్ వంటి మందులు లేక ఆయా చికిత్సలను నిరాకరిస్తున్నాయి. ఇంటికి సమీపంలో ఉన్న స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్సలు అందక...గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. రోజువారీ ఆక్సిజన్ డిమాండ్: 384 టన్నులు సరఫరా చేస్తున్నది: 260 టన్నులు రెమిడెసివర్ ఇంజెక్షన్లు అవసరం: 4 లక్షలు కేటాయించింది: 21550 ఇంజెక్షన్లు ఒక ఐసీయూ వెంటిలేటర్ రోగికి రోజుకు అవసరమయ్యే ఆక్సిజన్: 60 లీటర్లు 384 టన్నులకు..260 టన్నులే సరఫరా తెలంగాణ వ్యాప్తంగా 62 ప్రభుత్వ, 244 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ చికిత్సలకు అనుమతి పొందాయి. వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 150 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందాలంటే వీటికి రోజుకు కనీసం 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కానీ 260 టన్నులకు మించి సరఫరా చేయడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ ద్వారా లిండే సంస్థ సరఫరా చేస్తోంది. గాంధీకి రోజుకు 26 వేల కిలో లీటర్లు, ఉస్మానియాకు 20, నిలోఫర్‌కు 20, కింగ్‌కోఠికి 13, టిమ్స్‌కు 20 వేల కిలో లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. యశోద, కేర్, కిమ్స్, ఏఐజీ, అపోలో, కాంటినెంటల్, ఎస్ఎల్జీ, కామినేని, సన్‌షైన్, మల్లారెడ్డి, శ్రీకర, గ్లోబల్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎప్పటికప్పుడు నిల్వలు సరిచూసుకుంటున్నాయి. ఆక్సిజన్ కేటాయింపులో ప్రభుత్వం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ పెద్దగా ఆక్సిజన్ సమస్యలు రావడం లేదు. కానీ వంద పడకల్లోపు ఉన్న కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రిలో తగినంత మేర నిల్వలు లేక..డిమాండ్ మేరకు డీలర్లు సరఫరా చేయకపోవడంతో ఆయా ఆస్పత్రులు ఐసీయూ చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. సాధారణ ఆక్సిజన్ అవసరమైన రోగితో పోలిస్తే.. వెంటిలేటర్‌పై ఉన్న రోగికి ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుండటమే ఇందుకు కారణం. అంతేకాదు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను కార్పొరేట్ ఆస్పత్రులకే ఎక్కువ కేటాయిస్తున్నాయి. రెమ్‌డెసివిర్ వంటి మందులను కూడా వాటికే ఎక్కువ సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణకు 4లక్షల రెమ్‌డెసివిర్ మందులు కేటాయించాల్సిందిగా కోరితే...కేవలం 21,550 వాయిల్స్ మాత్రమే కేటాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కేటాయించిన మందులు కూడా కార్పొరేట్ ఆస్పత్రులకే ఎక్కువ సంఖ్యలో మళ్లిస్తుండటం, వంద పడకల్లోపు ఆస్పత్రులకు ఈ ఔషధాలు సరఫరా చేయకపోవడంతో సమస్య తలెత్తుతోంది. దీంతో ఆయా ఆస్పత్రులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు చికిత్సలు నిరాకరిస్తున్నాయి. చేర్చుకున్నా ఆ మందులు తెచ్చుకునే బాధ్యతను రోగుల బంధువులకే అప్పగిస్తున్నాయి. ముడిసరుకు కొరత జీడిమెట్ల: ఆక్సిజన్ తయారీ కోసం వినియోగించే ముడిసరుకు కొరత కారణంగానే ఉత్పత్తి బాగా తగ్గింది. దీంతో మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. జీడిమెట్లలోని ఆక్సిజన్ తయారీ పరిశ్రమల వద్ద సిలిండర్ల కోసం వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. కేవలం డీలర్లేగాకుండా..కరోనా బాధిత కుటుంబాలు కూడా నేరుగా ఫిల్లింగ్ సెంటర్ల వద్దకు వస్తున్నారు. సిలిండర్‌కు ఎంతైనా చెల్లిస్తామంటూ మొర పెట్టుకుంటున్నారు. కరోనా వైరస్ ఉధృతితో రాత్రింబవళ్లు సరఫరా చేసినా డిమాండ్ మేరకు భర్తీ చేయలేకపోతున్నట్లు పలు పరిశ్రమలకు చెందిన నిర్వాహకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఏజెంట్లపైనా ఆసుపత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ‘ఒకప్పుడు వంద సిలిండర్లు సరఫరా చేసేవాన్ని. ఇప్పుడు ఏకంగా వెయ్యి కావాలని డిమాండ్ చేస్తే ఎక్కడి నుంచి తెప్పించగలను. చాలా కష్టంగా ఉంది.’ అని జీడిమెట్లకు చెంది న ఒక ఆక్సిజన్ సరఫరా ఏజెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సిలిండర్ ధర విషయానికి వస్తే నిర్ణయించిన రేటు కంటే ఐదింతలు పెంచేశారు.. నిండుకున్న ముడిసరుకు.. ఆక్సిజన్ ఉత్పత్తికి వైజాగ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ముడిసరుకు రవాణా ఆగిపోయింది. బుక్ చేసిన ముడిసరుకులో 50 శాతమే పంపుతున్నారని పరిశ్రమల నిర్వాహకులు తెలిపారు. ఒక్కో పెద్ద సిలిండర్‌లో 7 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ పట్టే సామర్థ్యం ఉంటుంది. ఒక్క క్యూబిక్ మీటర్‌కు రూ.25 చొప్పున 7 క్యూబిక్ మీటర్లకు గతంలో రూ.175 ఉండేది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర 500 నుంచి రూ.800లకు చేరింది. -
దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో మృత్యుఘోష
-
ఆక్సిజన్ కొరత: ఢిల్లీలో మరో 20 మంది కరోనా రోగులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో మృత్యుఘోష ఆగడం లేదు. శనివారం జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న మరో 20 మంది రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందారు. మరో అరగంటపాటే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని గోల్డెన్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ కొరత వల్లే 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్నొన్నారు. మరో 200 మందికి పైగా కోవిడ్ రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆక్సిజన్ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్ ఆస్పత్రిలో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న రోగులను సరోజ్ ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేస్తున్నాయి. అదే విధంగా ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడింది. బాత్రా ఆస్పత్రికి డిమాండ్‌కు తగ్గట్టు ఆక్సిజన్ సరఫరా కావడం లేదు. 8వేల లీటర్ల ఆక్సిజన్ అవసరం కాగా కేవలం 500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే వస్తుండటంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాత్రా ఆస్పత్రిలో 350 మంది రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌పైనే కోవిడ్ రోగులకు చికిత్స ఆధారపడి ఉందని బాత్రా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ అందకపోతే కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి -
సీఎంలతో సమావేశం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) రవాణాలో వేగం పెంచామని, ఇందులో భాగంగా వైమానిక దళం, రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ కొరతపై ముఖ్యమంత్రుల విజ్ఞప్తులను మోదీ ఆలకించారు. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే వనరుల కొరత అనే మాటే ఉండదని తేల్చిచెప్పారు. పారిశ్రామిక ఆక్సిజన్‌ను కూడా తక్షణ అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్‌గా మార్చి, ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు గుర్తుచేశారు. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, సమన్వయం చేసుకోవాలని ప్రధాని కోరారు. ఆక్సిజన్, అత్యవసర ఔషధాల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ఎక్కడా ఆగిపోకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా తీరును పరిశీలించేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆక్సిజన్ ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని, ఖాళీ ట్యాంకర్లు వెనక్కి వచ్చే సమయాన్ని తగ్గించడానికి అన్ని అవకాశాలను పరిశీలించి, అమలు చేస్తున్నామన్నారు. ఏమీ చేయలేకపోతున్నా: కేజ్రీవాల్ ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రధానికి నివేదించారు. ‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రజలను వారి చావుకు వారిని వదిలేయలేం. ఢిల్లీ ప్రజల తరపున చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. వెంటనే తగిన చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. కొన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ రావాల్సి ఉండగా.. ఆ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లో ఆపేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఒక్క ఫోన్ చేయండి.ఆ వాహనాలను ఆపొద్దని చెప్పండి. ముఖ్యమంత్రి అయి ఉండీ ఏం చేయలేకపోతున్నా. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు ఒక జాతీయ ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళికలో అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ఆర్మీ రక్షణలో ఉంచాలి’’ అని కోరారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించి కేజ్రీవాల్ ప్రసంగాన్ని ఢిల్లీ ప్రభుత్వం మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుపట్టాయి. గతంలో కూడా సమావేశాలు ప్రసారమయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తుచేసింది. ఒకవేళ ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొంది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం చాలా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. డిమాండ్‌ను తీర్చడానికి పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయాలని ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో తగిన పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. ప్రభుత్వం, ఆక్సిజన్ ఉత్పత్తిదారుల మధ్య సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వైద్య అవసరాలను తీర్చడానికి పారిశ్రామిక ఆక్సిజన్‌ను మళ్లించడం గొప్ప పని అని కొనియాడారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర వాయువులను రవాణా చేయడానికి ఉద్దేశించిన ట్యాంకర్లను ఉపయోగించుకోవాలన్నారు. ఆక్సిజన్ చేరవేతకు రైల్వేలు, వైమానిక దళం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని గుర్తుచేశారు. ప్రభుత్వం, రాష్ట్రాలు, పరిశ్రమలు, రవాణాదారులు, అన్ని ఆస్పత్రులు ఏకతాటి పైకి వచ్చి కలిసి పని చేయాలన్నారు. -
ఆక్సిజన్ కోసం ఆరాటం
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడినవారి, దానికి బలైనవారి గణాంకాలు వెల్లడవుతూ ప్రజా నీకాన్ని భయోత్పాతంలో ముంచెత్తుతున్న వర్తమానంలో దేశంలో ‘జాతీయ ఆత్యయిక పరిస్థితి’ ఏర్పడిందని సుప్రీంకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యతో ఏకీభవించనివారుండరు. నిన్నటివరకూ మనతో కలిసి నడిచినవారు, మన కష్టసుఖాల్లో తోడుగా వున్నవారు, నిత్యం మనకు కనబడేవారు హఠాత్తుగా కరోనా బారిన పడ్డారని విన్నప్పుడు, ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారని విన్నప్పుడల్లా మనసు చివుక్కుమంటుంది. ఇప్పుడు మీడియాలో కనబడుతున్న అంకెల వెనక లక్షలాదిమంది జీవితాలున్నాయి. వారిపై ఆధారపడి జీవించే మరిన్ని లక్షలమంది వున్నారు. కరోనా పంజా నుంచి వీరంతా తప్పించుకుని మళ్లీ మామూలు మనుషులు కాలేకపోతే వారిని ఆలంబనగా చేసుకున్నవారి బతుకుల్లో చీకట్లు అలుముకుంటాయి. రెండో దశ కరోనా మొదలయ్యాక పెరుగు తున్న కేసుల సంఖ్యను చూసి గుండెలు బాదుకుంటున్నవారికి గురు, శుక్రవారాల్లో వెల్లడైన గణాం కాలు మరింత భయపెడతాయి. గురువారం 3,14,835 కొత్త కేసులు బయటపడితే...శుక్రవారం మరో 3,32,730 కేసులు వెల్లడయ్యాయి. ఇవి క్షణక్షణం పెరుగుతూనే వున్నాయి. రాగల అయిదారు రోజుల్లో ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, తెలంగాణల్లో కేసుల సంఖ్య అధికంగా వుండొచ్చని శాస్త్ర వేత్తలు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఇలాంటపుడు సహజంగానే పాలకులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. ఫలానావిధంగా చేయడం వల్లనో, చేయకపోవడం వల్లనో పరిస్థితి ఇంతగా దిగజారిందన్న వ్యాఖ్యలు వినబడతాయి. అలాంటి విమర్శలకు తీవ్రంగా స్పందించటం, అవతలివారిని దుమ్మెత్తిపోయడం వివేకవంతమైన చర్య కాదు. సంయమనం పాటించడం, జరుగుతున్నదేమిటో తేటతెల్లం చేయడం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వివరించడం పాలకుల బాధ్యత. అది కేవలం ఆ విమర్శకులకు జవాబు చెప్పడంగా భావించకూడదు. ఒక నిరసన స్వరం వినబడిందంటే దాని వెనక ఎన్నో గొంతులున్నాయని అర్థం. అలాంటివారందరిలో వున్న సందేహాలను తీర్చేలా, వాస్తవ పరిస్థితిని కళ్లముందుంచేలా చెప్పినప్పుడు సహజంగానే అంతా సర్దుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు ఏం చేయాలో చెబుతున్నారు. వారి వారి సమస్యలేమిటో తెలుసుకుంటున్నారు. ఇదంతా హర్షించదగ్గది. అయితే గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతూ, వాటి వెంబడే సమస్యలు తలెత్తినప్పుడు ఆయన కాకపోయినా ప్రభుత్వ పక్షాన ఎవరో ఒకరు మీడియా ముందుకొచ్చి వివరిస్తే, వారడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ పరిస్థితులేమిటో, వున్న పరిమితులేమిటో, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలేమిటో తెలియజెబితే ఇంత చేటు భయాందోళనలుండవు. విచిత్రమేమంటే సుప్రీంకోర్టు దేశంలో కరోనా వల్ల తలెత్తిన సమస్యలపై సుమోటోగా గురువారం విచారణ ప్రారంభించిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వంటివారు సర్వోన్నత న్యాయస్థానం తీరును తప్పుబట్టారు. పదవీ విరమణ చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ వ్యాఖ్యలపై స్పందించిన తీరు గమనించదగ్గది. ఇలా విచారించటం వెనక సుప్రీంకోర్టుకు దురుద్దేశాలు ఆపాదించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవరికైనా ఏ అభిప్రాయాలైనా వుండొచ్చని...కానీ తాము ఇచ్చే ఆదేశాలను చూశాక అలా అనివుంటే వేరని, ముందే ఏదో ఒకటి అంటగట్టడం వల్ల వ్యవస్థ ఔన్నత్యం దెబ్బతింటుందని ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించనివారుండరు. అయితే గత నాలుగైదు రోజులుగా ఆక్సిజన్ దొరక్క ఆసుపత్రులు తిప్పలు పడుతున్న తీరుపై పాలకులు సరిగా స్పందించకపోవటం వల్లే వాతావరణం వేడెక్కిందని గుర్తించాలి. ఆక్సిజన్ లభ్యంకాక రోగులు చనిపోతున్నారంటూ ముంబై వైద్యురాలు కంటతడి పెడుతూ చెప్పిన మాటలైనా, ఆక్సిజన్ కోసం రాష్ట్రాలు పరస్పరం కీచులాడుకోవటాన్ని గమనించినా ఇప్పుడున్న పరిస్థితేమిటో అవగాహన కొస్తుంది. మొత్తానికి ఆక్సిజన్ లోటుపై పాలకులతోసహా అందరూ ఇప్పుడు దృష్టి సారించారు. వాటిని ఉచితంగా అందజేసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత వున్న రాష్ట్రాలు వైమానిక దళం సాయం తీసుకోవటం ప్రారంభమైంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం తెరిచే విషయంలో వివాదంలో చిక్కుకున్న వేదాంత సంస్థ అక్కడ తాము ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి అనుమతించమని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించటం కూడా కొరతను దృష్టిలో వుంచుకునే. వివాదం తేలేవరకూ ఇతరత్రా కార్యకలాపాలపై ఎటూ విధినిషేధాలుంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కరోనా కారణంగా ప్రభుత్వాసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒకరిని డిశ్చార్జి చేస్తే తప్ప మరొకరిని చేర్చుకోలేని స్థితి. ఇంత దయనీయ స్థితి ఏర్పడటం బాధాకరం. ఇందుకు మీడియాను కూడా తప్పుబట్టాలి. పాశ్చాత్య ప్రపంచం ఎదు ర్కొంటున్న రెండోదశ కరోనా ఇక్కడ రాదన్న అభిప్రాయం చాలామందిలో ఏర్పడటానికి, ముందు జాగ్రత్తలు విస్మరించటానికి అది దోహదపడింది. ఎన్నికలు సరేసరి. కనీసం ఇప్పుడైనా అందరూ సంయమనం పాటించాలి. సమష్టిగా దీన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందాలి. ఈ విషయంలో కేంద్రంలోని అధికార పక్షం చొరవ చూపాలి. -
విదేశాల నుంచి ట్యాంకర్ల దిగుమతి!: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కేసులు పెరుగుతుండడంతో అదే స్థాయిలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగిపోతోంది. ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సింగపూర్, యూఈఏతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. మూసివేసిన ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను మళ్లీ తెరవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు లేఖలు రాసింది. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తి పెంపు, సరఫరాపై పలు సూచనలు చేశారు. సింగపూర్, యూఏఈతోపాటు ఇతర దేశాల నుంచి హై కెపాసిటీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ రవాణా విమానాల ద్వారా దిగుమతి చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. -
లక్షల్లో అడిగితే వేలల్లో ఇస్తారా? కేంద్రంపై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీ వైరల్ రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే అందుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతని దుయ్యబట్టారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో 4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు కావాలని కోరితే కేంద్రం కేవలం 21,551 ఇంజెక్షన్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నామన్నారు. టీకాల పంపిణీ తరహాలో రెమిడెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీని కేంద్రం తన నియంత్రణలో పెట్టుకో వడం బాధాకరమన్నారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి ఈటల మీడియాతో మాట్లా డుతూ మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన రోగులు హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఎక్కువగా చేరుతున్నందున ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కువగా పంపాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు చెప్పినా స్పందించలేదన్నారు. విపత్కర సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ముందుకు పోవాల్సింది పోయి ఇలా చేయడం బాధ కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రెమిడెసివర్ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని కోరారు. కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రానికి రెమిడెసివర్ ఇంజక్షన్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరా అంత దూరం నుంచా? తెలంగాణకు బళ్లారి, విశాఖ, ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోందని, దగ్గర ఉన్న ప్లాంట్ల నుంచి కాకుండా 1,300 కి.మీ. దూరంలో ఉన్న ఒరిస్సా నుంచి కేంద్రం ఆక్సిజన్ కేటాయించిందని ఈటల విమర్శించారు. అలాగే చెన్నై నుంచి 20 టన్నులు, పెరంబదూర్ నుంచి 35 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించినా తమిళనాడు ప్రభుత్వం ఆ మేరకు కోటా ఇవ్వడం లేదన్నారు. తమిళనాడు తరహాలో తాము కూడా వ్యవహరిస్తే ఎలా ఉంటుందని ఈటల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లకు కొంత కొరత ఉందన్న ఈటల... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. రాష్ట్రానికి నిత్యం 384 టన్నుల ఆక్సిజన్ అవసరంకాగా ప్రస్తుతం 270 టన్నుల మేర ఆక్సిజన్ అందుతోందన్నారు. గాంధీలో 600 మంది రోగులు ఐసీయూలో... గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 600 మంది కరోనా రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని మంత్రి ఈటల చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగుల పరిస్థితి విషమించాక ప్రభుత్వ ఆస్పత్రులకు పంపడం మానుకోవాలన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ, కర్ణాటకలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని వివరించారు. రాష్ట్రంలో రోజుకు 2 లక్షల కోవిడ్ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈటల వెల్లడించారు. తెలంగాణలోని 104 కేంద్రాల్లో రోజుకు 30 వేల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా మిగతా కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు. లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రుల్లో చేరాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 1,120 ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతిచ్చామని, ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎస్ ఆధ్వర్యంలోని 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం నిత్యం ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివర్ ఇంజక్షన్ల పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తోందన్నారు. చదవండి: భర్తకు కరోనా.. భయంతో ఉరేసుకున్న భార్య చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
Gaurav Rai: ఆక్సిజన్ మ్యాన్
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్.. మరో కోణంలో సమాజంలో అడుగంటిన మానవత్వాన్ని తట్టిలేపుతోంది. కరోనా కారణంగా ఎదురవుతోన్న సమస్యలకు ఒకరికొకరు సాయమందించుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్ కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తూ వందలమంది ప్రాణాలను రక్షిస్తున్నారు. ‘‘కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’. ఈ పరిస్థితిని స్వయంగా అనుభవించిన గౌరవ్.. తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదు అని భావించి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ‘ఆక్సిజన్ మ్యాన్ ’గా అందరి మన్ననలను పొందుతున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్న సమయంలో గౌరవ్ కరోనా బారిన పడ్డారు. అప్పుడు అతనికి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడానికి బెడ్ దొరకలేదు. దీంతో గౌవర్ కరోనా పేషంట్లు ఉన్న వార్డులో మెట్ల పక్కన పడుకున్నాడు. పడుకోవడానికి కాస్త స్థలం దొరికినప్పటికీ.. కరోనాతో అతని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. ఓ ఐదుగంటల తర్వాత గౌరవ్ భార్య నానా తంటాలు పడి ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గౌరవ్ నెమ్మదిగా కోలుకుని బయటపడ్డారు. సిలిండర్ దొరకక తాను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదనుకున్న గౌరవ్ ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలనుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్న గౌరవ్ రాయ్ అనుకున్న వెంటనే గౌరవ్ దంపతులు తమ సొంత డబ్బులతో వాళ్ల ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రోజు ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి గౌరవ్ తన వ్యాగ్నర్ కారులో తీసుకెళ్లి ఇవ్వడం ప్రారంభించారు. ఫేస్బుక్, ట్విటర్లో ఉన్న గౌరవ్ స్నేహితులు ఆక్సిజన్ బ్యాంక్ గురించి ప్రచారం చేయడంతో అవసరమైన వారందరూ గౌరవ్‌కు కాల్ చేసేవారు. వారికి సిలిండర్లను ఉచితంగా ఇచ్చి, ఆ పేషెంట్ కోలుకున్నాక మళ్లీ వెళ్లి సిలిండర్‌ను వెనక్కు తీసుకొచ్చేవారు. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోక పోవడం విశేషం. ప్రారంభంలో ఆక్సిజన్ బ్యాంక్ పది సిలిండర్లతో ప్రారంభమై నేడు 200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన కొందరు దాతలు విరాళాల రూపంలో గౌరవ్‌కు సాయం చేస్తున్నారు. తెల్లవారుజామున ఐదుగంటలకే లేచి.. ప్రారంభంలో గౌరవ్ తనుండే అపార్టుమెంటు లో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేవారు. సిలిండర్ కావాలని కాల్స్ పెరగడంతో తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అర్ధరాత్రి వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి ఇప్పటిదాక దాదాపు వేయ్యిమందికి సిలిండర్లను సరఫరా చేశారు. క్రమంగా సిలిండర్ల సంఖ్య పెంచుతూ బిహార్‌లోని 18 జిల్లాల్లోని కరోనా పేషంట్లకు సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. -
Covid Cases in India: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రతీరోజు అత్యధిక మరణాల రికార్డును సృష్టిస్తూ, సెకండ్ వేవ్ మరింత ప్రాణాంతకమని రుజువు చేస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,023 మంది కరోనాతో మరణించారు. గత సంవత్సరం కోవిడ్–19 అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో అత్యధిక మరణాలు మంగళవారం సంభవించాయి. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 1,82,570 కు పెరిగింది. మరోవైపు కొత్తగా 2,95,041 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. పాజిటివ్ కేసుల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,56,16,130. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,57,538 కు చేరింది. మొత్తం వైరస్ సోకిన వారిలో ఇది 13.82 శాతం. దీంతోపాటు కోవిడ్ కొత్త కేసుల్లో 76 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది. 85 శాతానికి చేరుకున్న రికవరీ రేటు: గత 11 రోజుల్లో రోజువారీ పాజిటివ్ కేసులు రెండింతలు అయ్యాయి. ఏప్రిల్ 9వ తేదీన 1.45 లక్షలు ఉన్న పాజిటివ్ రోగుల సంఖ్య, 21వ తేదీ నాటికి 2.95 లక్షలకు చేరుకున్నాయి. దీంతో రికవరీ రేటు ఇప్పుడు 85 శాతానికి తగ్గిపోయింది. గణాంకాల ప్రకారం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039కి పెరిగింది. మరోవైపు కరోనా మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.2 శాతానికి పడిపోయినప్పటికీ, ఇది మహారాష్ట్రలో 1.5 శాతం, పశ్చిమ బెంగాల్లో 1.6 శాతంగా ఉంది. మరణాలు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాలు పాక్షిక, పూర్తి లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. 8 రాష్ట్రాల్లోనే 77 శాతం మరణాలు: దేశంలో కరోనా కారణంగా ఒక్కరోజులో మరణించిన 2,023 మందిలో 77.02% మరణాలు 1,556 మంది ఎనిమిది రాష్ట్రాల్లోనే తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలో అత్యధికంగా 519 మంది, ఢిల్లీలో 277, ఛత్తీస్‌గఢ్‌లో 191, ఉత్తరప్రదేశ్‌లో 162, గుజరాత్ 121, కర్ణాటకలో 149, పంజాబ్‌లో 60, మధ్యప్రదేశ్‌లో 77 మంది మరణించారు. అలాగే ఆరు రాష్ట్రాల్లో 60 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 62,097, ఉత్తర్‌ప్రదేశ్‌లో 29,574, ఢిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794, కేరళలో 19,577, ఛత్తీస్‌గఢ్‌లో 15,625 కరోనా పాజిటివ్ కొత్త రోగులను గుర్తించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో భారత్ ముందుంది. ఇటీవల భారీ సంఖ్యలో పెరిగిన పాజి టివ్ కేసులతో భారత్ అమెరికా తరువాత రెండో స్థానంలో ఉం ది. కరోనాకు సంబంధించిన కొ త్త వేరియంట్ల కారణంగా పాజి టివ్ కేసులు పెరుగు తున్నా యని నిపుణులు భావిస్తున్నారు. -
చిన్న సంస్థలకు ఆక్సిజన్ కష్టాలు
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రంగాల్లోని చిన్న సంస్థలకు ప్రాణవాయువైన ఆక్సిజన్ అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. దీన్ని వైద్య అవసరాల కోసం కేటాయించాల్సి వస్తుండటమే ఇందుకు కారణం. దీనివల్ల చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్–19 కేసులు పెరిగిపోతుండటంతో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా ఎగిసిన మహారాష్ట్ర, న్యూఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని కంపెనీలపై ఇది ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. అయితే, ఇది ప్రస్తుతానికైతే తాత్కాలిక ధోరణిగానే కనిపిస్తోందని, ఆయా సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. కరోనా వైరస్ పూర్వస్థాయితో పోలిస్తే ఏప్రిల్ రెండో వారంలో (కేసులు భారీగా పెరగడం మొదలైనప్పట్నుంచీ) మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ అయిదు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మెటల్ ఫ్యాబ్రికేషన్ రంగాలకు ప్రతికూలం ‘పారిశ్రామిక వినియోగానికి ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమోటివ్ విడిభాగాలు, షిప్ బ్రేకింగ్, పేపర్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ఆదాయాలపై తాత్కాలికంగా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. సాధారణంగా ఈ రంగాల సంస్థలకు సొంత ఆక్సిజన్ ప్లాంట్లు ఉండవని పేర్కొన్నారు. వెల్డింగ్, కటింగ్ వంటి పనులకు అవసరమైన గ్యాస్‌ల కోసం సరఫరా వ్యాపారస్తులపైనే ఆధారపడాల్సి ఉంటోందని వివరించారు. అలాగని సొంతంగా ప్లాంటు ఏర్పాటు చేసుకోవడమన్నా, ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడమన్నా లాభసాటి వ్యవహారం కాదని, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని గౌతమ్ తెలిపారు. ప్రస్తుతానికైతే పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఎదురవ్వొచ్చని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ప్రభావిత సంస్థలు తమ దగ్గర నిల్వ ఉంచుకున్న ఆక్సిజన్‌తో ప్రస్తుతం గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే, ఆక్సిజన్ సరఫరాకి ఆటంకాలు మరింత దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో మాత్రం కాస్త రిస్కులు తప్పకపోవచ్చన్నారు. రెండు రకాలుగా వినియోగం .. సాధారణంగా ఆన్సైట్ వినియోగానికి, మర్చంట్ సేల్స్ కింద వ్యాపార అవసరాల కోసం విక్రయించడానికి దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. తమ అవసరాల కోసం పరిశ్రమలు సొంతంగా ఏర్పాటు చేసుకునే ప్లాంట్లను ఆన్–సైట్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో సింహభాగం (75–80%) వాటా దీనిదే ఉంటోంది. ఇక, మిగతా 20–25 శాతం వాటా వ్యాపార అవసరాల కోసం విక్రయించే మర్చంట్ సేల్స్ విభాగానిది ఉంటోంది. ద్రవ రూపంలో క్రయోజనిక్ ట్యాంకులు, సిలిండర్ల ద్వారా ఈ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మర్చంట్ సేల్స్ విభాగం కింద వచ్చే ఆక్సిజన్‌లో హెల్త్‌కేర్ రంగం వినియోగించేది కేవలం 10 శాతం మాత్రమే ఉంటోంది. -
కోవిడ్ కేర్ సెంటర్లన్నీ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ సీఎం ఆదేశాల మేరకు తక్షణమే చర్యలు చేపట్టి ఏ ఒక్క పేషెంట్కూ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు. పడకలు, ఆక్సిజన్, ఇంజక్షన్లు, కోవిడ్ చికిత్సకు అనుమతి ఉన్న ఆస్పత్రులకు ఇబ్బంది లేదని, త్వరలో మరిన్ని పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతులన్నీ సిద్ధం.. రాష్ట్రంలో కోవిడ్‌కేర్ సెంటర్లన్నీ పునరుద్ధరిస్తున్నాం. 2020 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లన్నీ (అప్పుడు 115 సెంటర్లు, 49,180 బెడ్లు ఉన్నాయి) శుక్రవారం సాయంత్రం నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. వాటిని పునరుద్ధరించాలని ఇప్పటికే కలెక్టర్లకు సూచించాం. గతంలో మాదిరిగానే భోజన ఏర్పాట్లు, వసతులు అన్నీ సిద్ధం చేస్తున్నాం. ఆక్సిజన్ కొరత లేదు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు బాగున్నాయి. ఒడిశా నుంచి మరో 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఏపీకి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాం. నేటి సాయంత్రం (గురువారం) కల్లా రెండో డోస్ తీసుకోవాల్సిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తాం. దీనికోసం ఏర్పాట్ల్రు పూర్తి చేశాం. 6 లక్షల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది రెండో డోసు ఇవ్వాల్సిన వారందరికీ సరిపోతుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్లు రావాలి.. 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌పై పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మార్గదర్శకాలు రాగానే మే 1వతేదీ నుంచి టీకాలు ఇస్తాం. దీనిపై కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తగినన్ని వ్యాక్సిన్లు రావాల్సి ఉంది. అనుమతి లేని ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్ ఇవ్వలేం రాష్ట్రంలో ప్రస్తుతం 140కిపైగా అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల్లో విధిగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తున్నాం. అనుమతి లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఇంజక్షన్లు లేవనడం సరికాదు. ఏప్రిల్ 1 నుంచి 20వతేదీ వరకు ప్రైవేట్ ఆస్పత్రులకు 67 వేలకు పైగా ఇంజక్షన్లు ఇచ్చాం. వీటిపై ఆయా ఆస్పత్రులు లెక్కలు చెప్పాలి. సోమవారం నుంచి రోజుకు 10 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ప్రభుత్వాసుపత్రులకు వస్తాయి. ప్రైవేట్‌కు 7,000 ఇంజక్షన్లు ఇస్తాం. 300 మంది డాక్టర్లు.. 120 లైన్లతో 104 కాల్‌సెంటర్ కాల్‌సెంటర్‌కు ఎలాంటి కోవిడ్ సమస్యతో ఫోన్ చేసినా వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తారు. 104 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేశాం. కన్సల్టెంట్లుగా 300 మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచే ఇది అందుబాటులోకి వచ్చింది. మూడు షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉంటుంది. తాజాగా మరో 60 లైన్లను అదనంగా చేర్చాం. గతంలో 60 లైన్లే ఉండేవి. అవసరమైతే మరికొంతమంది డాక్టర్లను కూడా నియమిస్తాం. -
ఆసుపత్రుల ముందు ఆక్రందనలు.. ఆర్తనాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులు కిక్కిరిసిపోవడంతో పడకలు ఖాళీ లేక కోవిడ్ బాధితులు అల్లాడుతున్నారు. దగ్గు, ఆయాసం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఒక్క ఆసుపత్రిలోనూ బెడ్ ఖాళీ లేక పేషెంట్లు విలవిల్లాడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. 19,322 కోవిడ్ బెడ్స్‌కు గాను 3,340 ఖాళీగా ఉన్నట్టు, 4,376 కోవిడ్ ఐసీయూ బెడ్స్‌కు గాను 57 ఖాళీగా ఉన్నట్టు ఆన్లైన్ పోర్టల్ చూపుతున్నా.. ఏ ఒక్క ఆసుపత్రి నెంబరూ పలకదు. ప్రతి ఆసుపత్రిలోనూ ఫోన్ బిజీ టోన్ వస్తోంది. టెస్టింగ్ కోసం, ఫలితం కోసం నాలుగైదు రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. లక్షణాలు ఉన్నా ఒకవేళ టెస్టింగ్‌లో వైరస్ దొరక్క నెగెటివ్ వస్తే, చెస్ట్ సీటీ స్కానింగ్ చేయించాలంటే ల్యాబ్‌ల ముందు పెద్దపెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైన డీఆర్డీవో కోవిడ్ ఆసుపత్రిలో 250 పడకలు ఉండగా.. అత్యంత సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు మాత్రమే అడ్మిషన్లు కల్పించినప్పటికీ.. ఇంకా బయట దాదాపు 250కి పైగా ఆంబులెన్స్‌లు పేషెంట్లతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆర్తనాదాలు.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, నాగ్‌పూర్ వంటి నగరాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్లాస్మా కోసం, కోవిడ్ బెడ్ కోసం, ఆక్సిజన్ సిలిండర్ కోసం, వెంటిలేటర్ల కోసం కొందరు, రెమిడెవిసిర్ ఇంజెక్షన్, టాసిలైజుమాబ్ ఇంజెక్షన్ కోసం సోషల్ మీడియా ద్వారా ఆర్తనాదాలు చేస్తున్నారు. కోవిడ్ హెల్ప్, కోవిడ్ ఎమర్జెన్సీ, కోవిడ్ 19, కోవిడ్ సెకెండ్ వేవ్ ఇండియా వంటి హ్యాష్‌టాగ్‌లు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమకు వచ్చిన వినతుల మేరకు స్టేటస్ మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు. టాసిలైజుమాబ్‌కు ప్రత్యామ్నాయంగా వాడే అల్జుమాబ్ వంటి ఔషధాలు కూడా స్టాక్ లేకుండా పోయాయి. కోవిడ్ చికిత్సలో వినియోగించే ఇమ్యునోసిన్ అల్ఫా 1 ఇంజెక్షన్. ఇనోక్జాపారిన్ వంటి ఔషధాలు కూడా వివిధ నగరాల్లో అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న మందులను సైతం బ్లాక్‌లో చెలామణి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానాల ఆగ్రహం.. కోవిడ్ బాధితుల పరిస్థితి విషమిస్తుండడంతో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 26 వరకు యూపీలోని 5 నగరాల్లో లాక్డౌన్ విధించాలని ఆదేశించింది. ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నో, గోరఖ్‌పూర్, కాన్పూర్ నగరాల్లో లాక్డౌన్ విధించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు కూడా లాక్డౌన్ లేదా కర్ఫ్యూ విధింపునకు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చింది. చదవండి: మానవ తప్పిదంతో కరోనా వేగంగా వ్యాప్తి -
ఆ షేర్లకు ‘ఆక్సిజన్’!
న్యూఢిల్లీ: పేరులో ఏముంది అంటారు గానీ ఒక్కోసారి ఆ పేరే అదృష్టం తెచ్చిపెట్టవచ్చు. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (బీవోఐఎల్) అనే కంపెనీయే దీనికి తాజా ఉదాహరణ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పేషంట్ల ట్రీట్మెంట్కు ఆక్సిజన్ డిమాండ్ భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ లాంటి వాయువుల తయారీ కంపెనీలకు మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు గ్యాస్‌ల తయారీ సంస్థల షేర్లను కొనేందుకు ఎగబడుతున్నారు. బీవోఐఎల్కి కూడా ఇదే కలిసి వచ్చింది. కంపెనీ పేరులో ఆక్సిజన్ అని ఉండటంతో ఇన్వెస్టర్లు బీవోఐఎల్ షేర్ల కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా ర్యాలీ చేస్తున్న సంస్థ షేరు సోమవారం బీఎస్ఈలో అప్పర్ సర్క్యూట్ తాకింది. రూ. 24,575 దగ్గర ఆగింది. పేరులో ఆక్సిజన్ అని ఉన్నప్పటికీ తత్సంబంధ వ్యాపారాలేమీ చేయడం లేదంటూ కంపెనీ చెబుతుండటం గమనార్హం. ఆక్సిజన్ వ్యవహారం.. సందేహాస్పదం.. వాస్తవానికి కంపెనీ వెబ్‌సైట్‌లోని హోంపేజీ ప్రకారం 1960లో బాంబే ఆక్సిజన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో సంస్థ ప్రారంభమైంది. అయితే, 2018 అక్టోబర్ నుంచి కంపెనీ పేరు బాంబే ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (బీఐఎల్)గా మారింది. ప్రధాన వ్యాపారం పారిశ్రామిక గ్యాస్‌ల తయారీ, సరఫరానే అయినప్పటికీ 2019 ఆగస్టు నుంచి దాన్నుంచి తప్పుకున్నట్లు ప్రస్తుతం షేర్లు, ఫండ్లు తదితర సాధనాల్లో పెట్టుబడుల ద్వారానే ఆదాయం ఆర్జిస్తున్నట్లు కంపెనీ తన వెబ్సైట్లో పేర్కొంది. అంతే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (ఎన్బీఎఫ్సీ)గా ఆర్బీఐలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ .. వెబ్‌సైట్‌లోని ’ఉత్పత్తులు’ సెక్షన్లో మాత్రం ఇప్పటికీ ఆక్సిజన్, ఇతర పారిశ్రామిక గ్యాస్‌ల పేర్లు అలాగే కొనసాగుతుండటం గమనార్హం. ఆ సెక్షన్లో కంపెనీ తనను తాను ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి పారిశ్రామిక గ్యాస్‌ల తయారీ సంస్థగాను, డీలర్గాను పేర్కొంటోంది. కానీ బీఎస్ఈలోని కంపెనీ పేజీలో మాత్రం సంస్థ ఎన్బీఎఫ్సీగానే నమోదై ఉంది. ఈ గందరగోళ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని, ఇన్వెస్టర్లకు లేటెస్ట్ సమాచారం అందించాలని కంపెనీకి బీఎస్ఈ ఏప్రిల్ 8న సూచించింది. సంస్థ మాత్రం తాము ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను ఇస్తూనే ఉన్నామంటూ బదులిచ్చింది. ప్రత్యేక దృష్టి.. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ షేర్లు గత కొద్దిరోజులుగా భారీగా ర్యాలీ చేశాయి. మార్చి ఆఖరు నాటికి సుమారు రూ. 10,000 స్థాయిలో ఉన్న షేరు ధర కొన్నాళ్లలోనే ఏకంగా రెట్టింపయ్యాయి. కంపెనీ పేరులో ఆక్సిజన్ అన్న పదం ఉండటమే ఈ ర్యాలీకి కారణమని మార్కెట్ వర్గాలు అం టున్నాయి. దీనితో పాటు సంస్థ వ్యాపార వ్యవహారాలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఈ దీన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో దీనితో పాటు పాత, కొత్త పేర్లలో ’గ్యాస్’, ’ఆక్సిజన్’ అన్న పదాలుండీ, ఇటీవల ర్యాలీ చేసిన ఇతర షేర్లపైనా దృష్టి సారించినట్లు వివరించాయి. -
Oxygen Cylinder Shortage in Hyderabad: అందని ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలు నిలబెట్టే ఈ ప్రాణవాయువును కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వాడకూడదని.. కేవలం కరోనా ఆసుపత్రులకు మాత్రమే వినియోగించాలని ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలు జారీ చేసినా ఏ కంపెనీ కూడా ఖాతర్ చేయడంలేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరిగా అందక రోగులు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఆక్సిజన్, ఐసీయూ పడకలపై ఉన్న రోగులకు పూర్తిస్థాయిలో కాకుండా కొంచెం కొంచెం మాత్రమే ఆక్సిజన్ అందిస్తూ నెట్టుకొస్తున్నారు. వీఐపీ రోగులైతే పైరవీలు చేయించుకొని పూర్తిస్థాయిలో ప్రాణవాయువు పొందుతుండగా.. సాధారణ రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆస్పత్రులు అయితే వారికి కొద్దిసేపు ఇచ్చి.. కొద్దిసేపు ఆపేస్తున్నాయి. రోగి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంటే తప్ప ఆక్సిజన్ వాడటంలేదు. మూడింతలు పెరిగిన డిమాండ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా ఆసుపత్రుల అవసరాలకు దాదాపు 165 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని అంచనా. అయితే, గత 2,3 రోజులుగా డిమాండ్ మూడింతలు పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 165 మెట్రిక్ టన్నుల్లో 40 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు, మిగిలింది ప్రైవేటు ఆస్పత్రులకు కావాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఆస్పత్రులకు ట్యాంకర్ల ద్వారా వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేసి.. అక్కడ నుంచి పైపుల ద్వారా రోగుల పడకల వద్దకు సరఫరా చేస్తారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండటంలేదు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వీటికి 99 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 60 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని అంటున్నారు. అంతేకాకుండా అవి సాధారణ పడకలను కూడా ఆక్సిజన్ పడకలుగా మార్చడంతో డిమాండ్ మరింత పెరిగింది. ఇష్టారాజ్యంగా ధరలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకట్రెండింటికి మినహా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థ లేదు. అక్కడ సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయి. ఇది మొత్తం డ్రగ్ కంట్రోల్ విభాగం ద్వారా జరుగుతుంది. ఆస్పత్రులకే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లు అవసరం. ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించిన మేరకు వాటిని కేటాయించాలి. ఎంతమంది రోగులు ఐసీయూ, ఆక్సిజన్ పడకలపై ఉన్నారో ఆ మేరకు సిలెండర్లు ఇవ్వాలి. కానీ డిమాండ్‌కు తగిన విధంగా అవి రావడంలేదని అంటున్నారు. పైగా ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు వాటిని విక్రయిస్తున్నారు. 22 క్యూబిక్ లీటర్ల పెద్ద సిలెండర్ ధర గతంలో రూ. 3,080 నుంచి రూ.3,740 ఉండేది. అంటే లీటర్‌కు రూ.140 నుంచి రూ.170 వరకు పడేది. ఇప్పుడు దానిని రూ.7,700 నుంచి రూ.8,580 వరకు విక్రయిస్తున్నారు. అంటే.. లీటర్‌కు రూ.350 నుంచి రూ.390 వరకు పడుతోందన్నమాట. ఇక పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం ఇదే సిలెండర్‌ను రూ.10 వేలైనా వెచ్చించి కొంటున్నారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారనే విమర్శలున్నాయి. ఇంతగా ధరలు పెంచడంతో ఆక్సిజన్ కొనలేక కొందరు, కొరత వల్ల కొన్ని ఆసుపత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ కొంచెం ఆక్సిజన్ సైతం దక్కనీయకుండా కొన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు గుత్తాధిపత్యం వహిస్తున్నాయని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యజమాని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పడకలు కూడా లేవని పలువురు రోగులను ప్రైవేటు ఆస్పత్రులు వెనక్కి పంపుతున్నా.. డ్రగ్‌కంట్రోల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్‌లో రెమిడెసివీర్.. తుసిలిజుమాబ్ ఆక్సిజన్ సంగతి పక్కన పెడితే.. కరోనా రోగులకు వినియోగించే ఔషధాల విషయంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. కరోనా బాధితులకు కీలకమైన సమయంలో రెమిడిసివీర్ ఇస్తారు. కేంద్రం సిఫార్సు చేయకపోయినా తుసిలిజుమాబ్‌ను కూడా కొన్ని ఆసుపత్రులు ఇస్తున్నాయి. ఇవి యాంటీ వైరల్ డ్రగ్స్ అయినా కూడా కొన్ని ఆసుపత్రులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నాయి. వాస్తవానికి వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులే రోగుల సంఖ్యను ఆధారం చేసుకొని ఇస్తుంటారు. అయితే, ఆస్పత్రులు మాత్రం వాటి కొరత ఉందంటూ రోగులనే తెచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రూ.5,600 ధర ఉన్న రెమిడిసివీర్ ఇంజెక్షన్‌ను ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నాయి. ఇక తుసిలిజుమాబ్ ధర రూ.12 వేలు కాగా, రోగుల నుంచి ఏకంగా రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రి ఒక రోగికి ఏకంగా రూ.75 వేలకు తుసిలిజుమాబ్ ఇచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రులు ఇలా రోగులను దోపిడీ చేస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పట్టించకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ప్రైవేట్ లేబరేటరీల్లో రూ.550కు చేయాల్సిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1200 నుంచి రూ.1400 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీపీఆర్ కిట్ ధర రూ.65కి తగ్గినా.. ఆ మేరకు ధర తగ్గించడంలేదు. చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం -
మరోసారి పెద్దమనసు చాటిన ముఖేష్ అంబానీ..!
ముంబై: భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగులు మరణిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కరోనా పేషెంట్ల కోసం తన వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. రిలయన్స్ నుంచి రాష్ట్రానికి 100 టన్నుల ఆక్సిజన్ గ్యాస్ నిల్వలను అందించనున్నట్లు మహారాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే ట్విటర్లో పేర్కొన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి మహారాష్ట్రకు ఎటువంటి ఖర్చు లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ తన పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ యూనిట్ల కోసం వాడే కొన్ని ఆక్సిజన్ నిల్వలను కరోనా రోగుల కోసం వినియోగించనున్నారు. रिलायन्स च्या जामनगर प्लँट मधून महाराष्ट्रासाठी १०० मेट्रिक टन अतिरिक्त ऑक्सिजन पुरवठा होणार. विभागीय आयुक्त, रायगड व ठाणे जिल्हाधिकारी आणि एफडीए आयुक्त यांची समन्वय समिती ऑक्सिजन पुरवठ्याबाबत समन्वयाचे काम करेल. — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) April 13, 2021 చదవండి: ముంబై: మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు -
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత..!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో అనేక మంది కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత డిమాండ్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో సుమారు 70 శాతం అవసరం ఉంది. కానీ అవసరం మేరకు సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమే. దాన్ని సరిదిద్దుకోవాలని మేం సూచించాం. లిక్విడ్ ఆక్సిజన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే కోరాం. ఒకట్రెండు ఆసుపత్రులు మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలినవన్నీ సాధారణ ఆక్సిజన్ సిలెండర్లపైనే ఆధారపడుతున్నాయి’అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడిందని తెలిపారు. రోగులను చేర్చుకుని ఆక్సిజన్ అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారానికి సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ మరో వారం రోజుల్లో వస్తుందని పేర్కొంది. రెమిడెసివిర్‌కు తీవ్ర కొరత.. రెమిడెసివిర్ ఇంజెక్షన్ల విషయంలోనూ ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య తీవ్రమైన ఆధిపత్యం కొనసాగుతోంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోని కొన్నింటికి రెమిడెసివిర్ అందట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో రెమిడెసివిర్ అమ్ముడవుతోంది. దాని సాధారణ ధర రూ.5 వేలు కాగా, బ్లాక్ మార్కెట్లో రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వద్ద మాత్రం ప్రస్తుతం 45 వేల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం మరో 15 రోజుల వరకు అవి సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, 3 నెలలకు సరిపడా 2 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. అందులో రెండ్రోజుల్లో 45 వేలు రాష్ట్రానికి వస్తాయని ఓ కీలకాధికారి తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో బుధవారం 1.25 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇంకా 6,13,380 టీకా డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరో నాలుగైదు రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం రెమిడెసివిర్ ఇంజెక్షన్లు 45 వేలు ఉన్నాయి. అవి 10–15 రోజులకు సరిపోతాయి. 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా కోసం 8,643 పడకలు ఉండగా, 2,408 నిండిపోగా, ఇంకా 6,235 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1,642 పడకల్లో 542 నిండిపోయాయి. 5,292 ఆక్సిజన్ పడకల్లో 1,434 నిండిపోగా, 3,858 ఖాళీగా ఉన్నాయి. ఇక 1,709 ఐసీయూ/వెంటిలేటర్లు ఉండగా, అందులో 432 నిండిపోయాయి. ఇంకా 1,277 ఖాళీగా ఉన్నాయి. చదవండి: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే -
రైతుల నిరసన: ఆగిన ఆక్సిజన్ ట్రక్కులు..
న్యూఢిల్లీ: రైతులు చేపట్టిన నిరసనలతో లిక్విడ్ ఆక్సిజన్ ట్రక్కులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. శ్వాస కోశ సమస్య ఉన్న కరోనా రోగులకు లిక్విడ్ ఆక్సిజన్ ద్వారానే చికిత్స అందిస్తారు. బారికేడ్లు అడ్డుపెట్టడంతో ఆక్సిజన్ ట్రక్కులు పానిపట్, ఘాజీపూర్ సరిహద్దుల దగ్గరే గంటల తరబడి నిలిచిపోయాయి. తమకు కొన్ని గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ మిగిలి ఉందని, ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోతోందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు సహకరించాలని కోరామని ఢిల్లీలోని ప్రైవేట్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ట్రక్కులు చేరుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అపోలో, గంగారామ్ ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ... తమ దగ్గర నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వ ఉందని, అయితే ఇప్పుడున్న పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే సమస్య మరింత జఠిలం అవుతుందన్నారు. సరిహద్దుల దగ్గర ఉన్న ట్రక్కులను తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేసస్తున్నామని, ఇప్పటికే హర్యానా, యూపీ, రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీలతో మాట్లాడామని వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని అఖిల భారత పారిశ్రామిక గ్యాస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు తెలిపారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రధేశ్, రాజస్థాన్ల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు. వీరిని నిలువరించడానికి ఢిల్లీ ప్రభుత్వం బారికేడ్లు ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ట్రక్కులను, జేసీబీలను సైతం అడ్డుపెట్టింది. దారులన్నీ మూసుకుపోవడంతో శుక్రవారం హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రావల్సిన లిక్విడ్ ఆక్సిజన్ ట్రక్కులు ఢిల్లీకి చేరుకోలేదు. ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లేకపోవడంతో పక్కనే ఉన్న హరియాణా, యూపీ, రాజస్థాన్ల నుంచి తెప్పిస్తున్నారు. -
పెద్దాసుపత్రుల్లో ‘ఎమర్జెన్సీ’
సాక్షి, అమరావతి: ఎమర్జెన్సీ కేసులు పెద్దాసుపత్రులను గుక్కతిప్పుకోనివ్వడం లేదు. ఏ ఆస్పత్రిలో చూసినా ఎమర్జెన్సీ వార్డులు కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కేసులు నమోదు కావడం వైద్య వర్గాలనే విస్మయపరుస్తోంది. నెల తిరిగే సరికి ఒక్కో ఆస్పత్రిలో వేలల్లో ఎమర్జెన్సీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పదకొండు బోధనాస్పత్రుల్లో సగటున గంటకు 140 మంది వరకూ అత్యవసర చికిత్సకు వస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యవసర చికిత్సకు చేర్చిన పేషెంటుకు వైద్యం అందించక మునుపే మరో పేషెంటు వస్తుండటంతో వైద్యులు బెంబేలెత్తుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తున్న ఈ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఐసీయూ వార్డుల్లో పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వెంటలేటర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. గుండెజబ్బుల బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతుండగా, కార్డియాలజీ స్పెషలిస్టుల కొరత బాధితులను కలవరపెడుతోంది. ఎక్కువగా ప్రమాద కేసులే..: ఎమర్జెన్సీ కేసుల్లో ఎక్కువగా ప్రమాద కేసులే ఉంటున్నాయని వైద్యులు వెల్లడించారు. ఒక్క అనంతపురం జనరల్ ఆస్పత్రికి గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 850 మందికి పైగా వచ్చారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో నాలుగు మాసాల్లో 130 మందికి పైనే నమోదయ్యారు. మరోవైపు గుండె సంబంధిత వ్యాధులతో వస్తున్న వారు అధిక సంఖ్యలో ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాద బాధితుల నమోదులో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, గుండె జబ్బుల బాధితుల నమోదులో అనంతపురం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. పురుగుల మందు లేదా మరేదైనా విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఎమర్జెన్సీ వార్డులకు వస్తున్న వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్లు పెంచాం.. పెద్దాసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేసులు పెరగడం వాస్తవమే. సాధారణంగా మధ్య తరగతి, దిగువ తరగతి వారు పెద్దాస్పత్రులకు ఎక్కువగా వస్తుంటారు. పలు ఎమర్జెన్సీ కేసులకు ఆరోగ్య శ్రీ వర్తించకపోవడం కూడా ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర కేసులు పెరగడానికి ఓ కారణం. ఆస్పత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్లు పెంచాం. – డాక్టర్ కే.బాబ్జి, వైద్య విద్య సంచాలకులు 108 అంబులెన్సులలో ఆక్సిజన్ కొరత క్షణాల్లో ప్రమాద స్థలానికి చేరుకుని బాధితుల ప్రాణాలను నిలిపే 108 అంబులెన్సులను ప్రస్తుతం ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అత్యవసర సమయాల్లో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 438 ఉండగా, అందులో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు(ఏఎల్ఎస్) వాహనాలు 120 మాత్రమే. మిగిలినవన్నీ బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్ఎస్) వాహనాలే. వీటిల్లో డీఫ్రిబులేటర్, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్ వంటి సదుపాయాలు ఉండవు. -
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం
ఉత్తరప్రదేశ్: గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలచివేసిన విషయం తెలిసిందే. ఈ దారుణం మరవకముందే మరో విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు నెలలో ఫరూఖాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్, మందుల కొరతతో సుమారు 49 మంది చిన్నారులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. దీంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో సహా మొత్తం మగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సీ దయానంద్ మిశ్రా తెలిపారు. ఆక్సిజన్ అందక చనిపోయిన పిల్లల్లో ఎక్కువగా అప్పుడే జన్మించిన వారే ఉండటం విశేషం. జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ దర్యాప్తు బృదం ఆస్పత్రికి వెల్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి వర్గాలను జిల్లా మెజిస్ట్రేట్ సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరారు. చిన్నారుల తల్లిదండ్రులు ఆక్సిజన్, మందుల సరఫరా కొరతపై ఫిర్యాదు చేశారు.