KTR Satire On AP BJP Chief Somu Veerraju Over His Commets On Liquor Rates - Sakshi
Sakshi News home page

వాహ్.. వాట్ ఏ స్కీమ్.. సోము వీర్రాజు బంపరాఫర్‌పై కేటీఆర్ సెటైర్లు

Published Wed, Dec 29 2021 2:56 PM | Last Updated on Wed, Dec 29 2021 5:20 PM

KTR Satire On AP BJP Chief Somu Veerraju Over His Commets On Liquor Rates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్‌పై మంగళవారం చేసిన కామెంట్స్‌పై పెద్ద దుమారం రేగుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్‌ లిక్కర్‌ను 50 రూపాయలకే ఇస్తామంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2024లో బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ.. తాము అధికారంలోకి వస్తే ముందుగా ఒక్క క్వార్టర్ సీసాను రూ.75కే ఇస్తామని ఇంకా కుదిరితే రూ.50కే విక్రయిస్తామని అని సోము వీర్రాజు ప్రకటించారు. కాగా సోము వీర్రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో లిక్కర్ ఫర్ ఓటు అంటూ క్యాంపెయిన్ నడుస్తోంది.

అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా సోము వీర్రాజుకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఏపీలో 50 రూపాయిలకే చీప్‌ లిక్కర్‌ ఇస్తామనడం.. బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. అధికారం కోసం ఇంత దిగజారుతారా అంటూ ప్రశ్నించారు. ‘వావ్‌ వాటే స్కీమ్‌.. వాటే షేమ్‌.. 50 రూపాయలకే చీప్ లిక్కర్ అనే బంపరాఫర్ బీజేపీ జాతీయ విధానమా? లేక కేవలం బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకి మాత్రమేనా’ అని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.
చదవండి: పోలీసులకే షాక్‌ ఇచ్చిన దొంగ.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే..
చదవండి: అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ శాఖ నజర్‌.. బీపాస్‌’తప్పనిసరి.. బైపాస్‌ లేదు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement