visitors
-
మూడు లక్షలకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య
అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు జమ్ముకశ్మీర్‌కు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శనివారం అమరనాథుణ్ణి 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 2,93,929 మంది భక్తులు అమర్నాథ్కు తరలివచ్చారు.అమరనాథుణ్ణి త్వరగా దర్శించుకోవాలనే ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తోంది. ఇందుకోసం టోకెన్లు పొందేందుకు, భక్తులు తెల్లవారుజాము నుంచే సేవా కేంద్రాలకు చేరుకుంటున్నారు. తాజాగా 1,630 మంది భక్తులు 74 చిన్న, పెద్ద వాహనాల్లో జమ్ము నుంచి బల్తాల్‌కు బయలుదేరారు. వీరిలో 1068 మంది పురుషులు, 546 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా పహల్గాం మార్గంలో 109 చిన్న, పెద్ద వాహనాల్లో 3039 మంది భక్తులు కశ్మీర్‌కు తరలి వెళ్లారు. వీరిలో 2350 మంది పురుషులు, 584 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, 96 మంది సాధువులు, ఇద్దరు సాధ్వులు ఉన్నారు. కాగా ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. -
జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్‌కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
G20 Summit: విదేశీ అతిథుల కోసం అనువాదకులు
న్యూఢిల్లీ: జీ20 సదస్సు కోసం వచ్చి ఢిల్లీ దుకాణాల్లో, ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో షాపింగ్ చేసే విదేశీ అతిథుల సౌకర్యం కోసం అక్కడి వర్తకులు మరో అడుగు ముందుకేశారు. షాపింగ్ సమయంలో భాషా బేధంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అనువాదకు(ట్రాన్స్‌లేటర్)లను సిద్ధంచేస్తున్నారు. ఇంగ్లి‹Ù, ఫ్రెంచ్, స్పానిష్ ఇలా జీ20 దేశాల్లో మాట్లాడే భాషలను అనర్గళంగా మాట్లాడి అనువదించగల 100 మంది మహిళా అనువాదకులను అక్కడి వర్తకులు రంగంలోకి దింపుతున్నారు. వీరు అందుబాటులో ఉండటంతో ఇకమీదట విదేశీ అతిథులు షాపింగ్ వేళ ఎలాంటి ఇబ్బందులు పడరని వర్తకులు చెబుతున్నారు. ఈ అనువాదకులు నిజానికి నూతన వ్యాపార వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూవర్స్). వీరిలో ఫ్యాషన్ డిజైనర్లు, సెలూన్, బొటిక్ యజమానులు, బ్లాగర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ‘ వీరంతా ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 8, 9, 10 తేదీల్లో ట్రేడర్లకు, అతిథులకు అనుసంధానకర్తలుగా మెలగుతారు’ అని వీరితో భాగస్వామ్యం కుదుర్చుకున్న ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్ చెప్పారు. ‘ ట్రేడర్లకు సాయపడే వాలంటీర్ల జాబితాను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు పంపాం. వీరు విదేశీ అతిథులకు అందుబాటులో ఉండి సాయపడతారు. దేశంలోనే షాపింగ్‌కు చిరునామాగా నిలిచే చాందీనీ చౌక్‌లో విదేశీయుల సందడి మరింత పెరగనుంది’ అని గోయల్ పేర్కొన్నారు. -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్‌లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్‌లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్‌లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్‌ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్‌గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్‌లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్‌లాండ్‌లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్‌గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్‌గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్‌ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్‌లాండ్‌కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో
సాక్షి, భువనేశ్వర్ : ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే.. విచిత్రమైన అనుభవం వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్ నందనకానన్ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది. వచ్చేశాయి సింహాలు ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్వోకు ఆదేశించినట్లు నందన కానన్ డైరెక్టరు తెలిపారు. #ସିଂହ_ସଫାରୀରେ_ଫସିଲା_ବସ୍ ନନ୍ଦନକାନନ ସିଂହ ସଫାରୀରେ ଫସିଗଲା ବସ୍ । ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଲେ ପର୍ଯ୍ୟଟକ । ସିଂହଗୁଡିକୁ କାବୁ କରି ଫିଡିଂ ଚାମ୍ବରରେ ରଖିଲେ କର୍ମଚାରୀ । #Nandankanan #Zoo #KanakNews pic.twitter.com/NwCoXWD1nt — Kanak News (@kanak_news) July 9, 2023 -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
'కాపీ పేస్ట్ సీఎం' అంటూ సెటైర్లు..హుందాగా బదులిచ్చిన హిమంత శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మని ట్రోల్ చేస్తూ ఓ వీడియ్ నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. దీంతో ఆయన దానికి స్పందించి..హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ ఒక రోజు ప్రభుత్వ స్కూల్‌ని సందర్శించారు. అక్కడ విజిటర్స్ బుక్‌లో రాయడానికి ఆయన.. వేరొక పుస్తకంలో చూసి రాస్తూ కనిపించారు. దీంతో రోషన్ శర్మ అనే వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తోపాటు.. కాపీ చేయకుండా విజటర్స్ బుక్‌లో ఒక్క పేరా కూడా రాయలేని అస్సాం సీఎం అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై గంటల వ్యవధిలోనే స్పందించిన ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తనకు ఇంగ్లీష్, హిందీ భాషలు సరిగా రావని, దాన్ని అంగీకరించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదన్నారు. పైగా తాను ఆ భాషాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశారు. దీనికి రాయ్ బదులిస్తూ..అస్సామీ ఒక అందమైన భాష, సందర్శకుల పుస్తకంలో అస్సామీ భాషలో రాసి ఉంటే మరింత మెరుగ్గా కనిపించేది. ఇక్కడ భాష కాదు సమస్య . అతను వచనాన్ని కాపీ చేయడం గురించి మాత్రమే విమర్శించాను. అయినా విజిటర్స్ బుక్‌లో హిందీ లేదా ఇంగ్లీష్‌లోనే రాయాలని రూల్ లేదు . కాపీ చేయడం అనేది మీ స్థాయి నాయకుడికి తగదు. నాయకుడు తన విభిన్నమైన ఉన్నతాశయ ఆలోచనలతో అందరికీ ఆదర్శంగా ఉండేలా కానీ ఇలా కాపీ చేయకూడదూ అని సూచిస్తూ ట్వీట్ చేశాడు. Presenting the CM of Assam who can't even write a paragraph in a visitor's book without copying 🤣🤣🤣 pic.twitter.com/MHvoRAGDH1 — Roshan Rai (@RoshanKrRaii) April 4, 2023 (చదవండి: ప్రధాని డిగ్రీని చూసే ప్రజలు ఓటేశారా? ఎన్సీపీ నేత ఫైర్) -
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్‌ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్‌ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్‌ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్‌లో త్వరలో స్లీపర్ బెర్తులు -
కూతుళ్లతో సుప్రీం కోర్టుకు సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీం కోర్టు హాలులో లాయర్లందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దివ్యాంగులైన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లను ఆయన న్యాయస్థానానికి తీసుకువచ్చారు. విజిటర్స్ గ్యాలరీ గుండా వారిద్దరినీ ఫస్ట్కోర్ట్కు తీసుకువచ్చారు. తను కూర్చునే చాంబర్‌ను చూపించారు. ఇతర జడ్జీలు కూర్చుని ఉండే చోటును, లాయర్లు వాదించే సమయంలో ఎక్కడి ఉండేదీ వారికి చెబుతూ.. కోర్టు పని విధానాన్ని వివరించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. వచ్చిన అతిథులను చూసి న్యాయవాదులంతా ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Haldwani Eviction: సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
నుమాయిష్ నయా లుక్..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమస్యల కారణంగా షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్‌ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది. ఆరంభమే...సంపూర్ణంగా... సాధారణంగా నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశి్వన్ మార్గం అన్నారు. ప్రారంభమైన స్టాల్స్ కేటాయింపు.. నుమాయిష్‌లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ కేటాయింపు లేఖలు అందజేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్‌ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా ఈ దఫా స్టాల్స్‌కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు. తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఇ)ల నుంచి 50స్టాల్స్ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు. సందర్శన వేళలు పెంపు... వీకెండ్స్‌లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన. ఈ సారి స్ట్రీట్ లైట్స్ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్ ఉన్నా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్ స్టాల్స్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్ మెయిన్ స్టాల్ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్ మార్గం చెప్పారు. (చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం ) -
సరదాగా.. సండేఫన్డే
కవాడిగూడ: నగర వాసుల ఆహ్లాదం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సండే..ఫండే’ సందర్శకులతో హుషారుగా సాగింది. సండే ఫండేను గతంలో ప్రారంభించినప్పటికీ కరోనా నేపథ్యంలో నిలిపి వేశారు. 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై సండేఫండేను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ను విద్యుత్ కాంతులు, జాతీయ జెండాలతో అలంకరించారు. నగర వాసులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. చిన్నారులకు ఇష్టమైన తినుబండారాలను కొనుగోలు చేసి ఆనందంగా గడిపారు. యువత జాతీయ జెండాలతో దేశభక్తి చాటుతూ సెలీ్ఫలు దిగారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సందర్శకులకు ఉచితంగా మొక్కలను పంపిణి చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొదటి సండే వర్షం ప్రభావం వల్ల సండేఫండేకు అధిక సందర్శకులు హజరు కాలేకపోయారు. సండేఫండే సందర్శంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిలిపి వేశారు. (చదవండి: జనాభాను మించి ఆధార్! ) -
బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ...ముచ్చెమటలు పట్టించేసిందిగా...
చాలామంది వేటితో పడితే వాటితో పరాచకాలు ఆడతుంటారు. ఎంతవరకు ఆటపట్టించాలో, వేటితో ఆడుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బంధించే ఉన్నాయి కదా అని వాటితో కూడా ఆడుకోవాలని చూస్తే అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ముందు వెనుక చూడకుండా క్రూరమృగాన్ని ఆటపట్టింటి ఎలా సమస్యను కొని తెచ్చుకున్నాడో చూడండి. వివరాల్లోకెళ్తే...చాలా మంది జూ చూసేందుకు వెళ్లి అక్కడ బోనుల్లో బంధించి ఉండే జంతువులను టచ్ చేయాలనుకుంటారు. ఓపక్క జూ అధికారులు వాటిని ముట్టుకోవద్దు అని చెప్పిన వినరు. ఎవరలేరు కదా వాటిని ముట్టుకునేందుకు ప్రయత్నించి నానా అవస్థలు పడుతుంటారు. జమైక జూలో కూడా ఒక సందర్శకుడు ఇలానే జంతువులను ముట్టుకునేందుకు ప్రయత్నించి ఇబ్బందులను కొనితెచ్చుకున్నాడు. ఆ సందర్శకుడు బోనులోనే బంధించి ఉంది కదా అని సంహాన్ని టచ్ చేసి ఆట పట్టించేందుకు ప్రయత్నిచాడు. అంతటితో ఊరుకోకుండా దాని నోటిలో వేలు పెట్టేందుకు ట్రై చేశాడు కూడా. సింహం ఊరుకుంటుందా..'నాతోనే మజాక్ చేస్తావ్ రా'.. అంటూ కోపంతో వాడి వేలును గట్టిగా కోరికి పట్టుకుంది. ఇక ఆ సందర్శకుడు పాట్లు మాములుగా లేవు. తన వేలుని వెనక్కి తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరికి వేలు పైన ఉన్న కండంతా పోయి ఎముకతో మిగిలింది. అందుకే పెద్దలు అంటారు వేటిలో పడితే వాటిలో వేళ్లు పెట్టకూడదని. ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది గానీ మనమే గుర్తించం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. Show off bring disgrace The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk — Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022 (చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు) -
అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి!
సాక్షి,హిందూపురం(అనంతపురం): ఐదు నుంచి ఆరు అంగుళాల గోధుమ వర్ణంతో వంపు తిరిగిన పొడవాటి ముక్కు.. తెలుపు రంగులో మెడ, తల, వీపు.. ఎరుపు, గుళాబీ మిళితమైన రెక్కల కొనలు.. రెక్కల మధ్య, మెడ కింద ముదురు ఆకుపచ్చ రంగు, కాళ్లు తొడల వరకు తెలుపు రంగుతో కూడిన పక్షులు చిలమత్తూరు మండలం వీరాపురంలో సందడి చేస్తున్నాయి. ఇవి రష్యా దేశంలోని సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు. సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం వేల మైళ్ల దూరం నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వీరాపురంతో పాటు వెంకటాపురం, పరిసర ప్రాంతాల చెరువుల్లో నీరు చేరింది. అటవీ శాఖ అధికారులు చెరువుల్లోకి చేప పిల్లలను సైతం వదిలారు. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలలోపు ఇక్కడకు పక్షులు వలస వచ్చి చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. నెలరోజుల తర్వాత ఆడ పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. గుడ్ల వద్ద ఒక పక్షి కాపలా ఉంటే.. మరో పక్షి ఆహారం సేకరించుకుని వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో గుడ్లు పొదుగుతాయి. రెండు నెలలు పాటు పిల్లలకు ఆహారం అందజేస్తాయి. పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక అవే ఆహారం కోసం వెళ్లి వస్తాయి. సంతానం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. -
Statue Of Equality: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు. ప్రారంభానికి ముందే అవస్థలు ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు. భారీ స్వాగత తోరణాలు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) -
Charminar: ‘లాడ్‌బజార్’.. తళుక్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే
సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్బజార్కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్‌ను సందర్శిచిన తర్వాత లాడ్బజార్లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు. రాత్రిపూట లాడ్బజార్లోకి వెళ్తే జిగేల్మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్‌బజార్‌ను నైట్ బజార్‌గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్‌గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్‌కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్‌బజార్‌లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి. ఆ పేరెలా వచ్చిందంటే.. ►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ► మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. -
మా ప్రైవసీకి భంగం కల్గిస్తారా.. ఎత్తిపడేసింది..
ప్రిటోరియా: సాధారణంగా చాలా మంది సరదాగా గడపటానికి జంతువుల సఫారీలకు, అభయారణ్యాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో సందర్శకులు.. క్రూరమృగాలను, ప్రత్యేక జీవులను దగ్గర నుంచి చూడటానికి ఇష్టపడతారు. వీటికోసం ఆయా పార్కులలో ప్రత్యేక వాహానాలు ఉంటాయి. అయితే, ఒక్కొసారి జంతువులను చూసే క్రమంలో.. సందర్శకులు అనుకొకుండా ఆపదలకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్‌లో గత ఆదివారం(నవంబరు28) జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలాటి గేమ్ రిజర్వ్‌లోని క్రూగెర్ నేషనల్ పార్కులో... కొందరు సందర్శకులు ప్రత్యేక వాహనంలో గైడ్ సహయంతో ఏనుగుల సఫారీకి వెళ్లారు. ఆ తర్వాత.. ఏనుగుల దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత.. గట్టిగా అరవడం ఆరంభించారు. వీరిని గమనించిన ఏనుగుల గుంపు కాస్త బెదిరిపోయింది. వారి వాహనం ఏనుగుల దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆఫ్రికా ఏనుగు వారు ప్రయాణిస్తున్న వాహనం వైపు ఘీంకరించుకుంటూ వచ్చింది. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండన్నట్లు..’ వారి వాహనాన్ని తొండం సహయంతో పక్కకు నెట్టి, కిందకు పడేసింది. ఈ సంఘటనతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే వాహనం నుంచి దూకి పారిపోయారు . అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేవు. వాహనం మాత్రం తుక్కుతుక్కయ్యింది. శీతాకాలంలో ఏనుగులు మేటింగ్‌లో పాల్గొంటాయి. వాటి ఏకాంతానికి అంతరాయం కల్గినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాయని రిజర్వ్ మేనెజర్ హవ్మెన్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను.. సందర్శకులలో ఒక వ్యక్తి రికార్డు చేశాడు. అతను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏనుగు ఎంత భయంకరంగా ఉంది..’, ‘కొంచెంలో బతికి బట్టకట్టారు..’, ‘మీరు ఏనుగుకు దొరికితే అంతే సంగతులు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Too much intrusion will take your life in Wilderness. However, wild animals keeps on forgiving us since long.#responsible_tourism specially wildlife tourism should be educational rather recreational. हांथी के इतना घुसा नही जाता 🙏 watch second video too pic.twitter.com/AOKGZ2BAjB — WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021 -
ట్యాంక్‌బండ్‌పై సందర్శకుల హడావిడీ, సందడిగా చార్మినార్
-
Tit For Tat: ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ రేసిజం చూపిస్తున్న ఇంగ్లండ్‌కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక మీదట ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు వచ్చే యూకే సిటిజన్స్‌కు పదిరోజుల క్వారంటైన్ నిబంధనను తప్పినిసరి చేసింది. రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ ఈ నిబంధనను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి భారత్ పర్యటనకు వచ్చే యూకే సిటిజన్లందరికీ క్వారంటైన్ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా.. భారత్‌కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. భారత్‌కు చేరుకున్న తర్వాత యూకే సిటిజన్లు తాము వెళ్లదలుచుకున్న డెస్టినేషన్‌కు ముందు పదిరోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్‌లో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను సడలించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు అధికారులు విజ్జప్తి చేసినప్పటికీ యూకే పెడచెవిన పెట్టింది. దీంతో కేంద్రం కూడా అదే తరహాలో ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళల వినూత్నంగా.. -
నేడు ట్యాంక్‌బండ్‌పై ఎస్పీ ‘బాలు’ సంస్మరణ వేదిక
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్న ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు వేదిక కానుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ఆర్కెస్ట్రాలో పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్నారు. ఆర్పీఎఫ్ బ్యాండ్‌మేళా, ప్రదర్శన సందర్శకులను కనువిందు చేయనుంది. ప్రతి ఆదివారం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: Civils Ranker: ఈజీగా ఏదీ దక్కదు.. అలాగే సాధ్యం కానిదంటూ లేదు -
ఐక్యతా విగ్రహాన్ని ఎంతమంది సందర్శించారో తెలుసా?
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ‘స్టాచ్యూఆఫ్ యూనిటీ’ని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు, 50 లక్షల మందికి పైగా సందర్శకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శించినట్టు రాష్ట్ర ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, అన్ని వయస్సుల జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఈ ప్రాంతం ఆకర్షిస్తోందని గుజరాత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌గుప్తా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. కెవాడియాలోని సర్దార్ సరోవర్ డ్యాం వద్ద, ప్రపంచంలోనే అతిపెద్దదైన, 182 అడుగుల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018, అక్టోబర్ 31 న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తున్నారు. ఆ తరువాత ఈ ప్రాంతానికి అదనపు హంగులు జోడించారు. ఈ ప్రాంతానికి రైలు, విమానాల రాకపోకలను మెరుగుపర్చేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎనిమిది కొత్త రైళ్ళను, అహ్మదాబాద్ నుంచి సీప్లేన్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులపై కోవిడ్ ప్రభావం పడింది. కోవిడ్ ఆంక్షల కారణంగా ఏడు నెలల సుదీర్ఘ కాలం అనంతరం గతయేడాది అక్టోబర్ 17న తిరిగి సందర్శకులకు అనుమతించారు. ఈ యేడాది జనవరి 18న దేశంలోని పలు ప్రాంతాల నుంచి 8 రైళ్ళను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎక్కువ మంది సందర్శించారని ప్రకటించారు. ప్రస్తుతం పెరిగిన రవాణా సౌకర్యాల కారణంగా ఒక సర్వే ప్రకారం రోజుకి లక్ష మంది పర్యాటకులు కెవాడియాను సందర్శించొచ్చన్నారు. చదవండి: సోనియాపై కేసును మూసేయాలి -
వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్
ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రాకతిక అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం వాటిని చూసి అబ్బుర పడటం కూడా మనకు తెల్సిందే. అందులో కొన్ని సామాన్యంగా కనిపించని అపురూపమైనవి కూడా ఉంటాయి. అలాంటి మెక్సికో పశ్చిమ తీరానికి మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం ఈ బీచ్ విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలయింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ దీన్ని మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. పై నుంచి చూస్తే ఈ రహస్య బీచ్ ఓ బిలం లోపల ఉన్నట్లు కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఏదిఏమైనా టార్సిసియో స్వారెజ్ అనే వీడియో గ్రాఫర్ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చింది. -
గోల్కొండ కోట సందర్శనకు అనుమతి
-
అక్కడ 24 గంటలకు మించి ఉంటే ఆంక్షలే!
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రవాసులు కాకుండా.. బయటి వ్యక్తులు ఎవరైనా.. 24 గంటలకు మించి మేఘాలయాలో ఉండాలనుకుంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఈ మేరకు మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏ)లో సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మేఘాలయా రాష్ట్రంలోకి ప్రవేశించే బయటి వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలు అధికారుల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ ఉద్యోగులకు ఈ చట్టం వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు రూపొందించిన ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏను 2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాజా సవరణ ప్రతిపాదించినట్టు చెప్పారు. మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ బయటి వ్యక్తులు సులువుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు ప్రతిపాదిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం, నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే.. చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని అన్నారు. అసోంలో భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) అమలు చేసి గత ఆగస్టులో 19 లక్షల మందిని అసోం పౌరులుగా గుర్తించలేదు. కాగా అసోం తరహాలోనే మేఘాలయ ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు చేపట్టనుంది.