
ఆహుతి ప్రసాద్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ సోమవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయన కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.అనారోగ్యంపై అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఆయన్ని బంధువులు, స్నేహితులు పరామర్శించారు.
ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్దన వరప్రసాద్. ఆయన సొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు.
గులాబి, నిన్నే పెళ్లాడతా, చంద్రమామ, కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. 'చందమామ' సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకున్నారు.