
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం శనివారం 6.5 లక్షల మందికి ఆహారాన్ని పంపిణీ చేసినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొంది. తమకు ఆహారం సరఫరా చేయాలని కోరుతూ ప్రభుత్వానికి 1,040 కాల్స్ వచ్చాయని తెలిపింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రోజూ 10 నుంచి 12 లక్షల మందికి ఢిల్లీ ప్రభుత్వం ఆహారం సమకూరుస్తుందని మార్చి 31న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము ఇప్పటివరకూ రోజుకు 4 లక్షల మంది వరకూ భోజనం అందిస్తుండగా సోమవారం నుంచి 10 నుంచి 12 లక్షల మందికి ఆహారం సరఫరా చేస్తామని ఆహార కేంద్రాలను పెంచి రద్దీని నివారిస్తామని కేజీవాల్ పేర్కొన్నారు. 2500 స్కూళ్లు, 250 నైట్ షెల్టర్లలో నిరాశ్రయులు, ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం ఆహారం సమకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment