Anil Baijal
-
గవర్నర్, సీఎం... విభేదాల పర్వం
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దేశ రాజధాని ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి. తన పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత సానుకూలంగా ఉన్నా టీఆర్ఎస్ సర్కారు తనను విస్మరించడం శోచనీయమని హస్తినలో ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతో తమిళసై భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు తమిళసై తాజా వ్యాఖ్యలతో బలం చేకూర్చాయి. తెలంగాణ ఏం జరుగుతుందో ప్రధాని సహా అందరికీ తెలుసునని ఆమె అన్నారు. తెలంగాణలో జరుగుతున్నదంతా ఓపెన్ సీక్రెట్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులతో విభేదించినంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్లను దూరం పెడతారా అంటూ వాపోయారు. అయితే గవర్నర్లతో ముఖ్యమంత్రులకు బేదాభిప్రాయాలు కొత్తకాదు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. వర్తమానంలోనూ పలు రాష్ట్రాల్లో సీఎం, గవర్నర్ కార్యాలయాల మధ్య విభేదాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతోంది. (క్లిక్: తారా స్థాయికి చేరిన గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య విభేదాలు) జగదీప్‌తో దీదీ ఢీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత జనవరిలో గవర్నర్ జగదీప్ దంకర్‌ను ట్విటర్లో బ్లాక్ చేశారు. ప్రతిరోజు ట్వీట్లు పెడుతూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని, తమను బానిసల్లా చూస్తున్నారని.. అందుకే ట్విటర్లో ఆయనను బ్లాక్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా తమ విధుల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు అనేక సమస్యలపై మమతా బెనర్జీ, గవర్నర్ దంకర్ మధ్య తలెత్తిన విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. తాను పంపిన ఫైల్స్‌పై గవర్నర్ సంతకాలు పెట్టడం లేదని గత ఫిబ్రవరిలో మమత ఆరోపించారు. కావాలనే ఇదంతా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దంకర్ కంటే ముందు గవర్నర్‌గా పనిచేసిన కేశరీనాథ్‌తోనూ మమతా బెనర్జీకి బేదాభిప్రాయాలు వచ్చాయి. (చదవండి: బీజేపీ జెండాతో వచ్చానా?) సింగ్ వర్సెస్ థాకరే మహారాష్ట్రలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుతో గవర్నర్ భగత్ సింగ్ కొషియారికి పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. సీఎం ఉద్ధవ్ థాకరే ఇటీవల నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీలపై నిర్ణయాన్ని గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. (క్లిక్: రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి) అక్కడ కూడా అంతే! కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కూడా అభిప్రాయ బేధాలున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం, ఇతర అంశాల్లో సీఎం, గవర్నర్ కార్యాలయాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి లెఫ్టినంట్ గవర్నర్లతో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదు. ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తోనూ ఇదే పరంపర కొనసాగుతుంది. పరిష్కారం ఏమిటి? గవర్నర్ వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ వారిని గవర్నర్లుగా నియమించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న భావన ఉంది. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని తటస్థులను నియమించాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. -
100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని గంటసేపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. అయితే పాఠశాలలు తెరవడానికి దశల వారీగా అనుమతిచ్చారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ఫిబ్రవరి 7 నుంచి పునఃప్రారంభంచనున్నారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుంచి వర్చువల్ బోధన కొనసాగించనున్నారు. టీకాలు వేసుకోని ఉపాధ్యాయులకు పాఠశాలలకు అనుమతిని నిరాకరించారు. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) ఉన్నత విద్యాసంస్థలు ప్రామాణిక నిబంధనలకు లోబడి తెరవబడతాయి. 100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, బార్లు ప్రారంభానికి అనుమతిచ్చారు. వ్యాపార సంస్థలన్ని యథాప్రకారంగా కొనసాగనున్నాయి. -
ఢిల్లిలో దీపావళి తర్వాతే మిగిలిన తరగతులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉన్నందున, దశల వారీగా మిగిలిన తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను నవంబర్ మొదటి వారంలో తిరిగి తెరవనున్నారు. దీపావళి పండుగ తర్వాత అధికార యంత్రాంగం దశలవారీగా పునః ప్రారంభించే విధానాలను నిర్ణయిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి దశలవారీగా తెరుచుకున్నాయి. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ల వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని కోవిడ్–19 ప్రోటోకాల్‌లను పాటిస్తూ తరగతులు జరుగుతున్నాయి. దీనితో పాటు రాంలీలా, దసరా, దుర్గాపూజ పండుగలను సైతం సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని సూచించారు. అంతేగాక కోవిడ్ ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. (చదవండి: జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది) -
‘ప్రతీదానికి అడ్డుపడడం బాగోలేదు’
ఢిల్లీ: తమ పాలనలోని ప్రతీ నిర్ణయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం నానాటికీ ఎక్కువ అవుతుండడంపై ఆప్ ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కారు. రైతు నిరసనల ఉద్యమ కేసుకు(జనవరి 26న జరిగిన పరిణామాల కేసు) సంబంధించి పోలీసుల తరపున వాదనలు వినిపించేందుకు ఢిల్లీ గవర్నమెంట్ ఒక లాయర్ల ప్యానెల్‌ను ప్రతిపాదించింది. అయితే దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఎల్జీ.. మరో ప్యానెల్‌ను సూచించాడు. ఇక ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు ఘోర అవమానమేనని కేజ్రీవాల్ ఆక్షేపించారు. ‘కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. బీజేపీని చిత్తుగా ఓడించి ఢిల్లీలో మేం(ఆప్) పాలిస్తున్నాం. మేం ప్రజానిర్ణయంతో ఎంపికయ్యాం. అలాంటిది ప్రతీదాంట్లో బీజేపీ, ఆయన(ఎల్జీని ఉద్దేశించి) జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఇది ఢిల్లీ ప్రజల్ని అవమానించడమే అవుతుంది. బీజేపీ కొంచెం ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తే బాగుంటుంది’ అని హిందీలో శనివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. कैबिनेट निर्णयों को इस तरह पलटना दिल्ली वालों का अपमान है। दिल्ली के लोगों ने एतिहासिक बहुमत से “आप” सरकार बनायी और भाजपा को हराया। भाजपा देश चलाये, “आप” को दिल्ली चलाने दे। आए दिन हर काम में इस तरह की दख़ल दिल्ली के लोगों का अपमान है। भाजपा जनतंत्र का सम्मान करे https://t.co/FQbQzuvMkL — Arvind Kejriwal (@ArvindKejriwal) July 24, 2021 గత సోమవారం ఢిల్లీ కేబినెట్ ప్రతిపాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లకు బదులు.. ఢిల్లీ పోలీసులు ఎంపిక చేసిన లాయర్ల ప్యానెల్‌ను ఎల్జీ అనిల్ బైజాల్ అప్రూవ్ చేయడం విశేషం. ఈ ప్యానెల్ నియామకం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే జరగడం మరో విశేషం. దీంతో డిప్యూటీ సీఎం సిసోడియా మండిపడ్డాడు. ‘అన్నీ వాళ్లే చేసుకుంటే.. ఇక మేమేందుకు?’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిను ఆయనకు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీలో ఈ నెల 16న రాత్రి 10 గంటల నుంచి 19న ఉదయం 6 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఢిల్లీలో 5 వారాల్లో కరోనా కేసులు 25 రెట్లు పెరిగాయి. మినహాయింపులు ఎవరికి.. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో జరుగబోయే వివాహాలకు ఆంక్షలతో కూడిన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. కర్ఫ్యూ సమయంలో వివాహాలకు హాజరయ్యేందుకు ప్రజలు ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మాల్స్, జిమ్‌లు, స్పాలు, ఆడిటోరియంలు, మార్కెట్లు, ప్రైవేట్ కార్యాలయాలను 30వ తేదీ వరకు పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లను 30 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపించేందుకు అవకాశం ఇచ్చారు. రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు అనుమతి లేదు. కేవలం హోమ్ డెలివరీ మాత్రమే ఉంటుంది. ఆసుపత్రుల్లో పడకల కొరత ఏం లేదు: కేజ్రీవాల్ కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని అన్నారు. బాధితుల కోసం 5,000 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. -
ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే!
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని తేల్చిచెప్పే బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్సీటీడీ)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని లోక్‌సభలో ఆప్, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ చర్యకైనా ఎల్జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఇది రాజకీయ బిల్లు కాదని, కేవలం కొన్ని అంశాలపై స్పష్టత కోసం తెచ్చిన బిల్లని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈబిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లు 1991లో కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. ఎల్జీ కార్యనిర్వహణాధికారి కనుక రోజూవారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఆయనకుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి అధికారాలు లాక్కొని ఎల్జీకి కట్టబెట్టలేదని వివరించారు. తమ తప్పుంటే విని దిద్దుకుంటామని, కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు విమర్శలను సహించమని, ఈ బిల్లు మరింత పారదర్శకత కోసమే తెచ్చామని చెప్పారు. 2015 నుంచి ఢిల్లీ హైకోర్టులో కొన్ని అంశాలపై వేసిన కేసులు, వాటిపై కోర్టు ఇచ్చిన రూలింగ్స్‌తో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎల్జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపని చెప్పి చేయాలని కోర్టు తీర్పులిచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యతిరేకం రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్ అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు. 2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ పరోక్షంగా అరవింద్ క్రేజీవాల్‌ను విమర్శించారు. అరవింద్ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల హరణలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్ ఎంపీ భగవంత్‌మన్ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
అన్‌లాక్ 4 : ఢిల్లీలో తెరుచుకోనున్న బార్లు
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ -4 మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీలో బార్లకు సెప్టెంబర్ 9 నుంచి ట్రయల్ బేసిస్ పద్దతిలో తెరవనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పేర్కొంది. ఢిల్లీలో బార్లకు అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను ఇటీవలే కోరింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరినట్లు ఢిల్లీలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు అనిల్ బైజల్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 30వరకు ట్రయల్ పద్దతిలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బార్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో పరిమిత సంఖ్యలో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం విధించిన అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారమే బార్లలో మద్యం సరఫరా చేయనున్నట్లు తెలిపింది. గత శనివారం కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో ప్రధాన నగరాల్లోని మెట్రో సేవలను పునరుద్ధరించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు షరతులతో కూడిన విధంగా బార్లను తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. బార్లకు అనుమతులు ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ఢిల్లీలోని వివిధ బార్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.(చదవండి : తగ్గుతున్న పాజిటివ్ రేటు;భారత్‌కు ఊరట) ►కేంద్రం విధించిన అన్‌లాక్ -4 మార్గదర్శకాలను బార్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. లేని పక్షంలో బార్ల లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ►బార్లకు వచ్చే కస్టమర్లకు మాస్కులు ఉంటేనే లోనికి అనుమతించాలి. ►సీటింగ్ కెపాసిటీ 50శాతానికి తగ్గించి.. ప్రతి కస్టమర్ కనీస భౌతికదూరం పాటించేలా చూడాలి. ►బార్‌కు వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ జోన్ లేకుండా ఉంచాలి. -
10 వేల పడకల కోవిడ్ సెంటర్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్లో 10 వేల పడకలు ఉన్నాయి. దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటలేటర్లు, ఐసీయూను అనిల్ బైజాల్ పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ‘ఆపరేషన్ కరోనా వారియర్స్’ పేరిట ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది. 1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్లో 200 ఎన్క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్లో 20 ఫుట్‌బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సందర్శించారు. -
చైనా ఆస్పత్రి కన్నా పదింతలు పెద్దది
-
చైనా ఆస్పత్రి కన్నా పదింతలు పెద్దది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో భారీ కేంద్రాన్ని నిర్మించ తలపెట్టిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుకున్న సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. 10 వేల బెడ్స్ సామర్థ్యం గల కోవిడ్ కేంద్రాన్ని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. దీనికి ‘సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్’ అని పేరు పెట్టారు. దక్షిణ ఢిల్లీ సమీపంలోని చత్తర్‌పూర్ ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్ బియాస్ కాంప్లెక్స్‌ను తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పున్న ఈ కేంద్రం దాదాపు 20 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన స్థలంలో నిర్మితమై ఉంది. (ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు) చైనాలో నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రికి ఇది పదింతలు పెద్దది కావడం విశేషం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఈ మేరకు అనిల్ బైజాల్ ట్విటర్ వేదికగా ఆస్పత్రి వివరాలను వెల్లడించారు. ఈ కోవిడ్ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు పరిశీలించారు. -
రాష్ట్రం నిరసన.. వెనక్కి తగ్గిన గవర్నర్
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కి తరలించే ముందు తప్పనిసరిగా అయిదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఐసోలేషన్ వార్డులో ఉంచాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఉపసంహరించుకున్నారు. శుక్రవారం గవర్నర్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల పట్ల కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా నిరసన తెలిపింది. గవర్నర్ ఉత్తర్వుల ప్రకారం కరోనా పేషంట్లను ఐసోలేషన్ వార్డులోనే ఉంచితే.. ఈ నెల చివర వరకు దాదాపు 90 వేల బెడ్లు అవసరమవుతాయని కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటికే బెడ్ల కొరతతో ఇబ్బంది పడుతుండగా.. మరో 90 వేల పడకలు ఎలా ఏర్పాటు చేస్తామని ప్రశ్నించింది. (‘అలా చేస్తే మరో 90వేల బెడ్లు కావాలి’) Regarding institutional isolation, only those COVID positive cases which do not require hospitalisation on clinical assessment & do not have adequate facilities for home isolation would be required to undergo institutional isolation. — LG Delhi (@LtGovDelhi) June 20, 2020 ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేవలం ఢిల్లీకి మాత్రమే ఈ ప్రత్యేక గైడ్‌లైన్స్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ ఉత్తర్వులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. కరోనా లక్షణాలు లేనివారు.. తక్కువగా ఉన్న వారు ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉండాలని ఐసీఎమ్ఆర్ సూచించదని మనీష్ సిసోడియా గుర్తు చేశారు. ప్రస్తుతం గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. (కరోనా చికిత్స: మార్కెట్లోకి ఫబిఫ్లూ ఔషదం) -
కరోనా: ఇకపై 5 రోజులపాటు ఆస్పత్రిలోనే
ఢిల్లీ : కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కి తరలించే ముందు ఆస్పత్రిలోనే తప్పనిసరిగా అయిదు రోజుల పాటు ఐసోలేషన్ వార్డులోనే ఉంచాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఇంటి వద్దే స్వీయ నిర్భంధంలో ఉన్నవారిపై తప్పనిసరిగా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. హోం క్వారంటైన్లో ఉన్నవారు భౌతిక దూరం పాటించకపోవడం వల్లే రాజధానిలో కేసులు మరిన్ని పెరగడానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నా సమస్య తీవ్రమైతే వెంటనే హాస్పిటల్‌కి తరలించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్ ) అయితే కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే వైద్యులు, నర్సుల కొరత ఉందని ఇలాంటి పరిస్థితుల్లో అందరికి ఆస్పత్రిలో సేవలందించడం సాధ్యమేనా అని సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుతానికి వేలాది మంది కరోనా రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని, తాజా ఉత్తర్వుల వల్ల పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలు, పడకలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని దీని ద్వారా స్వతహాగా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. ఫలితంగా కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 8,400 కరోనా బాధితులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కోవిడ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా 24 గంటల్లోనే 14,516 కొత్త కరోనా కేసులు నమోదుకాగా, 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (భారత్: మరోసారి రికార్డు స్థాయిలో కేసులు ) -
మహమ్మారిపై పోరు బాట
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో ఆదివారం సమావేశమై కరోనాని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, మృతదేహాల నిర్వహణ వంటి అంశాల్లో సుప్రీం కూడా మొట్టికాయలు వేయడంతో పరిస్థితుల్ని సమీక్షించి కరోనాను ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ సమావేశం ఫలప్రదమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రెండు ప్రభుత్వాలు కలిసి కోవిడ్‌ను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటానికి సంబంధించి అమిత్ షా పలు ట్వీట్లు చేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు. నేడు అఖిలపక్ష భేటీ ఢిల్లీలో వైరస్ వ్యాప్తిని సమీక్షించడానికి సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఇదీ కార్యాచరణ పరీక్షలు మూడు రెట్లు ► దేశ రాజధానిలో కోవిడ్ పరీక్షలను ఇక మూడు రెట్లు పెంచనున్నారు. వచ్చే రెండు రోజుల్లో రెట్టింపు పరీక్షలు, ఆరు రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించనున్నారు. కొద్ది రోజుల తర్వాత నగరంలో కంటైన్మెంట్ జోన్లలో ప్రతీ పోలింగ్ స్టేషన్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటి సర్వేలు ► ఢిల్లీలో ప్రస్తుతం 241 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలో ఇంటింటికీ వెళ్లి కేంద్రం సర్వే నిర్వహిస్తుంది. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నాయా, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీస్తుంది. ఈ జోన్లలో నివసించే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 500 రైల్వే బోగీలే కరోనా పడకలు ► ఢిల్లీలో కోవిడ్ రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో కేంద్రం 500 రైల్వే కోచ్‌లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చనుంది. ఈ కోచ్‌లలో 8 వేల మందికి చికిత్స అందించవచ్చు. వైరస్‌పై పోరాడడానికి అన్ని రకాల పరికరాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60% పడకల్లో వైద్యం ► ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 శాతం పడకల్ని కోవిడ్ రోగులకు కేటాయించనున్నారు. ఇక్కడ తక్కువ ధరకే వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం డాక్టర్ పాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎయిమ్స్ వైద్యులతో కమిటీ ► కోవిడ్ రోగులకు చికిత్సనందించే విధానంపై చిన్న చిన్న ఆస్పత్రుల్లో అవగాహన పెంచడానికి ఎయిమ్స్‌లో సీనియర్ వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా అక్కడ వైద్యులకు టెలిఫోన్ ద్వారా సూచనలు అందిస్తారు. అంతేకాదు ఢిల్లీలో కోవిడ్ సన్నద్ధతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ నగరంలో వైద్య సదుపాయాల్ని పర్యవేక్షిస్తుంది. -
వెనక్కి తగ్గిన సీఎం.. ఎల్జీ ఆదేశాలు అమలు!
న్యూఢిల్లీ: వివక్షకు తావు లేకుండా ప్రతీ ఒక్కరికి చికిత్స అందించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలు, వాదనలకు ఇది సమయం కాదని.. లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన ఉత్వర్వులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్జీ ఆదేశాలను తప్పక అమలు చేస్తాం. భేదాభిప్రాయాలకు, వాదనలకు సమయం కాదిది’’ అని పేర్కొన్నారు. కాగా దేశ రాజధానిలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 15 నాటికి 44 వేలు, జూన్ 30 నాటికి 2.25 లక్షలు, జూలై చివరి నాటికి 5.5 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.(కేజ్రీవాల్ వింత నిర్ణయం.. ఎల్జీ ఉత్తర్వులు) ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లోని పడకలను ఢిల్లీ వాసులకే కేటాయిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఆస్పత్రుల్లో బెడ్స్ అందరూ వాడుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్థానికేతరులకు చికిత్స అందించబోమన్న కేజ్రీవాల్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక కేజ్రీవాల్ ప్రకటనపై స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికి చికిత్స అందించాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన జీవించే హక్కులో ఆరోగ్యంగా జీవించే హక్కు అంతర్భాగమని సర్వోన్నత న్యాయస్థానం పలు తీర్పుల్లో వెల్లడించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. (మరో పదివేల కేసులు ) -
కరోనా: ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశం లెఫ్ట్‌నెంట్ గవర్నర్, విపత్తు నిర్వాహణ శాఖ చైర్మన్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరగడానికి కారణం కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ కాదంటూ కేంద్ర అధికారులు పేర్కొన్నారని వెల్లడించారు. గతవారం నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ జరగలేదని అధికారులు తెలిపారని అన్నారు. జూలై నెల చివరికల్లా 5.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని, కరోనా బాధితులకు వైద్యం అందిచడానికి 80 వేల బెడ్లు కావాలని పేర్కొన్నారు. (జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్) ఈ సమావేశానికి ముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 50 శాతం మందికి వ్యాధి ఎలా సంక్రమిస్తోందో సరైన సమాచారం లేదని తెలిపారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందస్తుగానే సెల్ఫ్ ఐసోలేషన్‌కి పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలో కొత్తగా 1007 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ఇప్పటివరకు 874 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. (24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు) -
కేజ్రీవాల్ వింత నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వుండేవారికీ మధ్య లడాయి కొత్తగాదు. ఇంకా వెనక్కు వెళ్తే వేరే పార్టీలకు చెందినవారు అధికారంలో వున్నప్పుడు కూడా ఇలాంటి విభేదాలు తరచు వస్తూనే వుండేవి. తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సోమవారం రద్దు చేశారు. సాధారణంగా అయితే ఇలా సమస్య తలెత్తినప్పుడల్లా కేజ్రీవాల్‌నే అత్యధికులు సమర్థించేవారు. ఈసారి మాత్రం వారిలో చాలా మంది ఆ పని చేయలేకపోయారు. కరోనా సమస్య పరిష్కారమయ్యేవరకూ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందిం చాలంటూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అందుకు కారణం. దీనిపై అన్నివైపులా వ్యతిరే కత రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ అది అమలుకాకుండా ఆపారు. కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ పేట్రేగుతుండటం, కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోవడం అందరిలోనూ భయాందోళనలు కలిగిస్తోంది. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో నిర్ణయాలు తీసుకోవాల్సివుంటుంది. సంయమనం పాటించాల్సివుంటుంది. కానీ కేజ్రీవాల్ సర్కారు జారీ చేసిన సర్క్యులర్ అందుకు విరుద్ధమైన పోకడలకు పోయింది. అన్ని రాష్ట్రాల్లాగే ఢిల్లీ కూడా కరోనా ఉగ్ర రూపం దాల్చినప్పటినుంచీ సరిహద్దులు మూసేసింది. బయటివారు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. వాటిని ఎవరూ తప్పుబట్టరు. లాక్డౌన్ నిబంధనల్ని సడలించడంలో భాగంగా ఆ ఆంక్షల్ని సోమవారం నుంచి రద్దు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం భావించింది. అంతవరకూ మంచిదే. కానీ కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే ఢిల్లీ ఆసుపత్రుల్లో వైద్యం లభిస్తుందని చెప్పడ మేమిటి? ఢిల్లీకి పొరుగున ఉత్తరప్రదేశ్, హర్యానాలున్నాయి. ఆ సరిహద్దుల్లోవున్న గ్రామాలు, పట్ట ణాల ప్రజలు ఎక్కువగా వైద్య అవసరాల కోసం ఢిల్లీకి వెళ్తుంటారు. అలాంటివారందరికీ వైద్యం నిరాకరిస్తామని చెప్పడం రాజ్యాంగవిరుద్ధం మాత్రమే కాక, అమానవీయం. ఆరోగ్యంగా వుండే హక్కు ప్రాథమిక హక్కుల్లో ఒకటైన జీవించే హక్కులో భాగమేనని ఆమధ్య సర్వోన్నత న్యాయ స్థానం తీర్పునిచ్చిన సంగతి కేజ్రీవాల్‌కు తెలియదనుకోలేం. పైగా తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన వారెవరినీ నిరాకరించబోమని వృత్తి చేపట్టే ముందు వైద్యులు ప్రమాణం చేస్తారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పాలన చూశాక మొన్న ఫిబ్రవరిలో రెండోసారి ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను జనం గెలిపించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తీరు అందరినీ మెప్పించింది. 20,000 లీటర్ల వరకూ ఉచితంగా మంచినీరు అందించడం, మహిళలకు సిటీబస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించడం వంటివి అందరినీ ఆక ట్టుకున్నాయి. కానీ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడం మొదలెట్టాక కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలపాలవుతున్నాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి నిరాకరించే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికను కూడా ఇలాగే అనేకులు తప్పుబట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సక్రమంగా చికిత్స అందడం లేదని వస్తున్న ఆరోపణల విషయంలో స్పందించని సర్కారు ప్రైవేటు ఆసుపత్రులకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఏమిటన్నది వారి ప్రశ్న. దానికి బదులు ప్రైవేటు ఆసుపత్రుల వాస్తవ సామర్థ్యం ఏమేరకుందో మదింపు వేసి, మెరుగైన సదుపాయాలున్న ఆసుపత్రులు కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించాలని ఉత్తర్వులిస్తే సరిపోయేది. ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఒకే స్థాయిలో వుండవు. ఎక్కడ పరిమిత సౌకర్యాలు వున్నాయో ...ఎక్కడ విస్తరణకు అనువైన సదుపాయాలున్నాయో చూసి, తగిన ఆదేశాలిస్తే అందువల్ల ప్రయోజనం వుంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఆసుపత్రులు కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే అన్న నిర్ణయం కూడా ఇలా అనాలోచితంగా తీసుకున్నదే. అక్కడి ఆసుపత్రుల్లో వైద్యం కావాలనుకున్నవారు రోగికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌బుక్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వగైరాల్లో ఏదో ఒకటి చూపాలని కేజ్రీవాల్ సర్కారు జారీచేసిన ఫర్మానా చెబుతోంది. ఢిల్లీలో ఈ నెలాఖరుకల్లా కరోనా రోగులకు చికిత్స అందించడానికి 15,000 బెడ్లు అవసరమవుతాయన్న నిపుణుల కమిటీ అంచనా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే కేన్సర్, న్యూరోసర్జరీ, అవయవాల మార్పిడి, రోడ్డు ప్రమాదాలు వగైరాలకు సంబంధించి ఈ నిబంధనలు వర్తించబోవని వివరించింది. అసలు ఎవరు ఢిల్లీ వాసులో, ఎవరు వేరే రాష్ట్రాలవారో కొన్ని పత్రాలనుబట్టి ఎలా నిర్ణయిస్తారో అనూహ్యం. ఇరుగు పొరుగు రాష్ట్రాల సంగతలావుంచి ఢిల్లీకి ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వచ్చినవారు అత్యవసరంగా చికిత్స అవసరమై వెళ్లినప్పుడు వారికి చికిత్స చేసేందుకు నిరా కరించడం అమానుషం కాదా? గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ మహేష్ వర్మ నేతృత్వంలోని కమిటీ ఏడున్నర లక్షలమంది అభిప్రాయాలు సేకరించినప్పుడు వారిలో 90 శాతంమంది ఢిల్లీ ఆసుపత్రులు స్థానికులకు మాత్రమే ఉండాలన్నారని కేజ్రీవాల్ అంటున్న మాటలు అర్థం లేనివి. భయాందోళనల్లో వున్నప్పుడు భావోద్వేగాలకు లోనయినవారు ఏమైనా మాట్లాడతారు. అందులో సహేతుకత వుందో లేదో నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వాలే. ఆ భావోద్వేగాల ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటామంటే నిబంధనలు ఒప్పుకోవు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న మతిమాలిన నిర్ణయాన్ని అనిల్ బైజాల్ పక్కనబెట్టడం హర్షించదగ్గది. సంక్షో భాలు ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు వివేకంతో వ్యవహరించాలి. అందరి క్షేమాన్నీ దృష్టిలో వుంచు కుని నిర్ణయాలు తీసుకోవాలి. -
జెస్సికాలాల్ హంతకుడి విడుదలకు ఢిల్లీ ఎల్జీ ఓకే
న్యూఢిల్లీ: 1999లో సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికాలాల్ హత్య కేసులో దోషిగా యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న మనుశర్మను ముందుగానే విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం ఆమోదం తెలిపారు. మనుశర్మను ముందే విడుదల చేయాలని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ అధ్యక్షతన మే 11న జరిగిన భేటీలో ‘ఢిల్లీ సెంటెన్స్ రివ్యూ బోర్డ్’ సిఫారసు చేసింది. మను శర్మ మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ కొడుకు. దక్షిణ ఢిల్లీలో ఉన్న టామరిండ్ కోర్ట్ రెస్టారెంట్లో మద్యం అందించేందుకు నిరాకరించిందన్న కారణంతో మోడల్ జెస్సికా లాల్‌ను మనుశర్మ తుపాకీతో కాల్చి చంపేశాడు. 1999 ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగింది. ట్రయల్ కోర్టు మనుశర్మను నిర్దోషిగా తేల్చింది. హైకోర్టు 2006 డిసెంబర్లో మనుశర్మకు యావజ్జీవ ఖైదు విధించింది. ఆ తరువాత 2010లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. -
16న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్‌ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. భారీగా జన సమీకరణ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్ ఆకర్షించారు. కేబినెట్లో పాత ముఖాలే ? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్ కేబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, రాజేంద్ర పాల్ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌లు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది. -
తీర్పు వెలువడ్డ కొద్దిగంటలకే...
కోర్టు తీర్పు తర్వాత కూడా ఢిల్లీ రాజకీయాల్లో మార్పు కనిపించటం లేదు. కొద్ది గంటల్లోనే ఆప్ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. సర్కార్ జారీ చేసిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం సుప్రీం కోర్టు తీర్పు అనంతరం అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని చెబుతూ సర్వీసెస్ డిపార్ట్మెంట్.. ఆ ఆదేశాలను తిరస్కరించింది. దీంతో అగ్గిరాజుకుంది. కోర్టు ధిక్కారమే.. తాజా అంశంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం కేంద్రం పక్కన బెడుతోందని విమర్శించారు. "నిన్నటి తీర్పులో కోర్టు స్పష్టంగా.. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు. ఆ లెక్కన కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌కే బదిలీల అధికారం పూర్తిగా ఉంటుందని ఆయన అంటున్నారు. దీనిపై ఎల్జీ కార్యాలయం అధికారికంగా స్పందించాల్సి ఉంది. బుధవారం సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు... ‘ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్థం చేయరాదు. ప్రభుత్వం తన నిర్ణయాలను ఎల్జికి తెలిపితే సరిపోతుంది. ఆమోదం అవసరం లేదు’ అని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన బెంచ్ తీర్పు వెల్లడించింది. -
‘ఈ డ్రామాలో ఢిల్లీ ప్రజలే అసలైన బాధితులు’
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు చేస్తోన్న దీక్షపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారం రోజుల నుంచి కేజ్రీవాల్ దీక్ష గురించి మౌనంగా ఉన్న రాహుల్... సోమవారం ప్రధాని మోదీ, కేజ్రీవాల్ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. పాలన పక్కన పెట్టి దీక్ష చేస్తోన్న అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు.. ఆయనకు కౌంటర్‌గా దీక్షకు దిగిన బీజేపీ నేతల తీరును కూడా రాహుల్ తప్పు పట్టారు. ‘ఢిల్లీ సీఎం, ఎల్జీ ఆఫీస్‌లో ధర్నా చేస్తున్నారు. బీజేపీ వాళ్లు సీఎం నివాసం వద్ద ధర్నాకు కూర్చున్నారు. ఇక ఢిల్లీ బ్యూరోక్రాట్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఈ అరాచకం ప్రధానికి మాత్రం కనబడటం లేదు. ఇక్కడ జరుగుతున్న డ్రామాలో ఢిల్లీ ప్రజలే అసలైన బాధితులు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. Delhi CM, sitting in Dharna at LG office. BJP sitting in Dharna at CM residence. Delhi bureaucrats addressing press conferences. PM turns a blind eye to the anarchy; rather nudges chaos & disorder. People of Delhi are the victims, as this drama plays out. — Rahul Gandhi (@RahulGandhi) June 18, 2018 -
ఢిల్లీ డిప్యూటీ సీఎం నిరాహార దీక్ష భగ్నం
-
నిరాహార దీక్ష: అనారోగ్యం పాలవుతోన్న మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్ష నేడు(సోమవారం) ఎనిమిదో రోజుకు చేరింది. ఇంతలో ఈ ‘సోఫా ధర్నా’పై కేజ్రీవాల్‌కు గట్టి షాకే తగిలింది. ఇతరుల ఇళ్లలో ధర్నా చేసే అధికారం మీకెవరిచ్చారంటూ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ను నిలదీసింది. ‘దీన్ని ధర్నా అని ఎవరూ అనరు. ఇతరుల ఇళ్లలోకి, కార్యాలయాల్లోకి జోరబడి ధర్నా చేసే హక్కు ఎవరికీ ఉండదు’ అని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు, ఆందోళన తదుపరి వ్యూహాలపై చర్చించేందుకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేతలు భేటీ కానున్నారు. మరోవైపు దీక్షలో పాల్గొన్న పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అనారోగ్యం పాలవడం ఆందోళన కలిగిస్తోంది. నిరసనలో భాగంగా గత వారం రోజులుగా దీక్షలో పాల్గొన్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం పూర్తీగా క్షీణించడంతో ఆయనను ఆదివారం రాత్రి లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రసుతం దీక్ష చేస్తోన్న మరో మంత్రి కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. ‘కీటోన్ లెవల్ 7.4కు పెరిగిన తర్వాత రొటీన్ చెకప్ కోసం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి తరలించారని’ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు పెరుగుతోంది. కేజ్రీవాల్ ఆందోళన విలక్షణమైనదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనకు బాసటగా నిలిచారు. ఆందోళన బాట పట్టిన ఆప్ నేతలకు ఏమైనా జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. After increase Ketone level 7.4 in routine check up in Anshan, Delhi Dy CM @msisodia is being shifted to LNJP Hospital. Stay tuned. pic.twitter.com/6yW27UnPjp — AAP (@AamAadmiParty) June 18, 2018 -
కేజ్రీకి సీఎంల సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ) తీరుపై నిరసన తెలుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నలుగురు ముఖ్యమంత్రుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆదివారం నాటి నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారమే ఢిల్లీ చేరుకున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి.. ఢిల్లీ సీఎంకు సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంపై సత్వరమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు తమ సమ్మెను విరమించాలని, పేదలకు ఇంటివద్దకే రేషన్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలనే ప్రధాన డిమాండ్లతో కేజ్రీవాల్, తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలోని సందర్శకుల గదిలో గత ఆరు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. నలుగురు ముఖ్యమంత్రులు వరుసగా మమత బెనర్జీ, పినరయి విజయన్, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ ఎల్జీని కోరారు. ఆయన అనుమతించకపోవడంతో.. కేజ్రీవాల్ నివాసంలో ఆయన భార్య సునీతను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించి, కేంద్రప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంతకుముందు ఆ నలుగురు ఏపీ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానిపై మండిపడ్డ సీఎంలు దేశ రాజధాని అయిన ఢిల్లీ సమస్యనే పరిష్కరించలేని వారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్‌లతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వచ్చాను. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. విపక్ష పార్టీలకు కూడా గౌరవం ఇవ్వాలి. ఢిల్లీలో ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వంపై ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. దేశ రాజధానిలో సమస్య ఇలా ఉంటే ఎలా? దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల భవిష్యత్తు ఏమవుతుంది? ఎల్జీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలి. అది స్వపక్షమా? విపక్షమా? అని చూడరాదు. ఒక సీఎంను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడానికి వీలుకానప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘మేం కేజ్రీవాల్‌ను కలవాలనుకున్నాం. ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి కల్పించాలి. అంతిమంగా మా డిమాండ్ ఒక్కటే. ఈ సమస్యను పరిష్కరించాలి. ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకోనివ్వాలి. కేంద్రం–రాష్ట్రం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజలకు సేవ చేయగలం’ అని పేర్కొన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంకు మద్దతు తెలిపేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చాం. ఢిల్లీ దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ‘కేంద్రం వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది ప్రజాస్వామిక దేశం. కేంద్రం సమాఖ్య వ్యవస్థను గౌరవించాలి. కేజ్రీవాల్‌కు మా మద్దతుంటుంది’ అని విజయన్ పేర్కొన్నారు. మండిపడ్డ కేజ్రీవాల్ సీఎంల వినతిని ఎల్జీ తిరస్కరించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ సొంతగా ఈ నిర్ణయం తీసుకుంటారనుకోను. కచ్చితంగా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక సీఎంను.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడాన్ని ప్రధాని అడ్డుకోగలరా? రాజ్ నివాస్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది దేశ ప్రజలది. ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుంది’ అని ట్వీట్ చేశారు. శనివారం ఏం జరిగింది? పశ్చిమబెంగాల్, కేరళ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదట ఆంధ్రా భవన్లో సమావేశమమయ్యారు. కేజ్రీవాల్‌కు మద్దతును సమీకరించేందుకు కావాల్సిన ప్రయత్నాలపై చర్చించారు. అనంతరం రాజ్ నివాస్ (లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం, కార్యాలయం)లో నిరసన చెబుతున్న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎల్జీ బైజాల్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అనుమతివ్వబోనని ఎల్జీ స్పష్టంచేశారు. తర్వాత వీరంతా కేజ్రీవాల్ నివాసంలో కుటుంబ సభ్యులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. అప్పుడు ఏమయ్యారు: బీజేపీ నలుగురు సీఎంలు కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపడంపై బీజేపీ మండిపడింది. ‘కేజ్రీవాల్ నివాసంలో, ఆయన సమక్షంలోనే సీఎస్ అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగింది. అప్పుడు ఈ నలుగురు ఏమయ్యారు? ఆ నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు కూడా అన్షు ప్రకాశ్‌కు సంఘీభావంగా ముందుకు వస్తే వీళ్లేం చేస్తారు?’ అని బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ ప్రశ్నించారు. -
‘ఇది ఏసీ-సోఫా ధర్నా కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కోసమే తాము పోరాటం చేస్తున్నామని, అంతేకాని సొంత ప్రయోజనాల కోసం ధర్నా చేయడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం హరిస్తుందంటూ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వద్ద గత ఐదు రోజులుగా నిరసన వ్యక్తం చేస్నున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు కూడా వారి నిరసన కొనసాగుతోంది. కాగా కొన్ని టీవీ చానెళ్లు తమ పోరాటాన్ని ‘ ఏసీ -సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఈ ధర్నా వల్ల వ్యక్తిగతంగా నాకు ఏం ఉపయోగం లేదు. నా కోసమో, నా పిల్లల కోసమో ధర్నా చేయడం లేదు. ఇది సరదా కోసం చేస్తుంది కాదు. కొన్ని టీవీ చానెళ్లు మా నిరసను ‘ ఏసీ సోఫాకా ధర్నా’ ( ఏసీలో బెడ్‌పై కూర్చొని ధర్నా) అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేసే ధర్నా’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరాహార దీక్ష చేస్తోన్న తమ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బలవంతంగా తరలిస్తే మంచి నీళ్లు కూడా తీసుకోం లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి తమను బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లను కూడా తీసుకోబోమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే వరకూ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘25 మంది ఇక్కడకు వచ్చారు. వారు మమల్ని తరలించడానికే వచ్చారనుకుంటాను. కానీ మా దీక్ష మాత్రం విరమించేది లేదు. ఒక వేళ మమల్ని బలవంతంగా తరలిస్తే పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకో’ అని వీడియోలో తెలిపారు. కాగా బీజేపీ, ఆప్ కలిసి ధర్నా నాటకం ఆడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. పాలనను వదిలేసి ధర్నా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని మండిపడ్డారు. మరో వైపు బీజేపీ కూడా ధర్నాకు దిగింది. రాష్ట్రం ప్రభుత్వం ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, నీటి కొరతను తీర్చాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖను కూడా రాశారు. -
ఎన్నాళ్లీ ఘర్షణ వాతావరణం?
మూడేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నివాసంలో ఆయన, ఆయన సహచర మంత్రులు మానిష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్‌లు మూడు రోజులనుంచి ధర్నా చేస్తున్నారు. వీరిలో సత్యేందర్ జైన్ నిరశన దీక్షలో కూడా ఉన్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సాగిస్తున్న సమ్మెను విరమింపజేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఆప్ నేతలకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు బైజాల్ నివాసం వెలుపల ధర్నా చేస్తు న్నారు. ఈ మొత్తం వివాదంలో దోషమెవరిదన్న సంగతలా ఉంచి ఆ ధర్నా విషయంలో ఏదో ఒకటి చేసి పరిస్థితిని చక్కదిద్దాలన్న స్పృహ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు తోచకపోతే కనీసం కేంద్రమైనా జోక్యం చేసుకుని ఉంటే బాగుండేది. ఢిల్లీకిS దేశం నలుమూలలనుంచి నిత్యం ఎందరో వస్తుంటారు. విదేశీ నేతలు, వాణిజ్య ప్రతినిధులు పర్యటిస్తుం టారు. అలాంటిచోట ఈమాదిరి ఉదంతాలు చోటు చేసుకోవడం వల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వులపాలవడం మినహా మరే ప్రయోజనమూ కలగదు. తనను ముఖ్యమంత్రి బెదిరించారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ విడుదల చేసిన ప్రకటన గమనిస్తే ఇది ఉన్నకొద్దీ మరింత ముదిరేలా కన బడుతోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 70 స్థానాలకూ 67 గెల్చుకుంది. ఇంత మెజారిటీతో ఏర్పడిన సర్కారుకు నిజానికి సమస్యలుండ కూడదు. కానీ అది ఢిల్లీ కావడం, వేరే రాష్ట్రాలతో పోలిస్తే అక్కడి ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలుండటం, దూకుడుగా ఉండే కేజ్రీవాల్ వంటి వ్యక్తి సీఎం స్థానంలో ఉండటం వగైరాలవల్ల్ల సమస్యలు తప్పడం లేదు. వీటి పరిష్కారానికి కేజ్రీవాల్, ఆయన సహచరులు అనుసరిస్తున్న విధానాలు ఆ సమస్యల్ని మరింత జటిలం చేస్తున్నాయి. కొత్త సమస్యలకు దారి తీస్తున్నాయి. ఆప్ ప్రభుత్వం విడుదల చేయదల్చుకున్న ఒక వాణిజ్య ప్రకటన విషయంలో అధికారులు అడ్డు చెప్పడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో మొన్న ఫిబ్రవరిలో కేజ్రీవాల్, ఆయన సహ చరులు సమావేశమైనప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలో తనపై ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారని అన్షు ప్రకాష్ ఆరోపించగా, తనను ఆయన కులం పేరుతో దూషిం చారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రత్యారోపణ చేశారు. ఆ కేసుల దర్యాప్తు కొనసాగుతుండగా, తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. క్షమాపణ చెప్పలేదన్న కార ణంతో వారు సమ్మె చేస్తున్నారన్నది కేజ్రీవాల్ తాజా ఫిర్యాదు. ఈ సమ్మె వెనక కేంద్రమూ, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారని ఆయన ఆరోపణ. విధులు నిర్వర్తిస్తూనే ఉన్నామని ఐఏఎస్‌లు చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక 2014లో అఖిల భారత సర్వీసులకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని సవరించారు. ఈ సర్వీసుల్లోనివారి పని విధానంలో పారదర్శకత, జవాబు దారీతనం ఉండాలని... వారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండా లని... నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఆ నియమావళి నిర్దేశిస్తోంది. వారు క్రమశిక్ష ణతో మెలగాలని చెబుతోంది. సాధారణ సిబ్బంది తరహాలో సమ్మెలు, నిరసనల వంటి చర్యలకు వారు దిగకూడదు. ఆ సర్వీసుల్లో పనిచేసేవారు ఎన్నో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తించాల్సి ఉంటుం దన్నది నిజం. ఇప్పుడు అన్షుప్రకాష్‌పై జరిగిందంటున్న దాడిపై కేసు నమోదైంది. అరెస్టులు జరి గాయి. అటు అన్షుప్రకాష్‌పై ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో సభా హక్కుల కమిటీ విచారణ జరుగుతోంది. వీటిని సవ్యంగా జరగనిస్తే ఎవరి తప్పొప్పులేమిటో తేలుతాయి. కానీ ఈలోగానే ఈ వివాదాన్ని ఇక్కడి వరకూ తీసుకురావడం ఇరుపక్షాల అపరిపక్వతనూ పట్టిచూపు తుంది. తాము సమ్మె చేయడం లేదని చెబుతూనే ముఖ్యమంత్రి, ఆయన సహచరులు నిర్వహించే ‘రొటీన్ సమావేశాలకు’ మాత్రం హాజరుకావడం లేదని ఐఏఎస్‌లు అంగీకరిస్తున్నారు. తమ ఫోన్లకూ, ఎస్సెమ్మెస్‌లకూ ఐఏఎస్‌లు జవాబివ్వడంలేదని మంత్రులు చెబుతుంటే... తాము వారి నుంచి వచ్చే లిఖితపూర్వక ఆదేశాలకు మాత్రమే జవాబిస్తున్నామని అధికారులంటున్నారు. కేజ్రీ వాల్ చెబుతున్నట్టు అధికారులు సమ్మెలో లేకపోవచ్చుగానీ సహాయ నిరాకరణ చేస్తున్నారని దీన్ని బట్టే అర్ధమవుతుంది. సకల అధికారాలూ గల ప్రభుత్వాలున్నచోట లేదా కేంద్రంలోని పాలక పక్షమే రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నచోట ముఖ్యమంత్రితో, మంత్రులతో అధికారులు ఇలా వ్యవహరించగలరా? అటు పాలకపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దౌర్జన్యానికి దిగడమైనా, ఇటు ఐఏఎస్‌లు సహాయ నిరాకరణ కొనసాగిస్తుండటమైనా ఊహకందనిది. ఈ వివాదం నాలుగు నెలలుగా కొనసాగడం అంతకన్నా విడ్డూరమైనది. కేజ్రీవాల్‌కు ముందు పనిచేసిన షీలా దీక్షిత్ కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా ఆమెకు ఇవి తప్పలేదు. కాకపోతే ఆమె లౌక్యంతో వ్యవహరించి వాటి నుంచి బయటపడ్డారు. కేజ్రీవాల్‌కు అలాంటి నైపుణ్యం లేదు. ఏతావాతా ఢిల్లీలో ఇప్పుడు తలెత్తిన ఘర్షణ వాతావరణం పర్యవసానంగా పాలన కుంటుబడింది. విద్యుత్, మంచినీరు సక్రమంగా అందడం లేదని, పారిశుద్ధ్యం దెబ్బతిన్నదని ఫిర్యాదులు ముమ్మరమయ్యాయి. ఢిల్లీ విస్తృతి రీత్యా దానికొక రాష్ట్ర ప్రభుత్వం అవసరమని గుర్తించి, అధికారాలు మాత్రం పరిమితంగా ఇచ్చినప్పుడు పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఉండదు. తమ నిర్వా్యపకత్వం కారణంగా జనం ఇబ్బందులు పడు తున్నారని కేంద్రమూ, లెఫ్టినెంట్ గవర్నర్, అధికారులు, కేజ్రీవాల్ గుర్తించినప్పుడే ఇదంతా ఓ కొలిక్కి వస్తుంది.