సాక్షి, న్యూఢిల్లీ: మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం కిక్ ఎక్కించే వార్త తెలిపింది. మద్యం అమ్మకాలపై విధించిన ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ఎత్తివేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. జూన్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అన్ని రకాల మందు బాటిళ్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా మద్యం అమ్మకాలపై 70 శాతం కరోనా ప్రత్యేక ఫీజును ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీగా మద్యం అమ్మకాలు తగ్గిపోవడం, మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్)
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీ మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తూ మరో రెండు రోజులు ఆగితే ఇప్పుడు కొనే మద్యాన్ని దాదాపు సగం ధరకే కొనుక్కోవచ్చని పేర్కొంటున్నారు. ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ఎత్తివేయడంతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయం పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక లాక్‌డౌన్ కారణంగా కోల్పోతున్న ఆదాయాన్ని మద్యం ధరల పెంపుతో భర్తీ చేయడంతో పాటు మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో ‘స్పెషల్ కరోనా ఫీజు’ ను ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. (చనిపోయిన కరోనా రోగి పట్ల అమానుషం)
Comments
Please login to add a commentAdd a comment