విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి.. | Chhattisgarh Boy Life Saved The Kims Cuddles Doctors | Sakshi
Sakshi News home page

విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..

Published Wed, Aug 28 2024 4:24 PM | Last Updated on Wed, Aug 28 2024 4:33 PM

Chhattisgarh Boy Life Saved The Kims Cuddles Doctors

సాక్షి, హైద‌రాబాద్: అరుదైన ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా తీవ్రంగా జ్వ‌రం, ఫిట్స్, మెద‌డులో ప్రెష‌ర్ త‌గ్గిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తి, చివ‌ర‌కు త‌న సొంత త‌ల్లిదండ్రుల‌ను కూడా గుర్తుప‌ట్ట‌లేని ప‌రిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక‌ ఆస్ప‌త్రిలో చేర్చి, ప‌రిస్థితి విష‌మించ‌డంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రికి స‌మాచారం ఇచ్చారు. ఇక్క‌డినుంచి కిమ్స్ క‌డ‌ల్స్ కొండాపూర్ ఆస్ప‌త్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్క‌డినుంచి బాబును ఇక్క‌డ‌కు తీసుకొచ్చి చికిత్స అందించారు. 

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను కిమ్స్ కడ‌ల్స్ ఆస్ప‌త్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినిక‌ల్ డైరెక్ట‌ర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిప‌తి డాక్ట‌ర్ ప‌రాగ్ శంక‌ర్‌రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్ర‌మైన జ్వ‌రం, ఫిట్స్, మెద‌డులో ప్రెష‌ర్ త‌గ్గిపోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దాంతో అక్క‌డి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అత‌డికి ఫిట్స్ పెర‌గ‌డం, బీపీ త‌గ్గిపోవ‌డం, బాగా మ‌త్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అంద‌ని ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇక్క‌డినుంచి వెళ్ల‌గానే ముందుగా ఆ బాబుకు వెంటిలేట‌ర్ పెట్టి,  ప‌రిస్థితిని కొంత మెరుగుప‌రిచాం. మెద‌డులో ప్రెష‌ర్, ఫిట్స్ స‌మ‌స్య‌లు త‌గ్గించేందుకు మందులు వాడాం. త‌ర్వాత అక్క‌డినుంచి విమానంలో హైద‌రాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావ‌డానికి మా పీడియాట్రిక్ ఐసీయూ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ త‌రుణ్ సాయ‌ప‌డ్డారు. ఆ బాలుడు ఇక్క‌డ 9 రోజులు ఆస్ప‌త్రిలో ఉన్నాడు. మ‌ధ్య‌లో బ్రెయిన్ ప్రెష‌ర్ పెరిగింది, ఫిట్స్ వ‌చ్చాయి, అన్నింటినీ త‌గిన మందుల‌తో న‌యం చేశాం. అత‌డికి వ‌చ్చిన రికెట్షియ‌ల్‌ ఇన్ఫెక్ష‌న్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివ‌ల్ల అత‌డికి మెద‌డులో మెర్స్ అనే స‌మ‌స్య వ‌చ్చింది. అత‌డికి త‌ర్వాత కాలేయం, మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చినా వాటినీ మందుల‌తో న‌యం చేశాం. ఇక్క‌డ చేరిన నాలుగోరోజే వెంటిలేట‌ర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా న‌యం కావ‌డంతో డిశ్చార్జి చేశాం” అని డాక్ట‌ర్ ప‌రాగ్ డెకాటే చెప్పారు. 

దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న పేషెంట్ల‌యినా ఉండ‌వ‌చ్చ‌ని, వారికి చికిత్స చేయ‌గ‌ల సామ‌ర్థ్యం కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రికి ఉంద‌ని డాక్ట‌ర్ అవినాష్‌, డాక్ట‌ర్ క‌ళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్క‌డ ఉన్న అత్యాధునిక వైద్య స‌దుపాయాలు అక్క‌డ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పారు. డాక్ట‌ర్ ప్ర‌భ్‌జోత్‌, డాక్ట‌ర్ జ‌యంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాల‌జిస్టులు), డాక్ట‌ర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్టు), డాక్ట‌ర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాల‌జిస్టు), డాక్ట‌ర్ ప్ర‌తీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియ‌స్ డిసీజెస్‌)ల‌తో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. 

“ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హార‌మే గానీ, ప్రాణాల‌కంటే ఏదీ ఎక్కువ కాదు.  అత్యాధునిక స‌దుపాయాలు లేని న‌గ‌రాల నుంచి అవి ఉన్న‌చోటుకు స‌రైన స‌మ‌యానికి స‌మ‌ర్థ‌మైన చికిత్స కోసం తీసుకురావడం కీల‌కం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాప‌ను విమానంలో ఇక్క‌డ‌కు తీసుకొచ్చి న‌యం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చిన‌వాటిలో ఇది రెండో కేసు. ఇటీవ‌లే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంట‌ల రోడ్డు ప్ర‌యాణంలో హైద‌రాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చిన‌వాటిలో ప్ర‌పంచంలోనే అత్యంత సుదూర ప్ర‌యాణం. ఒక ర‌కంగా అత్యాధునిక వైద్య స‌దుపాయాల‌తో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించ‌డం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్ట‌మైన కేసుల‌కు కూడా స‌మ‌ర్థ‌వంతంగా చికిత్స చేసిన చ‌రిత్ర కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రికి ఉంది” అని డాక్ట‌ర్ ప‌రాగ్ డెకాటే వివ‌రించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement