బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్‌ | photographer saved the boy | Sakshi
Sakshi News home page

బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్‌

Published Mon, Aug 7 2023 5:20 AM | Last Updated on Mon, Aug 7 2023 5:20 AM

photographer saved the boy - Sakshi

కొట్టుకుపోతున్న బాలుడిని రక్షిస్తున్న భాస్కరరెడ్డి

బీచ్‌ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టు­కు­పోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటో­గ్రాఫర్‌ రక్షించాడు. ఆది­వారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యు­లంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీ­గా ఉండటంతో బా­లు­డు తీరంలో ఆడు­కు­నేందుకు వెళ్లాడు.

ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలు­డిని లోపలకు లాక్కు­పోయింది. అక్కడ ఉన్న బీచ్‌ ఫొటో­గ్రాఫర్‌ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement