న్యూఢిల్లీ: అముల్, మదర్ డైరీలు సహా పలు కంపెనీల పాలల్లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ పరీక్షల్లో తేలింది. ఈ పాలు శ్రేయస్కరం కావని చెప్పడం లేదనీ, నాణ్యత తక్కువగా ఉన్నాయని మాత్రమే చెబుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం వివరించారు.
ప్రముఖ, స్థానిక బ్రాండ్లు సహా ఢిల్లీ వ్యాప్తంగా 165 పాల నమూనాలను పరీక్షించగా వాటిలో అముల్, మదర్ డైరీలు సహా మొత్తం 21 నమూనాల్లోని పాలు తక్కువ నాణ్యతను కలిగిఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. కంపెనీలు పాలపొడితో పాలను కల్తీ చేస్తున్నట్లు తేలిందన్నారు. అధికారిక వివరాలు, నివేదికలు ఇంకా తమ వద్దకు రానందున దీనిపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని అముల్, మదర్ డైరీల ప్రతినిధులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment