Liquor rates
-
అధిక ధరలు.. నిషేధంలో భాగమే: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ధరలు తగ్గిస్తే మద్యం మామూలు వాళ్లకు అందుబాటులోకి వస్తుందని, ఇంకా ఎక్కువ తాగుతారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ధర తక్కువ పెడితే చాయ్‌కి బదులు మందు తాగడం ప్రారంభి స్తారని.. ఎక్కువ ధరలు పెడితే తాగకుండా ఇంటి ఖర్చుల గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు. అధిక ధరలు పెట్టడం నిషేధంలో ఒక భాగమన్నారు. శుక్రవారం శాసనసభలో ఎక్సైజ్ శాఖ పద్దులపై సభ్యులకు ప్రశ్నలకు శ్రీనివాస్‌గౌడ్ సమాధానమి చ్చారు. దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేస్తే రాష్ట్రంలోనూ అమలు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. మద్యం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభు త్వం అనుకోవడం లేదని.. అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం వల్లే ఆదాయం పెరిగిందని చెప్పారు. రైతుల తరహాలో గీత కార్మికులకూ బీమా.. గీత కార్మికుల సాధారణ మరణాలకు సైతం పరిహారం చెల్లించేందుకు రైతుబీమా తరహాలో కొత్త పథకాన్ని తెస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ వర్గంవారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. నెక్లెస్ రోడ్డులో రూ.12 కోట్లతో నీరా కేఫ్‌ను, భువనగిరి నందనవనంలో రూ.7 కోట్లతో నీరా ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే యంత్రాలను అందు బాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 10, 15 అడుగులే ఉండే తాటి చెట్లను అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖను కోరామన్నారు. జనాన్ని మద్యానికి బానిస చేస్తున్నారు: భట్టి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.37వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను తాగుడుకు భయంక రంగా అలవాటు చేస్తోందని, బానిసలుగా మార్చు తోందని మండిపడ్డారు. కల్తీ కల్లు, డ్రగ్స్‌ను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఎప్పటి నుంచి ఇస్తారో తెలపాలని కోరారు. -
సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ కామెంట్లపై కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్‌పై మంగళవారం చేసిన కామెంట్స్‌పై పెద్ద దుమారం రేగుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ను 50 రూపాయలకే ఇస్తామంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2024లో బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ.. తాము అధికారంలోకి వస్తే ముందుగా ఒక్క క్వార్టర్ సీసాను రూ.75కే ఇస్తామని ఇంకా కుదిరితే రూ.50కే విక్రయిస్తామని అని సోము వీర్రాజు ప్రకటించారు. కాగా సోము వీర్రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో లిక్కర్ ఫర్ ఓటు అంటూ క్యాంపెయిన్ నడుస్తోంది. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా సోము వీర్రాజుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 50 రూపాయిలకే చీప్ లిక్కర్ ఇస్తామనడం.. బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారం కోసం ఇంత దిగజారుతారా అంటూ ప్రశ్నించారు. ‘వావ్ వాటే స్కీమ్.. వాటే షేమ్.. 50 రూపాయలకే చీప్ లిక్కర్ అనే బంపరాఫర్ బీజేపీ జాతీయ విధానమా? లేక కేవలం బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకి మాత్రమేనా’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే.. చదవండి: అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ నజర్.. బీపాస్’తప్పనిసరి.. బైపాస్ లేదు! Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu — KTR (@KTRTRS) December 29, 2021 -
మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: మద్యంప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. మద్యం ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎమ్ఎఫ్ లిక్కర్, ఫారిన్ లిక్కర్(మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లు) ధరలను క్రమబద్దీకరిస్తూ మార్పుచేర్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగానే ధరలు సవరించినట్లు పేర్కొంది. తగ్గించిన మధ్యం ధరల పట్టికను తెలియజేస్తూ అబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రూ. 50 నుంచి రూ.1350 వరకు వివిధ కేటగిరీల బ్రాండ్లపై మద్యం ధరలను తగ్గించింది. బీర్లు, రెడీ టూ డ్రింక్స్ రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. (చదవండి: ఏపీ: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై నిషేధం) 33 శాతం మద్యం షాపులు తగ్గించాం అక్రమ మద్యాన్ని నియంత్రించేందుకే ధరలను సవరించామని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. దశల వారీ మద్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. ఎస్ఈబీ ద్వారా అక్రమ మద్యాన్ని నియంత్రిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా తగ్గించడానికే ధరలు తగ్గించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 33 శాతం మద్యం షాపులను తగ్గించామని, అంటే 43 వేల బెల్టు షాపులను తొలగించామని పేర్కొన్నారు. -
మందు బాబులకు కిక్ ఇచ్చే వార్త
సాక్షి, న్యూఢిల్లీ: మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం కిక్ ఎక్కించే వార్త తెలిపింది. మద్యం అమ్మకాలపై విధించిన ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ఎత్తివేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. జూన్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అన్ని రకాల మందు బాటిళ్లకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా మద్యం అమ్మకాలపై 70 శాతం కరోనా ప్రత్యేక ఫీజును ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీగా మద్యం అమ్మకాలు తగ్గిపోవడం, మద్యం అక్రమ రవాణా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్) ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఢిల్లీ మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తూ మరో రెండు రోజులు ఆగితే ఇప్పుడు కొనే మద్యాన్ని దాదాపు సగం ధరకే కొనుక్కోవచ్చని పేర్కొంటున్నారు. ‘స్పెషల్ కరోనా ఫీజు’ను ఎత్తివేయడంతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయం పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక లాక్డౌన్ కారణంగా కోల్పోతున్న ఆదాయాన్ని మద్యం ధరల పెంపుతో భర్తీ చేయడంతో పాటు మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో ‘స్పెషల్ కరోనా ఫీజు’ ను ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. (చనిపోయిన కరోనా రోగి పట్ల అమానుషం) -
అందుకే మద్యం ధరలు పెంచారు: రోజా
సాక్షి, విజయవాడ: మద్యపాన నిషేదంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరలు పెంచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని అమె అభిప్రాయపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుదకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తే.. సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధానికి శ్రీకారం చుట్టారని రోజా చెప్పారు. రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లను తొలగించారని గుర్తు చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు,టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. -
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
-
మద్యం ధరలకు కిక్కు!
సాక్షి, హైదరాబాద్: మందు బాబుల జేబులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చిల్లు పెట్టింది. మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పేదలు తాగే చీప్ లిక్కర్ నుంచి సంపన్నులు సేవించే ఖరీదైన మందు వరకు అన్ని బ్రాండ్ల ధరలను 10 నుంచి 30 శాతం వరకు పెంచేసింది. చీప్ లిక్కర్ ధరలు 30 శాతం వరకు పెంచడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. సాధారణ మద్యంపై క్వార్టర్‌కు కనీసం రూ.20 చొప్పున పెరగ్గా, ప్రీమియం బ్రాండ్లపై రూ.40 వరకు పెరిగింది. ఇక బీర్ల ధరలను రూ.20, రూ.30 చొప్పున పెంచింది. విస్కీ, బ్రాందీ, రమ్, బీర్లు ఇలా అన్నిరకాల మద్యంపై పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని, అయితే మద్యం వ్యాపారులు ఇప్పటికే తీసుకున్న స్టాక్‌ను పాత ధరలకే అమ్మాల్సి ఉంటుందని, కొత్తగా బుధవారం నుంచి తీసుకునే స్టాక్‌కే కొత్త ధరలు వర్తిస్తాయని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేశాయి. బీర్ ‘భారమే’... కనీసం ఒక్కో క్వార్టర్‌కు రూ.20 చొప్పున ధరలను పెంచగా, కొన్ని బ్రాండ్లకు ఇంకా ఎక్కువే పెంచారు. మొత్తం మీద సాధారణ మద్యం ప్రస్తుతమున్న ధరలతో పోలిస్తే 90 ఎంఎల్ రూ.10, క్వార్టర్ రూ.20, హాఫ్ బాటిల్ రూ.40, ఫుల్‌బాటిల్ రూ.80, లీటర్ బాటిల్ రూ.110 వరకు పెంచారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్ ధర రూ.150 వరకు పెరిగాయి. యువత ఎక్కు వగా తీసుకునే బీర్ల ధరలనూ భారీగానే పెంచారు. గతంలో లైట్ బీర్ రూ.100 కాగా, ఇప్పుడు దాన్ని రూ.120 చేశారు. స్ట్రాంగ్ బీర్‌ను రూ.120 నుంచి 130కి పెంచగా, కొన్ని బ్రాండ్లు రూ.180 వరకు పెరిగాయి. చిన్న బీర్ల విషయానికి వస్తే రూ.60 ఉన్న బీరు 70కి, రూ.80 ఉన్న బీరు 90కి పెరిగింది. చీప్‌లిక్కర్ ధరలూ విపరీతంగా పెంచారు. డైమండ్, ఆర్కేఎస్, కేరళ, రైజోమ్ లాంటి బ్రాండ్లపై క్వార్టర్‌కు రూ.20 చొప్పున పెం చారు. అన్ని బ్రాండ్ల బ్రీజర్లపై రూ.30 వరకు పెంచారు. గప్‌చుప్‌గా... వాస్తవానికి మద్యం ధరలను పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ దీనికోసం మంత్రివర్గ ఉప సంఘం వేయాలని భావించింది. కానీ, ఉప సంఘం నియమించకుండానే, ఆ కమిటీ సిఫారసు లేకుండానే ఎక్సైజ్ అధికారులు గప్‌చుప్‌గా మద్యం ధరలను సవరించేశారు. సవరించిన ధరలను అమల్లోకి తెచ్చేందుకు ఎలాంటి సూచన లేకుండా సోమవారం నుంచే మద్యం డిపోల నుంచి సరఫరా నిలిపివేశారు. మంగళవారం కూడా వైన్‌షాప్‌లకు డిపోల నుంచి మద్యం ఇవ్వడం లేదని, బుధవారం నుంచే కొత్త స్టాక్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. -
ఖజానాకు కిక్కు!
-
ఖజానాకు కిక్కు!
బీర్ల ధరలను రూ. 5 నుంచి రూ. 20 వరకు పెంచే ప్రతిపాదన వోడ్కా, బ్రాందీ, విస్కీ బ్రాండ్లపైనా బాదుడుకు యోచన పక్క రాష్ట్రాల్లోని ఎంఆర్పీలకు అనుగుణంగా మోత మద్యం తయారీ ముడిసరుకుపై లెసైన్స్ ఫీజుల పెంపు సర్కారీ సారాయితో వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆబ్కారీ శాఖ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది. నాటుసారాకు విరుగుడుగా జూలై ఒకటో తేదీ నుంచి చీపెస్ట్ లిక్కర్(సారాయి)ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న నేపథ్యంలో తద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు గల అవకాశాలపై దృష్టిపెట్టింది. సారాయిని ప్రవేశపెట్టడం వల్ల రూ. 800 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు వివిధ రూపాల్లో ఆబ్కారీ శాఖకు నష్టం వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ఐఎంఎల్(దేశీయ మద్యం) తయారీకి వినియోగించే ముడిసరుకు మొలాసిస్, రెక్టిఫైడ్ స్పిరిట్, డీనేచర్ ్డ స్పిరిట్లపై లెసైన్స్ ఫీజులతోపాటు దిగుమతి, ఎగుమతి ఫీజులను కూడా పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ ఫీజుల ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ. 27 కోట్ల ఆదాయాన్ని రెండింతలు చేసుకోవాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో సాగుతున్న మద్యం విక్రయాల ద్వారా నెలకు రూ. 800 కోట్ల వరకు రాబడి వస్తున్నప్పటికీ వ్యాట్ పోగా ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఆబ్కారీ శాఖకు నెలకు రూ. 110 కోట్ల వరకు మాత్రమే మిగులుతోంది. ఈ మొత్తాన్ని కనీసం రూ. 200 కోట్లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనివల్ల మద్యం ఎంఆర్పీ పెరిగి మందుబాబులపై భారం పడనున్నా సర్కారు అటువైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బీర్ల ధరలకు రెక్కలు రాష్ట్రంలో బీర్ల ధరలు కొన్నేళ్లుగా పెరగలేదు. ఐఎంఎల్ ధరలను ఎప్పటికప్పుడు సవరిస్తున్నా బీర్ల ధరలు మాత్రం పెరగలేదు. బ్రూవరేజెస్ సంస్థలు ఒత్తిడి తేవడంతో 10 నుంచి 20 శాతం వరకు రేట్లు పెంచాలని బ్రూవరేజెస్ కార్పొరేషన్ ఏడాది క్రితమే ప్రభుత్వానికి నివేదించింది. అయితే బీర్ల ధరలు పెంచడం వల్ల తయారీ సంస్థలకే ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తయారీ సంస్థలతో సంబంధం లేకుండా ఎంఆర్పీ ధరలను పెంచి, వచ్చే అదనపు ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన ట్లు సమాచారం. ఈ మేర కు అదనపు కమిషనర్ ప్రసాద్ నేతృత్వంలో తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసిన కమిషనర్ అహ్మద్ నదీం సంబంధిత నివేదికను గురువారం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. తద్వారా 96 శాతం మార్కెట్ వాటా ఉన్న రూ. 85, రూ. 90 ఎంఆర్పీ గల 650 ఎంఎల్ బీర్ల ధర ఐదు రూపాయలు పెరిగి రూ. 90, రూ. 95కి చేరుతుంది. అలాగే 4 శాతం మార్కెట్ షేర్ ఉన్న 110 రూపాయల ఎంఆర్పీ విలువ గల బీర్ల ధరలను రూ. 130కి పెంచాలని ప్రతిపాదించారు. 330 ఎంఎల్ బీర్ల ధరలు కూడా రూ. 2 నుంచి రూ. 5 వరకు పెంచే అవకాశం ఉంది. తద్వారా నెలకు రూ. 65 కోట్ల నుంచి రూ. 70 కోట్ల ఆదనపు రెవెన్యూ ఆర్జించవచ్చని నివేదిక రూపొందించారు. వచ్చే మార్చి నెల నుంచి వేసవి సందర్భంగా బీర్లకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో కొత్త రేట్లను అప్పటి నుంచే అమల్లోకి తేవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. వీటితో పాటు ఇతర రకాల మద్యం ఎంఆర్పీ రేట్లను కూడా భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీల కన్నా ఎంఆర్పీ అధికంగా ఉన్న నేపథ్యంలో ధరలను సవరించాలని అధికారులు యోచిస్తున్నారు. 750 ఎంఎల్ స్మిర్నాఫ్ బ్రాండ్ వోడ్కా ఎంఆర్పీ తెలంగాణలో రూ. 700 ఉంటే మహారాష్ట్రలో రూ. 980గా ఉంది. అలాగే బ్రాందీ, విస్కీ ధరలను కూడా సరిపోల్చి క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు యోచిస్తోంది.