పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే..
థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది.
రూ. 100 కోట్లకు పైగా ఆదాయం
నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు.
దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు.
(చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..)
Comments
Please login to add a commentAdd a comment