న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ధిక్కరణ ఉత్తర్వులపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది. గత మూడు రోజులుగా దేశ రాజధానికి కేంద్రం ఎంత ఆక్సిజన్‌ను సరఫరా చేసిందని కోర్టు ప్రశ్నించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. ‘‘ఢిల్లీకి ప్రతిరోజు 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అని.. ఈ మేరకు సరఫరా చేస్తున్నాం’’ అని తెలిపారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. ‘‘అధికారులను జైలులో పెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం రెండు కోవిడ్ కట్టడికి ఉత్తమంగా కృషి చేయాలి. ఢిల్లీకి ఇవ్వాల్సిన కోటా మేరకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయండి’’ అని కోర్టు ఆదేశించింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాపై వివరాలు ఇవ్వాలని కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment