ప్రతీకాత్మక చిత్రం
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం.
ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్‌లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు.
స్విమ్స్‌లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment