Delhi government
-
‘నన్నెందుకు గుర్తించడం లేదు.. బాధగా ఉంది’.. స్పందించిన సీఎం
భారత చదరంగ క్రీడాకారిణి తానియా సచ్దేవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చెస్ ప్లేయర్‌గా తనకు సరైన గుర్తింపునివ్వడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఇతర రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని.. కానీ ఢిల్లీలో మాత్రం దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితి లేదని వాపోయింది.స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూఈ మేరకు.. ‘‘2008 నుంచి దేశం తరఫున వివిధ చెస్ టోర్నీల్లో పాల్గొంటున్నాను. ఎన్నో విజయాలు సాధించాను. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడం బాధగా ఉంది. ఇతర రాష్ట్రాలు మాత్రం తమ ఆటగాళ్లలోని ప్రతిభను గుర్తిస్తూ.. వారి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాయి.కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. 2022 చెస్ ఒలింపియాడ్‌లో చారిత్రక విజయం సాధించి.. కాంస్యం గెలిచిన జట్టులో నేను సభ్యురాలిని. వ్యక్తిగత పతకం కూడా సాధించాను. రెండేళ్ల తర్వాత.. అంటే 2024 చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన జట్టులోనూ నేను భాగమే.అయినప్పటికీ ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం నుంచి నాకెలాంటి గుర్తింపు లభించలేదు. ఢిల్లీ, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావించే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధగా ఉంది.ఇకనైనా విలువ ఇవ్వండిఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అతిశి మేడమ్, అరవింద్ కేజ్రీవాల్ సర్.. ఇకనైనా క్రీడలు, క్రీడాకారుల విలువను గుర్తించి చెస్ అథ్లెట్లకు అండగా ఉంటారని ఆశిస్తున్నా’’ అని తానియా సచ్దేవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి మర్లెనాతో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌లను ట్యాగ్ చేస్తూ తన విజ్ఞప్తిని తెలియజేసింది.గుకేశ్‌కు భారీ నజరానాకాగా ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ విజేతగా నిలిచిన భారత జట్టులో తానియా సచ్దేవ్ కూడా ఉంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్), వైశాలి (తమిళనాడు), అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), వంతిక అగర్వాల్‌లతో కలిసి పసిడి పతకాన్ని అందుకుంది.ఇక ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌పై తమిళనాడు ప్రభుత్వం కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 5 కోట్ల భారీ నజరానా అందజేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల తానియా సచ్దేవ్ తాజా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పందించిన సీఎంతానియా సచ్దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అతిశి మర్లెనా స్పందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని.. ఏ విషయంలో ఆమెకు అసౌకర్యం కలిగిందో చెప్పాలన్నారు. చెస్ ప్లేయర్ల కోసం తాము ఇంకా ఏమేం చేయగలమో చెప్పాలని సూచించారు. తన కార్యాలయం త్వరలోనే తానియాను సంప్రదించి.. అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటుందని అతిశి ఎక్స్ వేదికగా చెస్ ప్లేయర్‌కు హామీ ఇచ్చారు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
ఢిల్లీలో దీపావళి కాలుష్యం.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దీపావేళ వేళ బాణాసంచా నిషేధం అమలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో బాణాసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని తెలిపింది. బాణాసంచా కాల్చడం వల్ల దీపావేళ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించిందని తెలిపింది. ఈ ఏడాది బాణాసంచా వినియోగంపై పూర్తి నిషేధం అమలుకు తీసుకున్న చర్యలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వచ్చే ఏడాది నిషేధానికి సంబంధించి కూడా ప్రతిపాదిత చర్యలను తెలపాలని జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం పేర్కొంది.కాగా దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల ఢిల్లీ వాసులు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ(గాలి నాణ్యత సూచీ) 400 తీవ్రమైన మార్కును దాటడంతో సోమవారం గాలి నాణ్యత అధ్వాన్నంగా మారైంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీలో కాలుష్య స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేగాక దీపావళి నాటికి పంట వ్యర్థాల కాల్చివేతలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత పది రోజులలో పంట వ్యర్థాల దగ్దం కేసుల నమోదును తెలుపుతూ అఫిడవిట్లను దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ పరిధిలో పొలాల దహనం కేసుల నమోదును తెలపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. -
14 మంది మృతి యాదృచ్ఛికం కాదు: ఢిల్లీహైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఆశాకిరణ్ షెల్టర్‌హోమ్‌లో స్వల్ప వ్యవధిలో 14 మంది మృతి చెందడం యాదృచ్ఛికం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. షెల్టర్‌హోమ్‌లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్రావ్ గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సోమవారం(ఆగస్టు5) విచారించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. షెల్టర్ హోమ్‌లో ఉండాల్సినదాని కంటే ఎక్కువ మంది ఉంటే కొందరిని అక్కడి నుంచి తరలించాలని సూచించింది. షెల్టర్‌హోమ్‌లోని మంచినీటి పైపులైన్లతో పాటు డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించాలని, అక్కడి తాగునీటి నాణ్యతను పరీక్షించాలని ఢిల్లీ జల్‌బోర్డును ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి షెల్టర్‌హోమ్‌లో మొత్తం 25 మంది చనిపోగా కేవలం జులైలోనే 14మంది మరణించారు. -
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖమంత్రి అతిశీ రాష్ట్ర పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద పోలీసులు భద్రత కల్పిస్తూ, పర్యవేక్షించాలని లేఖలో కోరారు.‘‘ రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైప్లైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసులు భద్రత, పర్యవేక్షణ పెంచాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కోరుతున్నా. ఢిల్లీకి జీవనాధారంగా మారిన వాటర్ పైప్లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడాన్ని ఆపటం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు’’ అని మంత్రి అతిశీ లేఖలో కోరారు.మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అయితే కేంద్రమంత్రి తన వివాసంలో లేకపోవటంతో ఆప్ ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము నిన్న (శనివారం) కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ ఇచ్చాం. ఈ రోజు ఆయన్ను కలవడానికి వచ్చాం. అయితే ఆయన తన నివాసంలో లేరని సమాచారం అందింది. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం’’అని తెలిపారు.నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జిత్ కమల్జీత్ సెహ్రావత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంతో ప్రభుత్వం ట్యాంకర్లు అందుబాటులో లేవని అన్నారు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ప్రజల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నీటి సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కానీ, అసలు సమస జలవనరులకు శాఖలో ఉందని అన్నారు. కనీసం మానవత్వంతో అయినా అతిశీ ఆమె శాఖపై జాగ్రత్త దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
ఢిల్లీ నీటి సంక్షోభం: నీటిని విడుదల చేయాలని హిమాచల్‌కు సుప్రీం ఆదేశం
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీకి సాయంగా మిగులు నీటిని విడుదల చేయాలని తాజాగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(శుక్రవారం) 137 క్యూసెక్కుల నీటిని ఢిల్లీకి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీటి విడుదలకు హిమాచల్ ప్రదేశ్ అంగీకారం తెలిపిందని కోర్టు తెలిపింది. అదేవింధంగా వాజీరాబాద్ బ్యారేజ్ ద్వారా నీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని హర్యానాను సుప్రీం కోర్టు ఆదేశించింది. నీటి విడుదల చేసే సమయంలో హర్యానాకు ముందుస్తు సమాచారం అందించాలని హిమాచల్ ప్రదేశ్‌కు కోర్టు సూచించింది.సంక్షోభ సమయంలో నీటిని ఎట్టిపరిస్థితుల్లో వృథా చేయవద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొనడంతో తమ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి నీటిని అందించాలని ఆప్ ప్రభుత్వం గతవారం సుప్రీకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత కారణంగా నీటి సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి సమయంలో నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు జరిమానా వేస్తామని ఆప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటక చేసిన విషయం తెలిసిందే. -
నీటి సంక్షోభం.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కారు సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు శుక్రవారం(మే31) అత్యున్నత కోర్టులో ఢిల్లీ సర్కారు పిటిషన్ ఫైల్ చేసింది. హార్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఢిల్లీకి అదనపు నీళ్లు కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ప్రభుత్వం కోర్టును కోరింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నందున దేశ రాజధానికి నీళ్లివ్వడం అందరి బాధ్యత అని పిటిషన్లో తెలిపింది. కాగా, ఢిల్లీలో నీటి సంక్షోభంపై ప్రభుత్వం ఇప్పటికే వాటర్ ట్యాంకర్ వార్‌రూమ్ ఏర్పాటు చేసి యుద్ధ పప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరికి నీరు అందుబాటులో ఉండేలా చూస్తోంది. మరోపక్క తాగే నీటిని వృథా చేసి ఇతర అవసరాలకు వాడే వారిపై రూ.2వేల జరిమానా విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. నీటి కొరతపై గురువారం ఢిల్లీ జల వనరుల మంత్రి ఆతిషి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. -
శీతాకాల సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: స్కూల్ విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది.. జనవరి 1 నుంచి 6 వరకు స్కూల్స్‌కు శీతాకాల సెలవులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం డెరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ సర్య్కూలర్‌ను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. Delhi Government’s Directorate of Education issues circular for winter vacation in Delhi Govt Schools. The Winter Vacation for Academic Session 2023-2024 is scheduled to be observed from 1st January 2024 (Monday) to 6th January 2024 (Saturday) pic.twitter.com/P1GXIROySN — ANI (@ANI) December 6, 2023 15 రోజులు పాటు ఉండే సెలవులను ఈసారీ 6 రోజులకే పరిమితం చేశారు. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా గత నవంబర్ నెల మొదట్లో 9వ తేదీ నుంచి 18వరకు స్కూల్స్ మూసివేసిన సంగతి విదితమే. అందుకే ప్రతి యేటా జనవరి 1 నుంచి 15 వరకు ఇవ్వాల్సిన సెలవును ఈసారి ఆరు రోజులకే తగ్గించినట్లు తెలుస్తోంది. -
‘చీఫ్ సెక్రటరీ’ వివాదానికి సుప్రీం పరిష్కారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకంపై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఒక పరిష్కారమార్గం చూపింది. చీఫ్ సెక్రటరీ హోదాకు అర్హులైన అయిదుగురు సీనియర్ పరిపాలనాధికారుల పేర్లను ఈనెల 28న ఉదయం 10.30 గంటల్లోగా సూచించాలని కేంద్రాన్ని కోరింది. అందులో నుంచి ఒకరి పేరును అదే రోజు ఎంపిక చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొత్తగా చీఫ్ సెక్రటరీని కేంద్రం నియమించ జాలదంటూ ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ సూచనలు చేసింది. అంతకుముందు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో పోటాపోటీగా వాదనలు వినిపించాయి. -
ఢిల్లీలో అత్యంత దారుణ పరిస్థితులు- అనధికార ఎమర్జెన్సీ
-
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం
న్యూఢిల్లీ: ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టులా మారిన కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మళ్లీ సరి–బేసి విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకూ సరి–బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 20 తర్వాత ఈ విధానాన్ని పొడిగించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయు నాణ్యత తగ్గిపోవడం, కాలుష్యం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 8వ తరగతి వరకూ ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే పది, పన్నెండో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఉంటుందన్నారు. -
ఢిల్లీ బిల్లు నెగ్గింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. -
ఢిల్లీ ఆర్డినెన్స్ పిటిషన్ రాజ్యాంగ బెంచ్‌కు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార యంత్రాంగంపై నియంత్రణ తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయిదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాల డివిజన్ బెంచ్ సిఫారసు చేసింది. ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన తర్వాత దీనిపై విచారణ చేపడుతుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. -
కేంద్ర ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వండి
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిపాలన సర్వీసులపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నమని ఆరోపించింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేయడంతోపాటు అమ లుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసు, శాంతిభద్రతలు, భూమి మినహా మిగతా సరీ్వసులపై ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పెత్తనం ఉండాలని, ఇందుకోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలంటూ మే 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచి్చంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్–ఏ స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై పెత్తనం కొనసాగేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను మే 19న కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం. -
ముగిసిన మ్యాచ్‌కు కొత్తగా రూల్స్ ఏంటో?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల నియంత్రణపై అక్కడి ప్రభుత్వానికే సర్వాధికారం ఉందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సమీక్షకు వెళ్లింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఇవాళ ఓ పిటిషన్ దాఖలు చేసింది. అదే సమయంలో ఢిల్లీ వ్యవహారాలు తన అదుపులో ఉండేలా కేంద్రం తాజాగా పాస్ చేసిన ఓ ఆర్డినెన్స్‌ను సవాల్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్రం శుక్రవారం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. బ్యూరోక్రాట్ల నియామకం, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం తరపున చివరి మధ్యవర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించింది. అంతేకాదు.. అథారిటీ చైర్పర్సన్ హోదాలో ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని, అలాగే హోం శాఖ ప్రధాన కార్యదర్శిని ఈ అథారిటీలో స్థానం కల్పించింది. అథారిటీలో మెజార్టీ ఓటింగ్‌ల ఆధారంగా అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటింగ్‌లో ఏదైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే.. అప్పుడు లెఫ్టినెంట్‌గవర్నర్ నిర్ణయాన్ని తుది నిర్ణయంగా తీసుకుంటారు. అయితే.. పోస్టింగులు, ట్రాన్స్ఫర్లపై ఎల్జీకే తుది అధికారం కట్టబెడుతూ కేంద్రం దొడ్డిదారిన తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కోర్టు ఇచ్చిన అధికారాన్ని సైతం లాక్కునేందుకు కేంద్రం సిద్ధపడిందని ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. ఆట ముగిశాక.. రూల్స్ మార్చేసినట్లుంది ఇప్పుడు కేంద్రం తీరు.. అని ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అలాగే ఆ ఆర్డినెన్స్ ఇంకా పార్లమెంట్లో పాస్ కాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ కావాల్సి ఉంది. కానీ, రాజ్యసభలో బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేదు. దీంతో ప్రతిపక్షాలు ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకునే యత్నం చేయొచ్చు. కేంద్ర వర్గాలు మాత్రం.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో తలెత్తిన వైరుధ్యాన్ని తొలగించేందుకే ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. మే 11వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల విషయంలో సర్వాధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ప్రభుత్వానికి భూకేటాయింపులను మాత్రం మినహాయించి.. మిగతా అన్నింట్లో అధికారం ఢిల్లీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది కోర్టు. -
ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు-కేంద్రానివి కావన్న ‘సుప్రీం’
ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు-కేంద్రానివి కావన్న ‘సుప్రీం’ -
ఢిల్లీ మంత్రి జైలు విలాసాలపై ఘాటుగా స్పందించిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. జైలులో పోక్సో కేసులో నిందితుడైన ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. జైలులో ఉంటూనే సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. గదిలోనే రుచికరమైన ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లాగిస్తూ ఇటీవల కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సత్యేంద్ర జైన్ జైలు విలాసాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపీలో డిగ్రీ చేశాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. జైన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ జాతీయా మీడియాతో గురువారం మాట్లాడారు. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. తీహార్ జైలు పాలకుల తప్పిదం.. ఢిల్లీ రాజకీయ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తమ సొంత మంత్రి జైలులో ఉంటే అధికారులు మాత్రం ఎలా చర్యలు తీసుకుంటారని సెటైర్లు వేశారు. ‘సొంత మంత్రి జైలులో ఉండటం చాలా అరుదైన సందర్భం.. లోపల ఉన్న జైలు బాస్ ఇప్పటికీ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతను ఏదైనా చేయగలడు, అడగగలడు. అతని ఆదేశాలకు జూనియర్లు కట్టుబడి ఉంటారు. అవకతవకలు జరిగాయని సూపరింటెండెంట్ని ప్రభుత్వ సస్పెండ్ చేసింది. మరి మంత్రి సంగతేంటి? ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే వ్యవస్థ మనకు లేదా. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న ‘పెద్దమనిషి’ ఫిజియో కాదని తెలిసింది. అతను అత్యాచారం కేసులో నిందితుడని జైలు అధికారులు పేర్కొంటున్నారు. మరి అతనికి ఫిజియోథెరపీలో డిగ్రీ ఉందా.. లేదా రేప్ చేయడానికి ముందు అతను ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారా’ అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అనుమతి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైన్ సస్పెన్షన్ లేదా తొలగింపును రాష్ట్రపతికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కాగా భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణీ అయిన కిరణ్ బేడీ.. 1993లో ఢిల్లీ జైళ్ల ఐజీగా నియమితులయ్యారు. తిహార్‌లో జైళ్ల డైరెకర్ట్ జనరల్‌గా ఉన్న సమయంలో పలు జైలు సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు రామన్ మెగాసెస్ అవార్డు పొందారు. 2015లో బీజేపీలో చేరారు. చదవండి: అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ -
ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ సబ్సిడీ పథకం శనివారం నుంచి ప్రారంభమైంది. రాయితీ కావాలనుకునే వారు 7011311111 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజీ పంపొచ్చునంటూ గత నెలలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకు విద్యుత్ ఫీజు బకాయి లేని గృహ వినియోగదారులే రాయితీకి అర్హులు. అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా సబ్సిడీ వర్తిస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచితంగా, 400 యూనిట్ల వరకు వినియోగించుకునే వారికి 50% సబ్సిడీతో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ అందిస్తోంది. ఇందులో ఢిల్లీలోని మొత్తం 58 లక్షల గృహ విద్యుత్ వినియోగదారుల్లో 47 లక్షల మంది సబ్సిడీ పొందుతున్నారు. -
ఆప్ సర్కార్‌పై మరో దర్యాప్తు.. ‘బస్సుల’పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్‌గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని! -
అధికారంతో విషమెక్కావ్.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే ఆగ్రహం
రాలేగావున్/ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ గాంధేయవాది ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్ సర్కార్ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్‌పై అన్నా హజారే బహిరంగ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి. లిక్కర్ పాలసీ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆప్ మేనిఫెస్టో స్వరాజ్‌కు పరిచయం నాతోనే రాయించావు. అందులో మద్యంవిధానాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పావ్. నివాస ప్రాంతాల్లో స్థానికుల మద్దతు లేకుండా లిక్కర్ షాపులు తెరవనని స్వరాజ్‌లో పేర్కొన్నావ్. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఆదర్శాలను ఎలా మరిచిపోయావ్?.. నువ్వు, మనీశ్ సిసోడియా, అంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కానీ, ఇప్పుడు మిగతా పార్టీలకు మీకు తేడా ఏం లేకుండా పోయింది అని ఆయన లేఖలో మండిపడ్డారు. నేను సూచించినట్లుగా.. మనం ఒక గ్రూప్‌గా ఉండి.. అవగాహన డ్రైవ్ చేపట్టి ఉంటే.. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ ఏర్పడి ఉండేది కాదేమో. అయినా బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలకు బదులు.. లిక్కర్ పాలసీని తీసుకొచ్చే యత్నం చేశావ్. పైగా అది పూర్తి ప్రజా.. ప్రత్యేకించి మహిళా వ్యతిరేక నిర్ణయం అంటూ.. లేఖలో ఆగ్రహం వెల్లగక్కారు హజారే. మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుండి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదు అంటూ ఆప్ కన్వీనర్‌పై తీవ్ర స్థాయిలో లేఖలో మండిపడ్డారు హజారే. తన స్వస్థలం రాలేగావున్లో, స్వరాష్ట్రం మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ లేఖలో కితాబిచ్చారాయన. ఇదీ చదవండి: నాకు క్లీన్ చిట్ దొరికిందోచ్! -
‘బీజేపీలో చేరితే రూ.20కోట్లు.. ఎమ్మెల్యేలను తీసుకెళ్తే రూ.25 కోట్లు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంపై మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆప్ సీనియర్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డబ్బులు, బెదిరింపులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగిస్తుందో ప్రస్తుత పరిస్థితులు అద్దపడుతున్నాయని పేర్కొన్నారు ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్. ‘ఢిల్లీ ఎమ్మెల్యేలను విడగొట్టే ప్రయత్నం మొదలైంది. మనీష్ సిసోడియాపై బీజేపీ చేసిన ‘షిండే’ ప్రయత్నం విఫలమైంది. పార్టీ మారి రూ.20 కోట్లు తీసుకోండి.. లేదా సిసోడియా మాదిరిగా సీబీఐ కేసులు ఎదుర్కోండి అని ఆప్ ఎమ్మెల్యేలను బెదిరించారు. ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్‌నాథ్ భారతి, కుల్దీప్లకు బీజేపీ నేతలు ఈ ఆఫర్ ఇచ్చారు. పార్టీ మారితే ప్రతిఒక్కరికి రూ.20 కోట్లు ఇస్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తే రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.’ అని పేర్కొన్నారు ఎంపీ సంజయ్ సింగ్. తమకు బీజేపీ నేతలు ఏవిధంగా ఆఫర్ ఇచ్చారనే అంశాన్ని విలేకరులతో చెప్పారు మిగిలిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు. ‘సిసోడియాపై పెట్టిన కేసులు ఫేక్ అని తమకు తెలుసునని, కానీ, ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సీనియర్ నేతలు నిర్ణయించారని బీజేపీ నేతలు మాతో చెప్పారు. ఆప్ నాయకులను తీసుకువచ్చే పనిని వారికి అప్పగించినట్లు తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొడతామని వెల్లడించారు.’ అని ఎమ్మెల్యే సోమ్‌నాథ్ పేర్కొన్నారు. మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు, సిసోడియా.. ఆపరేషన్ లోటస్‌ను ఆపరేషన్ బోగస్‌గా మార్చారని ఎద్దేవా చేశారు సంజయ్ సింగ్. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది :కేజ్రీవాల్ -
ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. కీలక వ్యవస్థలకు 24 గంటల కరెంట్ కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. హీట్ వేవ్ కారణంగా దేశరాజధానిలో విద్యుత్ డిమాండ్ తారాస్థాయికి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెట్రో, హాస్పిటల్స్ వంటి కీలక వ్యవస్థలకూ నిరంతర విద్యుత్ అందించడం సాధ్యంకాదని ప్రభుత్వం హెచ్చరించింది. బొగ్గు కొరత కారణంగా దాద్రీ-2, ఊంచహార్ పవర్ స్టేషన్స్ నుంచి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ఇది ఇలాగే కొనసాగితే, ఢిల్లీ మెట్రోతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర కార్యాలయాలకు 24 గంటలు విద్యుత్ అందించడం కుదరదని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టంచేసింది. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు బొగ్గు సరఫరా కోసం ఢిల్లీ సర్కార్ కేంద్రం తలుపు తట్టింది. తక్షణమే బొగ్గు సరఫరా పెంచాలంటూ ఈమేరకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ విద్యుత్ అవసరాల్లో 25 నుంచి 30శాతం థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తోందని వివరించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ వినతిమేరకు ఢిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. చదవండి👉🏻పంజాబ్: శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు, వీడియోలు వైరల్ ఫుల్ డిమాండ్ ఏప్రిల్ నెలలో తొలిసారిగా రోజువారీ పవర్ డిమాండ్ 6వేల మెగావాట్ల మార్క్‌ను టచ్ చేసింది. తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో .. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే దాద్రీ -2 పవర్ స్టేషన్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దాద్రీ-2 నుంచి ఢిల్లీకి 1751 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోతే ఢిల్లీలో బ్లాకౌట్ కావడం ఖాయం అంటున్నారు నిపుణులు. చదవండి👉🏼 పెట్రోల్ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి -
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త..!
కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం కొనాలని చూస్తున్న వారికి ఢిల్లీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద రుణాలపై ఈ-ఆటోల కొనుగోలు చేస్తే వారికి ప్రభుత్వం ఐదు శాతం వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందిస్తున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్)తో కలిసి వెబ్సైట్(https://www.myev.org.in)ను అభివృద్ధి చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి రూ.25,000 అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోట్ మాట్లాడుతూ.. "ఈ వెబ్సైట్ వల్ల ప్రభుత్వం దృవీకరించిన వాహనాలు ప్రజలకు అందడంతో పాటు ఎలక్ట్రిక్ ఆటోల రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు" తెలిపారు. 'మై ఈవీ పోర్టల్' అనేది ఆన్ లైన్ పోర్టల్. ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ఓఐ) హోల్డర్లు ఈ-ఆటోలను కొనుగోలు చేయడానికి, ఢిల్లీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలను క్లెయిం చేసుకోవడానికి వీలు కలిపిస్తుంది. ఈ ఆన్లైన్ పోర్టల్ రవాణా శాఖ వెబ్సైట్లో కూడా వినియోగదారులకి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలపై అందిస్తున్న ప్రోత్సాహకలను త్వరలో దేశ రాజధానిలోని లిథియం-అయాన్ ఆధారిత ఈ-రిక్షాలు, ఇ-కార్ట్ లు మరియు ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ వాహనాలకి అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మహీంద్రా ఫైనాన్స్, అకాసా ఫైనాన్స్, మన్నాపురం ఫైనాన్స్, రెవ్ఫిన్, ప్రెస్ట్ రుణ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై రుణాలను అందించనున్నాయి. (చదవండి: క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?) -
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రూ.2 వేల జరిమానా రూ.500కు తగ్గింపు
న్యూఢిల్లీ: కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోర్ వీలర్ వాహనాల్లో కలిసి ప్రయాణించేవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 28(సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు మాస్క్ తప్పనిసరి ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధలను విధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగితే విధించే రూ.2 వేల జరిమానాను రూ.500 తగ్గిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఫోర్ వీలర్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మాస్క్ ధరించాలన్న నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం తొలగించింది. కారులో ఒక్కరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
టీకా వేయించుకోకుండా ఆఫీసుకు రావద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో ఉద్యోగులు ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్టోబర్ 16 తర్వాత ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని స్పష్టం చేసింది. కనీసం ఒక్క డోస్ టీకా కూడా వేసుకోని వారిని ఆఫీసు విధులకు హాజరు కానివ్వబోమని తెలిపింది. ఉపాధ్యాయులు, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలతో సహా వ్యాక్సిన్ వేయించుకోని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీసం ఒక డోస్ వేయించుకొనే వరకు ‘సెలవు’గా పరిగణిస్తామని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో సంబంధిత విభాగాల అధిపతులు ఆరోగ్య సేతు యాప్/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగుల హాజరును ధృవీకరిస్తారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీడీఎంఏ కార్యనిర్వాహక కమిటీ ఛైర్పర్సన్ విజయ్ దేవ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే విషయం పరిశీలించవచ్చని డీడీఎంఏ తెలిపింది. -
ఢిల్లీలో బాణాసంచాకు నో ఛాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాను నిషేధించాలని నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని బాణాసంచా వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో గత మూడు సంవత్సరాల మాదిరిగానే, ఈ ఏడాది సైతం దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకం, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం కొనసాగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం వ్యాపారులు బాణాసంచాను నిల్వ చేసిన తర్వాత కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పూర్తి నిషేధం ఆలస్యంగా విధించామని, ఇది వ్యాపారులకు నష్టాన్ని కలిగించిందని కేజ్రీవాల్ తన ట్వీట్లో వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈసారి ముందుగానే ప్రకటించినందున వ్యాపారులందరూ ఎలాంటి బాణాసంచాను నిల్వ చేయరాదని ఆయన కోరారు. రూ.1,500 కోట్ల బాణాసంచా వ్యాపారం మరోవైపు దీపావళి రోజున దేశ రాజధానిలో సుమారు రూ.1,500 కోట్లకు పైగా బాణాసంచా వ్యాపారానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దెబ్బ తగిలినటైంది. ఢిల్లీలో 150 కి పైగా హోల్‌సేల్ బాణాసంచా విక్రేతలు ఉన్నారు. వీరేగాక దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఢిల్లీలో బాణాసంచా విక్రేతలు తాత్కాలిక ప్రాతిపదికన వ్యాపారం చేస్తారు. -
రెండో దశలో సరికొత్త రికార్డ్: కరోనాపై ఢిల్లీ విజయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా రెండోసారి విజృంభణ అల్లకల్లోలం రేపింది. ఢిల్లీని చలికన్నా తీవ్రంగా గజగజ వణికించింది. ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కరోనా రహితం వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఈ కరోనా విషయంలో ఢిల్లీ రికార్డు సృష్టించింది. ఒక్కటంటే ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. తాజాగా శనివారం ప్రకటించిన కరోనా బులెటిన్‌లో ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పైగా పాజిటివ్ కేసుల నమోదు పదుల సంఖ్యకు చేరడం హర్షించే విషయం. పాజిటివిటీ శాతం ఏకంగా సున్నాకు పరిమితమైంది. ఆ విషయాలు ఇలా ఉన్నాయి. చదవండి: ‘ఆ కుండ తయారు చేసిందెవరో’? వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం తాజా బులెటిన్‌లో గడిచిన 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. ఇక కరోనా మృతులు సున్నా. రెండో దశ ప్రారంభమైన తర్వాత ఇప్పుడే అతి తక్కువ కేసులు నమోదవుతున్నారు. మరణాలు లేకపోవడం ఇది తొలిసారి. ఇక పాజిటివిటీ 0.05 శాతంగా ఉంది. ఏకంగా 74,540 కరోనా టెస్టులు చేయగా వాటిలో నమోదైన అతి తక్కువ కేసులు ఇవే. బుధవారం 41 నమోదయ్యాయి. ఆగస్టు 30వ తేదీన కేసులు కేవలం 20 నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తంగా 14.12 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? -
ఢిల్లీ:సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రలో దశలవారీగా సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 9-12వ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ 1 నుంచి ఆఫ్‌లైన్‌లో పాఠశాలలు, కళాశాలు ప్రారంభం కాగా, 6-8వ తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత ప్రారంభం కానున్నాయి. చదవండి: Work From Home: షుగర్, బీపీ, ఒబెసిటి కంటే.. ఈ సమస్యే ఎక్కువ! తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి అదే విధంగా విద్యాసంస్థల వద్ద క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో విద్యాసంస్థలు పున: ప్రారంభిస్తామని పేర్కొంది. అన్ని పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని పేర్కొంది. సెప్టెంబర్1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. చదవండి: Maharashtra: 10 రోజుల్లో ఆలయాలు తెరవండి.. లేదంటే.. -
ఢిల్లీలో కరోనా కట్టడికి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమణ నేపథ్యంలో ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అక్టోబర్ – నవంబరులో థర్డ్ వేవ్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఏరకంగా వ్యవహరించాలన్న దానిపై శుక్రవారం జరిగిన కీలక సమావేశంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ను ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆమోదించింది. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ వేరియంట్‌ను ఢిల్లీలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులోభాగంగా కరోనా సంక్రమణ సంభవించినప్పుడు, ఎప్పుడు లాక్డౌన్ విధించాలి...? ఎప్పుడ్ అన్‌లాక్ చేయాలి..? అనే అంశాలకు సంబంధించిన ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ను అనుసరించాలని నిర్ణయించారు. దీని కోసం బ్లూప్రింట్ సైతం సిద్ధం చేశారు. డీడీఎంఏ సమావేశం.. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్–19 మహమ్మారి పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలో శుక్రవారం 22వ డీడీఎంఏ సమావేశం జరిగింది. ఇందులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, రెవెన్యూ మంత్రి, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డెల్టా ప్లస్, లాంబ్డా వంటి కొత్త వేరియంట్ల కారణంగా ఎదురయ్యే పరిణామాలపై కూలంకషంగా చర్చించారు. వ్యాక్సినేషన్, జీనోమ్ సీక్వెన్సింగ్, టెస్టింగ్, ట్రాకింగ్, నిఘా వంటి చర్యలను నూతన వేరియెంట్స్ వ్యాప్తిని తగ్గించేందుకు అత్యంత ప్రభావవంతమైన దశలుగా సూచించారు. కరోనా సంక్రమణ రేటు, యాక్టివ్ కరోనా రోగుల సంఖ్య, ఆసుపత్రులలోని రోగుల సంఖ్య ఆధారంగా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ పనిచేస్తుంది. ఢిల్లీలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతున్న ప్రదేశాలలో ఆంక్షలు విధించనున్నారు. ఎలా పనిచేస్తుంది..? 1) ఎల్లో అలర్ట్: ఢిల్లీలో సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులపాటు 0.5 శాతానికి మించి ఉంటే లేదా వారంలో 1,500 కొత్త కరోనా కేసులు నమోదైతే లేదా ఆసుపత్రులలో 500 ఆక్సిజన్ పడకలు సగటున వారానికి నిండి ఉంటే ఈ హెచ్చరిక ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో కేసులు తక్కువ సంఖ్యలో ఉంటే, సరి–బేసి ఫార్ములా ప్రకారం మార్కెట్లు, మాల్స్‌లో అత్యవసరంకాని వస్తువులు,సేవల దుకాణాలను ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు తెరవడానికి అనుమతిస్తారు. మూడు కార్పోరేషన్ ప్రాంతాల్లో సగం సామర్థ్యంతో వారాంతపు మార్కెట్లు తెరిచేందుకు, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక యూనిట్లు పనిచేయడానికి అనుమతిస్తారు. 2) అంబర్ అలర్ట్ ః సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులు ఒక శాతానికి మించి ఉంటే లేదా వారంలో 3,500 కొత్త కేసులు ఉంటే లేదా వారంలో సగటు ఆక్సిజన్ పడకలు 700 కన్నా ఎక్కువ ఉంటే ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో, నిర్మాణ కార్యకలాపాలు అనుమతిస్తారు. మార్కెట్లు, మాల్స్‌లోని దుకాణాలను సరి–బేసి ప్రాతిపదికన ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు తెరవవచ్చు. 3) ఆరెంజ్ అలర్ట్ ః కరోనా సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులపాటు 2 శాతానికి మించి ఉంటే లేదా వారంలో 9,000 కొత్త కేసులు నమోదైతే లేదా వరుసగా ఏడు రోజులు ఆసుపత్రిలో సగటున 1000 ఆక్సిజన్ పడకలు నిండి ఉంటే ఈ హెచ్చరిక వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో కిరాణా, పాలు, కెమిస్ట్ వంటి ముఖ్యమైన వస్తువుల దుకాణాలు తప్ప, అన్ని దుకాణాలు, మార్కెట్లు మూసివేస్తారు. మెట్రో సర్వీసులు మూసివేస్తారు. బస్సులు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తారు. ఆటోలు, క్యాబ్‌లు, ఈ–రిక్షాలు గరిష్టంగా ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. 4) రెడ్ అలర్ట్ ః కరోనా సంక్రమణ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం మించి ఉంటే లేదా వారంలో 16,000 కొత్త కేసులు నమోదైతే లేదా ఆసుపత్రులు సగటున 3000 ఆక్సిజన్ పడకలతో ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం నిండి ఉంటే ఈ సిగ్నల్ ప్రభావవంతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, నిర్మాణ కార్యకలాపాలపై కూడా నిషేధం ఉంటుంది. కార్మికులు నిర్మాణ ప్రాంతంలోనే ఉండగలిగితే అవసరమైన వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయడానికి కర్మాగారాలకు అనుమతి ఉంటుంది. -
ఢిల్లీలో ‘బార్’లా తెరుచుకున్నాయి!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మద్యం మాఫియా ఆగడాలను అరికట్టేందుకు, కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా కేజ్రీవాల్ సర్కార్ నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. నూతన పాలసీ ప్రకారం వినియోగదారులకు ఇప్పుడు మద్యం షాపులలో వాక్–ఇన్ అనుభవం లభిస్తుంది. అంతేగాక హోటళ్ళు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లను ఇకపై తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకొనేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో పాటు బాల్కనీలు, టెర్రస్ల వంటి ఓపెన్ స్పేస్‌లలో సీటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన రెస్టోబార్లలోను మద్యం సరఫరా చేసేందుకు అవకాశం కల్పించారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో, రాష్ట్ర ప్రభుత్వమద్యం దుకాణాల సంఖ్య తగ్గడంతోపాటు, ప్రైవేట్ మద్యం సంస్థలకు లాభం చేకూరనుంది. అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రపంచంలోని 28వ నగరంగా ఢిల్లీ ఉంది.ఈ పరిస్థితుల్లో విదేశీ పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆదాయాన్ని పెంపేక్ష్యంగామద్యం పాలసీలో మార్పులు చేసినట్లుగా తెలిసింది. నూతన మద్యం పాలసీ ప్రభావం: కొత్త పాలసీ ప్రకారం మద్యం రిటైల్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేస్తారు. దుకాణాలకు మద్యం ఏకరీతి పంపిణీ కోసం ప్రతి మునిసిపల్ వార్డులో కనీసం 2 ఎయిర్ కండిషన్డ్ వెండ్స్, 5 సూపర్ ప్రీమియం దుకాణాలు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 దుకాణాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 849 మద్యం రిటైల్ స్టోర్స్ ఉంటాయి. మద్యం అమ్మకం నుంచి ప్రభుత్వం దూరం: ఢిల్లీ కన్సూ్యమర్స్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్ లిమిటెడ్ (డిసిసిడబ్లు్యఎస్), ఢిల్లీ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (డిఎస్ఐఐడిసి) వంటి సంస్థల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకం వ్యాపారం నుంచి ప్రభుత్వం నిష్క్రమిస్తుందని ఈ విధానం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ విక్రేతల లైసెన్సులు సెప్టెంబర్ 30 వరకు చెల్లుతాయి. అయితే రిటైల్ దుకాణాల నుంచి ఇన్పుట్స్ తీసుకొని, పొరుగు రాష్రాల ఉత్పత్తి ధరను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మద్యం బ్రాండ్ల ధర నిర్ణయించనున్నట్లు కొత్త విధానం పేర్కొంది. ఢిల్లీతో పోలిస్తే హరియాణాలో మద్యం చౌకగా ఉన్న కారణంగా, మద్యం అక్రమ రవాణాకు దారితీస్తోంది. మద్యం దుకాణాల్లోకి వాక్ ఇన్ అనుభవం: ప్రతి మద్యం దుకాణం తన వినియోగదారులకు వాక్–ఇన్ అనుభవాన్ని కల్పించాల్సి ఉంటుంది. దుకాణంలోకి వెళ్ళిన కస్టమర్ నచ్చిన బ్రాండ్ మద్యం ఎంచుకోగలుగుతారు. వెండింగ్ మెషీన్ వద్ద కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. అలాంటి రిటైల్ దుకాణాలన్నీ ఎయిర్ కండిషన్డ్‌గా, మాల్స్‌లో ఉండే షాపుల మాదిరిగా తయారవుతాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు అవకాశం: ఇకపై లైసెన్స్ పొందిన బార్లలో బీరు సరఫరా చేయడానికి మైక్రో బ్రూవరీస్ అనుమతించనున్నారు. హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం తాగేందుకు అనుమతించారు. ఎల్–38 పేరుతో ప్రభుత్వం కొత్త లైసెన్స్‌ను ప్రవేశపెట్టింది. బాంకెట్ హాళ్లు, పార్టీ చేసుకొనే ప్రదేశాలు, ఫామ్ హౌస్‌లు, మోటల్స్ లేదా వివాహాలు వంటి కార్యక్రమాల్లోదేశీ, విదేశీ మద్యం సేవించడానికి వన్ టైమ్ వార్షిక ఫీజు వసూలు చేస్తారు. -
జాతికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్ర ఆరోపించారు. కేజ్రివాల్ అబద్ధాలతో ఇతర రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, సెకండ్ వేవ్ సందర్బంగా ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ తేల్చింది. ఏప్రిల్, మే నెలలో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సిలిండర్లు ఢిల్లీకి అందాయని, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన మేరకు ఇతర రాష్ట్రాలకు తగ్గించి మరీ ఢిల్లీకి సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఢిల్లీకి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవరసం ఉండగా.. ప్రభుత్వం 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను డిమాండ్ చేసిందని పేర్కొంది. -
ఢిల్లీలో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు
సాక్షి, ఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో లాక్డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సడలింపు వివరాలను ప్రకటించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు మార్కెట్లు, మాల్స్ నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, బ్యాంకెట్ హాళ్లలో వివాహాలకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. 50 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతి ఇచ్చామన్నారు. ఢిల్లీ మెట్రో, బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతో నిర్వహణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.. ఆటోలు, ఈ-రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, స్పాలు, జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతి లేదని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. పార్క్‌లు, గార్డెన్లకు అనుమతి లేదు. ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చామని.. ప్రార్థనా మందిరాలు తెరిచినా భక్తులకు అనుమతి లేదని సీఎం పేర్కొన్నారు. ఇంటి వద్ద 20 మందితో వివాహాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం గ్రూప్-ఏ సిబ్బందికి అనుమతి ఇచ్చామన్నారు. ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి ఇవ్వడంతో పాటు అత్యవసర కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు. వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని.. కరోనా కేసులు పెరిగితే ఆంక్షలు మరింత కఠినం చేస్తామని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. చదవండి: అమ్మా.. కరోనా మాత, అపచారం తల్లీ! పిల్లలపై... థర్డ్‌వేవ్ ప్రభావానికి ఆధారాల్లేవ్! -
మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై మద్యం ఇంటికే డెలివరీ కానుంది. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేస్తే మద్యం ఇంటికి చేరుకొనేలా ఢిల్లీ ప్రభుత్వం చట్టం చేయనుంది. ఢిల్లీ ఎక్సైజు నియమాల సవరణ చట్టం –2021 ద్వారా ఇది అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ గెజిట్ ప్రటనను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బహిరంగంగా అమ్మే లైసెన్సు కలిగిన హోటళ్లు, క్లబ్బులు, బార్ల నుంచి సైతం మద్యాన్ని బాటిళ్ల ద్వారా అందుకునే వీలు ఈ చట్టం ద్వారా కలగనుంది. యాప్, వెబ్సైట్ ద్వారా చేసిన ఆర్డర్లకు మాత్రమే డెలివరీ సదుపాయం ఉంటుంది. కేవలం ఇంటి చిరునామాలకు మాత్రమే డెలివరీ చేయనున్నారు. ఆఫీసులు, సంస్థలు, హోటళ్లకు మాత్రం డెలివరీ ఉండదు. ఈ నిర్ణయాన్ని భారత ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) స్వాగతించింది. లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఢిల్లీ ఆర్థిక విభాగం ఈ ప్రకటనను జారీ చేసింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మండిపడ్డాయి. ఇలా మద్యాన్ని ఇళ్లకు డెలివరీ చేయడం దేశ సంస్కృతికి విరుద్ధమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ. నగరంలో కోవిడ్ 19ను అరికట్టడానికి బదులు కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యాన్ని డెలివరీ చేయడంలో బిజీగా ఉందంటూ విమర్శించారు. చదవండి: తాజాగా లక్షా 27 వేల కేసులు, 3 వేల మరణాలు -
అల్టిమేటం: ‘ఘాజీపూర్’ ఖాళీ చేయండి
ఘజియాబాద్: ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్ సరిహద్దు వద్ద ఉన్న నిరసన కేంద్రం నుంచి వెళ్లిపోవాలని ఘజియాబాద్ అధికారులు రైతులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రిలోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అక్కడ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న రైతు నేత రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆత్మాహుతి అయినా చేసుకుంటా. కానీ ఇక్కడి నుంచి కదలను. నిరసనను ఆపను’ అని అన్నారు. తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు సాయుధ గూండాలు ఇక్కడికి వచ్చారని ఆందోళన వెలిబుచ్చారు. దాంతో ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ఘాజీపూర్ సరిహద్దు వద్ద తికాయత్ నేతృత్వంలో భారతీయ కిసాన్ యూనియన్ నవంబర్ 28 నుంచి నిరసన తెలుపుతోంది. ‘ఖాళీ చేయాలని ఘజియాబాద్ కలెక్టర్ అజయ్ రైతులను ఆదేశించారు’ అని అధికారులు చెప్పారు. ‘శాంతియుత నిరసనలు చట్టబద్దమైనవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా, రైతు నిరసనకారులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. యూపీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నిస్తోంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. ఏదేమైనా మా నిరసన కొనసాగిస్తాం’ అని తికాయత్ స్పష్టం చేశారు. నోటీసులకు భయపడం ఢిల్లీ పోలీసులు పంపిస్తున్న నోటీసులకు భయపడబోమని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు స్పష్టం చేశారు. జనవరి 26 నాటి అల్లర్లను కారణంగా చూపి రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడం. వాటికి జవాబిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరసన కేంద్రాల నుంచి రైతులను వెనక్కు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలైన నేరస్తులపై చర్యలు తీసుకోకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్ట్ చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టి, పాల్వాల్ నిరసన కేంద్రం నుంచి రైతులను పంపించివేసేందుకు కుట్ర చేశారు’ అని సంయుక్త కిసాన్ మోర్చా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఘాజీపూర్ సహా నిరసన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలను నిలిపేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. సింఘు సరిహద్దు వద్ద రైతులు సద్భావన యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్లు, బైక్‌లతో దాదాపు 16 కిలో మీటర్లు ఈ ర్యాలీ నిర్వహించారు. రైతు సంఘాల జెండాలకు బదులుగా కేవలం త్రివర్ణ పతాకాలు పట్టుకుని రైతులు ఈ యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రాలు, మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటేనన్న భావనను ప్రచారం చేసేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నామ్ సింగ్.. తదితరులు తెలిపారు. జాతీయ పతాకాన్ని అవమానించారని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణకు ఇది తమ జవాబని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని తాము గౌరవించినట్లుగా మరెవరూ గౌరవించరని స్పష్టం చేశారు. సింఘు, టిక్రీ సరిహద్దుల వద్ద నిరసన తెలుపుతున్న రైతుల సంఖ్య భారీగా తగ్గినట్లు కనిపించింది. అయితే, జనవరి 26 నాటి ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు వెనక్కు వెళ్లిపోవడం వల్ల అలా కనిపిస్తోందని రైతు నేతలు తెలిపారు. ‘మాలో స్ఫూర్తి దెబ్బతినలేదు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగుతుంది’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి బల్దేవ్ సింగ్ స్పష్టం చేశారు. ఉద్యమం తొలిరోజు నుంచి ఉన్నవారిలో కొందరు వెనక్కు వెళ్లారని, వారి కుటుంబసభ్యుల్లో నుంచి కొందరు త్వరలో ఇక్కడకు వస్తారని తెలిపారు. ఫిబ్రవరి 1న తలపెట్టిన పార్లమెంటుకు పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేశామని రైతు నేతలు వెల్లడించారు. జనవరి 26నాటి అల్లర్లు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రేనని రైతు నేత గుర్జీత్ సింగ్ ఆరోపించారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద భారీగా భద్రతబలగాలు మోహరించాయి. యూపీలోని బాఘ్పట్ నిరసన కేంద్రంలో ఆందోళనలు ముగిశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరం డిసెంబర్ 19 నుంచి ఇక్కడ నిరసనలు సాగుతున్నాయి. పోలీసులకు అమిత్ షా పరామర్శ జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. శుశ్రుత్ ట్రామా సెంటర్, తీరత్ రామ్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న పోలీసులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవలతో కలిసి హోం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్లలో సుమారు 400 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. రైతు నేతలపై లుక్ఔట్ నోటీసులు గణతంత్ర దినోత్సవం రోజు రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసుల విచారణకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు 9 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక కుట్ర, నేరపూరిత ప్రణాళిక ఉన్నాయని, పరేడ్ మార్గంపై కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించాలని ముందే నిర్ణయించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్ సహా 20 మంది రైతు నేతలకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు గానూ వారిపై చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోకూడదో 3 రోజుల్లోగా వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, ఢిల్లీ హింసాకాండపై నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న రైతు నేతలపై పోలీసులు ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు. ఆ నాయకులు తమ పాస్‌పోర్ట్‌లను కూడా సరెండర్ చేయాల్సి ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు రాజధానిలో జరిగిన హింసాకాండ దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని భావిస్తున్న పోలీసులు.. ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో బాధ్యులపై దేశద్రోహం ఆరోపణలను కూడా నమోదు చేయాలని నిర్ణయించారు. వారిపై ఐపీసీలోని 124ఏ(దేశద్రోహం) సెక్షన్ కింద కూడా ఆరోపణలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎర్రకోట ఘటనలపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మాజీ గ్యాంగ్‌స్టర్ లఖా సిధానియాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ల్లో రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ చాందునీ, కుల్వంత్ సింగ్ సంధూ, జోగిందర్ సింగ్ ఉగ్రహ, మేథా పాట్కర్ తదితర 37 మంది నాయకుల పేర్లు ఉన్నాయి. రాజ్యాంగ బద్ధతపై సుప్రీం నోటీస్‌లు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త సాగు చట్టాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించే 14, 15, 21 అధికరణలను ఉల్లంఘిస్తున్నాయని ప్రతాపన్ తన పిటిషన్లో ఆరోపించారు. అందువల్ల ఆ చట్టాలను అక్రమమైనవి, రాజ్యాంగ విరుద్ధమై నవిగా ప్రకటించి రద్దు చేయాలని కోర్టును కోరారు. తప్పుడు ప్రచారం: దీప్ సిద్ధూ ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు రైతు నేతలు తనను బాధ్యుడిని చేయడంపై పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మండిపడ్డారు. ఎర్రకోటపై సిక్కు మత జెండాను ఎగరేసిన ఆందోళనకారుల్లో దీప్ సిద్దూ ఉన్నారు. ఎర్రకోట వైపు వెళ్లాలని యువ రైతులు వారికి వారే నిర్ణయించుకున్నారని వివరించారు. పోలీసులు, రైతు నేతలు అంగీకరించిన మార్గాన్ని చాలా మంది అనుసరించలేదన్నారు. ఢిల్లీ లోపల ట్రాక్టర్ పరేడ్ ఉంటుందని చెప్పి రైతు నేతలు తమను పిలిపించారని అక్కడి వారు తనకు చెప్పారన్నారు. రైతు నేతలు తనను బీజేపీ, ఆరెస్సెస్ వ్యక్తి అని విమర్శించడంపై స్పందిస్తూ.. ‘బీజేపీ వ్యక్తి కానీ, ఆరెస్సెస్ వ్యక్తి కానీ ఎర్రకోటపై సిక్కు మత ‘నిషాన్సాహిబ్’ జెండా ఎగరేస్తాడా?’ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ప్రశ్నించారు. తాను చేరుకునేటప్పటికే ఎర్రకోట గేట్ విరిగిపోయి ఉందన్నారు. -
‘కోరల’తో వస్తోన్న ‘కాలుష్య–కమిషన్’
సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క ప్రాణాంతక కరోనా వైరస్ మరో పక్క అంతకన్నా ప్రాణాంతక కాలుష్యం దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న విషయం తెల్సిందే. దేశంలో కాలుష్య నియంత్రణ కోసం 22 ఏళ్ల క్రితం ఏర్పాటై నేటికీ నిద్రావస్థలో జోగుతున్న ‘ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) అథారిటి’ స్థానంలో ‘కమిషన్ ఫర్ ఏర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ముదావహమే! ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట దుబ్బలను తగులబెట్టడం వల్ల ఏర్పడుతోన్న కాలుష్యాన్ని అంచనా వేసి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించేందుకు రిటైర్డ్ జడ్జి మదన్ లోకూర్‌తో ఏకసభ్య కమిషన్‌ను సుప్రీం కోర్టు అక్టోబర్ 16వ తేదీన ఏర్పాటు చేయడం, కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకరావడానికి హేతువు కావచ్చు! చదవండి: ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా శాశ్వత చర్యలకు శ్రీకారం చుట్టలేదు ఢిల్లీ సహా దేశంలో పలు నగరాల్లో కాలుష్యం నివారణకు గత కొన్నేళ్లుగా స్పందిస్తున్నది, చర్యలు తీసుకుంటున్నది సుప్రీం కోర్టు ఒక్కటే. దీపావళి పండుగకే కాకుండా పెళ్లిళ్లకు, ప్రారంభోత్సవాలకు బాణాసంచాను నియంత్రిస్తూ వస్తున్నది కూడా సుప్రీం కోర్టే. కాలుష్యం సమస్య ముందుకొచ్చినప్పుడల్లా ‘సుప్రీం కోర్టు చూసుకుంటుందిలే, మనకెందుకు?’ అన్నట్లు రాజకీయ, అధికార యంత్రాంగాలు ముసుగు తన్ని నిద్రపోతూ వచ్చాయి. కేంద్రానికి హఠాత్తుగా ఎందుకు కనువిప్పు కలిగిందేమోగానీ దేశంలో కాలుష్యాన్ని నియత్రించేందుకు 18 మంది సభ్యులగల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ హఠాత్తుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం వారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను కేంద్రం నియమిస్తుండగా, సభ్యులను నలుగురు కేంద్ర మంత్రులు, ఓ క్యాబినెట్ కార్యదర్శితో కూడిన నియామక కమిటీ నియమిస్తుంది. కమిషన్ నియామకానికి సంబంధించి విడుదల చేసిన గెజిట్‌లో అయిదు అధ్యాయాలు, 26 సెక్షన్లు ఉన్నాయి. ఈ కమిషన్ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తుందని అందులో పేర్కొన్నారు. అంటే వివరణ లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేకుండా స్వతంత్య్రంగా వ్యవహరిస్తుందని చెప్పడం కావచ్చు. కాలుష్యానికి కారణం అవుతున్న వారికి లేదా కాలుష్య చట్టాలను ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉండడం ఎంతైనా అవసరమే. ఈ కమిషన్‌ను దేశ రాజధాని ప్రాంతంతోపాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ ప్రాంతాల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉన్నందున తొలి ప్రాథమ్యం కింద వాటికే పరిమితం చేసి ఉండవచ్చు. ఆ ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నిర్మూలించాక, యావత్ దేశంలోని కాలుష్యాన్ని కూడా ఆ కమిషన్ రాష్ట్రాల సహకారంతో నిర్మూలించాలి. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలను అమలు చేసి చూపాలి. కాలుష్య నిర్మూలన కమిషన్‌కు సంబంధించి అంతా బాగుందిగానీ, ఇన్నేళ్లు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని కేంద్రం, పార్లమెంట్లో బిల్లుపెట్టి సమగ్ర చర్చ జరపకుండా ‘వాయు మేఘాల’ మీద ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇందులో ఏమైనా మతలబు ఉందా ? కాలుష్యం నివారణకు మెక్సికో, లాస్ ఏంజెలెస్, లండన్, బీజింగ్ ప్రభుత్వాలు కూడా ప్రమాద ఘంటికలు మోగాకే స్పందించాయి. కాలుష్యమే విషం కనుక ‘ఆలస్యం అమృతం విషం’ అనడం చెల్లకపోవచ్చు! -
ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో వాయు కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీగా జరిమానా, జైలుశిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం కాలుష్య కారకులకు ఏకంగా కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ బుధవారం సంతకం చేయడంతో వెంటనే అమల్లోకి వచ్చింది. ఆర్డినెన్స్‌ను కేంద్ర న్యాయ శాఖ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిమిత్తం 22 ఏళ్ల క్రితం నాటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ)ని రద్దు చేసి, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్‌లో 20 మందికిపైగా సభ్యులు ఉంటారు. ఆర్డినెన్స్ నియమ నిబంధనలను, ప్రత్యేక కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా లేదా ఐదేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. కమిషన్ చైర్మన్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు, కేబినెట్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ప్రతిఏటా పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. దీనివల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనాన్ని, తద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం ఇటీవలే విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కమిషన్ ఏం చేస్తుందంటే.. ►ఏయే ప్రాంతాల్లో గాలి నాణ్యతను ఎంత స్థాయిలో ఉండాలో నిర్ధారించే అధికారం కమిషన్‌కు కట్టబెట్టారు. ►చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న కంపెనీలు/ప్లాంట్లను కమిషన్ తనిఖీ చేస్తుంది. ►అలాంటి కంపెనీలు/ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తనంతట తానుగా(సుమోటో) లేదా ఫిర్యాదుల ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తుంది. ►కమిషన్ తన వార్షిక నివేదికలను నేరుగా పార్లమెంట్‌కు సమర్పిస్తుంది. ►కమిషన్ ఆదేశాలను సివిల్ కోర్టుల్లో సవాలు చేసేందుకు వీల్లేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. -
అన్‌లాక్ 4 : ఢిల్లీలో తెరుచుకోనున్న బార్లు
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ -4 మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీలో బార్లకు సెప్టెంబర్ 9 నుంచి ట్రయల్ బేసిస్ పద్దతిలో తెరవనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పేర్కొంది. ఢిల్లీలో బార్లకు అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను ఇటీవలే కోరింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరినట్లు ఢిల్లీలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు అనిల్ బైజల్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 30వరకు ట్రయల్ పద్దతిలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బార్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో పరిమిత సంఖ్యలో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం విధించిన అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారమే బార్లలో మద్యం సరఫరా చేయనున్నట్లు తెలిపింది. గత శనివారం కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో ప్రధాన నగరాల్లోని మెట్రో సేవలను పునరుద్ధరించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు షరతులతో కూడిన విధంగా బార్లను తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. బార్లకు అనుమతులు ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ఢిల్లీలోని వివిధ బార్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.(చదవండి : తగ్గుతున్న పాజిటివ్ రేటు;భారత్‌కు ఊరట) ►కేంద్రం విధించిన అన్‌లాక్ -4 మార్గదర్శకాలను బార్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. లేని పక్షంలో బార్ల లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ►బార్లకు వచ్చే కస్టమర్లకు మాస్కులు ఉంటేనే లోనికి అనుమతించాలి. ►సీటింగ్ కెపాసిటీ 50శాతానికి తగ్గించి.. ప్రతి కస్టమర్ కనీస భౌతికదూరం పాటించేలా చూడాలి. ►బార్‌కు వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ జోన్ లేకుండా ఉంచాలి. -
కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ స్టేట్ యూనివర్సిటీల పరిధిలోని వివిధ కోర్సులలో చివరి సంవత్సరం సహా అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఢిల్లీలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పరీక్షలు ఉండవని, గత పరీక్షల మూల్యాంకనం ఆధారంగా విద్యార్థుల ఫలితాలను సిద్ధం చేస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరీక్షలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఈ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో నిర్వహించే పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చదవండి: నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శరద్ పవార్ -
గొప్ప మనసు చాటుకున్న గౌతం గంభీర్
ఢిల్లీ : బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో గంభీర్ 50 పడకల గల ఐసోలేషన్ సెంటర్‌ను సిద్ధం చేసి గురువారం ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించి తన ఉదారతను చాటుకున్నారు. గంభీర్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో కోవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. మొత్తం 50 పడకలతో రూపొందించిన ఐసోలేషన్ సెంటర్లో ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించారు. (2 రోజులపాటు ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో కరోనా డెడ్‌బాడీ) గంభీర్ మాట్లాడుతూ..' కరోనా సోకినవారు ఎవరైనా సరే ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడికి రావచ్చు. ఇక్కడకు వచ్చే కరోనా బాధితులకు మా సెంటర్లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మానవతాదృక్పథంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. అందుకే నేను ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాను. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ త్వరలో ఇతర ప్రాంతాలలో కూడా ఐసోలేషన్ కేంద్రాలను నిర్మిస్తోంది. ' ప్రతి జీవితానికి మనమే బాధ్యత!'' అంటూ సందేశాన్నిచ్చారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్యా కరోనా బాధితులను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం పలు పంక్షన్ హాళ్లను ఐసోలేషన్ సెంటర్‌గా మార్చి కోవిడ్ ఆసుపత్రులకు అనుసంధానించింది. ఇప్పటివరకు ఢిల్లీలో 87,360 కరోనా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య 2,742గా ఉంది. -
‘వారిని పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ సర్కార్ తీరును సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా తప్పుపట్టింది. ఆస్పత్రుల్లో కోవిడ్-19 రోగులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వ నిర్వాకం పట్ల సుప్రీంకోర్టు మండిపడింది. కరోనా రోగులకు సరైన చికిత్స ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడి చర్యల్లో వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య తగ్గించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని ఆదేశించింది. ఇక మహమ్మారి బారినపడి మరణించిన వారి మృతదేహాల నిర్వహణ అమానుషంగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. చదవండి : షాకిచ్చిన కోర్టు.. ఐదు లక్షల ఫైన్ -
కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశం లెఫ్ట్‌నెంట్ గవర్నర్, విపత్తు నిర్వాహణ శాఖ చైర్మన్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరగడానికి కారణం కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ కాదంటూ కేంద్ర అధికారులు పేర్కొన్నారని వెల్లడించారు. గతవారం నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని అధికారులు తెలిపారని అన్నారు. జూలై నెల చివరికల్లా 5.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని, కరోనా బాధితులకు వైద్యం అందిచడానికి 80 వేల బెడ్లు కావాలని పేర్కొన్నారు. (జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్) ఈ సమావేశానికి ముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం మందికి వ్యాధి ఎలా సంక్రమిస్తోందో సరైన సమాచారం లేదని తెలిపారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందస్తుగానే సెల్ఫ్ ఐసోలేషన్‌కి పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలో కొత్తగా 1007 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ఇప్పటివరకు 874 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) -
కరోనా: ఢిల్లీ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవుతుండడం, వారికి ప్రత్యేక సదుపాయం కల్పించడం కష్టం అవుతుండడంతో ఢిల్లీ ఆస్పత్రుల్లోని బెడ్లను ఢిల్లీ జాతీయ రాజధాని పరిధిలో నివసిస్తున్న వారికి మాత్రమే రిజర్వ్ చేస్తున్నట్లు, ఆంకాలోజీ, న్యూరోసర్జరీ కేసులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పైగా ఆస్పత్రిలో చేరడానికి జాతీయ రాజధాని పరిధిలో నివసిస్తున్నట్లు తగిన ధ్రువ పత్రాలను కూడా చూపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవించే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఈ హక్కు రాజ్యాంగం 21వ అధికరణ కింద గ్యారంటీ ఇచ్చింది. అందుకని ఒకరి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి, మరొకరి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం కుదరదని, ఇందులో ఉన్నత స్థాయివారు, కాని వారంటూ వివక్షత చూపడం కూడా తగదని 1998లో ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో ఢిల్లీ వాసులకు మాత్రమే ఉచిత వైద్యం అందిస్తూ ఢిల్లీయేతరులకు ఉచిత వైద్యాన్ని నిరాకరిస్తూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు తీర్పుల ప్రకారం ఢిల్లీ ఆస్పత్రి బెడ్లను ఢిల్లీ జాతీయ రాజధాని పరిధిలోని వారికే కేటాయించడం చెల్లదు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించారేమో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చ్రెర్మన్ కూడా అయిన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఆస్పత్రులకు వచ్చే ప్రజలందరికి చికిత్స అందించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేశారు. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) -
మందు బాబులకు కిక్ ఇచ్చే వార్త
సాక్షి, న్యూఢిల్లీ: మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం కిక్ ఎక్కించే వార్త తెలిపింది. మద్యం అమ్మకాలపై విధించిన ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ఎత్తివేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. జూన్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అన్ని రకాల మందు బాటిళ్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా మద్యం అమ్మకాలపై 70 శాతం కరోనా ప్రత్యేక ఫీజును ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీగా మద్యం అమ్మకాలు తగ్గిపోవడం, మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్) ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీ మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తూ మరో రెండు రోజులు ఆగితే ఇప్పుడు కొనే మద్యాన్ని దాదాపు సగం ధరకే కొనుక్కోవచ్చని పేర్కొంటున్నారు. ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ఎత్తివేయడంతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయం పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక లాక్డౌన్ కారణంగా కోల్పోతున్న ఆదాయాన్ని మద్యం ధరల పెంపుతో భర్తీ చేయడంతో పాటు మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో ‘స్పెషల్ కరోనా ఫీజు’ ను ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. (చనిపోయిన కరోనా రోగి పట్ల అమానుషం) -
‘జీతాలు చెల్లించాలి.. రూ. 5 వేల కోట్లివ్వండి’
న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం సాయం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ట్విటర్లో వెల్లడించారు. ‘ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’అని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయమై మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్న నిధుల్ని ఇవ్వలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలకు రూ.3500 కోట్లు, ఇతర అవసరాలకు కలిపి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని తెలిపారు. గత రెండు నెలలుగా ఢిల్లీలో రూ.500 కోట్ల చొప్పునే జీఎస్టీ వసూళ్లు జరిగాయని వెల్లడించారు. ఇక కరోనా పోరులో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కూడా సొమ్ము లేదని వాపోయారు. ఇదిలాఉండగా.. దేశ రాజధానిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నటికీ.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధమని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో సడలిపులు ఇచ్చారు. ఢిల్లీ వ్యాప్తంగా 120 కంటైన్ జోన్లు ఉండటం గమనార్హం. ఇక ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 వేల కరోనా పాటిజివ్ కేసులు నమోదవగా.. 416 మంది మరణించారు. (చదవండి: ఢిల్లీలో మహమ్మారి విజృంభణ) -
సిక్కిం మరో దేశంగా ప్రభుత్వ ప్రకటన!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం తప్పులో కాలేస్తూ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఇందులో సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఢిల్లీ ప్రభుత్వం హుటాహుటిన తప్పును సరిదిద్దుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్లో వాలంటీర్లుగా చేరాలనుకునేవారి కోసం ప్రకటన విడుదల చేసింది. పలు పత్రికల్లోనూ ఈ యాడ్ అచ్చయింది. అందులో భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కింను కూడా చేర్చింది. దేశంలో అంతర్భాగమైన సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. (ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...) కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి ఇదే అదనుగా భావించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రంగా మండిపడింది. ఈశాన్య ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసిన అర్వింద్ కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది. దీనిపై స్పందించిన ఆప్.. హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రకటన జారీ చేశామని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ప్రకటన సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సదరు ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ దారుణ తప్పుకు కారణమైన సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా సిక్కిం ప్రత్యేక రాష్ట్రంగా 1975 మే 16న అవతరించింది. వారం రోజుల కిందటే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంది. (క్రమశిక్షణతో కొమ్ములు వంచారు) -
ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్ కరోనా ఫీజు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్ బాటిల్స్‌పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్డౌన్ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది. -
ఒక్కరోజులో 6.5 లక్షల మందికి ఆహారం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం 6.5 లక్షల మందికి ఆహారాన్ని పంపిణీ చేసినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొంది. తమకు ఆహారం సరఫరా చేయాలని కోరుతూ ప్రభుత్వానికి 1,040 కాల్స్ వచ్చాయని తెలిపింది. లాక్డౌన్ నేపథ్యంలో రోజూ 10 నుంచి 12 లక్షల మందికి ఢిల్లీ ప్రభుత్వం ఆహారం సమకూరుస్తుందని మార్చి 31న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము ఇప్పటివరకూ రోజుకు 4 లక్షల మంది వరకూ భోజనం అందిస్తుండగా సోమవారం నుంచి 10 నుంచి 12 లక్షల మందికి ఆహారం సరఫరా చేస్తామని ఆహార కేంద్రాలను పెంచి రద్దీని నివారిస్తామని కేజీవాల్ పేర్కొన్నారు. 2500 స్కూళ్లు, 250 నైట్ షెల్టర్లలో నిరాశ్రయులు, ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం ఆహారం సమకూరుస్తోంది. చదవండి : ‘క్రమశిక్షణతోనే మహమ్మారి కట్టడి’ -
కరోనా: కేజ్రివాల్ ప్రభుత్వం కీలక చర్యలు
సాక్షి, ఢిల్లీ : కరోనా బాధితులకు నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా కేజ్రివాల్ ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని లోక్‌నాయక్, జీబీ పంత్ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులను లలిత్ హోటల్లో ఉంచనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న వైద్యనిపుణులు, ఆరోగ్య కార్యకర్తలను 14 రోజులపాటు లలిత్ హోటల్లోనే ఉంచాలని నిర్ణయించింది. ప్రాణాంతక ఈ వైరస్ డాక్టర్లు, వారి కుటుంబాలకు కూడా సోకుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ ప్రణాళిక ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ట్వీట్ చేసింది. పాఠశాలలనే షెల్టర్లుగా కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో ప్రతిరోజు దాదాపు 4 లక్షల మందికి ఉచిత ఆహారం అందివ్వడానికి 800కి పైగా ప్రత్యేక కేంద్రాలు,72 లక్షల మందికి ఉచిత రేషన్ అందివ్వడానికి వెయ్యికి పైగా షాపులు పనిచేస్తాయని వెల్లడించింది. నిరాశ్రయులు, వలస కార్మికుల కోసం ఢిల్లీ అంతటా 234 నైట్ షెల్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా రోజూవారీ కార్మికులు, వలస కూలీలకు వసతి కల్పించేందుకు పాఠశాలలను షెల్టర్లుగా మార్చాలని యోచిస్తుంది. నగరం విడిచి వెళ్లకండి వలస కార్మికులు ఎవరూ నగరం విడిచి వెళ్లకూడదని, దీని ద్వారా 21 రోజుల లాక్డౌన్ ప్రయోజనాన్ని కోల్పోతామని కేజ్రివాల్ తెలిపారు. కాబట్టి ఎక్కడివారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి కేజ్రివాల్ వలస కార్మికులను కోరారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమానులు కార్మికులకు ఆహార సదుపాయం కల్పించాలని కోరారు. (ఆ వదంతులు అవాస్తవం: కేంద్రం) అద్దె డబ్బులు నేను చెల్లిస్తా: కేజ్రివాల్ అదే విధంగా ఈ విపత్కర సమయంలో నెలవారి అద్దె చెల్లించాలని అద్దెదారులను యజమానులు ఇబ్బంది పెట్టకూడదని కోరారు. ఒకవేళ అద్దె చెల్లించలేని నిరుపేదలు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టరాదని, ఆ డబ్బులు తానే ఇస్తానని కేజ్రివాల్ హామీయిచ్చారు. (తమిళనాడులో ఒక్కరోజే 17 కొత్త కేసులు) -
కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 9 గంటల నుంచి మార్చి 31 అర్ధ రాత్రి వరకు ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, గుంపులుగా తిరగడంపై ఆంక్షలు విధించారు. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ణా చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రోజున దాదాపు 3,700 సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341గా నమోదు కాగా, మృతుల సంఖ్య 6 కి చేరింది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. -
కరోనా: అవి తప్ప అన్ని మాల్స్ మూత
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరణకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని మాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. అయితే కిరాణా, ఫార్మసీ కూరగాయల దుకాణాలకు దీన్నుంచి మినహాయింపు వుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అన్ని మాల్స్ (కిరాణా, ఫార్మసీ, కూరగాయల షాపులు మినహా) మూసివేస్తున్నామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందితే, అలాంటి పరిస్థితులను ఎదుర్కొంనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఎంఆర్ఐ,ఇతర మెషీన్లు, వెంటిలేటర్లు, తగినంత మందులు, వినియోగ వస్తువులు, సిబ్బంది మొదలైనవి అందుబాటులో వుండాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఆయా విభాగాల అధిపతులు, కార్యదర్శులతో సమీక్షించినట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10031కి చేరింది. బాధితుల సంఖ్య 244 602కి చేరింది. In view of the prevailing situation, we are closing down all Malls (except grocery, pharmacy and vegtable shops in them) — Arvind Kejriwal (@ArvindKejriwal) March 20, 2020 -
ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం
-
ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లను ఢిల్లీలో నిర్వహించకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది.ఇదే విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ' ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉంది. దాంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిషేధిస్తున్నాం. ఐపీఎల్‌తో పాటు మిగతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను కూడా అనుమతించేది లేదు. ఒకవేళ బీసీసీఐ కొత్త ఫార్మాట్లో ఐపీఎల్లో నిర్వహించాలనుకుంటే అది వారి ఇష్టం' అని పేర్కొన్నారు. (భయంతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు) మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలా ? వద్దా? అనే దానిపై సందిగ్థత నెలకొనే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించలేమని కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. ఇదే విషయమై శనివారం(మార్చి 14) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. -
నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ హత్యాచార ఘటనలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ సామూహిక అత్యాచారం హత్య కేసులో ఒక దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని ఢిల్లీ హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషుల మెర్సీ పిటిషన్ కోసం వెయిట్ చేయాల్సి అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని బుధవారం పేర్కొంది. మరణ శిక్షరద్దుపై ముకేశ్, వినయ్ శర్మ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ముందుస్తుదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ మధ్యాహ్నానికి (భోజన విరామం తరువాత) వాయిదా పడింది. 2012 నిర్భయ కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ (26), ముకేశ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) ల ఉరి శిక్ష జనవరి 22న అమలు చేయలేమని, ప్రభుత్వం, తీహార్ జైలు అధికారుల స్టాండింగ్ కౌన్సెల్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22 న ఉరితీయలేమని వారు తేల్చి చెప్పారు. చదవండి : నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు -
ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి
దీపావళి అనగానే మనసుకి ఆహ్లాదాలనిచ్చే దీపాలూ, వాతావరణాన్ని కలుషితం చేసే టపాకాయలే గుర్తొస్తాయి. అందుకే దీపావళి పండుగని ప్రమాదకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏటా వేలాది మందిని మృత్యువు దరికి చేరుస్తోన్న టపాకాయలు కాల్చొద్దంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఎకోఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో, తక్కువ పొగని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్ బల్బులకు బదులుగా బయోడీగ్రేడబుల్ దీపాలను వెలిగించడం వల్ల కూడా కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. ఇందులోభాగంగానే ఈసారి ఢిల్లీ ప్రభుత్వం కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లను కాల్చుకోవడానికి మాత్రమే అనుమతినిచ్చింది. అవి కూడా ప్రభుత్వం తయారు చేసిన వాటిని మాత్రమే కొనాలి. ప్రభుత్వం తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటితోనే ఈసారి ఢిల్లీ వాసులు దీపావళి జరుపుకొని సంతృప్తి పడవలసిందే. -
మద్యం వ్యాపారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మద్యం వ్యాపారులకు షాక్ ఇస్తున్నాయి. ఎనిమిది రోజులకు మించి పాతబడిన మద్యం నిల్వలను ఆగస్ట్ 31 నుంచి ధ్వంసం చేయాలని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. కస్టమర్లకు నాణ్యతతో కూడిన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు కల్తీ మద్యం, పాత, కొత్త ఆల్కహాల్‌ను మిక్స్ చేసే వ్యాపారుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం వ్యాపారులు తరచూ గడువు ముగిసే బీర్లను పెద్దసంఖ్యలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని కస్టమర్లకు అందిస్తున్నారు. తొలుత కొనుగోలు చేసిన మద్యం నిల్వలను ముందుగా విక్రయించాలని బీర్, వైన్, షాంపేన్ వంటివి మూడు రోజుల వరకే కౌంటర్లలో ఉంచాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. రూ 1500 ఖరీదు కలిగిన విస్కీ, జిన్, వోడ్కా, రమ్, స్కాచ్‌లను ఐదు రోజుల్లోగా విక్రయించాలని, రూ 1500 నుంచి రూ 6000 విలువైన మద్యాన్ని ఎనిమిది రోజుల్లోగా అమ్మకాలు జరిపి మిగిలిన నిల్వలను ధ్వంసం చేయాలని పేర్కొంది. ఆయా గడువులోగా స్టాక్స్ మిగిలితే వాటిని అమ్మినట్టుగానే భావించి కౌంటర్ల నుంచి పక్కనపెట్టాలని తెలిపింది. ఈ నిల్వలను వారం రోజుల్లో నిర్వీర్యం చేయాలని పేర్కొంటూఈ ఉత్తర్వులను పాటించని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, డిస్కోథెక్‌ల లైసెన్లను రద్దు చేసేందుకూ ప్రభుత్వం వెనుకాడబోదని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ కుమార్ గంభీర్ స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై పబ్‌లు, హోటల్స్, బార్ యజమానులు భగ్గుమంటున్నారు. ఈ నిర్ణయంతో అవినీతి మరింత పెరుగుతుందని, మద్యం కల్తీని అరికట్టాలంటే ఎక్సైజ్ శాఖ తమ అవుట్లెట్లను తనిఖీ చేయవచ్చని ఇలా తమను టార్గెట్ చేయడం సరికాదని ఆర్ధర్ 2 పబ్ యజమాని సువీత్ కార్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రీమియం బ్రాండ్స్ వ్యాపారంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కస్టమర్లు ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, నాణ్యమైన మద్యం తమకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం వెసులుబాటు కల్పిస్తుందని థామస్ కుక్‌లో పనిచేసే పర్వ్ పేర్కొన్నారు. కల్తీ మద్యం నివారించకపోతే పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని సీనియర్ వైద్యులు విక్రంజిత్ సింగ్ అన్నారు. బార్లలో తరచూ పాత, కొత్త మద్యాలను మిక్స్ చేసి కస్టమర్లకు ఇవ్వడం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కల్తీ మద్యం పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. -
ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ రాజకీయాలలో విద్యుత్తు ఎల్లప్పుడూ కీలకాంశంగానే ఉంటోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చారిత్రక విజయం లభించడం వెనుక కూడా ‘బిజ్లీ హాఫ్’ హామీ ముఖ్యపాత్ర పోషించింది. సబ్సిడీ రేట్లకు విద్యుత్తు ఇస్తామన్న తమ ïహామీ తమ విజయానికి ముఖ్య కారణాలలో ఒకటన్న విషయాన్ని ఆప్ కూడా మరచిపోలేదు. అందుకే గత నాలుగున్నర సంవత్సరాలలో విద్యుత్తు చార్జీలు పెరగకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమీçపిస్తున్న తరుణంలో 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ఓటర్లపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ సమ్మోహనాస్త్రం అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌కు ఓట్ల జల్లు కురిపించే అవకాశం ఉంది. చదవండి: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. ఆప్ ప్రయోగించిన ఈ మాస్టర్ స్ట్రోక్ తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలో పడ్డాయి. ప్రతిపక్ష పార్టీలు గత కొద్ది నెలలుగా ఫిక్స్డ్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఫిక్స్డ్ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు. షీలాదీక్షిత్ సర్కారు పరాజయం వెనుక పెరిగిన విద్యుత్తు చార్జీల ప్రభావం ఉందన్నది కాదనలేని అంశం. కేజ్రీవాల్ 2013 నుంచే పెరిగిన విద్యుత్తు చార్జీలను ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఈ విషయమై ఆయన అప్పట్లో 15 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు.ఆ తరువాత బిజ్లీ హాఫ్ పానీ మాఫ్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈ హామీని అమలు చేశారు. ఇప్పుడు ఆప్ సర్కారు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసిç ³హలే హాఫ్ అబ్ మాఫ్ నినాదంతో ఓట్లు రాబట్టాలనుకుంటోంది. -
పెళ్లి వేడుకకూ పరిమితులు
‘నా పెళ్లి.. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను’అంటే కుదరదంటోంది ఢిల్లీ ప్రభుత్వం. పెళ్లి ఎక్కడ చేసుకోవాలో, ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం పెట్టాలో.. .మిగిలిన ఆహారాన్ని ఏం చెయ్యాలో... అన్ని తామే చెబుతామంటోంది. తమ మాట పాటించకపోతే భారీగా జరిమానా కూడా వసూలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానాన్ని కూడా తయారు చేసింది. కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా, ఆడంబరంగా పెళ్లి తదితర వేడుకలు జరుపుకోవడం ఈ మధ్య మామూలైంది. వీటివల్ల యజమానులకు కలిగే సంతోషాన్ని పక్కన పెడితే బోలెడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లలో బోలెడు ఆహారం వృథా అవుతోందని, వేడుకల్లో వాడే వస్తువులు, పదార్థాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని, ఇరుగుపొరుగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు రాజధానిలో వేడుకల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రూపొందిం చాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సర్కారు ఈ ముసాయిదాను తయారు చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా (ఎల్డీఆర్ఏ) ఇన్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదించింది కూడా. దాని ప్రకారం.. ► పెళ్లిళ్లు, వేడుకల్లో మిగిలిపోయే, వృథా అయ్యే ఆహారాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)ద్వారా అన్నార్థులకు పంచిపెట్టాలి. ఇందుకోసం కేటరర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు ఎన్జీవోల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆహారాన్ని ఎలాపడితే అలా కాకుండా చక్కగా, పార్సిళ్లలోనో, డబ్బాల్లోనో ఎన్జీవోలకు అందజేయాలి. ► హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, కేటరర్లు,నిర్వాహకులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆహార భద్రత విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అలాంటి వారే వేడుకలకు భోజనాలు తయారు చేయడం, సరఫరా చేయడం వంటివి చేయాలి. ► వేడుక నిర్వహించే ప్రాంతం విస్తీర్ణాన్ని బట్టి అతిథులను పిలవాలి. ఎక్కడ ఎంత మందిని పిలవాలన్నది సంబంధిత పట్టణ స్థానిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. ► ఎంత మంది అతిథులను పిలుస్తామో వారికి సరిపడేంత ఆహారం మాత్రమే సిద్ధం చేయాలి. పిలిచిన వాళ్లంతా రాకపోవడం లేదా ఇతరేతర కారణాల వల్ల ఆహారం మిగిలితే వేడుక పూర్తయిన వెంటనే మిగులు ఆహారాన్ని వెంటనే ఫంక్షన్ హాలు నుంచి తొలగించాలి. ఆ బాధ్యత హాలు యాజమాన్యానిదే. ► ఫంక్షన్ హాలులో పార్కింగ్ ప్రదేశంలో ఎన్ని కార్లు నిలపవచ్చో ఆ సంఖ్యను నాలుగుతో గుణిస్తే ఎంత వస్తుందో అంత మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంటే 20 కార్లు పట్టేంత స్థలం ఉంటే 80 మందినే పిలవాలన్నమాట. లేదా హాలు విస్తీర్ణాన్ని 1.5 చదరపు మీటర్లతో భాగిస్తే ఎంత వస్తుందో అంత మందినే పిలవాలి. ఈ రెండింటిలో ఏది తక్కువయితే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ► రెండున్నర అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో కట్టిన హాళ్లలోనే ఇలాంటి వేడుకలు నిర్వహించుకోవాలి. ఈ హాళ్లు రోడ్డు చివర(డెడ్ ఎండ్) ఉండకూడదు. ఈ భవనాలకు ప్రధాన రహదారితో కలుపుతూ 60 అడుగుల రోడ్డు సదుపాయం ఉండాలి. ► పర్యావరణానికి ఏ విధంగానూ ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడుకల కోసం పాక్షిక శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. హాలు బయట వాహనాలు నిలపకూడదు. నీటిని పొదుపుగా వాడాలి.చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. పెద్ద శబ్దాలు చేయకూడదు. ► ఈ నిబంధనలను పాటించాలి. లేనిపక్షంలో 15 లక్షల వరకు జరిమానా కట్టాలి. మొత్తం జరిమానాను కేవలం హాళ్ల యాజమాన్యం కట్టాలి. వేడుకలు జరుపుకునే వారికి సంబంధం లేదు. -
అది నిరుద్యోగ మహిళలకు కేజ్రివాల్ వరం
సాక్షి, న్యూఢిల్లీ : 23 ఏళ్ల డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ షీలా ఓ రోజు కొంచెం ఆలస్యంగా ఆఫీసుకు బయల్దేరింది. తానెక్కిని మినీ బస్సు ఆఫీసుకు సమీపంలోకి రాగానే ముందు వైపున్న ఫుట్‌బోర్డు పైకి వెళ్లింది. కొంచెం బస్సును స్లో చేస్తే తాను ఆఫీసు ముందు దిగిపోతానని డ్రైవర్‌ను కోరింది. అదేమి వినిపించుకోని డ్రైవర్ అలాగే బస్టాప్ వైపు బస్సును తీసుకెళుతున్నారు. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి రావాలంటే పదిహేను నిమిషాలు పడుతుంది. బస్సు ఈ లోగా కొంచెం స్లోకాగానే ఆమె ఏమీ ఆలోచించకుండా అందులో నుంచి దూకేసింది. అదుపు తప్పి కింద పడిపోయింది. కుడి మోచేతి, ఎడమ మోకాలు కొట్టుకు పోయాయి. అలాగే ఆఫీసుకు వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం సెలవు పెట్టి ఇంటికి వెళ్లింది. దక్షిణ్పురిలోని తన ఇంటి నుంచి దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా ఫేస్ వన్‌లోని ఆఫీసుకు షీలా ప్రతి రోజు గ్రామీణ సేవా మినీ బస్సు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఇందుకు ఆమెకు పోను ఐదు రూపాయలు, రాను ఐదు రూపాయలు బస్సు ఛార్జీలు అవుతున్నాయి. అదే ఆటోలో వెళ్లాలంటే పోను, రాను 20 రూపాయలు సమర్పించుకోవాలి. ఢిల్లీ నగరంలో 3,900 బస్సులు ఉన్నప్పటికీ, 373 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉన్నప్పటికీ షీలాకు అందుబాటులో ఉన్న బస్సు సౌకర్యం ఇదే. అంటే అంతకన్నా ఆమె ఎక్కువ డబ్బులు ప్రయాణానికి ఖర్చు పెట్టలేదు. షీలా లాంటి వాళ్లు నగరంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నగరంలోని బస్సుల్లో, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు విద్యాలయాలు, ఆఫీసులకు, మార్కెట్లకు వెళ్లేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతోందన్న ఉద్దేశంతో కేజ్రివాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది. పట్టణాల్లోనే మహిళలకు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ ఆశ్చర్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు ఏదో ఒక పనికి వెళుతున్నారు. ఢిల్లీ కూడా అందుకు విరుద్ధం ఏమీ కాదు. ఢిల్లీలో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎత్తయిన బహుళ అంతస్తు కార్యాలయాలు, మాల్స్, హోటళ్లు, కేఫ్‌లు ఎప్పుడు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. కానీ 15 ఏళ్లు దాటిన 11.7 శాతం స్త్రీలు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. జాతీయంగా మహిళలు సరాసరి 27 శాతం మంది పనిచేస్తుండగా అందులో ఢిల్లీలో పనిచేస్తున్న మహిళల సంఖ్య సగం కూడా లేక పోవడం ఆశ్చర్యం కల్పిస్తోంది. ఇంటిపట్టున ఉంటున్న చాలా మంది మహిళలను ఉద్యోగం విషయంలో కదిలించగా, ఉద్యోగాలకు అప్లై చేయడానికి డబ్బులు లేవని, అప్లై చేసినా అంతంత దూరం ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు ఇట్లో డబ్బులివ్వరని చెప్పారు. ముఖ్యంగా పెళ్లి చేసుకొని ఉద్యోగం చేయాలనుకుంటున్న మహిళల బాధ మరోలా ఉంది. చాలీ చాలీ జీతాలు అందుకుంటున్న భర్తలు డబ్బులివ్వలేరని, ఉండి ఇద్దామనుకున్న భర్తలను అత్తామామలు వారిస్తున్నారని, వారికి తాము ఉద్యోగం చేయడం ఇష్టంలేకేనని చెప్పారు. కేజ్రివాల్ తీసుకున్న నిర్ణయం వల్ల తాము ఇప్పుడు ఎక్కడికైనా స్వతంత్రంగా వెళ్లి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందిన షీలా, సుషా, రాధ తదితరులు తెలిపారు. -
ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలకు బ్రేక్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధాలు, మందుల అమ్మకాలను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మందుల ఆన్లైన్ అమ్మకాలపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..‘ఆన్లైన్ అమ్మకాల కారణంగా ఔషధాలు దుర్వినియోగమయ్యే అవకాశముంది. నకిలీల బెడదతో సతమతవుతున్న ఈ–కామర్స్ సైట్లలో నాణ్యతలేని, కల్తీ మందులు సరఫరా అయితే రోగి ప్రాణానికే ప్రమాదం’ అని తెలిపారు. దీంతో ఈ విషయంలో అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కోర్టు నోటీసులు జారీచేసింది. -
సంచలన నిర్ణయం తీసుకున్న ఆప్ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఢిల్లీ పోలీసులు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా హోం మంత్రి సత్యేంద్ర జైన్ ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులను ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతవారం ఢిల్లీ సచివాలయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కారం పొడితో దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి బీజేపీ, ఢిల్లీ పోలీసులే కారణమని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తమ నాయకులపై బీజేపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావాలనే డిమాండ్ తెరమీదకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో సీపీఎస్ రద్దు: కేజ్రీవాల్ ఢిల్లీలో నూతన పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు సోమవారం ఢిల్లీలో కదం తొక్కారు. ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ఇక్కడి రాంలీలా మైదానంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాకు సీఎం కేజ్రీవాల్ వచ్చారు. పాత పెన్షన్ విధానం అమలుకోసం సోమవారమే ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం బాధాకరం అన్నారు. అందుకే ఢిల్లీలో సీపీఎస్ రద్దు చేశానన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానన్నారు. ఢిల్లీలో సీపీఎస్ రద్దుచేస్తున్నందుకు ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి స్థిత ప్రజ్ఞ... సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ధర్నాలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ : జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా పడింది. నిషేదిత ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలతో పాటు యుమునా నది కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయెల్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు వెలువరించింది. జనావాసాల్లో నెలకొల్పిన స్టీల్ శుద్ధి పరిశ్రమలను వెంటనే మూసేయించాలని ఆదేశాలు జారీచేసింది. ‘ఆలిండియా లోకాధికార్ సంఘం’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ ఈ తీర్పునిచ్చింది. కాగా, ఢిల్లీ మాస్టర్‌ప్లాన్-2021 ప్రకారం నిషేదించబడిన ప్రదేశంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయనీ, వాటిని నియంత్రించాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (డీపీసీసీ)కు ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ జరిమానా తప్పలేదు. -
అతడిని విడుదల చేయడం కుదరదు!!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెసీకా లాల్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మను శర్మ ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించింది. అతడితో పాటుగా ప్రియదర్శిని మట్టూ అనే యువతి హత్య కేసులో నిందితుడైన సంతోష్ సింగ్, తాండూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుశీల్ శర్మలను కూడా శిక్షా కాలం పూర్తికాకముందే విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన సమావేశమైన శిక్షాకాల పునఃసమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు- ఎస్సార్బీ) గురువారం సమావేశమైంది. ఇందులో భాగంగా ముందస్తు విడుదల కోసం అప్లై చేసుకున్న 108 మంది ముద్దాయిల దరఖాస్తులను బోర్డు పరిశీలించింది. ఇందులో 86 మంది అభ్యర్థనను తిరస్కరించిన బోర్డు సభ్యులు.. సత్ప్రవర్తన కలిగిన 22 మందిని మాత్రం శిక్షా కాలం కంటే ముందే విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన మనుశర్మ, సంతోష్ సింగ్, సుశీల్ శర్మ వంటి వ్యక్తులను ముందస్తుగా విడుదల చేయడం అంత శ్రేయస్కరం కాదని బోర్డు వ్యాఖ్యానించింది. కాగా జైళ్ల డీజీ అజయ్ కశ్యప్, హోం సెక్రటరీ మనోజ్ పరీదా, ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్, జిల్లా జడ్జి, లా సెక్రటరీ అనూప్ తదితరులు ఎస్సార్బీ సభ్యులుగా ఉన్నారు. కాగా ఒక ప్రైవేటు బార్లో పనిచేస్తున్న జెసికా లాల్ 1999లో హత్యకు గురయ్యారు. జెసికా మరణించిన రోజు మనుశర్మ మాజీ మంత్రి వినోద్ శర్మ కుమారుడితో కలిసి ఆమె పనిచేస్తున్న బార్‌కు వెళ్లాడు. ఆ రోజు జెసికాను మద్యం తీసుకురమ్మని మనుశర్మ ఆదేశించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ కోపంలో జెసికాను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో పోలీసులు మనుశర్మ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడిలో మార్పు వచ్చిందని భావించిన జెసికా సోదరి సబ్రినా లాల్ అతడిని విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జైళ్ల శాఖకు లేఖ రాయడం విశేషం. -
నజరానా కోసం నిరీక్షణ!
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం సాధించింది. ఇంతటి ఘనత సాధించి మూడు నెలలు దాటినా... సొంత రాష్ట్రం నుంచి ప్రొత్సాహక బహుమతికి ఇంకా నోచుకోలేకపోయింది. ప్రస్తుత ఢిల్లీ క్రీడా పాలసీ ప్రకారం స్వర్ణ, రజత, కాంస్యాలకు వరుసగా రూ. 14 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 6 లక్షలు నజరానా ఇస్తున్నారు. ఇది హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు ఇచ్చే నజరానా కంటే చాలా తక్కువ. అయితే కొత్త పాలసీ ప్రకారం మనికకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలకు వరుసగా రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నజరానా ఆలస్యంపై ఢిల్లీ ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్ (స్పోర్ట్స్) ధర్మేందర్ సింగ్ మాట్లాడుతూ ఫైల్‌ను కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు చెప్పారు. -
ఇంటి వద్దకే 100 రకాల ప్రభుత్వ సేవలు
న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి వాటికోసం ఇక ప్రభుత్వ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సినవసరం లేదట. ఇక మీదట ఇలాంటి 100 రకాల ప్రజా సేవలను ఢిల్లీ ప్రభుత్వం ఇంటి వద్దనే అందించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి ఈ సేవలన్నింటిన్నీ ఇంటి వద్దనే అందించడం ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటి కోసం అదనంగా 50 రూపాయల ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, విజయవంతంగా పూర్తయిన ప్రతి ఒక్క లావాదేవీకి ‘ ఫెసిలిటేషన్ ఫీజు’ కింద సిటిజన్ల నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి వర్గం ప్రకటించింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, ఈ సమస్యను తీర్చడానికి ఢిల్లీ సర్కారు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా ఈ వినూత్న సౌకర్యాన్ని ప్రారంభించబోతుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని, లంచాల బెడద తప్పుతుందని, ప్రజల సమయం వృథా కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.ఈ పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు. దీంతో ఏ ఒక్క సిటిజన్ గంటల తరబడీ క్యూ లైన్లలో వేచి చూడాల్సినవసరం లేదన్నారు. ఈ ప్లాన్ కింద మొబైల్ సహాయకస్(ఫెసిలేటర్లు)ను ఏజెన్సీ ద్వారా నియమించుకుంది. దీనికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ప్రారంభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేయాలనుకునే వారు, సంబంధిత కాల్ సెంటర్‌కు కాల్ చేసి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏజెన్సీ, మొబైల్ సహాయకస్కు ఆ పనిని అప్పగించి, దరఖాస్తుదారుల రెసిడెన్స్‌ను సందర్శించాలని ఆదేశిస్తుంది. ఏజెన్సీ ఆదేశాలు మేరకు దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లను, వివరాలను కోరతారు. అయితే డ్రైవింగ్ టెస్ట్ కోసం దరఖాస్తుదారుడు ఒక్కసారి ఎంఎల్ఓ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. దీని కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని గతేడాది నవంబర్లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. -
ఎలక్ర్టిక్ బస్సులకు ఢిల్లీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : కాలుష్య కోరల్లో కూరుకుపోయిన ఢిల్లీకి ఉపశమనం కలిగించే రీతిలో రాజధాని రహదారులపై వేయి ఎలక్ర్టిక్ బస్సులను నడిపేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఢిల్లీ సర్కార్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కన్సల్టెంట్ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో వేయి ఎలక్ర్టిక్ బస్సులను నడిపేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఢిల్లీ రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా ఇది మెరుగైన చర్యగా ఆయన అభివర్ణించారు.ఈ బస్‌లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనపై కూడా కేబినెట్లో విస్తృత చర్చ జరిగినా కొన్ని సాంకేతిక అంశాలతో దీనిపై నిర్ణయాన్ని రవాణా శాఖకు విడిచిపెట్టారు. కాగా, ఈ బస్‌లతో పోలిస్తే ఖర్చు తక్కువ అయ్యే హైడ్రోజన్ ఇంధన బ్యాటరీ ఆధారిత బస్‌లను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఢిల్లీ వివాదం యథాతథం
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య వివాదం యథాతథంగా కొనసాగుతోంది. నియామ కాలు, బదిలీలకు సంబంధించిన సిబ్బంది విభాగంపై అధికారం మాదంటే మాదని ఇటు సీఎం, అటు ఎల్జీ ప్రకటించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారుల బదిలీలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం పంపిన ఫైలును ఎల్జీ అనిల్ బైజాల్ తిప్పి పంపేశారు. మరోపక్క పాలనపై, అధికారులపై పట్టు సాధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ప్రజల ముంగిట్లోకే రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు. ఎల్జీపై కేజ్రీవాల్ ధ్వజం సుప్రీం తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఎల్జీ అనిల్ బైజాల్‌తో సీఎం కేజ్రీవాల్ సుమారు 25 నిమిషాల పాటు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదని, అధికారుల నియామకాలు, బదిలీలు చేసే అధికారం తమకే ఉందని 2015లో హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీం రద్దు చేయలేదని ఎల్జీ కేజ్రీవాల్‌కు చెప్పారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఎల్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్జీ అంగీకరించడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం బాహాటంగా తిరస్కరించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. సిబ్బంది విభాగాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించరాదని కేంద్ర హోం శాఖ తనకు సూచించిందని బైజాల్ నాతో చెప్పారు’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు అమలు చేయాలని కోరేందుకు కేజ్రీవాల్ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. పాలనపై పట్టుకు ఆప్ యత్నాలు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో పాలనపై, అధికా రులపై పట్టు బిగించేందుకు ఆప్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అభ్యంత రాలన్నీ పక్కనపెట్టి ప్రజల ముంగిట్లోనే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆహార విభాగాన్ని ఆదేశించినట్టు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నా రు. దీనిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించానన్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎల్జీ గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం అమలుకు ముందు కేంద్రాన్ని సంప్రదించాలని ఆప్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎల్జీ అభ్యంతరాలను తోసిరాజని కేజ్రీవాల్ ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అలాగే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అధ్యక్షతన సమావేశమై వ్యయ, ఆర్థిక కమిటీ రెండు ప్రాజెక్టులను ఆమోదించింది. సిగ్నేచర్ బ్రిడ్జికి చివరి విడత నిధుల మంజూరుకు, ఢిల్లీ టెక్నికల్ వర్సిటీలో అకడమిక్ భవనం, హాస్టల్ గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇంకో తీర్పు వస్తే పూర్తి స్పష్టత: ఎల్జీ కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఎల్జీ తోసిపుచ్చారు. సిబ్బంది విభాగానికి సంబందించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో కూడా తీర్పు వస్తే ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుందని ఎల్జీ పేర్కొన్నారు. ఢిల్లీలో సిబ్బంది విభాగం అసెంబ్లీ పరిధిలోకి రాదంటూ 2015లో కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు ఇంకా రద్దు చేయలేదనీ, కాబట్టి ఉద్యోగుల బదిలీలపై అధికారం తమదేనంటూ కేజ్రీవాల్‌కు ఎల్జీ లేఖ రాశారు. హోం శాఖ స్పందిస్తూ.. సిబ్బం ది విభాగం అంశంపై సుప్రీంలో పెండిం గ్లో ఉన్నందున తాము తుది నిర్ణయం చెప్పడం చట్టవ్యతిరేకమవుతుందంది. -
తీర్పు వెలువడ్డ కొద్దిగంటలకే...
కోర్టు తీర్పు తర్వాత కూడా ఢిల్లీ రాజకీయాల్లో మార్పు కనిపించటం లేదు. కొద్ది గంటల్లోనే ఆప్ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. సర్కార్ జారీ చేసిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని చెబుతూ సర్వీసెస్ డిపార్ట్మెంట్.. ఆ ఆదేశాలను తిరస్కరించింది. దీంతో అగ్గిరాజుకుంది. కోర్టు ధిక్కారమే.. తాజా అంశంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం కేంద్రం పక్కన బెడుతోందని విమర్శించారు. "నిన్నటి తీర్పులో కోర్టు స్పష్టంగా.. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు. ఆ లెక్కన కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌కే బదిలీల అధికారం పూర్తిగా ఉంటుందని ఆయన అంటున్నారు. దీనిపై ఎల్జీ కార్యాలయం అధికారికంగా స్పందించాల్సి ఉంది. బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు... ‘ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్థం చేయరాదు. ప్రభుత్వం తన నిర్ణయాలను ఎల్జికి తెలిపితే సరిపోతుంది. ఆమోదం అవసరం లేదు’ అని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన బెంచ్ తీర్పు వెల్లడించింది. -
ప్రజాప్రభుత్వమే సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కార్ మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. లెఫ్టినెం ట్ గవర్నర్(ఎల్జీ) అధికారాలకు కత్తెర వేసిన న్యాయ స్థానం.. ఆయనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం సలహాలు, సూచనల ఆధారంగానే ఎల్జీ నడుచుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రకటిం చింది. ఢిల్లీ రాష్ట్రం కాదని, ప్రస్తుతమున్న రాజ్యాంగ పరిమితుల్లో ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కీలక తీర్పును ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ అధికారాల పరిధిని స్పష్టంగా వెల్లడించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్ర ప్రభుత్వంపై కేజ్రీవాల్ సర్కారు పై చేయి సాధించినట్లయ్యింది. నేపథ్యం ఇదీ..: 2014లో ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం ఎక్కినప్పటి నుంచి కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య అధికార పరిధిపై వివాదం నడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ప్రస్తుత ఎల్జీ అనిల్ బైజల్, మాజీ ఎల్జీ నజీబ్‌జంగ్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విభేదిస్తూ వచ్చారు. వారు కేజ్రీవాల్ తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఎల్జీ కేంద్రం అండ చూసుకుని తన ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఎల్జీ కార్యనిర్వాహక అధిపతే అంటూ 2016 ఆగస్టు 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అనేక అప్పీళ్లు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239ఏఏతో ముడిపడి ఉన్న అనేక విషయాలకు తాజా తీర్పుతో జవాబిచ్చింది. ఎల్జీ పాలనాధికారి మాత్రమే.. సీజేఐ జస్టిస్ మిశ్రా తన తరఫున, న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్ తరఫున 237 పేజీల తీర్పును వెలువరించింది. ‘ప్రస్తుత రాజ్యాంగ పరిమితుల మేరకు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదు. జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ ప్రత్యేకమైనది. భిన్నమైనది. లెఫ్టినెంట్ గవర్నర్ హోదా.. రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదు. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే. పరిమితార్థంలో ఎల్జీ హోదాలో ఆయన పని చేస్తారంతే’ అని సీజేఐ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. మంత్రిమండలితో ఘర్షణ పూరిత వైఖరితో కాకుండా ఎల్జీ సంధానకర్త లాగా వ్యవహరించాలని, ఎల్జీకి, మంత్రిమండలికి మధ్య అభిప్రాయ భేదాలు పరిధి దాటకూడదని, వాటిని చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకో వాలంది. ‘ఎల్జీకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే ఎటువంటి అధికారం లేదు. ఆయన మంత్రిమండలి సలహాలు, సూచనల ఆధారంగా పనిచేయాలి. లేదా ఆయన సూచనల మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి’అని పేర్కొన్నారు. మంత్రిమండలి తీసుకునే ప్రతి నిర్ణయం ఎల్జీకి తెలియజేయాలని, అయితే ప్రతి అంశంలోనూ ఎల్జీ ఆమోదం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూములు ఈ మూడు అంశాలు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు అధికారం ఉందన్నారు. నిర్ణయాలు తీసుకునేది కేబినెట్.. జస్టిస్ డీవై చంద్రచూడ్ వెలువరించిన 175 పేజీల అనుబంధ తీర్పులో నిర్ణయాలు తీసుకునేది ఎల్జీ కాదని, మంత్రిమండలి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాన్ని ఎల్జీ గుర్తుపెట్టుకోవా లన్నారు. రాష్ట్రపతి నిర్ణయానికి కూడా ఎల్జీ బద్ధుడై ఉండాలని తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్ తన 123 పేజీల అనుంబంధ తీర్పులో ఎన్నికైన∙ప్రజాప్రతిని ధులకు ఢిల్లీ శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి అభిప్రాయాలు, నిర్ణయాలను అన్ని సమయా ల్లోనూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ ప్రజల విజయం: కేజ్రీవాల్ అధికారం కోసం కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పు తమ ప్రభుత్వానికి దక్కిన భారీ విజయమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన ‘ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా: చిదంబరం సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఘన విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించిన చిదంబరం అన్నారు. ఇదే తీర్పు పుదుచ్చేరికి కూడా వర్తిస్తుందన్నారు. ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి దక్కిన ఘన విజయం. క్లీన్ చిట్ ఉన్న లెఫ్టినెంట్ అనిల్ బైజాల్.. రాజకీయ గురువుల మాట విని తప్పుడు మార్గంలో ఎందుకు నడిచారు?’ అని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చిదంబరం ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. నష్టం జరిగినా కేజ్రీవాల్‌కు పండుగే: బీజేపీ తన ప్రభుత్వానికి పూర్తి అధికారాలివ్వాలన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినా ఆయన పండుగ చేసుకుంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం, ఎల్జీ మధ్య జరుగుతున్న అధికార పోరాటంలో అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ గౌరవాన్ని నిలబెట్టింది. కేబినెట్ నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేయాలని న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగానికి తన కిష్టమైన అర్థాన్ని చెప్పడం కేజ్రీవాల్ నైజం. నష్టపోయినా ఉత్సవాలు జరుపుకునేదెవరంటే కేజ్రీవాల్ అనే సమాధానం వస్తుంది’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇదీ ‘ఢిల్లీ’ చరిత్ర... న్యూఢిల్లీ: బ్రిటిష్ హయాం నుంచి నేటి వరకు ఢిల్లీ పాలనలో చోటుచేసుకున్న కీలక పరిణామాలివీ.. బ్రిటిష్ పాలకులు 1911లో దేశ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ సమయంలో ఢిల్లీకి అధినేతగా ఓ కమిషనర్‌ను నియమించి, దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ అని పిలిచేవారు. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఢిల్లీని పార్ట్–సీ రాష్ట్రంగా మార్చారు. అక్కడ అసెంబ్లీ ఏర్పాటుచేయడానికి ప్రత్యేక చట్టం చేశారు. పార్ట్– ఏ,బీ,సీ,డీ రాష్ట్రాలను రద్దుచేస్తూ 1956, అక్టోబర్ 19న రాష్ట్రాల పునర్విభజన చట్టానికి ఆమోదం లభించింది. ఫలితంగా దేశంలోని ప్రాంతాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. దీనిలో భాగంగా, రాష్ట్రపతి నియమించే వ్యక్తి పాలించేలా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైంది. ఢిల్లీ శాసనసభ, శాసనమండలి రద్దయ్యాయి. ఆ తరువాత కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీలు, మంత్రి మండళ్లను ఏర్పాటుచేసేందుకు 1963లో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ చేశారు. అయితే ఈ చట్టాన్ని ఢిల్లీకి వర్తింపచేయలేదు. కానీ, 1966 నాటి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ చట్టం ప్రకారం..56 మంది ఎన్నికైన సభ్యులతో కూడిన మెట్రోపాలిటన్ కౌన్సిల్, ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో పరిమిత ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. గవర్నర్/అడ్మినిస్ట్రేటర్/చీఫ్ కమిషనర్ రాష్ట్రపతి నియంత్రణలో ఉంటూ రాష్ట్రాల గవర్నర్ల మాదిరిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని 1966, ఆగస్టు 20న కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీకి ఏ హోదా ఇవ్వాలన్న విషయమై 1987లో బాలక్రిష్ణన్ కమిటీని నియమించారు. ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతంగానే సాగిస్తూ, శాసనసభ, మంత్రిమండలిని ఏర్పాటుచేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, స్థిరత్వం కోసం ప్రత్యేక హోదా ఇచ్చేలా రాజ్యాంగపర చర్యలు తీసుకోవాలంది. ఫలితంగా 1991లో 69వ రాజ్యాంగ సవరణ చేపట్టి, నిబంధన 239ఏఏ (ఢిల్లీకి ప్రత్యేక నిబంధనలు), 239ఏబీ(రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైన సందర్భాలు)లను చేర్చారు. నాలుగేళ్ల క్రితమే వివాదానికి బీజాలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)తో రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదానికి బీజాలు నాలుగేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో గ్యాస్ ధరలను ఏకపక్షంగా నిర్ణయించారంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మురళీ దేవ్రా తదితరులపై కేజ్రీవాల్ కేసు పెట్టారు. ► 2014, మే 2: ఈ కేసును కొట్టేయాలంటూ రిలయన్స్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించే అధికారం ఢిల్లీ ఏసీబీకి ఇస్తూ 1993లో కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేసింది. ► 2014 మే 8: కేంద్ర మంత్రుల కేసులపై విచారణ అధికారం ఏసీబీకి ఇవ్వడాన్ని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ► 2014 ఆగస్టు 19: గ్యాస్ ధరల నిర్ణయంపై కేంద్ర మంత్రులతోపాటు రిలయన్స్‌పై పెట్టిన కేసుల దర్యాప్తు పరిధి నుంచి కేంద్రం తమను తప్పించిందని ఏసీబీ హైకోర్టుకు తెలిపింది. ► 2015 జూన్ 27: ఏసీబీ చీఫ్‌గా ఎల్జీ నియమించిన ఎంకే మీనాను ఏసీబీ ఆఫీసులోకి ప్రవేశించనీయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వేసింది. ► 2016 ఆగస్ట్ 4: ఎల్జీ కేబినెట్ సలహా మేరకు పనిచేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ► 2016 సెప్టెంబర్ 9: ఈ తీర్పుపై ఆ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించింది. ► 2017 డిసెంబర్ 6: ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదావేసింది. ఓటుహక్కుది చిరస్థాయి: సుప్రీం న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు చిరస్థాయిగా నిలిచిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దేశం తమదేననే భావనను అది ప్రజల్లో పెంపొందిస్తుందని పేర్కొంది. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు కోత పెడుతూ వెలువరించిన చారిత్రక తీర్పులో ఈ విధంగా స్పందించింది. ప్రజ ల ఆకాంక్షలు అమలయ్యేలా చూడటం అవసరమంది. ‘ఓటుహక్కు ప్రాథమిక హక్కు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అది గుండెకాయ స్థానంలో ఉంటుంది’ అని పేర్కొంది. -
అముల్, మదర్ డైరీ పాలల్లో లోపాలు
న్యూఢిల్లీ: అముల్, మదర్ డైరీలు సహా పలు కంపెనీల పాలల్లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ పరీక్షల్లో తేలింది. ఈ పాలు శ్రేయస్కరం కావని చెప్పడం లేదనీ, నాణ్యత తక్కువగా ఉన్నాయని మాత్రమే చెబుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం వివరించారు. ప్రముఖ, స్థానిక బ్రాండ్లు సహా ఢిల్లీ వ్యాప్తంగా 165 పాల నమూనాలను పరీక్షించగా వాటిలో అముల్, మదర్ డైరీలు సహా మొత్తం 21 నమూనాల్లోని పాలు తక్కువ నాణ్యతను కలిగిఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. కంపెనీలు పాలపొడితో పాలను కల్తీ చేస్తున్నట్లు తేలిందన్నారు. అధికారిక వివరాలు, నివేదికలు ఇంకా తమ వద్దకు రానందున దీనిపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని అముల్, మదర్ డైరీల ప్రతినిధులు చెప్పారు. -
పుస్తకమూ విద్యార్థే!
ఒకప్పుడు అన్న చదివిన పుస్తకాన్నే తమ్ముడు చదివేవాడు, అక్క చదివిన పుస్తకాన్నే చెల్లెలు చదివేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక ఒక పుస్తకాన్ని మరొకరు చదవడానికి వాళ్లు పెట్టుకున్న నిబంధనలు అంగీకరించడం లేదు. ‘‘మా పెద్ద పిల్లాడు చదివింది కూడా మీ స్కూల్లోనే, మీ కౌంటర్లో కొన్న పుస్తకాలే ఇవి. చిన్న పిల్లాడిని ఈ పుస్తకాలతో చదువుకోనివ్వండి’’అని పేరెంట్స్ మొత్తుకున్నా సరే, ప్రైవేటు స్కూళ్ల రూల్స్ ఒప్పుకోవు. ‘‘అంతగా ఆ పుస్తకాలు బాగున్నాయనుకుంటే మీ చిన్న పిల్లవాడికి రెండో సెట్‌గా ఉంటాయి. ఇంట్లో ఉంచుకోండి. ఒకవేళ ఇప్పుడు కొన్న పుస్తకాల్లో ఏవైనా పోతే అవి పనికొస్తాయి’’ అని.. స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. పేరెంట్స్ ఇంకేం చేస్తారు? ఓ ఏడాది పాటు దాచి, అవీఇవీ అన్నీ కలిపి పాత పేపర్లు కొనేవాళ్లకు తూకానికి వేసేస్తారు! ప్రభుత్వ ఉద్యమం! ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల పుస్తకాల పొదుపు ఉద్యమం మొదలు పెట్టింది! వాడిన పుస్తకాలు వెళ్లాల్సింది పాత పేపర్ల దుకాణానికి కాదని, మరో పేద విద్యార్థికి అవి జ్ఞానాన్ని అందించాలనీ ప్రభుత్వం సంకల్పించి పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’ నుంచి ఢిల్లీలోని అన్నీ స్కూళ్లకు ఆదేశాలు వెళ్లాయి. వాటి ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థికి పెద్ద తరగతికి వెళ్లినప్పుడు కొత్త పుస్తకాలు ఇచ్చే టైమ్‌లో అతడికి గత ఏడాది ఇచ్చిన పాత పుస్తకాలను స్కూలు సిబ్బంది వెనక్కి తీసుకోవాలి. వాటితో ఓ బ్యాంకు తయారు చేయాలి. పాత పుస్తకాలలో జారిపోతున్న పేజీలను అతికించి, పెన్సిల్ రాతలను చెరిపేసి వాటిని మళ్లీ వాడుకునే విధంగా సిద్ధం చేయాలి. కొంతమంది పిల్లలు పుస్తకాలను పూర్తిగా పనికి రానంతగా చించేసినా సరే వాటిని మెరుగుపరచాలి. దీనివల్ల సగం పుస్తకాలైనా బుక్ బ్యాంకుకు చేరతాయి. అంటే ప్రభుత్వం తిరిగి పుస్తకాలు ముద్రించాల్సిన ఖర్చులో ఏటా çసగానికి సగం ఆదా అవుతుంది. అంతకంటే ముఖ్యంగా కాగితం తయారీకి అవసరమైన సహజ వనరులు ఆదా అవుతాయి. పేరెంట్స్ సహకారం తాజాగా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వ పాఠశాల సిబ్బంది పాత పాఠ్య పుస్తకాలను విద్యార్థుల నుంచి సేకరించి ఒకచోట అందుబాటులో ఉంచుతారు. ఆ పుస్తకాలను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అలాకూడా కొనలేని పిల్లలకు వాటిని ఉచితంగా ఇస్తారు. ఈ విధానాన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఆచరిస్తే పేద తల్లిదండ్రులు ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు కొత్త పుస్తకాల ముద్రణ తగ్గుతుంది కనుక పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పేరెంట్స్ కూడా పూనుకుని తమ పిల్లలు చదివేసిన పాఠ్యపుస్తకాలను కాలనీలలో ఉండే లైబ్రరీలకు ఇస్తే.. పుస్తకాలు కొనలేని వాళ్లు వాటిని తీసుకుంటారు. ఏడాది మధ్యలో పిల్లలు పుస్తకాలు పోగొట్టినప్పుడు లైబ్రరీలో ఉండే ఈ పుస్తకాలు పెద్ద ఆసరా అవుతాయి. అక్షరం అమూల్యం టెక్ట్స్ బుక్ జీవితకాలం తొమ్మిది నెలలో ఏడాదో కాదు. వాటికి దక్కాల్సిన గౌరవం కాగితం తూగే బరువుతో కాదు. పుస్తకం విలువ వెలకట్టలేనంత విలువైన సమాచారం. అమూల్యమైన వాటిని అంతే అమూల్యంగా వాడుకోవాలి. ఢిల్లీలో మొదలైన ఈ బుక్ బ్యాంక్ ఉద్యమం అన్ని రాష్ట్రాలకూ విస్తరించాలి. పాఠ్య పుస్తకాల జీవితకాలం ఎంత ఉంటుంది? ఏడాది అనుకుంటాం కదా! ఏడాది అన్నది విద్యాసంవత్సరానికి మాత్రమే కానీ, పుస్తకానికి కాల పరిమితి అంటూ ఉండదు. పాత విద్యార్థులు వెళ్లిపోయి, కొత్త విద్యార్థులు వచ్చినా మళ్లీ ఇదే పుస్తకాన్నే కదా చదవాలి. అందుకే జాగ్రత్తగా వాడుకున్నంత కాలం, వాడుకోవడం తెలిసినంత కాలం పాఠ్యపుస్తకాలు నిలిచి ఉంటాయి. సిలబస్ మారే వరకు పాఠ్యపుస్తకాలు కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త విద్యార్థులే. -
అక్కడ సగం ఉద్యోగాలు ఖాళీ
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పలు ప్రభుత్వ శాఖల్లో సగటున 50 ఉద్యోగాలు ఖాళీగా పడిఉన్నాయి. శాఖలవారీగా చూస్తే సిబ్బంది కొరత న్యాయ శాఖలో 87 శాతం ఉండగా, విద్యుత్ శాఖలో 20 శాతం వరకూ సిబ్బంది కొరత వేధిస్తోంది. కీలక శాఖల్లో ఉద్యోగులు కొరవడటంతో పాలన కుంటుపడుతోందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కీలక ప్రాజెక్టుల అమలులోనూ ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఢిల్లీ కాలుష్య కోరల్లో కూరుకుపోయిన క్రమంలో కీలకమైన రవాణా శాఖలో సిబ్బంది కొరత అత్యధికంగా 63 శాతం నెలకొంది. రెవెన్యూ, ఎక్సైజ్, సంక్షేమ, విద్యా, గణాంక, ప్రణాళికా శాఖల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మౌలిక ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణలో కీలకమైన ప్రజా పనుల శాఖలో 40 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా సేవల ఇన్‌ఛార్జ్‌గా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తుండటంతో తమ పరిధిలో ఉద్యోగాల భర్తీకి చేసేదేమీ లేదని కేజ్రీవాల్ సర్కార్ చేతులెత్తేస్తోంది. -
ప్యాడ్ మ్యాన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్లో తాజాగా విడుదలైన ప్యాడ్ మ్యాన్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆడవారు ఎదుర్కొనే రుతుక్రమం ఒక రహస్యం కాదని, చర్చించాల్సిన అంశమన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రత్యేక ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రంతో ప్రభుత్వాల్లో కూడా కదలిక వచ్చింది. పాఠశాలలోని విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందించేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమైపోయింది. ఇందులో భాగంగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసింది. ‘ఇది దాచుకోవాల్సిన అంశం ఏం కాదు. ఉపాధ్యాయులు కూడా ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించారు. ఆ సమయంలో విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరు అవుతుంటారు. అందుకే వారికి ఉచితంగా ప్యాడ్లను అందించేందుకు సిద్ధమయ్యాం’ అని స్థానిక నేత శిఖా రాయ్ వెల్లడించారు. 2018-19 బడ్జెట్‌కి గానూ ఈ నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ప్రత్యేక సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లును మేయర్ కమల్జీత్ షెరావత్ ఆమోదించగా.. మునిసిపల్ కమిషనర్ ఆమోదించాల్సి ఉంది. మరోవైపు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆర్.బాల్కీ డైరెక్షన్లో అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. -
కేజ్రీవాల్ నిర్ణయం.. ప్రజల ఆకలి తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రజలను పస్తులు ఉంచుతూ.. విమర్శలకు తావునిస్తోంది. ఆధార్ డేటా ఆధారంగా రేషన్ కోసం ప్రవేశపెట్టిన బయో మెట్రిక్ విధానం విఫలం కావటంతో .. ఐరిష్ స్కాన్, ఓటీపీల ద్వారా రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించించింది. అయితే రెండువారాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు దిగింది. బయో మెట్రిక్ విధానం... అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న ఓ కొత్త నిర్ణయం ప్రకటించింది. ఆధార్ కార్డులోని డేటాతో వేలి ముద్రలు సరిపోతేనే రేషన్ అందిస్తామని స్పష్టం చేసింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి.. అర్హులైనవారికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సర్కార్ ప్రకటించింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవేం పట్టించుకోని ప్రభుత్వం ఢిల్లీలోని 2,255 రేషన్‌షాపులకు ఈ-పీవోఎస్(e-PoS.. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను అందించింది. అయితే ఆధార్డేటాతో కొందరు లబ్ధిదారుల వేలిముద్ర మ్యాచ్ కాలేదు. దీంతో రేషన్ ఇచ్చేందుకు డీలర్లు నిరాకరించగా.. లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో తక్షణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కంటిపాపల్ని స్కాన్ చేసి కొత్తగా పాస్వర్డ్లు ఇస్తామని, తద్వారా రేషన్ పొందొచ్చని ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 15న తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీరా కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులు మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులెవరూ అక్కడ లేరని, ఉన్నవారు కూడా స్పందించటం లేదని, తాము పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివరణ... విమర్శలపై ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పందించారు. వైఫై కనెక్టివిటీ మూలంగానే సమస్య ఉత్పన్నమైందని.. పునరుద్ధరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం 15 లక్షల మంది రేషన్ లబ్ధిదారుల్లో 98 శాతం మంది రేషన్ తీసేసుకున్నారని.. 2 శాతం(26, 650 మంది) మాత్రం అందుకోలేకపోయారని ఆయన చెబుతున్నారు. ఖండించిన రేషన్ డీలర్లు... అయితే రేషన్ డీలర్లు మాత్రం మంత్రి వాదనను కొట్టిపడేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం సెక్రెటరీ సౌరభ్ గుప్తా స్పందిస్తూ... ‘‘ నా సొంత వైఫైతో కనెక్ట్ చేసినా మెషీన్లు పని చేయటం లేదు. బేల్(BEL) నుంచి వచ్చిన ఇంజనీర్లు యాంటీనాలు ఇచ్చారు. కానీ, అవి కూడా ఇప్పుడు పని చేయటం లేదు’’ అని తెలిపారు. అంతేకాదు 98 శాతం మందికి రేషన్ అందుతుందా? అన్న ప్రశ్నకు గుప్తా నుంచి సరైన సమాధానం అందలేదు. ఈ గొడవలేమీ లేకుండా మాన్యువల్‌గా రేషన్ సరుకులు ఇవ్వాలని షాపులకు ఆదేశాలు అందినప్పటికీ.. అవి కూడా సక్రమంగా అమలు కావటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. బీజేపీ విమర్శలు.. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న వ్యవస్థను కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయోగాలతో చెడగొట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని తివారీ విమర్శించారు. (ఎన్డీటీవీ సర్వే కథనం ప్రకారం...) -
కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ.. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని ఈసీ తేల్చి చెబుతూ రాష్ట్రపతికి నివేదికను పంపింది. అసలు విషయం.. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ సర్కార్‌లో ఏడుగురే మంత్రులుండాలి. కానీ, కేజ్రీవాల్ మాత్రం 2015లో 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి..వారికి కారు, కార్యాలయం, ఇతర వసతులు కల్పించాడు. తద్వారా వారందరికీ కేబినెట్ హోదా ఇచ్చినట్లయింది. పరిపాలనా సౌలభ్యానికే వీరిని పార్లమెంట్ కార్యదర్శులుగా నియమించినట్లు అప్పట్లో కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. పైగా వీరికి ఎటువంటి అదనంగా చెల్లింపులు చేయబోమని చెప్పారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కావటంతో బిల్లుపై తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి పంపారు. లాభదాయకమైన జోడు పదవులు అనుభవిస్తున్న కారణంగా ఈ 21 మందిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా 21 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులిచ్చింది. దీనికి వారు వివరణ కూడా ఇచ్చారు. తరువాతి పరిణామాల నేపథ్యంలో జర్నైల్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక మిగిలిన 20 మంది ఎమ్మెలపై వేటు వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.వేటు పడిన వారిలో అల్కా లాంబ, ఆదర్శ్ శాస్త్రి తదితరులున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన రాజకీయ ప్రతికూలత ఏర్పడి కేజ్రీవాల్ సర్కార్ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బస్సులకు, మెట్రోకు కామన్ కార్డు
న్యూఢిల్లీ : నగర రవాణా వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా కోసం వాడే బస్సులకు, మెట్రోకు కామన్ మొబిలిటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంచ్ చేశారు. దీంతో కామన్ మొబిలిటీ కార్డును లాంచ్ చేసిన తొలి నగరంగా ఢిల్లీ పేరులోకి వచ్చింది. మెట్రో రైళ్లతో పాటు, 200 డీటీసీ, 50 క్లస్టర్ బస్సులకు ఈ కార్డును వాడుకోవచ్చని లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. రవాణా వ్యవస్థలో తాము తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైనదని, ఢిల్లీ ప్రజలకు అనంతమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డు లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కొంచెం సేపు డీటీసీ బస్సులో ప్రయాణించారు. డెబిట్ కార్డు లాగానే ఈ కామన్ కార్డు పనిచేస్తుందని, ఏప్రిల్ 1 నుంచి డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో దీన్ని వాడుకోవచ్చని చెప్పారు. నగరవ్యాప్తంగా మొత్తం 3900 డీటీసీ, 1600కి పైగా క్లస్టర్ బస్సులు ఉన్నాయి. షీలా దీక్షిత్ ప్రభుత్వంలోనే ఈ కార్డును తొలిసారి ప్రతిపాదనలోకి వచ్చిందని, కానీ దీన్ని ప్రారంభించడం ఆలస్యం చేశారని కేజ్రీవాల్ అన్నారు. ఎందుకు ఆలస్యం చేశారో మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను అడగండంటూ సూచించారు. ఏదేమైనప్పటికీ, తమ ప్రభుత్వం ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో దీనికి కౌంటర్‌గా కామన్ మొబిలిటీ కార్డును కేజ్రీవాల్ తీసుకొచ్చారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లోత్ కూడా ఉన్నారు. -
క్యాబ్‌ల్లో షేర్ రైడ్స్‌కు చెక్
సాక్షి,న్యూఢిల్లీ: క్యాబ్‌ల్లో షేరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో గమ్యస్ధానాలకు చేరుకునే వెసులుబాటు ఇక ఉండకపోవచ్చు. యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్స్‌కు త్వరలో చెక్ పడనుంది. ఢిల్లీ ప్రభుత్వం నూతన ట్యాక్సీ స్కీమ్ ద్వారా వీటికి చెక్ పెట్టనుంది. సీటీ ట్యాక్సీ స్కీమ్ 2017కు ఢిల్లీ ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. ఈ నిబంధనల కింద షేర్ రైడ్‌ను అనుమతించబోరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముసాయిదా విధానాన్ని ప్రజల ముందుంచి వారి సూచనల మేరకు షేర్ రైడ్‌ను అనుమతించాలా లేదా అనేది నిర్ణయిస్తామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. షేర్ రైడ్, కార్ పూల్‌ను ఢిల్లీలో అనుమతించమని గతంలో ప్రభుత్వం పేర్కొంది. కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్‌పై తిరిగే వాహనాలను పలువురు ప్రయాణీకులను ఎక్కించుకోవడాన్ని మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం అనుమతించరు. స్టేజ్ క్యారేజ్ పర్మిట్ కలిగిన బస్సుల వంటి ప్రజా రవాణా వాహనాలను మాత్రమే వివిధ లొకేషన్ల నుంచి ప్రయాణీకుల పికప్, డ్రాప్‌లకు అనుమతిస్తారు.ప్రస్తుతం యాప్ ఆధారిత క్యాబ్‌ల షేర్ రైడ్లు చట్టపరిధికి వెలుపల ఉన్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అందుబాటు ధరలో సౌకర్యవంతమైన ప్రయాణంగా రైడ్ షేర్ ఢిల్లీలో ఆదరణ చూరగొంది.ఢిల్లీలో క్యాబ్ ప్రయాణాల్లో 30 శాతం పైగా షేర్ రైడ్లే ఉంటున్నాయి. ఏడాదిలో షేర్ రైడ్లు ఐదు రెట్లు పెరిగాయని ఇటీవల ఓలా ప్రకటించింది. ఓలా షేర్‌కు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం కీలక మార్కెట్‌గా ఓలా ప్రతనిధి చెబుతున్నారు.మరోవైపు కర్ణాటక ప్రభుత్వం షేర్ రైడ్ చట్టవిరుద్ధమంటూ దాన్ని నిషేధించేందుకు రవాణా శాఖ సంసిద్ధమైంది. -
ముంగిట్లోకి సర్కారు సేవలు
న్యూఢిల్లీ: రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్ వంటి పౌర సేవల్ని ప్రజలకు వారి ఇంటివద్దే అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో భాగంగా మరో 3–4 నెలల్లో దాదాపు 40 పౌర సేవలను రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని వెల్లడించింది. గురువారం నాడిక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికి చేరవేయబోతున్నాం. ఈ సేవల అమలు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటాం. ఇకపై పౌర సేవల కోసం భారీ లైన్లలో నిల్చునే బాధ ఢిల్లీ వాసులకు తప్పుతుంది’ అని తెలిపారు. ఇందులో భాగంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నల్లా కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, వికలాంగుల పెన్షన్ పథకాలు, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డుల జారీ, అందులో మార్పుల కోసం సహాయక్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు కనీస మొత్తాలను మాత్రమే వసూలు చేయనున్నారు. ఢిల్లీ కాలుష్యం తట్టుకోలేక.. రాజధాని ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు అనారోగ్యం పాలైన కోస్టారికా రాయబారి బెంగళూరుకు మకాం మార్చారు. బాధితురాలు మారియెలా క్రూజ్ అల్వారెజ్ భారత్‌లో కోస్టారికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఊహించని విధంగా పెరిగాయి. నా ఆరోగ్యం దెబ్బతిని, బెంగళూరు వెళ్లే వరకు ఆ గాలి పీల్చడం వల్ల కలిగిన దుష్ప్రభావాన్ని గ్రహించలేకపోయా. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోంది. భూ మాత గోడును అందరూ పట్టించుకోవాలి’ అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు. -
ఇంటి ముందుకే డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్
సాక్షి,న్యూఢిల్లీ: ఇంటి ముందుకే రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కుల ధ్రువీకరణ పత్రం వంటి 40 సేవలను అందించేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. దీనికి సంబంధించిన పధకం మూడు,నాలుగు నెలల్లో రూపొందిస్తామని దేశంలోనే తొలిసారిగా ప్రజల ముందుకే పాలన ఫలాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ పధకం అమలు కోసం ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీ సేవలు తీసుకుంటుందని చెప్పారు. తొలి దశలో కుల ధృవీకరణ పత్రం, వాటర్ కనెక్షన్, ఇన్కమ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, వివాహ రిజిస్ర్టేషన్, డూప్లికేట్ ఆర్సీ, ఆర్సీలో చిరునామా మార్పు వంటి సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోదలిస్తే వారు ప్రత్యేక కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏజెన్సీ ప్రతినిధులు ఆ వివరాలతో మొబైల్ సహాయక్తో దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి అవసరమైన పత్రాలను తీసుకుంటారని చెప్పారు.మొబైల్ సహాయక్లో బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా వంటి అన్ని మౌలిక వసతులు ఉంటాయని దీనికి సంబంధించి దరఖాస్తుదారు నామమాత్ర రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. -
సరి-బేసి విధానంపై ప్రభుత్వానికి చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం, పొగమంచు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంతో ముందుకొచ్చింది. కానీ దీన్ని అమలు చేయడంలోనే జాప్యం జరుగుతోంది. ఈ విధానం నుంచి మహిళలను, టూ-వీలర్స్‌ను మినహాయించాలని ప్రభుత్వం కోరుతుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ అందరికీ ఈ పాలసీని అమలు చేయాల్సిందేనని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ తీర్పునిచ్చింది. ఈ విషయంపై మరోసారి ఎన్జీటీని ప్రభుత్వం ఆశ్రయించగా.. మరోసారి కూడా ఢిల్లీ ప్రభుత్వ అభ్యర్థనను ఈ ట్రైబ్యూనల్ కొట్టివేసింది. మహిళలను, టూ-వీలర్స్‌ను కూడా ఈ విధానం నుంచి మినహాయించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీచేసింది. సరి-బేసి విధాన రోజుల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యను పరిష్కరించడానికి కేవలం మహిళ కోసం బస్సులు ఎందుకు నడపడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫోర్-వీలర్స్ కంటే టూ-వీలర్సే ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు టూ-వీలర్స్‌కు మినహాయింపు కోరుతుందో తెలియడం లేదంది. ఇదేమనా జోకా? అంటూ మండిపడింది. ఏజెన్సీ రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం తన పిటిషన్లో మార్పుల కోసం తన ఫిర్యాటును విత్‌డ్రా చేసుకున్నట్టు తెలిసింది. -
సరి-బేసి విధానంతో రె'ఢీ'
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు గాలిలో కలవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వాయుకాలుష్యం చేరుకుంది. దీంతో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఈ విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతో, ఢిల్లీ హైకోర్టు ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఒకవేళ అవసరమైతే నేడు, రేపు కూడా ఈ సరి-బేసి విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సరి-బేసి విధానంతో ఢిల్లీలో వాహన ట్రాఫిక్ సగం మేర తగ్గుతోంది. డిల్లీ మెట్రో నెట్వర్క్ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు తక్కువగా ఉండటం ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. కానీ కాలుష్య స్థాయిలు తగ్గించే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కమర్షియల్ ట్రక్కులకు నగరంలోకి అనుమతి లేదని పేర్కొంది. నిర్మాణ కార్యకలాపాలు ఆపివేయాలని తెలిపింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది.