మేము సైతం
మేము సైతం
Published Wed, Apr 12 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
- క్యాన్సర్ బాధితురాలికి చేయూత
- విరాళాలు అందజేస్తున్న దాతలు
కర్నూలు(హాస్పిటల్): ‘ఆశే బతికించింది’ శీర్షికన ఈ నెల 8న సాక్షిలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు చేయూతనందించేందుకు మేము సైతం అంటూ దాతలు ముందుకొస్తున్నారు. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న గురుచరణ్‌దాస్ రూ.20వేలు, ఎమ్మిగనూరుకు చెందిన వ్యాపారి గణేష్ రూ.5వేలు, నంద్యాలకు చెందిన ఉపాధ్యాయులు క్రిష్ణప్రసాద్ రూ.2,100లు, కోవెలకుంట్లకు చెందిన జ్యోతి రూ.3వేలు, ఆళ్లగడ్డకు చెందిన రామయ్య రూ.4వేలు, జాన్‌పాల్ రూ.2,300లు, ఆదోనికి చెందిన మెకానిక్ శ్రీనివాసరెడ్డి రూ.1,500లను సైదా బ్యాంక్ అకౌంట్‌లో వేశారు.
కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ప్రాంతానికి చెందిన అబ్దుల్ అజీజ్ భార్య సైదా అలియాస్ వై.జయంతి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. రొమ్ములు రెండు పూర్తిగా క్యాన్సర్‌తో పాడైపోయిన పరిస్థితుల్లో ఆమె దీనగాధను గత ఏడాది జూన్ 3న ‘ఆశే బతికిస్తోంది’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన విషయం విదితమే. దాతలు స్పందించిన మేరకు పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.30లక్షలు ఖర్చు చేసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు. ఆమెకు పూర్తిస్థాయి వైద్యం అంది, కోలుకోవాలంటే ఇంకా రూ.8లక్షల వరకు అవసరం అవుతుందని అజీజ్ తెలిపారు. దాతలు సహకరించి తన భార్య సైదాను బతికించాలని ఆయన వేడుకుంటున్నాడు. ఆయన సెల్ నెం. 7396092542.
బ్యాంకు అకౌంట్ వివరాలు
సైదా
భర్త : అబ్దుల్ అజీజ్
ఆంధ్రాబ్యాంక్, కొత్తబస్టాండ్ బ్రాంచ్,
కృష్ణా కాంప్లెక్స్, కర్నూలు.
అకౌంట్ నెంబర్: 1107101001664
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఏఎన్‌డిబి0001107
Advertisement