
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Delhi Chief Minister Arvind Kejriwal: All cinema halls to remain shut in Delhi till 31st March. Schools and colleges where exams are not being held will also remain closed. #CoronaVirus pic.twitter.com/pbuB1JNFnW
— ANI (@ANI) March 12, 2020
Comments
Please login to add a commentAdd a comment