KiMs
-
శ్రీతేజు విదేశాల్లో చికిత్స..! బాలుడ్ని పరామర్శించిన బన్నీ వాసు
-
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మా తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడికి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ తండ్రికి రూ.5 లక్షల సాయం చేశారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే ముందురోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రదర్శించారు మేకర్స్. డిసెంబర్ 4న సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అదే సమయంలో అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అల్లు అర్జున్‌పై కేసు..సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా బన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయమే జైలు నుంచి విడుదలయ్యారు. -
'అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమదే'.. శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులతో చర్చించారు.( ఇది చదవండి: శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్)సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందని అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వివరించారు. అందుకే అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని వచ్చా..అల్లు అరవింద్ మాట్లాడుతూ..'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూసేందుకు వచ్చా. ప్రస్తుతం బాలుడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది. శ్రీతేజ్ కోలుకోడానికి మేం ఎంతైనా సహాయం చేస్తాం. తను సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగిరావడానికి ప్రభుత్వం సహకరిస్తామనడం అభినందనీయం. చాలా మంది అభిమానులు, బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించలేదని అడుగుతున్నారు. అల్లు అర్జున్ హాస్పిటల్‌కు రాకపోడానికి కారణం ఉంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఆస్పత్రికి అల్లు అర్జున్ వస్తానని అనుకున్నాడు. కానీ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వద్దని వారించడంతో రాలేదు. అదే రోజు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎవరితో మాట్లాడవద్దని మా న్యాయవాది నిరంజన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేం రావడానికి అనేక నిబంధనలు అడ్డొచ్చాయి. బన్నీ బాధపడుతూ నన్ను వెళ్లి చూసి రమ్మన్నారు. అందుకే ప్రభుత్వ అనుమతితో బాలుడు శ్రీతేజ్ పరిస్థితిని అడిగితెలుసుకున్నా' అని తెలిపారు.అసలేం జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే ఒక రోజు ముందే ఈ మూవీ ప్రీమియర్స్ షోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో సినిమా వీక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్ దూసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. -
నిద్రలో పళ్ల సెట్ మింగిన విశాఖపట్నం వాసి
సాక్షి, విశాఖపట్నం: పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంత వైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది.కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఊరికి బంధువులొస్తున్నారుసాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు. -
టీడీపీ నేత బొల్లినేని కృష్ణయ్య ఫోర్జరీ కేసులో దర్యాప్తు వేగవంతం
-
KIMS చైర్మన్ పై క్రిమినల్ కేసు
-
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్‌జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
పదోతరగతి నుంచే మద్యపానం.. ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
సాక్షి, అనంతపురం: పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం అలవాటైపోయిన ఓ యువకుడికి.. దాని కారణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవనే బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడమే కాక.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ తెలిపారు.“హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్‌కు తాను పదోతరగతి చదివే సమయం నుంచి మద్యపానం అలవాటు ఉంది. కొంతమందిలో దానివల్ల మరీ అంత సమస్యలు రాకపోయినా, కొందరికి మాత్రం శరీర తత్వం కారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. లోకేష్‌కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడలా తయారైపోవడమే కాక.. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అతడు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో ఇక్కడ చూపించుకున్నప్పుడు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు. దాంతో రోగి, అతడి బంధువులు బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ మూడు నాలుగు పెద్దపెద్ద ఆస్పత్రులకు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ చేసినా, 60-70శాతం మంది చనిపోతారు. బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రులలో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగిపోయింది. రక్తపోటు పడిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించక తప్పలేదు. ఇన్ఫెక్షన్ ప్రేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశాం. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెట్టేస్తాం.ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతడికి కచ్చితంగా మధుమేహం వస్తుంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు. -
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్‌లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్‌లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
కిమ్స్ ఖాతాలో మరో ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న కింగ్స్‌వే హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలు ప్రక్రియలో భాగంగా కింగ్స్‌వే ఆసుపత్రికి రూ.80 కోట్లను కిమ్స్ పెట్టుబడి రూపంలో అందించనుంది. ఈ మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్ షీట్ బలోపేతానికి వినియోగిస్తారు. కింగ్స్‌వే హాస్పిటల్స్‌కు 300లకుపైగా పడకల సామర్థ్యం ఉంది. మహారాష్ట్రలో నాసిక్ తర్వాత సంస్థకు ఇది రెండవ కేంద్రం అని కిమ్స్ ఎండీ భాస్కర రావు తెలిపారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. లోకోపైలెట్ అప్రమత్తమైనప్పటికీ...
హుబ్లీ: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం హుబ్లీలో చోటు చేసుకుంది. రెండుకాళ్లు తెగిపోయి క్షతగాత్రుడు విషమ స్థితిలో హుబ్లీ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... మధ్యాహ్నం షాలీమార్ వాస్కోడిగామా రైలు హుబ్లీ స్టేషన్ వదిలిన నాలుగు నిముషాలకు హెగ్గేరి సమీపంలో వస్తుండగా ఓ వ్యక్తి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టాడు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటోంది. లోకో పైలెట్ రైలు వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అతని రెండు కాళ్లు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బాధితుడిని కిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రుడి వివరాలు తెలియల్సి ఉంది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: బ్లూవేల్ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య) -
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్‌లో చేరారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించిన కాకర్ల సుబ్బారావు.. 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు చల్లపల్లి, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి ఆయన డాక్టర్ పట్టా పొందారు. చదవండి: తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు -
ఘనంగా కిమ్స్–లివ్లైఫ్ సెంటర్ వార్షికోత్సవం
-
ప్రకాశం జిల్లా రిమ్స్ అస్పత్రిపై కిమ్స్ మాస్టర్ ప్లాన్
-
రైడ్ ఫర్ గ్రీన్
-
గురువు గారూ..మరి సెలవు
-
మేము సైతం
- క్యాన్సర్ బాధితురాలికి చేయూత - విరాళాలు అందజేస్తున్న దాతలు కర్నూలు(హాస్పిటల్): ‘ఆశే బతికించింది’ శీర్షికన ఈ నెల 8న సాక్షిలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు చేయూతనందించేందుకు మేము సైతం అంటూ దాతలు ముందుకొస్తున్నారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న గురుచరణ్‌దాస్ రూ.20వేలు, ఎమ్మిగనూరుకు చెందిన వ్యాపారి గణేష్ రూ.5వేలు, నంద్యాలకు చెందిన ఉపాధ్యాయులు క్రిష్ణప్రసాద్ రూ.2,100లు, కోవెలకుంట్లకు చెందిన జ్యోతి రూ.3వేలు, ఆళ్లగడ్డకు చెందిన రామయ్య రూ.4వేలు, జాన్‌పాల్ రూ.2,300లు, ఆదోనికి చెందిన మెకానిక్ శ్రీనివాసరెడ్డి రూ.1,500లను సైదా బ్యాంక్ అకౌంట్లో వేశారు. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన అబ్దుల్ అజీజ్ భార్య సైదా అలియాస్ వై.జయంతి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. రొమ్ములు రెండు పూర్తిగా క్యాన్సర్‌తో పాడైపోయిన పరిస్థితుల్లో ఆమె దీనగాధను గత ఏడాది జూన్ 3న ‘ఆశే బతికిస్తోంది’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన విషయం విదితమే. దాతలు స్పందించిన మేరకు పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.30లక్షలు ఖర్చు చేసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు. ఆమెకు పూర్తిస్థాయి వైద్యం అంది, కోలుకోవాలంటే ఇంకా రూ.8లక్షల వరకు అవసరం అవుతుందని అజీజ్ తెలిపారు. దాతలు సహకరించి తన భార్య సైదాను బతికించాలని ఆయన వేడుకుంటున్నాడు. ఆయన సెల్ నెం. 7396092542. బ్యాంకు అకౌంట్ వివరాలు సైదా భర్త : అబ్దుల్ అజీజ్ ఆంధ్రాబ్యాంక్, కొత్తబస్టాండ్ బ్రాంచ్, కృష్ణా కాంప్లెక్స్, కర్నూలు. అకౌంట్ నెంబర్: 1107101001664 ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్డిబి0001107 -
ఆస్పత్రి నుంచి దాసరి నారాయణరావు డిశ్చార్జ్
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మంగళవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గత రెండు నెలలుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ జనవరి 29న దాసరి కిమ్స్‌లో చేరారు. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో దాసరికి గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రి సీఈవో భాస్కర్ రావు నేతృత్వంలో దాసరికి చికిత్స చేశారు. అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతం దాసరి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. -
'దాసరి కోలుకుంటున్నారు'
పరామర్శించిన చంద్రబాబు, చిరు హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆసు పత్రిలో చేరిన దర్శకనిర్మాత, మాజీ కేంద్రం మంత్రి దాసరి నారాయణరావును ఏపీ సీఎం చంద్ర బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయనతో పాటు రాజ్య సభ సభ్యులు చిరంజీవి, టి.సుబ్బ రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంత రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, జయప్రద, అశ్వనీదత్, వీవీ వినాయక్, సి.కల్యాణ్, విజయబాపినీడు తదితరులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని పరా మర్శించారు. నటుడు, నిర్మాత మోహన్‌బాబు ఉదయం నుంచీ ఆసుపత్రి వద్దే ఉన్నారు. కిడ్నీ పనితీరు మెరుగుపడింది: వైద్యులు దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని, ఆయన కిడ్నీ పనితీరు మెరుగుపడిందని, డయాలసిస్ అవసరం లేకుండా పనిచేస్తున్నాయని కిమ్స్ సర్జన్లు డాక్టర్ కేవీ కృష్ణ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడిందని, మరో రెండు రోజుల్లో ఆయనను సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. త్వరలోనే కోలుకుంటారు: చంద్రబాబు ‘నాతో ఎంతో సన్నిహితంగా ఉండే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయన్ని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎంతో కులాసాగా ఉన్నారు. తొందరగా కోలుకుంటారనే విశ్వాసం ఉంది’అని చంద్రబాబు చెప్పారు. దాసరి ఎంతో హుషారుగా ఉన్నారని, మాట్లాడలేకపోతున్నా పెన్‌తో తన ‘ఖైదీ నంబర్ 150’కలెక్షన్స్ గురించి అడిగారని చిరంజీవి తెలిపారు. కలెక్షన్లు రూ.250 కోట్లు దాటాలని ఆకాంక్షించారన్నారు. చిరు, పవన్‌తో సినిమా: సుబ్బరామిరెడ్డి ‘ఇటీవలే దాసరిని కలిసినప్పుడు జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహించాలని మాట్లాడుకున్నాం. అంతలోపు అనారోగ్యానికి గురయ్యారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో చిత్రం తీస్తానని ప్రకటించగానే కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ టాప్ హీరోలే. సమానమైన పాత్రలతో కథ సిద్ధం చేయగానే సినిమా మొదలు పెడతాం. అయితే ఇది రాజకీయ ఉద్దేశాలతో తీసేది కాదు’అని సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. -
భారీ విస్తరణ దిశగా కిమ్స్..
• ఫిబ్రవరికల్లా ఒంగోలు ఆసుపత్రి పూర్తి • మరో మూడు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు • కొత్తగా 4,000 మంది నియామకం • కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఫిబ్రవరినాటికి 300 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది. రూ.60 కోట్లతో ఒంగోలులో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కొండాపూర్‌లోని 100 పడకల ఆసుపత్రికి ఇటీవలే రూ.40 కోట్ల ఖర్చుతో మరో 100 పడకలను జోడించారు. కొండాపూర్ ప్రాంతంలో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్ పెరిగిందని, అందుకే విస్తరణ చేపట్టామని కిమ్స్ హాస్పిటల్స్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ బొల్లినేని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘ఇంకా గువహటి, భువనేశ్వర్, ఇండోర్ నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించాం. ఇవి ఒక్కొక్కటి 250 పడకల సామర్థ్యంతో వస్తాయి. ఈ మూడు సెంటర్లకు రూ.450 కోట్ల దాకా వెచ్చిస్తాం. 2018 చివరికల్లా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని అభినయ్ వివరించారు. ప్రస్తుతం సంస్థ వద్ద అన్ని విభాగాల్లో కలిపి 7,000 మందికిపైగా పని చేస్తున్నారు. ప్రతిపాదిత విస్తరణ పూర్తయితే ఈ సంఖ్య 11,000 దాటుతుందని ఆయన వెల్లడించారు. కిమ్స్‌కు తెలంగాణలో సికింద్రాబాద్, కొండాపూర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళంలో ఆసుపత్రులున్నాయి. వీటి సామర్థ్యం 2,200 పడకలు. శ్రీకాకుళంలోని మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి ఉంది. -
అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం
అమలాపురం రూరల్ : ఎనస్తీషియా రంగంలో అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం కానున్నాయని ఇండియా ఎనస్తీషియా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు తెలిపారు. గత నెల 25 నుంచి 28వ తేదీ వరకూ చైనా దేశం ఘాంజూలో జరిగిన 16 దేశాల ఎనస్తీషియా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుల అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కామేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకూ హాంకాంగ్‌లో జరిగిన ప్రపంచ మత్తు వైద్యుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ రెండు సదస్సుల్లో కూడా డాక్టర్ కామేశ్వరరావు మత్తుపై వస్తున్న ఆధునిక పరిశోధనలు, ప్రక్రియలపై ప్రసంగించారు. క్యాన్సర్ నొప్పిపై విశ్లేషాత్మక ఉపన్యాసం చేశారు. ఈ రెండు అంతర్జాతీయ సదుస్సుల్లో పాల్గొని తిరిగి వచ్చిన డాక్టర్ కామేశ్వరరావు స్థానిక కిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చైనాలో జరిగిన మత్తు వైద్యుల సదస్సులో 16 దేశాల అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొంటే మన దేశం తరఫున తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. హాంకాంగ్‌లో జరిగిన ప్రపంచ మత్తు వైద్యుల సదస్సులో మన దేశం నుంచి వంద మంది వైద్యులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సదస్సులోనే తాను ఇంటర్నేషనల్ ఎనస్తీషియా ఎడ్యుకేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యానని తెలిపారు. ఆసియా దేశాల నుంచి ఈ కమిటీకి తానొక్కడినే సభ్యుడిగా ఎన్నికయ్యానని వివరించారు. ఇండియా ఎనస్తీషియా డాక్టర్స్ అసోసియేషన్‌లో 23 వేల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారని డాక్టర్ కామేశ్వరరావు తెలిపారు. డాక్టర్ కామేశ్వరరావును కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు, ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ అభినందించారు. -
నిలకడగా ఎమ్మెల్యే ఆరోగ్యం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. 'తీవ్ర జ్వరం, ఫిట్స్‌తో ఆయన ఆస్పత్రిలో చేరారు. నాలుగేళ్ల క్రితం ఆయన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి తరచుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు' అని కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. -
సైకిల్ థాన్ ప్రారంభించిన నటుడు రానా
-
కిమ్స్ ఆస్పత్రి వద్ద చైన్ స్నాచింగ్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి స్నాచర్లు 7 తులాల బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... చిక్కడపల్లికి చెందిన వరప్రసాద్ జీవీకే సంస్థలో కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో భార్య గీతతో కలిసి తన ద్విచక్ర వాహనంపై చిక్కడపల్లి నుంచి బేగంపేట్ వెళుతున్నారు. మినిష్టర్‌రోడ్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రాగానే ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు వీరి వాహనాన్ని అదుపు తప్పేలా చేసి గీత మెడలో ఉన్న 7తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. వాహనం అదుపు తప్పుతుందనే కంగారులో ఉన్న వరప్రసాద్ తేరుకునే లోపు వారు మాయమయ్యారు. నిందితుల్లో ఒకరు నలుపు రంగు జర్కిన్ ధరించి ఉన్నాడని అలాగే నలుపు రంగు కళ్ల జోడు పెట్టుకున్నాడని వరప్రసాద్ తెలిపారు. అనంతరం వారు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఏటా 2.33 లక్షల మందికి ప్రొస్టేట్ కేన్సర్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దేశంలో ఏటా సుమారు 2.33 లక్షల మంది పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ బారిన పడుతున్నారని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రొస్టేట్ కేన్సర్ అవగాహన మాసం సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూరాలజీ వైద్యులు డాక్టర్ ఉపేంద్రకుమార్, డాక్టర్ గోపీచంద్, డాక్టర్ ఎన్.త్రివేది మాట్లాడారు. కేవలం పురుషుల్లోనే కనిపించే ఈ కేన్సర్ మూత్రాశయం కింద ఉండే ప్రొస్టేట్ గ్రంథిలో మొదలై శరీరమంతా వ్యాపిస్తుందన్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కువ మంది పురుషుల మరణానికి కారణమవుతున్న రెండో కేన్సర్ ఇదేనని చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తులకు పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండా నాలుగో స్టేజీ వరకు వెళుతుందన్నారు. 50 ఏళ్లు దాటిన పురుషులకు ముందస్తుగా పీఎస్ఏ, ట్రస్ బయాప్సీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఈ కేన్సర్‌ను గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం సులభమని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల మొత్తం ప్రొస్టేట్ కేన్సర్ పరీక్షలు, కన్సల్టేషన్‌కు రాయితీలు అందిస్తున్నామని వివరించారు. -
కిమ్స్‌లో కాలేయ మార్పిడి
మంగళగిరి నుంచి శంషాబాద్‌కు విమానంలో తరలింపు పోలీసుల సహకారంతో రోడ్డు బ్లాక్ చేసి కిమ్స్‌కు చేరిక హైదరాబాద్: కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి నగరానికి చెందిన కిమ్స్ వైద్యబృందం విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసింది. కాలేయ మార్పిడి 6 నుంచి 8 గంటల్లోపే చేయాల్సి ఉన్నందున కిమ్స్ వైద్యులు అవయవదాత నుంచి సేకరించిన కాలేయాన్ని విజయవాడ నుంచి విమానంలో తీసుకొచ్చి.. నగరంలో పోలీసుల సాయంతో రోడ్లపై ట్రాఫిక్ ఆపివేసి ఆసుపత్రికి తెచ్చి సకాలంలో ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనమ్మ(54)ను వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్ సిబ్బంది అవయవదానంపై బంధువులకు అవగాహన కల్పించడంతో వారు అందుకు అంగీకరించారు. వెంటనే కిమ్స్ వైద్యులు విజయవాడ చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు దాత శరీరం నుంచి కాలేయాన్ని సేకరించి ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచారు. ఆలస్యం చేయకుండా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం 5.30కు బయలు దేరిన విమానం 6.20కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గ్రీన్‌చానల్ ద్వారా రాత్రి 7.10 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కిమ్స్‌లో చికిత్స పొందుతున్న 43 ఏళ్ల వ్యక్తికి ఆపరేషన్ థియేటర్లో ఛాతీ భాగాన్ని తెరిచి ఉంచారు. డాక్టర్ ఎంబీవీ ప్రసాద్ నేతృత్వంలోని వైద్యబృందం బాధితునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చింది. -
ఎం.ఎస్.నారాయణ ఆరోగ్యం విషమం
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు ఎం.ఎస్.నారాయణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సంక్రాంతి పండుగకని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి ఈ నెల 20న తీసుకొచ్చారు. అయితే ఎం.ఎస్. మరణించారని గురువారం పలు టీవీ చానళ్లలో వార్తలు రావడంతో సినీరంగ ప్రముఖులు, ఆయన సన్నిహితులు, అభిమానులు హతాశులయ్యారు. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ఎం.ఎస్.నారాయణ గుండెపోటుకు గురయ్యారని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామనీ, డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎం.ఎస్.నారాయణను సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం, నటులు రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తేజ్, అనంత్ తదితరులు పరామర్శించారు. నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం: శశికిరణ్ తమ తండ్రి ఎం.ఎస్. ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమార్తె శశికిరణ్ మీడియాకు తెలిపారు. త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. -
హెల్త్ బులెటిన్ : ఎంఎస్ నారాయణ ఆరోగ్య స్థితి
-
ఎంఎస్ నారాయణ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లు అమర్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు డయాలసిస్ కొనసాగుతుందని కిమ్స్ వైద్యులు చెప్పారు. కాగా ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించిన విషయం తెలిసిందే. ఎంఎస్ నారాయణ ప్రస్తుతం మాదాపూర్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. -
ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది: చిరంజీవి
హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి సోమవారం ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ఆహుతి ప్రసాద్ విలక్షణ నటుడని, ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చిన్న వయసులోనే ఆహుతి ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిదన్నారు. ఆహుతి ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నఆహుతి ప్రసాద్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. -
ప్రసాద్ మృతి జీర్ణించుకోలేనిది
-
ఆహుతి ప్రసాద్ కన్నుమూత
* చికిత్స పొందుతూ మృతి * నాలుగేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న నటుడు * రెండ్రోజుల క్రితం కిమ్స్‌లో చేరిక * ప్రసాద్ మృతిపై అభిమానులు, సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి * ఆహుతి సినిమాతో గుర్తింపు..‘చందమామ’తో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు * నేడు అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ‘ఆహుతి’ ప్రసాద్ (57) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ‘ఆహుతి’ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన పూర్తిపేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. 122 చిత్రాల్లో నటించిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందారు. నాలుగేళ్ల నుంచి పెద్దపేగు చివరి భాగంలో కేన్సర్‌తో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆహుతి ప్రసాద్ మృతితో బంధువులు, అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రసాద్ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సోమవారం ఉదయం ఫిలిం చాంబర్లో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసాద్ మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలోని కోడూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన అప్పుడప్పుడు కోడూరుకు వచ్చి అందరినీ కలిసి వెళ్లేవారని గ్రామస్తులు పేర్కొన్నారు. సినిమాలంటే చాలా ఇష్టం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న ఉపాధ్యాయుడు రంగారావు, హైమావతి దంపతులకు ఆహుతి ప్రసాద్ జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ప్రసాద్‌కు మొదట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్‌కు ఆయన వీరాభిమాని. సినిమాల్లోకి రావాలనే తపనతో ప్రసాద్ హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత కొంతకాలం దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్‌కు ఇన్చార్జిగా ఉన్నారు. హీరో నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’తో ప్రసాద్ నటుడిగా పరిచయమయ్యారు. అనంతరం ‘ఆహుతి’ చిత్రంతో మంచి గుర్తింపు రావడంతో... అప్పటి నుంచి ఆయన పేరు ఆహుతి ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్లాడుతా’ చిత్రంతో ఆహుతి ప్రసాద్ సెకండ్ ఇన్నిం గ్స్ మొదలైంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ ఆయన సినీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఆ తర్వాత తండ్రి పాత్రలు, కామెడీ, విలనీ పాత్రలతో తనదైన శైలిలో రక్తి కట్టించారు. 122 చిత్రాల్లో నటించిన ప్రసాద్... 2007లో ‘చందమామ’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, 2002లో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ చిత్రానికి ఉత్తమ విలన్‌గా నంది పురస్కారాలు అందుకున్నారు. ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర పోషించారు. అదే ఆయన ఆఖరి సినిమా. కాగా.. ఆహుతి ప్రసాద్ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని తెలుగు నటీనటుల సంఘం, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం పేర్కొన్నాయి. ఆయన మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించాయి. సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబులు ప్రసాద్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సంతాపం.. ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మరణంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హాస్య పాత్రలతో చెరగని ముద్ర వేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సినీ కళాకారుల సంక్షేమానికి కూడా కృషి చేశారని పేర్కొన్నారు. ఆహుతి ప్రసాద్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రసాద్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ మంచి నటుడని రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి పేర్కొన్నారు. ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంపీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ పేర్కొన్నారు. -
గోప్యత పాటిస్తున్న నటుడి కుటుంబసభ్యులు!
'ఆహుతి' చిత్రాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పటం లేదు. కాగా ఆహుతి ప్రసాద్.. సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇంతకీ అనారోగ్యం ఏమిటనేది ...ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నట్లు ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. ' ఆహుతి ప్రసాద్‌కు ఫోన్ చేసినా... నాన్న బిజీగా ఉన్నారని ఆయన కుమారుడు సమాధానం ఇస్తున్నారని, అయితే అసలు విషయం తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లితే...ఆహుతి ప్రసాద్ బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని' ఆయన పేర్కొన్నారు. కాగా ఆహుతి ప్రసాద్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన రెండు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. 1986లో 'విక్రమ్' సినిమా ద్వారా ఆహుతి ప్రసాద్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అనంతరం ఆయన నటించిన 'ఆహుతి' పెద్ద బ్రేక్ ఇచ్చింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్త బంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో ఆహుతి ప్రసాద్ చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు. -
కిమ్స్‌లో చేరిన సినీ నటుడు ఆహుతి ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ సోమవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయన కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.అనారోగ్యంపై అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఆయన్ని బంధువులు, స్నేహితులు పరామర్శించారు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు. -
గెయిల్ క్షతగాత్రుల వివరాలు ఇవే
అమలాపురం : గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12మంది క్షతగాత్రులు అమలాపురం కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో పలువురు 90శాతం గాయపడినవారే. మెరుగైన చికిత్స కోసం వారిలో కొందరిని కిమ్స్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు అయిదుగురు ఉన్నారు. గాయపడినవారి వివరాలు. 1.ఎం.డి.తఫీ,2.తాటికాయల రాజ్యలక్ష్మి, 3.ఓనరాసి దుర్గాదేవి, 4.ఓనరాసి వెంకటరత్నం,5.రాయుడు సూర్యనారాయణ, 6.బోనం పెద్దిరాజు, 7.బోనం రత్నకుమారి,8.పల్లాలమ్మ, 9.ఓనరాసి మధుసూదన్ (9), 10.మోహన్ కృష్ణ (7), 11.జోత్స్నాదేవి (8), 12.కావీ చిన్నా (18నెలలు). కాగా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్దాల బాలాజీ, గోపిరెడ్డి దివ్యతేజ మృతి చెందారు. దుర్ఘటనలో 18మంది సజీవ దహనం కాగా, 30మంది గాయపడిన విషయం తెలిసిందే. -
శ్రీకాకుళంలో 'కిమ్స్' వద్ద ఉద్రిక్తత
శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టౌన్‌ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కిమ్స్ ఆసుపత్రి సెల్లార్ నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ మున్సిపల్ సిబ్బంది బుధవారం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో సెల్లార్ నిర్మాణం కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది సమయాత్తమైయ్యారు. మున్సిపల్ సిబ్బంది చర్యలను ఆసుపత్రి సిబ్బంది ప్రతిఘటించారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో కిమ్స్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు గుండె, శ్వాసకోస సంబంధమైన సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత ఏడాది ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కాగా ఆయనకు మరింత విశ్రాంతి అవసరం ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు కొత్తపల్లి సుబ్బారాయుడు తరపున ఆయన తనయుడు నాని, సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. -
కిమ్స్‌లో రోగులను పరామర్శించిన జగన్
-
సునందకు వైద్య పరీక్షలు నిర్వహించాం: కిమ్స్
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ఈ వారం మొదట్లో కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ ఆసుపత్రి ప్రతినిధి శనివారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం సునంద ఈ నెల 13న ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఆ రోజు ఆ మరుసటి రోజున ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అయితే వైద్య పరీక్షలు నివేదిక అందేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే మందులు ఇస్తామని సునందతో వెల్లడించినట్లు పేర్కొన్నారు. నేడు, రేపో ఆమె ఆసుపత్రి వచ్చి వైద్య పరీక్షల నివేదిక తీసుకుంటుందని తాము భావించామన్నారు. అయితే ఆ నివేదికలో ఏం ఉంది అనే అంశాన్ని మాత్రం వెల్లడించేందుకు ఆసుపత్రి ప్రతినిధి నిరాకరించారు. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద నిన్న రాత్రి న్యూఢిల్లీని హోటల్లో విగత జీవిగా మారిన సంగతి తెలిసిందే.