
న్యూఢిల్లీ: అవయవదానం గురించి ఒక ఉద్యమంలా అవగాహన కల్పించాల్సిన అవసరముందని, అప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అవయవ మార్పిడి చేస్తున్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మరణించిన దాతల నుంచి మార్పిడి, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య భారీ అంతరం ఉందని తెలిపారు. భారత్‌లో ప్రతీ 10 లక్షల జనాభాకు కేవలం 0.65 అవయవ దాన రేటు ఉందని చెప్పారు. ఢిల్లీలో భారతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు.