
సాక్షి, విశాఖ: దక్షిణాది రాష్ట్రాల సమావేశం, స్టీట్‌ప్లాంట్ ఉద్యోగుల దీక్షపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదంటూ ఆరోపించారు.
విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ అంటూ డీఎంకే రాజకీయం చేస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని, పెరిగాయని డ్రాఫ్ట్ ఏదైనా రిలీజ్ అయిందా?. మా ముందు చాలామంది ఎన్నో కలలు కన్నారు.. అన్నీ కరిగిపోయాయి. మా ముందు ఎగిరే మీ రాష్ట్రాలు కూడా ఉండవు.. మీరూ ఉండరు. డీఎంకే ఎక్కువకాలం ఉండదు. లక్కీగా అయినా తెలంగాణ ముఖ్యమంత్రి స్క్వేర్ ఫీట్‌కు ఇంత అని లెక్కల్లో ఉన్నారు. మాదే స్టాండర్డ్ ఉన్న పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఉక్కు ఉద్యమంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా?. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మిక నాయకులే కారణం. కార్మిక నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు?. కార్మికులు కష్టపడుతుంటే కార్మిక నాయకుల కళ్ళు మండుతున్నాయి. జపాన్‌లో అయితే ఈ కార్మిక నాయకులను ఏం చేసేవారు. తిన్నది అరగక ఉద్యమం చేస్తున్నారా అని ఉద్యమ నాయకులని అడగాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదు. వాళ్ళు చైనా బాగుండాలని కోరుకుంటారు.. వాళ్లని నమ్మవద్దు. ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చాం ఇంకేం కావాలి అని ప్రశ్నించారు.
అలాగే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారం అంటే అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పని చేశారు. కల్లల్లో ఒత్తులు వేసుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment