ఈ భూమండలం మీద ఇప్పటికీ మానవుల దృష్టికి రాని ప్రాకతిక అందచందాలెన్నో ఉన్నాయనే విషయం తెల్సిందే. అలాంటి దృశ్యాలు మానవాళి దృష్టికి అప్పుడప్పుడు రావడం వాటిని చూసి అబ్బుర పడటం కూడా మనకు తెల్సిందే. అందులో కొన్ని సామాన్యంగా కనిపించని అపురూపమైనవి కూడా ఉంటాయి. అలాంటి మెక్సికో పశ్చిమ తీరానికి మారియెట్ దీవుల్లో దాగిన రహస్య బీచ్. ఇదిపై నుంచి చూస్తే ఓ బిలంలో దాగి ఉన్నట్లు కనిపించడం ఈ బీచ్ విశేషం. దీన్ని రహస్య బీచ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించగా, ఆ తర్వాత మెక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్‌గా ప్రకటించింది. ఇప్పుడు దాన్ని నేచర్ రిజర్వ్‌గా మార్చడంతో ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలయింది. ఇది పుంటా మీటాకు కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్నప్పటికీ దీన్ని మొదటి నుంచి సైనిక కార్యకలాపాలకే ఉపయోగించినందున ఈ రహస్య దీవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయింది. పై నుంచి చూస్తే ఈ రహస్య బీచ్ ఓ బిలం లోపల ఉన్నట్లు కనిపించడానికి కారణం ఎప్పుడు బాంబులు వేయడం వల్లనే ఆ బిలం అలా ఏర్పడి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఏదిఏమైనా టార్సిసియో స్వారెజ్ అనే వీడియో గ్రాఫర్ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చింది.
వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్
Published Fri, Oct 9 2020 1:47 PM | Last Updated on Fri, Oct 9 2020 8:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment