డెహ్రడూన్: శీతాకాలం ప్రారంభమవుతుండడంతో ఉత్తరఖాండ్ రాష్ర్టంలోని హిమాలయ పుణ్యక్షేత్రం గంగోత్రిని గురువారం మూసివేశారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయానికి మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఆలయ పూజారులు, అధికారుల సమక్షంలో తాళం వేశారు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు హిమాలయ పుణ్యక్షేత్రాల్లో(బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి) ఇది ఒకటి. వీటిని చార్‌ధామ్ అని పిలుస్తారు. కాగా మిగతా మూడు దేవాలయాలను త్వరలోనే మూసివేయనున్నారు.