close
-
క్రెడిట్ కార్డ్ క్లోజింగ్.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?
ఈరోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్ కార్డులు ఉండటం సాధారణమైపోయింది. బ్యాంకులు, ప్రవేటు సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే సమస్య లేదు కానీ, ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్ చేసుకోవడం మంచిది. అయితే వీటిని ఎలా క్లోజ్ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు ఏమిటీ అన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..ఆర్బీఐ నిబంధనలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాలి. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయలేకపోతే, 7 రోజుల వ్యవధి తర్వాత, దానిపై రోజుకు రూ. 500 జరిమానాను కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండకూడదు.క్రెడిట్ కార్డును క్లోజ్ చేయండిలా..» ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని మూసివేసే ముందు దాని బకాయిలన్నింటినీ చెల్లించాలి. బకాయిలు ఎంత చిన్న మొత్తం అయినప్పటికీ, బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేందుకు వీలుండదు.» క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయడం మర్చిపోతుంటారు. కార్డ్‌ను మూసివేసేటప్పుడు రివార్డ్ పాయింట్లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి» కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ వంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటుంటారు. కార్డ్‌ను మూసివేయడానికి ముందు, దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్ధారించుకోండి.» అన్నీ సరిచూసుకున్నాక క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను సంప్రదించాలి. క్రెడిట్ కార్డ్ మూసివేయడానికి గల కారణాన్ని అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ అభ్యర్థన తీసుకుంటారు. ఒకవేళ బ్యాంక్ ఈమెయిల్ పంపమని అడగవచ్చు. కత్తిరించిన కార్డ్ ఫోటోను కూడా ఈమెయిల్ చేయమని అడగవచ్చు.» క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించడం. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయకండి. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళితే, దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. -
ఆ థియేటర్లలో బొమ్మ పడదు
సాక్షి, హైదరాబాద్: థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమష్టి నిర్ణయం కాదని... నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే...శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా.. అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం పదిశాతం ఆదాయం కూడా రావడం లేదని ఎగ్జిబిటర్ చారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మల్టీప్లెక్స్‌లకు పర్సెంటేజీ రూపంలో లాభాలు సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా మల్టీప్లెక్స్‌లకు ఒక విధంగా, సింగిల్ థియేటర్లను మరోలా చూస్తున్నారన్న వాదన కూడా ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా వారంరోజులు నడిస్తే..వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు ఇస్తుంటే.. సింగిల్ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారని, అద్దె చెల్లించడానికి వచ్చే ఆదాయం కంటే తక్కువ కలెక్షన్లు వచి్చనప్పుడు పర్సెంటేజీ లెక్కన తీసుకోమంటున్నారని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుండడంతో.. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోందని, దానికితోడు ఓటీటీల్లోనూ సినిమాలు వస్తుండడంతో.. థియేటర్లకు ఆదరణ తగ్గుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుదర్శన్ థియేటర్ యజమాని గోవింద్‌రాజు తెలిపారు. అది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం.. రెండువారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్‌నారంగ్, కార్యదర్శి కె.అనుపమ్‌రెడ్డి స్పష్టం చేశారు. చిత్రసీమ అపెక్స్ బాడీకి నోటీసు ఇవ్వలేదు..తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయానికి చిత్ర పరిశ్రమ అపెక్స్బాడీలైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలికి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శనలు రద్దు చేయడమైందని గతంలోనూ బోర్డులు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు. -
‘ఆటోమేటిక్ డోర్‌కు అలవాటు పడలేదు’
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది? వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్‌లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్‌లోని నో పార్కింగ్ జోన్లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్‌కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4) — Kosha (@imkosha) April 2, 2024 -
నేటితో ప్రచారం సమాప్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పంపకాలకు తెరలేవనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగబోనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో నేటి సాయంత్రం 4 గంటలతోనే ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం తర్వాత ఇక రాజకీయ నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడరాదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రలోభాలపై దృష్టి పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్ మెనేజ్మెంట్కు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.2వేల నుంచి రూ.3వేలు చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు, మద్యం పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నాటికే ఓటర్లకు డబ్బులు, మద్యం చేరవేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలింగ్‌కు ముందు రోజు రాత్రి మద్యం నిల్వలను బయటకి తీసి ఓటర్లకు పంపిణీ చేయనున్నారని చర్చ జరుగుతోంది. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఎంత మేరకు నియంత్రించ గలుగుతుందో చూడాలి. -
కేదార్నాథ్ ఆలయం మూసివేత
కశ్మీర్: హిమాలయాల్లోని కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసివేయబడ్డాయి. విపరీతమైన చలిలో కూడా కేదార్‌నాథ్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2,500 మందికి పైగా యాత్రికులు హాజరయ్యారని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. ఈ ఆలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. కేదార్నాథ్ సమీప ప్రాంతాలు ఇప్పటికే మంచుతో కప్పబడ్డాయి. కేదార్నాథ్ శివున్ని'పంచముఖి డోలీ' ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి పూజారులు తీసుకువెళ్లారు. శీతాకాలం ముగిసేవరకు అక్కడే పూజలు నిర్వహించనున్నారు. శీతాకాలంలో 19.5 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారని అధికారులు తెలిపారు. ఛార్‌దామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. శీతాకాలం ముగిసేవరకు ఉత్తరకాశీ జిల్లాలోని ఖర్సాలీ గ్రామంలోని ఖుషిమత్‌లో ఆరు నెలల పాటు పూజిస్తారు. భద్రినాథ్ దామ్‌ను కూడా నవంబర్ 18న మూసివేయనున్నారు. శీతాకాలంలో హిమాలయాల్లో తీవ్ర మంచు కారణంగా ఛార్‌దామ్ యాత్రను ప్రతి ఏడాది అక్టోబర్-నవంబర్‌లో నిలిపివేసి మళ్లీ ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూసెంటర్కు ఘన చరిత్ర
నందలూరు (రాజంపేట): బ్రిటీషు రైల్వే పాలకుల నుంచి కొనసాగిన ఎంతో ఘన చరిత్ర కలిగిన నందలూరు రైల్వే రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్ (మిగిలిన ఏకై క డిపార్టుమెంట్) ఎత్తివేతకు డెడ్‌లైన్ విధించారు. ముందుగా నందలూరుకు మోడర్ రన్నింగ్‌రూం కోటి వ్యయంతో మంజూరు చేశారు. దానిని అర్ధాంతరంగా రద్దుచేశారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో రన్నింగ్‌స్టాప్ డిపో ఏర్పాటు అనుకూలం కాదని చెబుతున్నా గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు పట్టించుకోలేదని.. వారి అనాలోచిత నిర్ణయాలతో నందలూరు డిపోకు మంగళం పాడారని రైల్వే కార్మిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. 6న క్రూసెంటర్ క్లోజ్.. వచ్చేనెల 6న రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్‌ను క్లోజ్ చేయనున్నారు. ఈ మేరకు సంబంధితశాఖ అధికారులకు గుంతకల్ నుంచి సంకేతాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే దశలవారీగా లోకోఫైలెట్లు, అసిస్టెంట్ లోకోఫైలెట్లు, గార్డులను గుంతకల్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసుకున్న డిపోకు తరలించారు. ఇక పూర్తి స్థాయిలో నందలూరు క్రూ సెంటర్‌ను మూసేసేందుకు రంగంసిద్ధం చేశారు. – రన్నింగ్‌స్టాప్ సిబ్బందిని ఇప్పటికే గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు ఎర్రగుంట్ల డిపోకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేశారు. వచ్చే నెల 6 నాటికి నందలూరులో క్లోజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి లోకోఫైలెట్లు, ఏఎల్పీ, గూడ్స్గార్డులు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు. దీంతో నాగిరెడ్డిపల్లె అర్బన్ పంచాయతీలో అద్దె ఇళ్లను ఖాళీ చేసుకుంటున్నారు. ఎర్రగుంటల్లో నివాసం ఉండలేమని వారు అంటున్నారు. కాలుష్యం లేని, తాగునీటి వసతి తదితర సమస్యలు లేని సమీప నగరాల్లో ఉండేందుకు అద్దె ఇళ్లను అన్వేషించుకుంటున్నారు. నాలుగేళ్లలో.. ఆది నుంచి ఒక పథకం ప్రకారం నందలూరు రైల్వేకేంద్రాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేసుకుంటూ వస్తోందని రైల్వే వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రూ సెంటర్ క్లోజ్ నేపథ్యంలో ఆ పార్టీకి రాజంపేట, నందలూరు ప్రాంతీయుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. హాల్టింగ్, ఉన్న డిపార్టుమెంట్లను ఎత్తివేయడం తదితర వాటిని రైల్వే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ నందలూరు రైల్వే వైభవం కోల్పోవడానికి నాంది పలికిందని.. ఇప్పుడు బీజేపీ పాలనలో పూర్తిగా గత వైభవంను క్లోజ్ చేశారనే విమర్శలు వెలువడుతున్నాయి. 170 ఏళ్ల తర్వాత నిర్వీర్యం దిశగా నందలూరు.. దక్షిణమధ్య రైల్వే చరిత్రలో గుంతకల్‌కు రైలుమార్గంలేని రోజులలోనే నందలూరుకు రైల్వేమార్గం ఉండేది. సదరన్ రైల్వే(తమిళనాడు)లో కీలక రైల్వే కేంద్రంగా విరాజిల్లింది. వేలాది మంది కార్మికులతో కళకళలాడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు నందలూరులో నివాసాలు ఉండటంతో దేశవ్యాప్త కల్చర్ నందలూరులో కొనసాగింది. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడంలేదు. ఇక గూడ్స్ రైళ్లు కూడా ఆగకుండా వెళ్లిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రన్నింగ్‌రూం, రైల్వే హాస్పిటల్, ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఎలక్ట్రికల్, రైల్వే ఇనిస్టిట్యూట్ తదితర విభాగాలు కూడా క్లోజ్ కానున్నాయి. ఆ విధంగా 170 ఏళ్ల చరిత్ర కలిగిన నందలూరు బీజేపీ పాలనలో గ్రామీణస్టేషన్గా అవతరించనున్నది. రన్నింగ్‌స్టాప్ డిపో క్లోజ్ చేస్తే .. నందలూరు రన్నింగ్‌స్టాప్ క్రూ సెంటర్ వచ్చేనెల 6న క్లోజ్ చేయనున్నారు. కళకళలాడే నందలూరు ఇక కళ తప్పనుంది. 170 ఏళ్ల రైల్వేచరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. గంతకల్ రైల్వేడివిజన్ ఉన్నతాధికారులు నందలూరుపై కత్తికట్టి మరీ నిర్వీర్యం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నేరుగా రైల్వేబోర్డులో కదిలిక తీసుకురావాలి. నందలూరు పూర్వవైభవం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. – జంబు సూర్యనారాయణ, సర్పంచి, నాగిరెడ్డిపల్లె అర్బన్, నందలూరు జిల్లాలో రైల్వే అంటే నందలూరు జిల్లాలో రైల్వే అంటే నందలూరు.. నందలూరు అంటే రైల్వే అన్నట్లుగా కొనసాగింది. జిల్లాలో ఏ రైలు ఎక్కాలన్నా నందలూరుకు వచ్చేవారు. ఇప్పుడు ఏ రైలూ ఆగడం లేదు. ఉన్న విభాగాలను ఎత్తివేసే పరిస్థితులు నెలకొన్నాయి. నేడు నిర్వీర్యదిశగా పయనించడం బాధాకరం. నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వవైభవానికి కలిసికట్టుగా కృషిచేయాలి. – కమాల్‌బాష, రిటైర్డ్ లోకోఫైలెట్, నందలూరు -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత.. స్కూళ్లకు సెలవులు
భోపాల్: భారత్‌లోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 కేసులు నమోదవ్వడంతో కోవిడ్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా లాక్ విధిస్తారని, త్వరలో విద్యాసంస్థలు కూడ బంద్ చేస్తారనే వార్తలు కూడా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐడీ) కొట్టిపారేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నిజంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. అయితే కరోనా కారణంగా కాదు. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలో స్కూళ్లను మూసేశారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు జోరుగా వీస్తున్నాయి. చలి తీవ్రరూపం దాల్చడంతో భోపాల్, ఇండోర్, విదిషా, ఉజ్జయినితో సహా కొన్ని జిల్లాలో 8వ తరగతి వరకు పాఠశాలలు మూసేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఛతర్పూర్ జిల్లాలోని నౌగాంగ్ పట్టణంలో శుక్రవారం ఉదయం అత్యల్పంగా 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారి హెచ్ఎస్ పాండే తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం పూట రోడ్లపై పొగమంచు ఏర్పడటం కారణంగా అసలు ప్రయాణికులే కనిపించడం లేదని పేర్కొన్నారు. విపరీతమైన చలిలో ప్రజలు భోగి మంటల చుట్టూ బారులు తీరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ఐదవ రోజు 7 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా నమోదయ్యాయని ఆయన చెప్పారు గుణ, సత్నా, డాటియా, జబల్పూర్, సాగర్ మరియు ఛతర్పూర్ జిల్లాల్లో దట్టమైన పొగమంచు, చల్లటి వాతావరణం నెలకొంది. గ్వాలియర్, రేవా, ఛతర్పూర్ జిల్లాలోని నౌగావ్ పట్టణంలో ఒక మోస్తరు పొగమంచు కమ్ముకుంది. భోపాల్, ఇండోర్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7.3, 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. -
అక్టోబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్.. ఏకంగా 21 రోజులు
సాక్షి, ముంబై: పండుగల సమీపిస్తున్న నేపథ్యంలో అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవు. రెండు,నాలుగు శనివారాలు, ఆదివారాలు సహా మొత్తం 21 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్రసెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సో కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 2022 నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్ అక్టోబరు 1, 2022- బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక ముగింపు (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 2, 2022- గాంధీ జయంతి, ఆదివారం అక్టోబర్ 3, 2022- దుర్గా పూజ (అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) అక్టోబర్ 4, 2022- దుర్గాపూజ/దసరా/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవ (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్ , తిరువనంతపురం) అక్టోబర్ 5, 2022- దుర్గాపూజ/దసరా/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం అక్టోబర్ 6, 2022- దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 7, 2022- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 8, 2022- రెండో శనివారం. మిలాద్-ఉల్-నబీ (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 9, 2022- ఆదివారం అక్టోబర్ 13, 2022- కర్వా చౌత్ (సిమ్లా) అక్టోబర్ 14, 2022- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ , శ్రీనగర్) అక్టోబర్ 16, 2022- ఆదివారం అక్టోబర్ 18, 2022- కటి బిహు (గౌహతి) అక్టోబర్ 22, 2022- నాల్గవ శనివారం అక్టోబర్ 23, 2022- ఆదివారం అక్టోబర్ 24, 2022- కాళీ పూజ/దీపావళి అక్టోబర్ 25, 2022- లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్) అక్టోబర్ 26, 2022- గోవర్ధన్ పూజ/భాయ్ దూజ్/దీపావళి/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్) అక్టోబర్ 27, 2022- భాయ్ దూజ్/లక్ష్మీ పూజ/దీపావళి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్ మరియు లక్నో) అక్టోబర్ 30, 2022- ఆదివారం అక్టోబర్ 31, 2022- సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్/ఛత్ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ) 21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినా ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెలవు రోజుల్లో కస్టమర్లు బ్యాంక్ నుండి డబ్బును భౌతికంగా డిపాజిట్ చేయలేరు లేదా విత్‌డ్రా చేయలేరు. కానీ ఇతర ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. -
జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా...కానీ ఇక్కడో ట్విస్ట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది...కాదు కాదు..మరో కొత్త స్కీంతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ నేపథ్యంలోనే లాయల్టీ ప్రోగ్రామ్ ‘జొమాటో ప్రో’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద ఇక కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఫ్రీడెలివరీ లాంటి ఫెసిలిటీలు రద్దు అన్నమాట. కస్టమర్ అడిగిప్రశ్నకు సమాధానంగా ట్విటర్లో స్పందించిన జొమాటో ‘జొమాటో ప్రో’ సేవలపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. గడువు ముగిసిన ప్రో మెంబర్‌షిప్‌ను రెన్యువల్ చేయడం కుదరదని జొమాటో తెలిపింది. దీనికి వెనుకకారణాలను మాత్రం జొమాటో స్పష్టం చేయలేదు. జొమాటో ప్రో, ప్లస్ లకు కొత్తగా సభ్యత్వం ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే మెంబర్షిప్ వాలిడిటీ ఉన్నవారు తమ ప్రయోజనాలు యధావిధిగా పొందుతారు. సభ్యత్వ గడువు ముగిసిన తర్వాత, దాన్ని పొడిగించలేరు/ పునరుద్ధరించలేరు అని జొమాటో ప్రతినిధి తెలిపారు. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఇటీవలికాంలో జొమాటో రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. నిన్నగాక మొన్న హృతిక్ రోషన్ యాడ్‌కు సారీ చెప్పిన జొమాటో 'ప్రో' అనే మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయడం విశేషం. ఇప్పటికే ప్రో ప్లస్‌కు గుడ్ బై చెప్పేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా సవరించిన సంగతి తెలిసిందే. (పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్) మరోవైపు తన వినియోగదారుల కోసం "కొత్త ప్రోగ్రామ్"ను లాంచ్ చేయనుందట. అప్డేట్ చేసిన ప్రోగ్రామ్‌తో మెరుగైన సేవలందిస్తామని, మరిన్ని ఆఫర్లు/అప్డేట్స్ కోసం వేచి ఉండాలంటోంది. దీనికోసం కస్టమర్లతో, రెస్టారెంట్ భాగస్వాములతో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంది. కొత్త ప్రోగ్రాం టైమ్‌లైన్‌ను పేర్కొనలేం గానీ రావడం పక్కా అని తెలిపింది. (ఇదీ చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) Hi there, we regret hearing this from you. Please be informed that Zomato Pro Plus is unavailable for renewal as we are working on a new experience for you. We will get back with an update soon. We'd also like to thank you for being a part of the Zomato Pro program.[1/2] — zomato pro (@ZomatoProHelp) August 22, 2022 -
అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..!
Tollywood Movies Shooting Close From August 1: ఆగస్టు 1నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిపివేయాలని సినీ అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రెండు, మూడు నెలలు చిత్రీకరణ బంద్ చేద్దామని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గతకొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కొవిడ్ తర్వాత థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొద్ది రోజులపాటు షూటింగ్‌లు ఆపేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చివరి దశ షూటింగ్ ఉన్న చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణను నిలిపివేయాలని చూస్తున్నారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్‌లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదవండి: బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్ స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ ఈ విషయంపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 1 నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 వారాలకు పొడిగించాలని భావిస్తున్నారట. ఈ విషయాలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ఆయన మాకు గురువులాంటివారు: పూజా హెగ్డే -
హృదయాలను కదిలిస్తున్న జ్యూట్ మిల్లు కార్మికుల ఆవేదన
-
జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత
తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది. సుందరకాండ పారాయణం ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుందరకాండ 58వ సర్గలో గల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. చదవండి: పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
నేటినుంచి 4 రోజులపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్
-
బర్డ్ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు బంద్
భోపాల్: కరోనా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదు. మరో వైపు బర్డ్ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్ మాంద్సౌర్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ‘ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు. దాంతో ఇక్కడ రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు. (చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత? ) 2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళలో కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోగా.. మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. -
అన్నవరంలో దర్శనాలు నిలిపివేత
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు. ఇటీవల దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఈ నెల 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. రెండ్రోజుల్లో మరో 200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల పూజలన్నీ ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈ వో తెలిపారు. చదవండి: ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవ సేవ -
16 ఇంజనీరింగ్ కాలేజీలు మూత!
సాక్షి, హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 16 ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడనున్నాయి. దీంతో వాటిల్లో ఉన్న దాదాపు 4 వేల సీట్లు రద్దు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 201 ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఇవ్వగా, మరో 16 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల్లోని దాదాపు 4 వేల సీట్లలో మొదటి సంవత్సరం ప్రవేశాలు వద్దని జేఎన్టీయూకు దరఖాస్తు చేశాయి. గత నాలుగేళ్లుగా వాటిల్లో పెద్దగా ప్రవేశాలు లేకపోవడం, గతేడాది అన్ని బ్రాంచీల్లో కలిపి 70లోపే ప్రవేశాలు ఉండటం, అంతకుముందు సంవత్సరాల్లోనూ పరిస్థితి అలాగే ఉండటంతో ఆ కాలేజీలన్నీ మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు వరుసగా మూడేళ్లు 30 శాతం కంటే తక్కువ ప్రవేశాలు ఉంటే సగం సీట్లకే అనుమతి ఇస్తామని ఏఐసీటీఈ గతంలోనే స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర యూనివర్సిటీలు మాత్రం 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయ్యే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతించమని తెలిపింది. ఈసారి ఆ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. -
14 వరకు మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 14 వరకు అన్ని మద్యం దుకా ణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లు మూసి ఉంచాలని, ఈ విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మ ద్యం దుకాణాల మూసివేత గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలకు కొం త వెసులుబాటు కల్పిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసే ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బొమ్మని గీస్తే...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులకు కరోనా ప్రభావంతో కాస్త విరామం దొరికింది. దీంతో ఇంటి పట్టునే ఉండి తమకు ఇష్టమైన పని చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇంట్లో ఉండి తన సృజనాత్మకతను బయపెట్టారు. సల్మాన్‌కి బొమ్మలు గీయడం వచ్చు. ఓ బొమ్మ గీస్తూ, ఆ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు సల్మాన్. డ్రాయింగ్ ప్యాడ్, స్కెచ్‌లు, వాటర్ కలర్స్‌తో కాలక్షేపం చేశారు. కేవలం రెండు నిమిషాల్లోనే చక్కని బొమ్మ వేశారట. ఆ బొమ్మలో ఇద్దరు వ్యక్తుల తలలు, ముఖాలు పాక్షికంగా కప్పబడి ఉన్నాయి. వారి కళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్కెచ్ చూసిన ఆయన అభిమానులు ‘వావ్.. భాయ్’ అని అభినందిస్తున్నారు. -
శిరిడి సాయిబాబా ఆలయం మూసివేత
-
కరోనా : యాపిల్ రీటైల్ స్టోర్లు బంద్
కోవిడ్-19 (కరోనా వైరస్) విలయంతో టెక్దిగ్గజం యాపిల్ కూడా కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. మార్చి 27 వరకు తన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలన్నీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఒక ప్రకటించింది.అయితే కరోనా వైరస్ మొదలైన చైనాలో పరిస్థితి కాస్త కుదుటు పడ్డంతో, అక్కడ యాపిల్‌స్టోర్‌ను తిరిగి ప్రారంభించింది. అయితే ప్రపంచదేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తుండటం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా స్టోర్లను తాత్కాలిగా మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. యాపిల్ కార్యాలయాలు, ఉద్యోగుల్లో, కరోనా వ్యాప్తిని నివారించడానికి చేయగలిగినదంతా చేయాలి. ఈ నేపథ్యంలోనే మార్చి 27వరకు గ్రేటర్ చైనా వెలుపల అన్ని దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్టు యాపిల్ సీఈవో ట్విటర్లో వెల్లడించారు. అయితే యాపిల్ అధికారిక వెబ్సైట్ (www.apple.com) యాప్ స్టోర్ ద్వారా ఆన్లైన్లో వినియోగదారులకు అందుబాటులోవుంది. ఏవైనా సందేహాలుంటే వినియోగదారులు ఆన్లైన్ ఆపిల్ కస్టమర్ కేర్‌ను సందర్శించవచ్చు. అంతేకాదు కోవిడ్-19కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు ఒకవిభాగాన్ని కూడా ప్రారంభించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఆపిల్ తన డెవలపర్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆన్లైన్ ఫార్మాట్‌ను ఆశ్రయిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2020 ఆన్లైన్ కీనోట్, సెషన్లు ఆన్లైన్లోనే వుంటాయని గ్లోబల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫిల్ షిల్లర్ తెలిపారు. రానున్న వారాల్లో మరింత సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 1,45,000 మందికి పైగా సోకింది. 5400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో ఈ కోరన్ కోరలకు చిక్కిన వారి సంఖ్య శనివారం నాటికి 84కు చేరింది. జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించగా, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు అన్ని విద్యాలయాలు, సినిమా థియేటర్లను, షాపింగ్‌మాల్స్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటిచాయి. In our workplaces and communities, we must do all we can to prevent the spread of COVID-19. Apple will be temporarily closing all stores outside of Greater China until March 27 and committing $15M to help with worldwide recovery. https://t.co/ArdMA43cFJ — Tim Cook (@tim_cook) March 14, 2020 -
కరోనా : స్కూళ్లు, కాలేజీలు, సినిమాలు అన్నీ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో భాగంగా తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. Delhi Chief Minister Arvind Kejriwal: All cinema halls to remain shut in Delhi till 31st March. Schools and colleges where exams are not being held will also remain closed. #CoronaVirus pic.twitter.com/pbuB1JNFnW — ANI (@ANI) March 12, 2020 -
ఇద్దరికి వైరస్, ఆఫీసులు మూసివేసిన టెక్ సంస్థ
సాక్షి, బెంగళూరు: ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలుకొనసాగుతుండగానే బెంగళూరు నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్వేర్ గ్రూప్ కుచెందిన భారత సంస్థ ‘సాప్’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే సదుపాయాన్ని కల్పించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, హెచ్1ఎన్1 లక్షణాలలో జ్వరం, చలి, గొంతు నొప్పిలాంటివి సాధారణ జలుబు లక్షణాలుగా పైకి కనిపించినప్పటికీ, ఈ వైరల్ న్యుమోనియా ఆరోగ్యకరమైన యువకులను కబళించే తీవ్రత ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.బెంగళూరులో సాప్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్1ఎన్1 వైరస్ ఫలితం పాజిటివ్ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంతవరకు తమ ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేయాలని కోరింది. -
ఐఆర్సీటీసీ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మూతపడనుంది. శనివారం, ఆదివారాల్లో కొంత సమయం పాటు ఐఆర్సీటీసీ సేవలను నిలిపివేయనున్నారు. మెయింటినెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వినియోగదారులకు కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 18, 2019 శనివారం, మే 19 ఆదివారం మధ్య కొంత సమయం పాటు సేవలు నిలిపివేస్తారు. ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ అందించిన సమాచారం ప్రకారం తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దేశీయంగా శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 2.30 గంటల వరకు, ఢిల్లీలో 18వ తేదీ అర్థరాత్రి 23.45 నుంచి 19వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుంది. మరింత సమాచారం కోసం : కస్టమర్ కేర్ నంబర్లు: 0755-6610661, 0755-4090600, 0755-3934141 మెయిల్ ఐడీ: eticket@irctc.co.in సంప్రదింవచ్చని ఇ-టికెట్ బుకింగ్ వెబ్సైట్ ప్రకటించింది. కాగా రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ మే 16, గురువారం ఉదయం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ పని చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. మెయింటెనెన్స్ కారణంగా ఇప్పుడు ఈ-టికెటింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. దయచేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి అన్న మెసేజ్‌తో దర్శనమిచ్చింది. దీంతో సైట్ మెయింటెనెన్స్ విషయాన్ని ముందుగా తెలియజేయ లేదంటూ పలువురు యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
27న శ్రీశైలం ఆలయం మూసివేత
శ్రీశైలం: చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని ఈ నెల 27న మధ్యాహ్నం 2 నుంచి మరుసటిరోజు వేకువజామున 4.30 వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీరామచం ద్రమూర్తి సోమవారం తెలిపారు. 27న తెల్లవారు జామున 3.30 నుంచి మంగళ వాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతి ఉంటాయన్నారు. 5.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. -
రాత్రి 11 దాటితే నో ఏటీఎం!
సాక్షి, హైదరాబాద్: ఇకపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఐదు కంటే తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎం కేంద్రాలు మూతపడనున్నాయి. ఏటీఎంల నిర్వహణ భారం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చాయి. నిర్ణీత లావాదేవీల కంటే తక్కువ ఉన్న ఏటీఎం కేంద్రాలను రాత్రి వేళల్లో డీ–లింక్ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడించాయి. నిర్వహణ భారంతో పాటు స్కిమ్మింగ్ వంటి సైబర్ నేరాలు తగ్గించడానికి డీ–లింక్ చేయడమే కాక ఆయా కేంద్రాలను నిర్ణీత సమయంలో పూర్తిగా మూసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశాన్ని ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు. నిర్వహణ కోణంలో చూసిన బ్యాంకర్లు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ఏటీఎంలు కేంద్రంగా జరిగే సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల్ని పోలీసులు బ్యాంకర్లకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏటీఎం కేంద్రాల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలు ఉండే ఏటీఎంలను రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు డీ–లింక్ చేసి ఉంచాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకర్లు పోలీసులకు తెలిపారు. ఇలాంటి ఏటీఎంల వల్ల ఏసీలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని వారు పేర్కొన్నారు. డీ–లింక్ చేయడం ద్వారా ఏటీఎం మిషన్ పని చేయకుండా పోతుంది. అప్పుడు ఏసీలను ఆఫ్ చేసినా మిషన్‌కు ఎలాంటి నష్టం ఉండదు. నిర్ణీత సమయం తర్వాత మళ్లీ సదరు ఏటీఎంను సర్వర్‌తో లింక్ చేయడం ద్వారా యథావిధిగా పని చేసేలా చేయవచ్చు. మూసేయాలని సూచించిన పోలీసులు.. బ్యాంకర్ల ప్రతిపాదనకు సైబరాబాద్ పోలీసులు కీలక సవరణలు సూచించారు. నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడానికి ఏటీఎంలను డీ–లింక్ చేయడమే కాక పూర్తిగా మూసేయాలని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ఐదు కంటే తక్కువ లావాదేవీలున్న ఏటీఎంల్లో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. డెబిట్/క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసే ముఠాలు ఇలాంటి వాటినే ఎంచుకుని.. రాత్రి వేళల్లో ఏటీఎంలకు స్కిమ్మర్లు, చిన్న కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్డుకు సంబంధించిన సమాచారం, పిన్ నంబర్లు తస్కరిస్తాయి. వీటి ఆధారంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా చేస్తుంటాయి. మిషన్‌ను డీ–లింక్ చేసినప్పటికీ వినియోగదారుడు వచ్చి అందులో కార్డు పెట్టే, పిన్ నంబర్ ఎంటర్ చేసే అవకాశం ఉందని పోలీసులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లారు. అలా చేస్తే స్కిమ్మింగ్ పూర్తయిపోతుందని, అలా కాకుండా ఉండాలంటే ఆయా ఏటీఎంల షట్టర్లు దింపడం ద్వారా పూర్తిగా మూసేయాలని సూచించారు. ఏటీఎం కేంద్రాలను నిర్ణీత సమయాల్లో మూసి ఉంచితే ఇలాంటి నేరాలకూ ఆస్కారం లేకుండా చేయవచ్చని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రతినిధులు విషయాన్ని తమ ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకువెళ్తామని, అనుమతి లభించిన వెంటనే అమలులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. -
ఆ యాప్స్‌ను మూసేస్తున్న ఫేస్బుక్
న్యూఢిల్లీ : సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ మూడు యాప్స్‌ను మూసేస్తోంది. హలో, మూవ్స్, టీబీహెచ్ అనే యాప్స్‌ను మూసేస్తున్నట్టు ఫేస్బుక్ ప్రకటించింది. తక్కువ వాడకం కారణంతో ఈ యాప్స్‌ను తీసేస్తున్నామని కంపెనీ తెలిపింది. బ్రెజిల్, అమెరికా, నైజిరియాలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 2015లో హలో యాప్‌ను ఫేస్బుక్ లాంచ్చేసింది. ఇది యూజర్ల ఫేస్బుక్ సమాచారాన్ని, ఫోన్లోని కాంటాక్ట్ సమాచారంతో కలుపుతూ ఉంటుంది. మరికొన్ని వారాల్లోనే కంపెనీ హలో యాప్‌ను తీసేయబోతుంది. ఇక రెండో యాప్ మూవ్స్. ఈ ఫిట్నెస్ యాప్‌ను 2014లో ఫేస్బుక్ కొనుగోలు చేసింది. యూజర్ల రోజువారీ కార్యకలాపాలు వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వంటి వాటిని రికార్డు చేయడం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. జూలై 31 నుంచి ఈ యాప్‌ను ఫేస్బుక్ మూసేస్తుంది. ఇక చివరి యాప్ టీబీహెచ్. గతేడాదే దీన్ని ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అమెరికాలోని హైస్కూల్ విద్యార్థులకు ఈ సోషల్ మీడియా యాప్ సుపరిచితమే. ప్రస్తుతం తొలగిస్తున్న ఈ యాప్స్‌లోని యూజర్ల డేటాను 90 రోజుల్లో తొలగిస్తామని కంపెనీ చెప్పింది. తరుచూ తమ యాప్స్‌పై సమీక్ష చేపడుతూ ఉంటామని, ఈ సమీక్షలో తక్కువగా వాడే యాప్స్‌ను తొలగించేలా నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కొంతమంది యూజర్లు ఇంకా ఈ యాప్స్‌ను వాడుతున్నారని, వారికి ఇది నిరాశ కలిగించే అంశమని, మీ సపోర్టు తమకు అందించినందుకు కృతజ్ఞతలని కంపెనీ తెలిపింది. తాజాగా ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్ స్నూజ్ను పరిశీస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్ ద్వారా కొన్ని పోస్టులను 30 రోజుల పాటు మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ టెస్టింగ్‌ను ఫేస్బుక్, టెక్‌క్రంచ్‌కు ధృవీకరించింది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను ఫేస్బుక్ ఆవిష్కరించనుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
31న కనకదుర్గ ఆలయం మూసివేత
సాక్షి, విజయవాడ: ఈనెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. ఉదయం 10 గంటలకు మహానివేదన అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, ప్రధానాలయ, ఉపాలయమూర్తులకు స్నపనాది కార్యక్రమమాల నిర్వహణ చేపడతారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8-30 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 31న సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. -
31న శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: ఈనెల 31వ తేదీన తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఉదయం నుంచి రాత్రివరకు మూసివేయనున్నారు. ఆరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసి ఉంచనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. -
శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్‌ను అధికారులు మూసివేశారు. రేపు జరగాల్సిన ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ ఎదుట మను స్మృతి ప్రతులను పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా హాస్టల్‌కు సెలవు ప్రకటించామని, వర్సిటీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని రిజిస్ట్రార్ తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ దళిత వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
స్టాక్‌మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఈక్విటీ మార్కెట్లకు శని, ఆదివారాలు సెలవు దినాలు. అలాగే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ఉండదు. తిరిగి మంగళవారం(3న) యథాప్రకారం ఉదయం 9.15కు మార్కెట్లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ ఎఫ్ అండ్ వో సిరీస్ భారీగా నష్టపోగా , ముగింపు సందర్భంగా గురువారం చివర్లో మార్కెట్లు కోలుకున్నాయి. అయితే అక్టోబర్ సిరీస్ ప్రారంభం రోజు (శుక్రవారం)న మార్కెట్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లలో ఏకంగా రూ. 15 లక్షల కోట్ల టర్నోవర్ నమోదుకాగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గురువారం నగదు విభాగంలో రూ. 5,328 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అలాగే దేశీ ఫండ్స్ (డీఐఐలు) గురువారం ఏకంగా రూ. 5,196 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సాక్షి వెబ్ పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు! -
పర్మిషన్ లేని పాఠశాల మూసివేత
పెద్దకడబూరు : మండల పరిధిలోని కంబలదిన్నెలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఎన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను విద్యాశాఖాధికారులు సోమవారం మూసివేశారు. నెలరోజులుగా అనుమతి లేకుండా స్కూలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం ధర్నా చేయడంతో మేలుకున్న ఎంఈఓ ఖాజామోహిద్దీన్ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డుల కోసం ఆరా తీయగా సిబ్బంది తెలియదని చెప్పడంతో మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులను బయటకు పంపి తాళం వేశారు. ఈ కారణంగా స్కూల్లో చేరిన 124 మంది విద్యార్థులు అయోమయంలో పడ్డారు. -
టూ వీలర్స్ అమ్మకాలపై ఇక్రా అంచనాలు
టూవీలర్ అమ్మకాలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం బాగానే ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ నెల వరకూ రెండంకెల స్థాయిలో పరుగుపెట్టిన టూవీలర్స్ రంగం పెద్ద నోట్ల రద్దుతో కాస్త నెమ్మదించిందని రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. అయితే ఈ ఏడాది ద్విచక్ర వాహన అమ్మకాలు 7-8 శాతం వృద్ధి కనబరచనున్నట్లు నివేదించింది. వెరసి వాహన అమ్మకాలు ఏడాది మొత్తంగా 7-8 శాతం ప్రగతిని సాధించగలవని నివేదిక అభిప్రాయపడింది. డీమానిటైజేషన్ కారణంగా ద్రవ్య సంక్షోభం కారణంగా అమ్మకాలు నవంబర్ ,జనవరి మధ్య 11.3 శాతం పడిపోయాయని తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న బీఎస్-4 ప్రమాణాల మార్పిడి వంటి అంశాల కారణంగా నవంబర్ నుంచీ జనవరి వరకూ వాహన విక్రయాలు 11 శాతం చొప్పున మందగించినట్లు నివేదిక తెలియజేసింది. నోట్ బ్యాన్ సమయంలో మోపెడ్ల అమ్మకాలు డబుల్ డిజిట్ నమోదు చేశాయని, స్కూటర్ల అమ్మకాల వృద్ది 12.5 శాతంగా ఉన్నట్టు, సెప్టెంబర్ మాసం నాటి 24.7 శాతంతో పోలిస్తే చాలా తక్కువ అని అభిప్రాయపడింది. మొత్తంమీద, పరిశ్రమ వృద్ధి రేటు గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలతో మెరుగ్గానే ఉండనున్నట్టు అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల(ఏప్రిల్-జనవరి)లో ద్విచక్ర వాహన అమ్మకాలు 8 శాతంపైగా వృద్ధి సాధించాయి. గత నాలుగేళ్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, మార్చిలలోనూ 7 శాతం స్థాయిలో అమ్మకాలు నమోదుకాగలవని, 2018 లో మంచి అమ్మకాలు నమోదు కానున్నాయని ఇక్రా అంచనా వేస్తోంది. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికాలో విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని తెలిపింది. తదుపరి రెండవ ఆర్థభాగంలో ప్రధానమైన మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాల నేపథ్యంలో ఎగుమతులు క్రమంగా వచ్చే మూడేళ్లలో 8-10 శాతం వృద్ధి ఉండనుందని నివేదించింది. 2018లో తిరిగి 8-10 శాతం స్థాయిలో వృద్ధి నమోదుకావచ్చని ఐసిఆర్ఎ తన నివేదికలో పేర్కొంది. 2018లో స్కూటర్ల అమ్మకాలు మోటార్ సైకిళ్లను మించిపోగలవని ఇక్రా అభిప్రాయపడింది. -
నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్
-
నల్లకుబేరులకు మరో గోల్డెన్ ఛాన్స్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేత దారులకు కేంద్రం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. కొత్త బ్లాక్ మనీ డిస్ క్లోజర్ పథకాన్ని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా శనివారం ప్రకటించారు. ఇది రేపటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆదాయ వెల్లడికి గాను ఇచ్చిన ఈ అవకాశం మార్చి 31, 2017తో ముగిస్తుందని వెల్లడించారు. 50 శాతం పన్ను, జరిమానాతో ఈ గడువు లోపల ఆదాయాలను వెల్లడించాలని ఆయన సూచించారు. ఇలా వెల్లడించిన ఆదాయ సమాచారాన్ని బహిర్గతం చేయమని అదియా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పన్నుల చట్టం 2016 లోని రెండవ సవరణకు దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించిందని పేర్కొన్నారు. నల్లదనం వివరాలను ప్రజలు కూడా అందించవచ్చని తెలిపారు. దీనికోసం ఒక స్పెషల్ ఈ మెయిల్ ను కూడా క్రియేట్ చేసినట్టే కూడా ఆయన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం చేపట్టిన నల్లధనంపై పోరులో ప్రజలు సమాచారం అందించాలనుకున్నవారు blackmoneyinfo@incometax.gov.in అనే మెయిల్ ఐడీకి వివరాలు అందించాలని కోరారు. దీని ద్వారా ప్రభుత్వానికి ప్రజలు నల్లధనం సమాచారం అందించవచ్చని తెలిపారు. -
చెన్నైఎయిర్ పోర్ట్ మూసివేత
-
స్పల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు వారాంతంలో స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 53 పాయింట్లు క్షీణించి 28,077 వద్ద నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 8,693 వద్ద స్థిరపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ లాభాల మద్దుతుతో నష్టాలనుంచి కోలుకున్నాయి. అలాగే ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభపడ్డాయి. మెటల్స్ సూచీ నీరసించింది. సెప్టెంబర్ క్వార్టర్ లో లాభాలను ఆర్జింఇన రిలయన్స్ ఇండస్ట్రీస్ , 2.5శాతం నష్టాలతో ముగిసింది. యాక్సిస్, హెచ్ డీ ఎఫ్ సీ తీవ్ర అమ్మకాల ఒత్తడిని ఎదుర్కొన్నాయి. హిందాల్కో, అంబుజా, ఏసీసీ, సిప్లా, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, ఇన్ఫ్రాటెల్ నష్టపోగా, ఐడియా, టెక్‌మహీంద్రా, టాటా పవర్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లాభపడ్డాయి. అటు డాలర్ బలహీనత నేపథ్యంలో రూపాయి ఉదయం నష్టాలనుంచి కొద్దిగా కోలుకుంది. ప్రస్తుతతం 0.05 పైసల నష్టంతో 66.86 వద్ద ఉంది. కాగా పసిడి మరింత దిగి వస్తున్నట్టు కనిపిస్తోంది. పది గ్రా పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో 33 రూపాయలు క్షీణించి రూ. 29,877 వద్ద ఉంది. -
లాభాలను కుదించుకున్నమార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాలతో ఆకట్టుకుని 200 పాయింట్లకు పైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్ సెన్సెక్స్ 145 పాయింట్ల లాభాలకు, నిఫ్టీ 40 పాయింట్ల లాభాలకు సరిపెట్టుకుంది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ ఎంసీజీ , ఫార్మా సెక్టార్ ల బలహీనత మార్కెట్ ను ప్రభావితం చేసింది. మరోవైపు భారీ ఎత్తున ఏటీఎం కార్డుల సమాచారం లీక్ అయిన వివాదం కొనసాగుతున్నప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్ లాభాలను ఆర్జించింది. అటు ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ క్యూ2 మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, ఎస్ బీఐ, ఎల్ అండ్ టీ, టాప్ గెయినర్స్ గా , లుపిన్, హిందుస్తాన్ యూనీ లీ వర్, టాటా మోటార్స్, సన్ ఫార్మ, టాఇన్ఫోసిస్, ఐటీసీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. అటు రూపాయి 10 పైసల నష్టంతో66.78 వద్ద వుంది. పసిడి ఎంసీఎక్స్ మార్కెట్ లో 57 రూపాయల లాభంతో రూ.29,958 వద్ద ఉంది. -
ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌ల మూసివేత!
గుంటూరు: ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరోసారి పెట్రోల్ బంక్‌ల బంద్ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. శనివారం గుంటూరులో సమావేశమైన అసోసియేషన్ సభ్యులు.. అక్టోబర్ 19, 26 తేదీల్లో సాయంత్రంపూట, నవంబర్ 6న పూర్తిగా పెట్రోల్ బంక్‌లు మూసివేయాలని నిర్ణయించారు. అలాగే.. నెలలో ప్రతి ఆదివారంతో పాటు 2, 4వ శనివారాలు కూడా పెట్రోల్ బంకులు మూసేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. -
సహ‘కారం’!
– ఆదరణ లేని కో–ఆపరేటివ్ సొసైటీలు – వెలవెలబోతున్న చక్కెర ఫ్యాక్టరీలు – తెరుచుకోని విజయా డెయిరీ – దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు, రైతులు – మూతపడ్డ వాటిని తెరిపించాలని వేడుకోలు ఉపకారికి నుపకారం నెపమెన్నకు చేయువాడే నేర్పరి సుమతీ.. అన్నాడో కవి. కానీ అది నాటి మాట. ఇప్పుడు.. కాలం మారింది. ఉపకారికి అపకారం వెనువెంటనే చేయువాడే సర్వోత్తముడు సుమతీ.. అంటున్నారీ పాలకులు.. పదిమందికీ అన్నంపెట్టి.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సహకార సంస్థలను పూర్తిగా గాలికొదిలేశారు. చిల్లిగవ్వ విదల్చకుండా నీరుగార్చేశారు. ఫలితంగా అనేక సంస్థలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడ్డ ఉద్యోగులు, రైతులు రోడ్డున పడి విలవిల్లాడుతున్నారు. వీరి గోడు పట్టించుకునే నాథుడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, చిత్తూరు : జిల్లాలో సహకార సంస్థలు వెలవెలబోతున్నాయి. చిత్తూరులోని విజయా డెయిరీ, చక్కెర కర్మాగారం మూతపడింది. రేణిగుంటలోని షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ఆగిపోయింది. వీటిపై ఆధారపడ్డ వారు ఏ ఆధారం లేక పస్తులతో బక్కచిక్కి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విజయా..లే‘దయ’ దేశంలో రెండో అతిపెద్ద సహకార సంస్థ విజయా డెయిరీ. రోజూ 20 లక్షల లీటర్ల పాలసేకరణ సామర్థ్యం దీని సొంతం. 1960ల్లో దక్షిణ భారత దేశంలోనే ఏకైక చిల్లింగ్ యూనిట్. ఈ డెయిరీ నుంచే టీటీడీకి పెద్ద ఎత్తున నెయ్యి సరఫరా అయ్యేది. పాల మిగులు ఎక్కువగా ఉందనే ఒకేఒక్క కారణంతో వారంలో ఒకరోజు రైతుల దగ్గర నుంచి పాల సేకరణ ఆపేయాలని సంస్థ నిర్ణయించింది. ఆ నిర్ణయం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్భలం ఉందనే ఆరోపణలు ఇప్పటికీ విన్పిస్తున్నాయి. మొదట్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోయడానికి రైతులు ఇష్టపడేవారు కాదు. వారంలో ఒక రోజు విజయా డెయిరీ సెలవు ప్రకటించడం, డబ్బులు కూడా సరిగా చెల్లించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వాటి వైపు మొగ్గు చూపారు. అప్పటి నుంచి ఆర్థికంగా డెయిరీ పతనావస్థకు చేరింది. ఈ నిర్ణయం డెయిరీని మూతవేత దిశగా నడిపించింది. 2001 ఆగస్టులో ఈ డెయిరీ మూతపడింది. ఈ సంస్థపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులు ఇబ్బందులకు గురయ్యారు. డెయిరీలో పనిచేసే 500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. తన సొంత డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు విజయ డెయిరీపై దెబ్బ కొట్టారని జిల్లా ప్రజలు బహిరంగంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ప్రైవేటు డైయిరీలే ఆధారమయ్యాయి. వారిచ్చే అరకొర ధరతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. చిత్తూరులోని విజయా డైయిరీ మూతపడిన తర్వాత దాని ఆలనాపాలన అధికారులు పట్టించుకోకవపోవడంతో విలువైన యంత్ర సామగ్రి దొంగలపాలవుతోంది. కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఉన్న ఈ కర్మాగారానికి చెందిన 40 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. చరిత్రలో కలిసిపోయేందుకు ఈ డైయిరీ సిద్ధంగా ఉంది. చక్కెర ఫ్యాక్టరీలదీ అదే పరిస్థితి ప్రైవేటు ఆధీనంలో ఉన్న జిల్లాలోని ఇతర చక్కెర కర్మాగారాలు లాభాల బాటలో పయనిస్తోంటే.. రేణిగుంటలోని వేంకటేశ్వర, చిత్తూరులోని సహకార చక్కెర ఫ్యాక్టరీలు కాలక్రమంలో కొత్త యంత్రాలు అమర్చుకోలేక, ప్రభుత్వం సహాయ నిరాకరణతో చతికిలపడ్డాయి. ఎలాంటి సాంకేతిక సమస్యా లేకపోయినా క్రషింగ్‌ను నిలిపేయడంతో నష్టాలు చుట్టుముట్టాయి. రైతుల బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. చిత్తూరు ఫ్యాక్టరీలో అయితే 32 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోయారు. తినడానికి తిండి కూడా లేని దయనీయ స్థితిలో కొంత మంది ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.20 కోట్ల మేర ఉన్నాయి. ఇప్పుడైనా మేలుకోవాలి.. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని రైతులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విజయా డెయిరీతోపాటు మిగిలిన చెక్కర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని వారు కోరుతున్నారు. ఫ్యాక్టరీ ఆధునికీకరణకు రూ.50 కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఇది చాలా చిన్న మొత్తం అని వారు పేర్కొంటున్నారు. 20సీటీఆర్51.. -
ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
పెనుబల్లి : స్థానిక సప్తపది ఫంక్షన్హాల్లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెనుబల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో కరాటేను ప్రజల్లోకి తీసుకెళ్లిన కరాటే మాస్టర్ శ్రీకాంత్‌ను ఆభినందించారు. మహిళల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం తుదిపోరును తిలకించారు. అంతకుముందు ఈ పోటీలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్లు, స్థానిక నాయకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, చీకటి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు, ముక్కర భూపాల్‌రెడ్డి, కీసర శ్రీనివాస రెడ్డి, పిల్లి నవజీవన్, అలుగోజు చినస్వామి పాల్గొన్నారు. -
వేడుకగా ధ్వజారోహణం
కాణిపాకం(ఐరాల) : స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ధ్వజారోహణంతో వైభవంగా ముగిశాయి. వినాయక చవితి రోజున ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు నేత్రపర్వంగా జరిగాయి. భాగంగా బుధ వారం సాయంత్రం ఆలయంలోని బంగారు ధ్వజ స్తంభం వద్ద వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై నుంచి మూషిక చిత్రపటాన్ని అవరోహణ చేశారు. ధ్వజ స్తంభానికి పవిత్రజలాలతో అభిషేకించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు,ఏసి వెంకటేషు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు మల్లి కార్జున, చిట్టిబాబు,ఉత్సవ కమిటీ సభ్యలు పాల్గొన్నారు. నేత్రపర్వం.. త్రశూలస్నానం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఉదయం ఆలయ పవిత్ర పుష్కరణిలో త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. తొలుత సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని పురవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణì కి వద్దకు వేంచేపు చేశారు. పుష్కరిణి ఒడ్డున త్రిశూలాన్ని ఉంచి సంప్రదాయబద్ధంగా అభిషేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 108 కలశాలకు పూజలు చేసి, పుష్కరిణిలో ఆ కలశాలలోని తీర్థాలను కలిపారు. ఆతర్వాత త్రిశూలానికి అవభతస్నానం చేయించారు. ఈ సందర్భంగా అర్చకులు, సిబ్బంది, భక్తులు కోనేరులో పవిత్రస్నానాలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత ఆలయంలోకి వేంచేపు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, అధికారులు రవీంద్ర బాబు, చిట్టిబాబు, మల్లికార్జున పాల్గొన్నారు. -
బ్యాంకులు, ఫ్యాక్టరీలు బంద్..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు శుక్రవారం రోజు మూతపడనున్నాయి. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్నాయి. ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ వంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్ల తెరుస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం ఈ సమ్మె చేయనున్నాయి. . మరోవైపు ట్రేడ్ యూనియన్ల నిర్వహించబోయే ఈ బంద్‌ను ఎలాగైనా ఆపాలని కేంద్రప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయంపై ప్రధాని మోదీ నేడు ఎమర్జెన్సీ మీటింగ్‌ను నిర్వహించారు. ప్రధాని నిర్వహించబోయే ఈ మీటింగ్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కార్మికశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం విఫలమవ్వడంతో ప్రధాని మోదీ ఈ మీటింగ్ నిర్వహించారు. మరో 48 గంటల్లో కార్మిక సంఘాలను సంప్రదించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల వివిధ యూనియన్లు కూడా శుక్రవారం జరగబోయే బంద్‌లో పాల్గొనబోతుండటంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తీవ్ర అంతరాయం కలుగనుంది. అయితే ట్రేడ్ యూనియన్లు నిర్వహించబోయే ఈ బంద్‌లో రైల్వే ఉద్యోగులు పాల్గొనే సంకేతాలు లేకపోవడంతో, రైళ్లు యథాతథంగా తిరగనున్నట్టు సమాచారం.ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ సమ్మెపై తీవ్ర ఇరకాటంలో పడింది. సమ్మెకు మద్దతిస్తే ప్రభుత్వ పక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు విమర్శలు వస్తాయని ఆలోచిస్తోంది. -
పుష్కర సంబరం..
ముగిసిన అంత్యపుష్కరాలు చివరిరోజు భక్తుల తాకిడి ధర్మపురి 40వేలు, కాళేశ్వరంలో 10వేల మంది పుష్కరస్నానం ధర్మపురి/కాళేశ్వరం/ ౖయెటింక్లయిన్‌కాలనీ: 12 రోజులపాటు జరిగిన అత్యపుష్కరాలు వైభంగా ముగిశాయి. కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల, మంథని, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. చివరిరోజు మహాహారతి వైభంగా నిర్వహించి పుష్కరుడికి వీడ్కోలు పలికారు. ధర్మపురి గోదావరిలో గురువారం 40వేలమంది పుణ్యస్నానం చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ఐదువేల మందికి అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఆంధ్రాబ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ శివానందశేషగిరి రావు, సీసీఎల్ఏ కార్యదర్శి కె. కష్ణ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో నిర్వహించిన ప్రత్యేక గంగాహారతి కార్యక్రమానికి చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో అంత్యపుష్కరాలు వైభవంగా జరిగాయి. 12 రోజులపాటు వివిధ ప్రాంతాలనుంచి లక్షా 50వేలమంది పుష్కర స్నానాలు ఆచరించారు. చివరి రోజు 10వేలకు పైగా స్నానాలు చేశారు. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక శ్రావణమాసపు పూజలు నిర్వహించారు. మహిళలు గోదావరిమాతకు మహిళలు దీపారాధన, లక్షవత్తులు వెలిగించారు. శుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. చివరిరోజు పూజల్లో మంథని ఆర్డీవో బాల శ్రీనివాస్, సర్పంచ్ మాధవి, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనభాను, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు పాల్గొన్నారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహించారు. 12రోజులకు కాళేశ్వరం దేవస్థానానికి రూ.11.20లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో డి.హరిప్రకాశ్‌రావు తెలిపారు. కమాన్‌పూర్ మండలం సుందిళ్ల గ్రామ పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ పెరిగింది. -
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
విశాఖ,కల్చరల్ పౌరాణిక జాన పద రంగస్థలానికి వన్నెతెచ్చి ప్రేక్షకుల్ని çమధురానుభూతి కల్గించాయి. మూడు రోజుల నుంచి రంగస్థాయి నాటక ఉత్సవాల్లో భాగంగా సురభి నాటకం ప్రదర్శనలు కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ముగిశాయి. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు, నగర ప్రేక్షకుల కోరిక మేరకు మాయాబజారు నాటకాన్ని శుక్రవారం ఒకే రోజు రెండు ప్రదర్శనలు చేశారు. విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఈ నాటకం నగరంలో మొత్తం మూడు ప్రదర్శనలు ఇచ్చారు. తొలిరోజు ప్రారంభంలోను, మళ్లీ ముగింపు రోజైన శుక్రవారం రెండు ప్రదర్శినలిచ్చి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ముగింపు కార్యక్రమంలో మాయాబజారు తొలు ప్రదర్శనను సినీరచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు జ్యోతిప్రజ్వలన చేశారు. మలి ప్రదర్శనను వాణిజ్య పన్నుల విభాగం అధికారిణి కవితారావు, విజయనిర్మాణ్కంపెనీ అధినేత డాక్టర్ సూరపునేని విజయకుమార్,ఆర్.వి.ఆర్.ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్. సత్యనారాయణ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు ఆర్. నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యహరించారు. -
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
-
నేడు విద్యా సంస్థల బంద్
నల్లగొండ టూ టౌన్ : ప్రసుత్త పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్‌మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుతాల నాగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని కోరారు. -
మూతపడనున్న వసతిగృహం
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సాకు ప్రవేశాలపై ప్రచారం కరువు ఏడాదిగా ఇన్‌చార్జీలతోనే నిర్వహణ ఆందోళనలో విద్యార్థులు మర్రిగూడ: అధికారుల నిర్లక్ష్యంతో మర్రిగూడలో దళిత సంక్షేమ బాలుర వసతిగృహం (ఎస్సీ) మూతపడనుంది. మండల కేంద్రంలో మూఫ్పై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో మూసివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇన్చార్జీ పాలనలో ఇబ్బందులు ఈ హాస్టల్లో పని చేసే వార్డన్ గత ఏడాది మార్చిలో పదవీ విరమణ పొందాడు. అప్పటి నుంచి దేవరకొండ వసతిగృహం వార్డెన్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను వారంలో ఒకటి, రెండు రోజుల మాత్రమే ఇలా వచ్చి అలా పోవడంతో విద్యార్థులకు మౌలిక వసతులు అందడం లేదు. మోను ప్రకారం విద్యార్థులకు భోజనం అందడం లేదు. గత వారం రోజుల నుంచిlఉదయం అల్పహారంగా ఇచ్చే జావా కూడ ఇవ్వడం లేదు. అరటిపండ్లు అందడం లేదు. గతంలో వందల మంది ఉన్న ఈ హాస్టల్లో వసతులు లోపించడం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో అస్తవ్యస్తంగా మారింది. దీనికితోడు ఈయేడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను వసతిగృహంలో చేర్పించడంతో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో విద్యార్థులు lచింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ తదితర మండలాల్లోని వివిధ గ్రామాల నుంచిl30 మంది విద్యార్థులు ఈ వసతిగృహంలో ఉంటు విద్యనభ్యాసిస్తున్నారు. అయితే ఇప్పుడు అర్థాంతరంగా హాస్టల్ మూసివేస్తామని అధికారులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ వార్డెన్ కూడా సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు మూసివేయాలని నివేధిక అందించాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎటూకానీ సమసయంలో తాము వసతి కోసం ఎక్కడికి వెళ్లాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్‌ను మూసేస్తే ఊరుకోం –సిలివేరు విష్ణు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు బాడిబాట కార్యక్రమంలో విద్యార్థులను చేర్చుకోకుండా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని హాస్టల్‌ను మూసివేస్తామనడం అధికారులకు సబబు కాదు. హాస్టల్‌ను తొలగిస్తే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు. అధికారులు మెండిగా వ్యవహరిస్తే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకోని ఆందోళనలు చేస్తాం. విచారణ చేస్తాం బాలసింగ్, ఏఎస్‌డబ్ల్యూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వసతి గృహాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నాం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తు్తన్నాం. సంఖ్య పెరగని పక్షంలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. -
మూసుకుపోయింది!
►దూసి ఆర్ఎస్ ఇసుక అక్రమ ర్యాంపు మూసివేత ►నది పక్కనే పొక్లయినర్లను దాసి పరారైన ముఠా ► వాటిని సీజ్ చేయకుండా తిరిగొచ్చిన అధికారులు ► పది రోజుల్లోనే రూ.56 లక్షలు దండుకున్న అక్రమార్కులు ► సీజ్ చేయకుంటే మళ్లీ ఇసుక తవ్వేందుకు అవకాశం ► పకడ్బందీ చర్యల్లేకుంటే పొంచివున్న పెను ప్రమాదం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే నాగావళి నదిని ఇసుక తవ్వకాలతో తూట్లు పొడుస్తున్న మరో ముఠా తోక ముడిచింది! ఆమదాలవలస మండలం దూసిపేటలో పరిమితికి మించి పొక్లయినర్లతో నిబంధనలను విరుద్ధంగా రూ.15 కోట్లు విలువైన ఇసుకను దోపిడీ చేసిన ముఠా ఆగడాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చింది. దీంతో దూసిపేటలో ర్యాంపు నిలిచిపోయినా ఆ పక్కనే దూసి రైల్వేస్టేషన్ వద్ద మరో ర్యాంపును అక్రమంగా తెరిచింది మరో ముఠా. దీనిపై కూడా సాక్షి కథనం ఇచ్చింది. ఈ ముఠా నిలువుదోపిడీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం సోమవారం జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనృసింహానికి ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం ర్యాంపును పరిశీలించి.. అక్రమమని తేల్చారు. దీన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దూసి రైల్వే క్వార్టర్ల పక్కనుంచి ర్యాంపు వరకూ అక్రమంగా నిర్మించిన గ్రావెల్ రోడ్డు ప్రవేశమార్గాన్ని రైల్వే అధికారులు మూసివేశారు. అయితే ర్యాపు వద్దే గడ్డిలో ముఠా దాచేసిన రెండు భారీ పొక్లయినర్లను అధికారులు సీజ్ చేయకపోవడంపై దూసి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడగానే ముఠా మళ్లీ ఇసుక తవ్వకాలు సాగించేందుకు ఇది అవకాశం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో వర్షం పడితే జిల్లాలో భారీ వరదతో పొటెత్తే నాగావళి, వంశధార నదుల గురించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియనది కాదు! అది ప్రకృతి విపత్తు అని సరిపెట్టుకోవచ్చు... కానీ ఎక్కడి నుంచో జిల్లాకు వచ్చి నదుల్లో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతూ పరివాహక ప్రాంతాలకు ముఠాలు పెనుముప్పు తెస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత ఈ ముఠాలు రెక్కలు విచ్చుకున్నాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులను మచ్చిక చేసుకొనో, వారి బంధువులకు, బినామీలకు వాటాలిచ్చో ఒక్కో ప్రాంతాన్ని వరుసగా దోచుకుపోతున్నాయి. ' దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది క్వార్టర్ల పక్కనుంచి నాగావళి నదీగర్భం వరకూ జీడిమామిడి తోటలను తొలగించి రూ.7 లక్షల ఖర్చుతో కిలోమీటరు రోడ్డును ఇసుక మాఫియా ఆఘమేఘాలపై వేసింది. ఇందుకు అవసరమైన కంకర అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి క్వారీల నుంచి సరఫరా కావడం గమనార్హం. ఇందుకు ప్రతిఫలం ర్యాంపులో ఆయన కుమారుడికి వాటా రూపంలో దక్కింది. అలా ఆరుగురు వాటాదారుల్లో ముగ్గురికి అధికార పార్టీ నేతలతో ఏదొక రూపంలో సంబంధాలు ఉండటం, మాఫియా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల పేరు చెప్పి బెదిరించడంతో దూసి గ్రామస్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీనిపై అధికారులు కూడా స్పందించలేదు. యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడి వ్యవహారాన్ని సాక్షి ఈనెల 16న ‘కళ్లు మూసుకున్నారు!’ శీర్షికతో వెలుగులోకి తీసుకొచ్చింది. పది రోజుల్లో రూ.56 లక్షల దోపిడీ దూసి ఆర్ఎస్ ర్యాంపుకు ఇసుక కోసం వచ్చే ఒక్కో లారీకి రూ.4,800 చొప్పున ముఠా వసూలు చేసింది. రాత్రీపగలు తేడాలేకుండా గత పది రోజుల్లో వందల సంఖ్యలో లారీలు ఇసుక తరలించుకుపోయాయి. వాటి నుంచి ముఠా వసూలు చేసింది దాదాపు రూ.56 లక్షలని సమాచారం. పొక్లెయినర్లను పట్టించుకోలేదు వాస్తవానికి ర్యాంపు వద్ద పొక్లయినర్ల వంటి యంత్రాలేవీ ఇసుక ఎత్తిపోతకు ఉపయోగించకూడదు. కానీ దూసిపేట ర్యాంపులోనే ఆరు పొక్లెయినర్లను పెట్టి నాలుగు నెలల పాటు నిర్విరామంగా లక్షల యూనిట్ల ఇసుక తరలించుకుపోయింది. అదే నిబంధనల ప్రకారం చేస్తే సంవత్సరం అంతా స్థానికులకు ఉపాధి దొరికేది. పొక్లయినర్లను అధికారులు సీజ్ చేయకపోవడంతో దూసి ఆర్ఎస్ ర్యాంపులోనూ మూడు పొక్లెయినర్లను ముఠా దించింది. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం దూసి గ్రామస్థులతో కలిసి ర్యాంపు వద్ద ఆందోళనకు దిగనున్నారని, అలాగే అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలుసుకున్న ఇసుక మాఫియా అప్రమత్తమైంది. మూడు పొక్లెయినర్లలో ఒకదాన్ని ఉదయాన్నే అక్కడి నుంచి పంపించేశారు. మిగిలిన రెండింటిని నదిపక్కన ఒక గొయ్యిలో గడ్డిమధ్య దాచేశారు. తమ్మినేని బృందం పరిశీలించి వచ్చిన తర్వాత రెవెన్యూ, గనుల శాఖ అధికారులు ర్యాంపులో పరిశీలనకు వచ్చారు. ర్యాంపు అక్రమమని ప్రకటించారు. కానీ ఆ రెండు పొక్లయినర్లను సీజ్ చేయలేదు. -
ఇక చాలు.. కట్టు కథలకు అడ్డుకట్ట వేయండి!
సెలబ్రిటీలు కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే చాలు.. వాళ్ల మధ్య ఏదో నడుస్తోందనీ... డేటింగ్ చేస్తున్నారనీ.. ఇలా రకరకాల గాసిప్పులు ప్రచారమవుతాయి. ముఖ్యంగా సినిమా రంగంలో మాత్రం ఇటువంటి గాసిప్పులకు కొదవే ఉండదు. ఫలానా హీరో ఫలానా హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడట.. ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారట... త్వరలో పెళ్లి చేసుకుంటారట...! వంటి వార్తలు కోకొల్లలు. ప్రస్తుతం కృతీసనన్, సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ గురించి అలాంటి ఓ వార్తే ప్రచారంలో ఉంది. మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ‘రాబ్తా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రకథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో ఆమె క్లోజ్‌గా మూవ్ అవుతున్నారన్న వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో ఇది ఓ హాట్ టాపిక్. ఇంకా మౌనం వహిస్తే, ఈ ప్రచారం వీర విహారం చేస్తుందనుకున్న కృతీ సనన్ స్పందించారు. ‘‘ఒక సినిమా చేసేటప్పుడు హీరో, డెరైక్టర్.. ఇలా అందరితో క్లోజ్‌గా ఉంటాం. అంత మాత్రాన ఏదో ఉన్నట్లేనా? ఏదీ లేకుండా ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండదా? సరదాగా మాట్లాడుకున్నంత మాత్రాన లవ్‌లో ఉన్నట్లేనా? ఇక చాలు.. సుశాంత్‌తో నాకేదో ఉందని అల్లిన కట్టుకథలకు అడ్డుకట్ట వేస్తే బెటర్’’ అని ఘాటుగా అన్నారు కృతి. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా బుల్లితెర తార అంకితా లోఖాండేతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ‘సమ్‌థింగ్’ ఉండేదనే వార్తలు వచ్చేవి. ఇటీవల ఈ ఇద్దరూ విడిపోవడంతో.. ఇప్పుడా ప్లేస్‌ని కృతి రీప్లేస్ చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ, కృతి క్లారిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి.. ఇక వీళ్ల గురించిన వదంతులకు ఫుల్స్టాప్ పడుతుందని ఊహించవచ్చు. -
దుర్గ గుడి ఘాట్‌రోడ్డు మూసివేత
విజయవాడ: ఇంద్రకీలాద్రి ఆధునికీకరణ పనుల్లో భాగంగా భక్తులు కొండపైకి చేరుకునే ఘాట్‌రోడ్డును అధికారులు సోమవారం మూసివేశారు. ఇప్పటికే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని భవాని దీక్ష మండపం పరిపాలన విభాగం భవనాలను పూర్తిగా తొలగించారు. సోమవారం నుంచి ఘాట్‌రోడ్డును మూసివేసిన అధికారులు భక్తులను మహా మండపం మీదుగా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. కొండపైన అన్నదాన భవనాన్ని కూడా తరలించిన అధికారులు శృంగేరి పీఠంలో నూతన అన్నదాన భవనాన్ని ప్రారంభించారు. -
థాయ్‌లాండ్ బీచ్‌ను మూసేస్తున్నారు
బ్యాంకాక్: ఒకప్పుడు రద్దీగా ఉండే థాయిలాండ్‌కు చెందిన బీచ్ ఒకటి శాశ్వతంగా మూతపడనుంది. వాతావరణాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో థాయిలాండ్, ఇతర దేశాల నుంచే వచ్చే పర్యాటకులకు ఈ బీచ్ దూరం కానుంది. అండమాన్ సముద్రంలోని సిమిలాన్ నేషనల్ పార్క్ సమీపంలో కోహ్ తచాయి అనే చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ అందమైన బీచ్ ఒకటి నెలవై ఉంది. ఇక్కడి పెద్ద మొత్తంలో పర్యాటకు స్వదేశీయులు వస్తుంటారు. అయితే, దీనిని ఇక పూర్తిస్థాయిలో ఈ ఏడాది అక్టోబర్ మాసం నుంచి మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు ది బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. 'ఇన్ని రోజులపాటు మనందరకి ఆహ్లాదాన్ని ఇచ్చిన కోహ్ తచాయికి ధన్యవాదాలు చెబుతున్నాను. కుప్పలుకుప్పలుగా వచ్చిన టూరిస్టులతో కొద్దికాలంలోనే ఎంతో పాపులర్ అయింది. కానీ, మితిమీరిన జనాలు రావడం వల్ల సమీపంలోనే జాతీయ పార్క్ వాతావరణంపై దుష్ప్రభావం పడే పరిస్థితి తలెత్తింది' అని ఆ పార్క్ అధికారి ఆయన చెప్పారు. -
గడువు తర్వాత ప్రచారం నిర్వహించరాదు: ఖమ్మం కలెక్టర్
పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. గడువు తర్వాత అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ దానకిషోర్ సూచించారు. నియోజకవర్గానికి చెందని వ్యక్తులు, స్థానికేతరులు 14వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉండరాదని ఆదేశించారు. భద్రత దృష్ట్యా ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్లకు తోడు మరో 21 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ బ్రాంచ్ మూసివేత
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శాఖ మూతపడింది. ఇక్కడి గంగానమ్మపేటలోని ఉన్న హెచ్డీఎఫ్సీ లైఫ్ కార్యాలయం రెండు మూడు రోజులుగా తీయడం లేదని పాలసీదారులు పలువురు తెలిపారు. దీనిపై పాలసీదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలిసింది. పట్టణంతోపాటు సమీప ప్రాంతాల ప్రజల బీమా అవసరాల కోసం 2008లో ఇక్కడ సంస్థ శాఖను ఆరంభించారు. హెచ్డీఎఫ్సీ సంస్థకు గల బ్రాండ్ విలువ, స్థానికంగా అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో పాలసీదారులు ఆదరించారు. ఏడేళ్లు కార్యకలాపాలు సాగించిన తర్వాత మూసివేయడంతో పాలసీదారుల్లో అయోమయం నెలకొంది. -
త్రీడేస్ వాట్సాప్ క్లోజ్!
బ్రెజిల్: బ్రెజిల్లో వాట్సాప్‌పై వేటు పడింది. వాట్సాప్ ను మూడు రోజులపాటు నిషేధించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించడంతో గత 72గంటలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో దాదాపు 100 మిలియన్లమంది వాట్సాప్ యూజర్లపై ఈ ప్రభావం పడింది. అసలు ఎందుకు దీనిపై నిషేధం విధించాల్సి వచ్చిందనే కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ముఠా నేరాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు వాట్సాప్ సంస్థ అంగీకరించని కారణంగానే పరోక్షంగా దానిపై పోలీసులు నిషేధం విధించాల్సిందిగా కోర్టును కోరినట్లు తెలుస్తోంది. బ్రెజిల్ లో పలు నేరాలు చేసే దొంగలు, క్రిమినల్స్ అంతా కూడా ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వారి నేరాలను విచారించే పోలీసులకు సమాచారం అవసరం ఉన్నందున చాలాసార్లు ఆ కంపెనీలను కోరిన సహకరించలేదని తెలుస్తోంది. అందుకే బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక అనుసంధాన వేదికల్లో వేగంగా దూసుకొచ్చిన ప్రసార మాధ్యమం వాట్సాప్. ఫోన్ చేసేందుకు కాల్ బ్యాలెన్స్ లేకుండా ఉంటున్నారేమోగానీ.. వాట్సాప్ యూజ్ కోసం డేటా లేకుండా మాత్రం ఎవరూ ఉండలేని పరిస్థితి. ఇప్పటికి దీనివల్ల ఎన్నో సమస్యలు వచ్చినా ఓ రకంగా కమ్యూనికేషన్‌కు మాత్రం ఇది ఒకింత వేగంగా పనిచేస్తుందనే చెప్పాలి. ఇలాంటి వాట్సాప్ ఈ మధ్యకాలంలో పలు విమర్శలకు గురవుతుంది కూడా. -
ఫ్రీడం 251:రింగింగ్ బెల్స్ ఆఫీస్ క్లోజ్!
న్యూ ఢిల్లీ: ఫ్రీడమ్ 251 పేరుతో ఇండియాలో అత్యంత చౌకయిన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలకు ఆర్డర్లు తీసుకున్న తయారీ సంస్థ రింగింగ్ బెల్స్‌కు సంబంధించిన నోయిడా కార్యాలయం బుధవారం మూసివేసి ఉన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫీస్‌కు సంబంధించిన అద్దెను చెల్లించడంలో విఫలమైనందున ఆ కార్యాలయానికి తాళాలు పడినట్లు తెలుస్తోంది. అయితే రింగింగ్ బెల్స్ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాత్రం తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికి పారిపోవడం లేదని వెల్లడించారు. రింగింగ్ బెల్స్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్‌ను ఫ్రీడమ్ 251 మొబైల్ ధరను గురించి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మొబైల్ల కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్ల డబ్బు విషయంలోనూ ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. దిగ్గజ సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి అత్యంత చౌకయిన ధరకు స్మార్ట్ మొబైల్‌ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ముందుకు రావడంతో ఈ సంస్థపై ఇప్పటికే ప్రజల్లో పలు అనుమానాలున్న నేపథ్యంలో ఆఫీసును మూసేశారన్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. -
గడువు ముగిసింది
-
గడువు ముగిసింది
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయింది. చివరి రోజు 500 మందికి పైగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీ నుండి తప్పుకోవడానికి నిరాకరించారు. అన్ని పార్టీలకు రెబల్ అభ్యర్థుల బెడద ఉంది. 150 డివిజన్లకు 4,069 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 189 నామినేషన్లను చెల్లుబాటు కానివిగా ఎన్నికల అధికారులు తేల్చారు. బీఫామ్‌ల విషయంలో చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ముందుగా ఒకరి పేరును ప్రకటించి బీఫామ్‌లు మరొకరికి ఇవ్వడంతో.. టికెట్ దక్కని వారు పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. పలు డివిజన్లలో టీడీపీ, బీజేపీల పొత్తు వికటించింది. కొన్ని చోట్ల అభ్యర్థులకు రెండు పార్టీలూ బీఫాంలు ఇచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ పలువురు అభ్యర్థులను మార్చింది. అధికార పార్టీ టీఆర్ఎస్కు కూడా రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. -
గంగోత్రి ఆలయం మూసివేత
డెహ్రడూన్: శీతాకాలం ప్రారంభమవుతుండడంతో ఉత్తరఖాండ్ రాష్ర్టంలోని హిమాలయ పుణ్యక్షేత్రం గంగోత్రిని గురువారం మూసివేశారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయానికి మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఆలయ పూజారులు, అధికారుల సమక్షంలో తాళం వేశారు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు హిమాలయ పుణ్యక్షేత్రాల్లో(బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి) ఇది ఒకటి. వీటిని చార్ధామ్ అని పిలుస్తారు. కాగా మిగతా మూడు దేవాలయాలను త్వరలోనే మూసివేయనున్నారు. -
మోదీ నియోజవర్గంలో విద్యాసంస్థలు బంద్
-
మోదీ నియోజకవర్గంలో విద్యాసంస్థలు బంద్
లక్నో: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తోన్న నియోజకవర్గం వారణాసిలో ఏర్పడిన ఘర్షణ వాతావరణ ప్రభావం అక్కడి పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలపై తీవ్రంగా పడింది. రెండో రోజు కూడా అవి తెరుచుకోలేదు. ఎప్పుడు ఎటునుంచి ఘర్షణ మొదలవుతుందో, రాళ్లు పడతాయో, తుపాకీ పేలుతుందో తెలియని ఆందోళనతో ఆయా సంస్థల యాజమాన్యాలు వాటిని తెరవలేదు. వారణాసిలో హిందూత్వ ప్రతినిధులు, పోలీసులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హిందూత్వ సంస్థల ప్రతినిధులపై సెప్టెంబర్ 22న జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ సోమవారం ఉదయం నిర్వహించిన ర్యాలీ.. చివరికి హింసాయుతంగా మారడంతోపాటు పోలీసు బలగాలపై రాళ్లదాడికి ఆందోళనకారులు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. కొద్ది నిమిషాల్లోనే అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకాయి. దీంతో కర్ఫ్యూ కూడా విధించారు. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుండటంతో మంగళవారం కూడా వారణాసిలో అలాంటి పరిస్థితే కొనసాగుతోంది. గణేశ్ విగ్రహాలను గంగా నదిలో నిమజ్జనం చేసే విషయంలో ప్రభుత్వాధికారులకు, మండపాల నిర్వాహకులకు మధ్య తలెత్తిన విబేధాలే ప్రస్తుత అల్లర్లకు మూల కారణం. -
గుట్ట ఆలయం గంటపాటు మూసివేత
యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సోమవారం గంటపాటు మూసివేశారు. విష్ణుపుష్కరిణిలో పడి హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన దుద్దెడ రాజు అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆలయ అర్చకులు నిత్య కైంకర్యాలన్ని నిలిపి వేసి గంటపాటు ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజనం చేశారు. నిత్య కైంకర్యాలను నిర్వహించి తిరిగి తెరిచారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. -
ఏపీలో 3990 ప్రభుత్వ పాఠశాలల మూసివేత
-
ఏపీలో 3990 ప్రభుత్వ పాఠశాలల మూసివేత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 13 జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. టీపీఆర్ పద్ధతిలో రేషనలైజ్ నిర్వహించాలి. మండల స్థాయిలో వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. కిలో మీటర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 30 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తించాలి. ఈ మేరకు 3 కిలో మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలల జాబితా సిద్ధం చేయాలి. పాఠశాలలో వసతులు, విద్యార్థుల ఆధారంగా క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్క ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,990 పాఠశాలలు మూత పడనున్నాయి. -
మోదీకి అత్యంత సన్నిహితులెవరు?
-
మూత'బడు'లు
మూసివేత దిశగా 100కు పైగా పాఠశాలలు 1:30 ప్రకారం 155, 1:20 ప్రకారం అయితే 105 స్కూళ్లు .. 78 సక్సెస్ పాఠశాలలపైనా వేటు కొంపముంచుతున్న రేషనలైజేషన్ డీఎస్సీపైనా తీవ్ర ప్రభావం విద్యాశాఖలో రేషనలైజేషన్ సంక్షోభం నెల కొంది. తాజా బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి జీవో నం.11 లేదా సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం కూడా సర్కారు పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడనుంది. నిజామాబాద్ అర్బన్ : విద్యాశాఖలో రేషనలైజేషన్ సంక్షోభం నెలకొంది. తాజా బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి జీవో నం.11 లేదా సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారమైనా సర్కారు పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడనుంది. జిల్లాలో 100కు పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రక్రియను అమలు చేస్తే విద్యాశాఖనే సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. తాజా మార్గదర్శకాలపై పాఠశాల డెరైక్టర్ ఆదేశాల కోసం విద్యాశాఖ ఎదురుచూస్తుండగా జీవో నం. 11ను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సర్కారు పాఠశాలల మనుగడకు ముప్పు ఏర్పడనుంది. 100కు పైగా పాఠశాలలు మూత.. తాజా ఉత్తర్వులు లేదా సవరించిన మార్గదర్శకాల ప్రకారం 100కు పైగా పాఠశాలలకు ముప్పు వాటిల్లనుండడంతో విద్యాశాఖ అధికారులే విస్మయం చెందుతున్నారు. జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 576 ప్రాథమిక పాఠశాలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2.65 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జీవోనం.11ను విడుదల చేసింది. దీని ప్రకారం 1:30 ప్రకారం అరుుతే 155 పాఠశాలలు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు 1:20 ప్రకారం అరుుతే 105 పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది. అంతేకాక 1:30 ప్రకారం రేషనలైజేషన్ చేపడితే 1175 టీచర్ పోస్టులు బదలాయించాల్సి వస్తుంది. ఇందులో 68 మంది టీచర్లను మాత్రమే బదలాయించే అవకాశం ఉంది. మిగితా 1107 టీచర్ పోస్టులు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. ఈ పోస్టులను ఎక్కడ భర్తీ చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో మిగిలిన వారిని సైతం ఆయా పాఠశాలల్లో వరుస క్రమంగా కేటాయిస్తే పాఠశాలలకు అదనంగా ఉపాధ్యాయులను కేటాయించినట్టవుతుంది. ఈ విధానాన్నే విద్యాశాఖ కొనసాగించే అవకాశం ఉంది. 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేపడితే 750 పోస్టులు మిగిలిపోతున్నాయి. వీరిని సైతం ఇదే విధంగా కేటాయించే అవకాశం ఉంది. 78 సక్సెస్ పాఠశాలలకు ఎసరు... రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇంగ్లిష్ మీడియం బోధిస్తే సక్సెస్ పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఏర్పడింది. జీవో నం.11 ప్రకారం 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న సక్సెస్ పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో 188 సక్సెస్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 మంది విద్యార్థుల కన్న తక్కువ ఉన్న పాఠశాలలు 78 ఉన్నాయి. వీటిని మూసివేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమీప పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో సక్సెస్ పాఠశాలలో విలీనం చేయనున్నారు. లేదంటే ఉన్నత పాఠశాలల్లోనే కొనసాగించనున్నారు. ఈ పాఠశాలల్లో ఉన్న టీచర్లను సైతం బదలాయిస్తారు. డీఎస్సీపై తీవ్ర ప్రభావం... రేషనలైజేషన్ ప్రక్రియ డీఎస్సీపై తీవ్ర ప్రభావం చూపనుంది. రేషనలైజేషన్‌లో సుమారు వెయ్యి పోస్టులు ఎక్కువగా మిగిలిపోనున్న నేపథ్యంలో ఆ ఉపాధ్యాయులతో ఖాళీలు భర్తీ చేస్తారు. ఇది డీఎస్సీపై ప్రభావం చూపుతుంది. 1:30 ప్రకారం 1107, 1:20 ప్రకారం 750 పోస్టులు మిగిలిపోనున్నాయి. దీంతో జిల్లాలో అసలు పోస్టులు ఖాళీలు లేకుండా పోతున్నాయి. డీఎస్సీ నిర్వహణకు జిల్లాలో 1150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారులు పాఠశాల డెరైక్టర్‌కు నివేదించారు. రేషనలైజేషన్ చేస్తే ఈ పోస్టులు సైతం మిగిలేలా లేవు. మరి దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పాఠశాలల మూసివేత మానుకోవాలి రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఒక్కటి కూడా మూసివేయొద్దు. టీచర్ల పోస్టులు బదలాయించినా 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడాలి. - కమలాకర్‌రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రాథమిక పాఠశాలలను మెరుగుపర్చాలి రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు తీవ్ర అన్యాయం జరుగనుంది. వందలాది పాఠశలలు మూసివేసే ప్రక్రియ వెంటనే విరమించుకోవాలి. పాఠశాలలను మెరుగుపర్చాలి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. - మాడవేడి వినోద్‌కుమార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు -
ట్రాఫిక్ జామ్ సమస్యతో స్కూల్ కు సెలవులు!
పాట్నా: ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ స్కూల్ కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా విద్యార్ధులు సకాలంలో చేరలేకపోతుండటంతో చేసేదేమిలేక స్కూల్ ను గురువారం నుంచి మూడు రోజులపాటు మూసివేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో పాట్నాకు సమీపంలోని జెతులీలో చోటు చేసుకుంది. జెతూలీ నగర శివారులోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ వద్ద ఎప్పటిలానే ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఉదయం 7.15 నిమిషాలకు చేరాల్సిన విద్యార్ధులు ట్రాఫిక్ జామ్ లో బస్సులు ఇరుక్కుపోవడంతో 11.30 గంటల వరకు కూడా చేరలేకపోతున్నారని అధికారులు వెల్లడించారు. మంగళవారం రోజున స్కూల్ కు సకాలంలో చేరలేకపోయిన విద్యార్ధులను 12.10 గంటలకు వెనక్కి పంపగా వాళ్లు ఇంటికి చేరే సరికి సాయంత్రం 5 గంటలైందని, ట్రాఫిక్ జామ్ నరకాన్ని చూపిస్తొందని, బస్సులో పిల్లలు కూర్చోలేక ఏడుపు అందుకున్నారని బస్సు డ్రైవర్ తెలిపారు. హైవేకి ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో ట్రాఫిక్ జామ్ లు రెగ్యులర్ వ్యవహారమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ జామ్ స్కూల్ విద్యార్ధులు చిక్కుకోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం పిల్లలే కాదు.. అంబులెన్స్ లు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. -
అమ్మ అంత్యక్రియల్లోనూ అదే తీరు
బంగారప్ప తనయుల గొడవ అనుచరులతో సహా బాహాబాహీకి యత్నం సన్నిహితుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ బంగారప్ప అంత్యక్రియల్లోనూ ఇంతే శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుటుంబ కలహం మరో సారి రచ్చకెక్కింది. బంగారప్ప సతీమణి శకుంతలమ్మ అంత్యక్రియల సందర్భంగా బుధవారం ఆమె తనయులు కుమార, మధు బంగారప్పలు దాదాపు బాహాబాహీకి సిద్ధపడగా, వారి అనుచరులు కూడా తమ నాయకుల బాటలోనే నడిచారు. బంగారప్ప కుటుంబ సన్నిహితులు, శ్రేయోభిలాషులు జోక్యం చేసుకుని గొడవ మరింత పెద్దది కాకుండా నివారించగలిగారు. బంగారప్ప అంత్యక్రియల్లోనూ ఆయన కుమారులిద్దరు గొడవ పడిన సంగతి తెలిసిందే. శకుంతలమ్మ పార్థివ శరీరాన్ని బుధవారం అంతిమ దర్శనం కోసం ఉంచినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అంత్య సంస్కారాలను నిర్వహిస్తున్న సందర్భంలో మధు బంగారప్పతో పాటు సోదరి గీతా శివ రాజ్ కుమార్, కుటుంబ సభ్యులు అనిత, సుజాతలు ఓ పక్క నిలబడి ఉన్నారు. కుమార బంగారప్ప మరో వైపు నిల్చుని శ్రాద్ధ కర్మలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదిలోనే గొడవ ఉదయం కుమార బంగారప్ప తన కుటుంబ సభ్యులతో సొరబ తాలూకా కుబటూరు నివాసానికి వచ్చిన సమయంలో మధుతో మాటా.. మాటా పెరిగింది. గీతా సైతం కుమార వెంట వచ్చిన బంధువుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మధు, కుమారల వర్గీయులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిద్దరినీ చెరో వైపు తీసుకెళ్లారు. వారి మద్దతుదారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఇద్దరూ అంత్య సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ శ్రేయోభిలాషులు సూచించడంతో గొడవ సద్దుమణిగింది. అంతిమ దర్శనం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం కన్ను మూసిన శకుంతలమ్మను వాహనంలో కుబటూరుకు బుధవారం అర్ధరాత్రి తీసుకు వచ్చారు. బంగారప్ప నివాసంలో పార్థివ శరీరాన్ని ఉంచి తుది దర్శనానికి అవకాశం కల్పించారు. అనంతరం వాహనంలో భౌతిక కాయాన్ని సొరబ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి తరలించి ప్రజల దర్శనానికి అవకాశం కల్పించారు. బంగారప్ప అంతిమ సంస్కారాలను నిర్వహించిన స్థలం వద్దే శకుంతలమ్మ చితికి నిప్పంటించారు. సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
సీమాంధ్రలో విద్యా సంస్థల బంద్
సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. మద్దతుగా సీమాంధ్ర ప్రాంతంలో విద్యా సంస్థలు సోమవారం నుంచి బంద్ పాటిస్తున్నాయి. 55 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఈ నెల 30 వరకు మూసివేయనున్నారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. 450 ప్రైవేటు విద్యాసంస్థలు, 80 జూనియర్ కాలేజీలు 8 పాలిటెక్నికల్, 75 డిగ్రీ కాలేజీలు, 15 పీజీ కాలేజీలు, 9 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. విశాఖపట్నంలో 30వరకు విద్యాసంస్ధలు బంద్ పాటిస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఇక నెల్లూరులో దాదాపు 1,200 ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో 300మీటర్ల జాతీయజెండాతో మానవహారం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 6వేల మంది విద్యార్ధులతో విద్యార్ధి గర్జన నిర్వహించారు.