ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ -4 మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీలో బార్లకు సెప్టెంబర్ 9 నుంచి ట్రయల్ బేసిస్ పద్దతిలో తెరవనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పేర్కొంది. ఢిల్లీలో బార్లకు అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను ఇటీవలే కోరింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరినట్లు ఢిల్లీలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు అనిల్ బైజల్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 30వరకు ట్రయల్ పద్దతిలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
బార్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో పరిమిత సంఖ్యలో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం విధించిన అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారమే బార్లలో మద్యం సరఫరా చేయనున్నట్లు తెలిపింది. గత శనివారం కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో ప్రధాన నగరాల్లోని మెట్రో సేవలను పునరుద్ధరించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు షరతులతో కూడిన విధంగా బార్లను తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. బార్లకు అనుమతులు ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ఢిల్లీలోని వివిధ బార్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.(చదవండి : తగ్గుతున్న పాజిటివ్ రేటు;భారత్‌కు ఊరట)
►కేంద్రం విధించిన అన్‌లాక్ -4 మార్గదర్శకాలను బార్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. లేని పక్షంలో బార్ల లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.
►బార్లకు వచ్చే కస్టమర్లకు మాస్కులు ఉంటేనే లోనికి అనుమతించాలి.
►సీటింగ్ కెపాసిటీ 50శాతానికి తగ్గించి.. ప్రతి కస్టమర్ కనీస భౌతికదూరం పాటించేలా చూడాలి.
►బార్‌కు వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ జోన్ లేకుండా ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment