
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి 4 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.40 కోట్ల ఆదాయం వచ్చింది.
టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.