నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే ముందు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ట్వీట్ చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమలనాథులతో కలిసి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఏజెంట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గత 8 నెలల్లో నజీబ్ జంగ్ చేసిందేమీ లేదని కేజ్రీవాల్ విమర్శించారు.