low quality
-
అముల్, మదర్ డైరీ పాలల్లో లోపాలు
న్యూఢిల్లీ: అముల్, మదర్ డైరీలు సహా పలు కంపెనీల పాలల్లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ పరీక్షల్లో తేలింది. ఈ పాలు శ్రేయస్కరం కావని చెప్పడం లేదనీ, నాణ్యత తక్కువగా ఉన్నాయని మాత్రమే చెబుతున్నామని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం వివరించారు. ప్రముఖ, స్థానిక బ్రాండ్లు సహా ఢిల్లీ వ్యాప్తంగా 165 పాల నమూనాలను పరీక్షించగా వాటిలో అముల్, మదర్ డైరీలు సహా మొత్తం 21 నమూనాల్లోని పాలు తక్కువ నాణ్యతను కలిగిఉన్నట్లు తేలిందని ఆయన వెల్లడించారు. కంపెనీలు పాలపొడితో పాలను కల్తీ చేస్తున్నట్లు తేలిందన్నారు. అధికారిక వివరాలు, నివేదికలు ఇంకా తమ వద్దకు రానందున దీనిపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని అముల్, మదర్ డైరీల ప్రతినిధులు చెప్పారు. -
దోపిడీకి ప్లాన్
పాలకొల్లుటౌన్ : ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు తెలుగుదేశం నాయకులకు కల్పతరువుగా మారాయి. కాంట్రాక్టర్లు, అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ఇది పాలకొల్లు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. పాలకొల్లు మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.18 కోట్లు మంజూరు చేసింది. 2017–18లో ఈ నిధులు ఖర్చు చేయాలి. అయితే మున్సిపల్ అధికారులు పనులకు టెండర్లు ఖరారు చేసి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటివరకు ఆ పనులను పూర్తి చేయలేదు. మార్చి నెలాఖరు సమీపిస్తుండడంతో నిధులు తిరిగి వెనక్కు మళ్లుతాయనే భయంతో హడావుడిగా టీడీపీ నాయకులు పనులను వేగవంతం చేశారు. సబ్‌ప్లాన్ చట్టాన్ని కూడా అతిక్రమించి నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. పాలకొల్లు బెత్లహాంపేటలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో నాణ్యత లేకుండా నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్ 7 ఎస్సీ వార్డులు పాలకొల్లులో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏడు ఎస్సీ వార్డులు. ఈ వార్డుల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. జనాభాలో 40శాతం ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లో ఈ నిధులు వాడాలి. టీడీపీ నేతల కోసం రోడ్డు అయితే ఎస్సీలు 10శాతం కూడా లేని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. వాస్తవానికి 17, 18 వార్డుల్లో ఎస్సీలు పదిశాతం కూడా ఉండరు. ఇలాంటిచోట పలువురు టీడీపీ నాయకులు వారి పొలాలను రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడానికి రూ.50లక్షల సబ్‌ప్లాన్ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా బీటీ రోడ్డు నిర్మించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక పొలాలు, కొబ్బరితోటలు తొలగించి చకాచకా లేఅవుట్లకు సిద్ధం చేస్తున్నారు. నాసిరకంగా పనులు ఇదిలా ఉంటే 18వ వార్డు బెత్లహాంపేట, 16వ వార్డులో ఎస్సీ సబ్‌ప్లాన్, మున్సిపల్ జనరల్ ఫండ్ దాదాపు రూ.4కోట్లతో నిర్మితమవుతున్న రోడ్లు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. దీనిలో భారీ అవినీతి జరుగుతున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. నాసిరకం సిమెంటు వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇసుకపాళ్లు ఎక్కువ వేసి తూతూమంత్రంగా పనులు చేపట్టినట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా వేసిన 2రోజులకే రోడ్డు, డ్రెయిన్లు బీటలు తీశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఎస్సీవార్డుల్లో డ్రెయినేజీ నిర్మాణం లేకుండా హడావుడిగా రోడ్డు నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.కోటి వ్యయంతో 16వ వార్డులో నిర్మిస్తున్న డ్రెయిన్ దృశ్యం టీడీపీ నేతల కనుసన్నల్లోనే పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనులన్నీ టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. నాసిరకంగా పనులు చేపట్టడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పనులు జరుగుతున్న ఎస్సీ వార్డుల్లో ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది టీడీపీ వార్డు కౌన్సిలర్లు నాయకులు కాంట్రాక్టర్లు తమను ప్రసన్నం చేసుకోకపోతే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. కొంతమంది టీడీపీ నేతలు డబ్బులు చేతిలో పడితేగానీ పనులు సాగనీయడం లేదని ™ లుస్తోంది. వీటిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ అనేకసార్లు మున్సిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, కొందరు టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. వారు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రూ.50లక్షలు సబ్‌ప్లాన్ నిధులతో రోడ్డు నిర్మించారని విమర్శించారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాడినా ఫలితం లేదు. 7 వార్డుల్లో 86 పనులు పాలకొల్లు మున్సిపాలిటీలో 7వార్డుల్లో 86 పనులను చేపట్టారు. ప్రస్తుతం 48పనులు నూరుశాతం పూర్తికాగా మరో 38 పనులు 75శాతం పూర్తయ్యాయని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మార్చి 15లోపు మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10, 11, 15, 21, 31 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలకు కాంట్రాక్టర్లు తిలోదకాలిచ్చినా అధికారులు పట్టించుకోని దుస్థితి నెలకొంది. రెండు రోజులకే బీటలు బెత్లహాంపేటలో డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. అయితే 2రోజులకే ఎక్కడికక్కడ కాంక్రీటు రాలిపోయింది. ప్లాస్టరింగ్ కూడా చేయలేదు. డ్రెయిన్ మార్జిన్ పూడ్చమని అడిగితే ఎవరింటిముందు వాళ్లే పూడ్చుకోవాలని చెబుతున్నారు. ఇది చాలా దారుణం. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. – షేక్ మీరాఉద్దీన్, బెత్లహాంపేట, డ్రెయిన్ లేకుండానే రోడ్డు మా వార్డులో అధికారులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే డ్రెయినేజీ లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని అడిగితే రోడ్డు పూర్తయ్యాక డ్రెయిన్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. డ్రెయిన్ నిర్మాణం లేకుండా రోడ్డువేస్తే కుంగిపోతుంది. డ్రెయినేజీ లేకపోవడం వల్ల ఎక్కడి మురుగు అక్కడే ఉంటుంది. పందులు, దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నాం. ఇది చాలా దారుణం. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. – నగరపు సత్తెమ్మ, రాజీవ్‌నగర్ కాలనీ, పర్యవేక్షిస్తున్నారు పాలకొల్లు మున్సిపాలిటీలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో నాణ్యతాప్రమాణాలను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో ఎక్కడైనే నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే ఆ పనులకు బిల్లులు నిలిపివేస్తాం. క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీతో నాణ్యత ప్రమాణాల పరిశీలన అనంతరమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం. నాణ్యత ప్రమాణాలు లోపించిన చోట ప్రజలు గమనించి తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. – ఎ.రామ్మోహనరావు, మున్సిపల్ కమీషనర్, పాలకొల్లు -
రంజాన్ తోఫా బ్యాగుల్లో నాసిరకం సరుకు
-
‘నాసిరకం విత్తనాలతో అన్యాయం’
అనంతపురం అగ్రికల్చర్ : నాసిరకం వరి విత్తనాలు సాగు చేసి మోసపోయిన రైతులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో పలువురు నాయకులతో కలిసి టెక్నికల్ ఏఓలు సి.ప్రతాప్, సి.చెన్నవీరస్వామికి వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల అనంతపురం, రాప్తాడు, గార్లదిన్నె, ఆత్మకూరు, ముదిగుబ్బ తదితర మండలాల పరిధిలో వందలాది మంది రైతులకు బీటీపీ–5204 రకం వరి మాటున నకిలీ విత్తనాలు అంటగట్టిన ఫలితంగా పంట దారుణంగా నష్టపోయిందన్నారు. నంద్యాల, అనంతపురంలో ఉన్న బాధ్యుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ఓబిరెడ్డి, ఆర్.వెంకటరాముడు, రాగే పరశురాముడు, బి.ఆదినారాయణ, బి.కదిరెప్ప తదితరులు ఉన్నారు. -
ఘాట్‌కో గండం
నాసిరకంగా ఘాట్ల ఏర్పాటు కొన్ని చోట్ల జారుడు బండల్లా నిర్మాణం ఆయా ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు పుష్కర పనుల్లో అంతా హడావుడి.. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఏర్పాట్లన్నీ నత్తనడకన సాగుతున్నాయి.. ముహూర్తం ముంచుకొచ్చేకొద్దీ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు ముగిస్తున్నారు..ఈ క్రమంలో భక్తుల భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. లక్షల మంది భక్త జనం వచ్చే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిపోయి..తూతూమంత్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఘాట్లన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొల్లిపర: పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్ స్లూయిస్ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మున్నంగి వద్ద అప్రోచ్ రోడ్డు.. మున్నంగి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్‌రోడ్డు వెంట సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వల్లభాపురం ఘాట్‌కు బారికేడ్లు తప్పనిసరి? భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్ వద్ద రెండు పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం.. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్‌కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. జారుడు బల్లగా పుష్కర ఘాట్.. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నీళ్ల సాంబారు.. చప్పిడి మెతుకులు
– విద్యార్థులకు రుచించని మధ్యాహ్న భోజనం – సర్కారు బడుల్లో అందని పోషకాహారం హిందూపురం అర్బన్ : చప్పిడి ముద్దగా మారిన అన్నం.. నీళ్ల సాంబారు, పోషక విలువలు లేని భోజనం.. శుభ్రత లేని పరిసరాలు.. దీంతో మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్థులు విముఖత చూపుతున్నారు. భోజన ఏజెన్సీలకు బకాయిలు సరైన సమయంలో ఇవ్వకపోవడం.. పప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం తదితర కారణాల రీత్యా మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడుతోంది. అప్పులు చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నామని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. సర్కారు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం అమలై పదేళ్లు పూర్తయినా క్షేత్రస్థాయిలో మాత్రం తీరు మారడం లేదు. హిందూపురం పట్టణంలో 88 ప్రాథమిక, 15 ప్రాథమికోన్నత, 18 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 31 వేల మంది ఉన్నారు. వీరందరికీ భోజన సదుపాయం కల్పించేందుకు 122 ఏజెన్సీలు ఉన్నాయి. అయితే చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా సాగుతోంది. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి భోజన ఖర్చు నిమిత్తం రూ.4.60, ఉన్నత పాఠశాలలో రూ.6.38 చొప్పున ఇస్తున్నారు. దీంతో పాటు ప్రాథమిక స్థాయి విద్యార్థికి 100 గ్రాములు, ఉన్నత పాఠశాల విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నారు. కూరగాయలు, చింతపండు, కందిపప్పు ఇలా ప్రతి వస్తువు ధర గత ఏడాది కంటే 15 శాతం పైగా పెరిగాయి. ఈ ధరల మోత భరించలేని నిర్వాహకులు నాణ్యతపై ప్రభావం చూపుతున్నారు. మధ్యాహ్న భోజనం తినలేక చాలామంది పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకుని తింటున్నారు. మరికొందరు నేరుగా ఇళ్లకే వెళ్లిపోతున్నారు. కోడిగుడ్డు, అరటిపండు నెలకు ఓసారి కూడా ఇవ్వట్లేదు. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం ప్రకటించిన మెనూ గాలికి వదిలేసి తమకు అనుకూలమైన రీతిలో భోజనాలు సిద్ధం చేసుకుంటున్నారు. నాణ్యతలేని కూరగాయలు, గుడ్డు, అరటిపండుకు స్వస్తి పలికి ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు మిగులు చేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనికితోడు పాఠశాలలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా వేధిస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే రెండు నెలలుగా బకాయిలు చెల్లించ లేదని అప్పులు చేసి వంటలు చేస్తున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. కాగా మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టి సారిస్తామని ఎంఈఓ గంగప్ప తెలిపారు.