న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని గంటసేపు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది.
సోమవారం నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. అయితే పాఠశాలలు తెరవడానికి దశల వారీగా అనుమతిచ్చారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు ఫిబ్రవరి 7 నుంచి పునఃప్రారంభంచనున్నారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఫిబ్రవరి 14 నుంచి వర్చువల్ బోధన కొనసాగించనున్నారు. టీకాలు వేసుకోని ఉపాధ్యాయులకు పాఠశాలలకు అనుమతిని నిరాకరించారు.
చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..)
ఉన్నత విద్యాసంస్థలు ప్రామాణిక నిబంధనలకు లోబడి తెరవబడతాయి. 100 శాతం సామర్థ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతిచ్చారు. జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్లు, బార్లు ప్రారంభానికి అనుమతిచ్చారు. వ్యాపార సంస్థలన్ని యథాప్రకారంగా కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment