అవయవాలను అంబులెన్సు వద్దకు తీసుకువెళుతున్న దాత కుటుంబ సభ్యులు
కాకినాడ రూరల్: తను మరణించినా.. తన అవయవాల ద్వారా పలువురికి ఊపిరి పోశారు కాకినాడకు చెందిన పెంకే గోవిందకుమార్ (50). కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన గోవిందకుమార్ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు రాజశేఖరన్, ప్రశాంత్, యు.కిషోర్‌కుమార్, కల్యాణి, శ్రీకాంత్, గణేష్ ఆదిమూలం, డీవీఎస్ సోమయాజులు, వై.కల్యాణ్ చక్రవర్తి, ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, సనా ప్రవీణ తదితరులు రాత్రి 8 గంటలకు దాత నుంచి అవయవాలు సేకరించారు.
ఒక కిడ్నీని ఆస్పత్రిలోనే రోగికి విజయవంతంగా అమర్చారు. రాత్రి 10 గంటల సమయంలో మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి, కాలేయాన్ని (లివర్) గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద మణిపాల్ ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. దీనికోసం జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు.
అంబులెన్సులు గమ్యానికి సజావుగా చేరేలా ఎస్పీ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అవయవాల తరలింపును ట్రస్ట్ ఆస్పత్రి వైద్యుడు రామకృష్ణ సమన్వయం చేశారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ కో–ఆర్డినేటర్‌గా స్వాతి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment