
న్యూయార్క్: భారతీయ అమెరికన్ ఒకరు తన కొడుకును కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటాక్రజ్ కౌంటీలో వారం క్రితం ఈ విషాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి కుటుంబంతో పాంథెర్ బీచ్‌కు వెళ్లారు.
అలల్లో కొట్టుకుపోతున్న 12 ఏళ్ల కొడుకును కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. మరొకరి సాయంతో కొడుకును ఒడ్డుకు తీసుకొచ్చారు. అంతలో బలమైన అల మూర్తిని లోపలికి లాక్కెళ్లింది. ఈత రాని ఆయన లోతైన నీళ్లలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మూర్తిని సహాయక సిబ్బంది బయటికి తీసి హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తరలించినా ప్రాణాలు దక్కలేదు.