న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగంపై నియంత్రణ తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయిదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల డివిజన్ బెంచ్ సిఫారసు చేసింది.
ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తర్వాత దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment